Monday 8 September 2014

ఎన్నార్ చందూర్ నడిపిన పత్రిక "జగతి" తీరే వేరు.



చెన్నయ్ నుంచి జగతి అనే మాస పత్రిక వచ్చేది.ఎర్రటి బ్యాక్ గ్రౌండ్ మీద తెల్లటి అక్షరాలు.రమారమి 53 సంవత్సరాలు నడిచి,ఇంచుమించు 620 ఇష్యులకి పైగా ప్రచురణ కావడం..అదీ వన్ మేన్ ఆర్మీ లాంటి ఎన్నార్ చందూర్ నేతృత్వంలో..!చాలా సింపుల్ గా వచ్చేది ఎలాంటి పటాటోపం లేకుండా.. చాలా దాకా ఆ సంపాదకులు ఏర్చికూర్చినవే.అయితే కొన్ని ఆణిముత్యాల వంటి రచనలు,సేకరణలు ఉండేవి.పాత సినిమా సమీక్షలు,డైరీ విశేషాలు,జోకులు,ఉత్తరాలు,పుస్తక సమీక్షలు,జఫర్సన్ రచన కి అనువాదం,ఇలా గమ్మత్తు కూర్పులతో వచ్చేది.

పత్రిక ..ముఖ్యంగా చిన్న పత్రిక నడపడానికి..ఆర్ధిక స్థోమత అటుంచి చాలా ఓర్పు ఉండాలి. చాలా మంది చిన్న పత్రికలు ఎంత తొందరగా తెస్తారో అంత తొందరగానూ మూసేస్తారు.ఓర్పుతో నడపాలే గాని కాలం తో పాటు దానికీ ఓ శక్తి పెరుగుతుంది.గౌరవం పెరుగుతుంది.ఇక లోధ్ర ,కేసరి ,అశోక పౌడర్ యాడ్ లు గుర్తుకొస్తాయి జగతి అనగానే.

పాపం చనిపోయేంతవరకు ..నాకు ప్రతి నెల ఓ కాపీ పంపుతుండేవారు చందూర్ గారు. పాత జగతి కాపీలు చూసినప్పుడల్లా కొన్నేళ్ళు వెనక్కు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది.కొన్ని ఏళ్ళ క్రితం The Books  అనే నాలుగు పేజీల ఇంగ్లీష్ పత్రిక నడిపినప్పుడు నేను టంచన్ గా ఆయనకి ఓ కాపీ పంపేవాడిని.ఆ గౌరవం తో అనుకుంటాను..బహుశా ఆయన చివర కాపీ వరకు జగతి ని నాకు పంపేవారు.ఈ రోజు ఆ జగతి పాత ప్రతి చూడగానే ఇది రాయాలనిపించింది.Click here 

Wednesday 3 September 2014

అప్పుడప్పుడు అవి కూడా ఉపయోగపడుతుంటాయి.



రైల్వే స్టేషన్ లోనో..బస్ స్టాండ్ లోనో కనబడుతుంటాయి.ముప్ఫై రోజుల్లో కన్నడ నేర్చుకొండి..తమిళ్ నేర్చుకొండి..అంటూ కొన్ని పుస్తకాలు.ఇవి ఇంచు మించు అన్ని భారతీయ భాషల మీద ప్రచురిస్తుంటారు.ఏదైనా ఇతర రాష్ట్రం వెళ్ళినప్పుడు ప్రాధమిక జ్ఞానం ఆ భాషలో బాగానే అందిస్తుంటాయి ఇవి.తీరిక ఉన్నప్పుడల్లా కొన్ని పేజీలు చదువుతుంటే చక్కగా ఉంటుంది.ఇప్పుడు నెట్ లో చాలా ఉన్నాయనుకోండి.ఎప్పటినుంచో ఇవి ప్రచురిస్తున్న పబ్లిషర్స్ అభినందనీయులు.Click here

Saturday 30 August 2014

తిరుక్కురళ్ (తమిళవేదం)

తిరుక్కురళ్ (తమిళవేదం) చదివారా..?

ఇంచుమించు కొన్ని వందల ఏళ్ళ క్రితం రాయబడిన తిరుక్కురళ్.. తమిళ జీవిత జీవిధానం పై చాలా ప్రభావాన్ని కలిగి ఉన్నదని చెప్పాలి.మనిషి జీవితం లో ఎదుర్కునే ప్రతి ముఖ్య మలుపు ని ఉద్దేశించి రెండు వరుసల్లో (ద్విపద)  చెప్పిన గ్రంధమిది.అనుభవసారాన్ని కాచి వడబోసినట్లుగా ఉంటాయి ఆ సత్యాలు.చల్లా రాధాకృష్ణ శర్మ గారు తెలుగు సేత ని చదివాను.అనేక భారతీయ ..యూరోపియన్ భాషల్లోకి అనువదించబడింది ఇది.రచయిత ని వళ్ళువర్ అంటారు.ధనం మీద ఆయన చెప్పిన కురళ్ చాలా వాస్తవంగా అనిపిస్తుంది.( "ధనమును బాగా ఆర్జింపుము,అది నీ శత్రువు గర్వం ను త్రుంచే కత్తి వంటిది" అంటాడు ఓ కురళ్ లో ..)

ప్రేమ,స్నేహం,ధనార్జన,రాజనీతి,సంతానం,వ్యవసాయం,ప్రయత్నం ఇలా ఒకటేమిటి అనేక అంశాల మీద జీవిత సత్యాల్ని ఎంతో హృద్యంగా చెప్పాడాయన.వీలైతే చదవండి..!Click here
 










  

Monday 25 August 2014

మొబైల్ ఎక్కువ మాట్లాడినా చిక్కేనేమో..!



సెల్ ఫోన్ లో ఊరికే అదే పనిగా మాట్లాడినా మన మానసిక ఆరోగ్యానికి..ఆ పిమ్మట శారీరక ఆరోగ్యానికి దెబ్బేనని ఆ మధ్యనెక్కడో చదివాను.మెదడు లోని న్యూరాన్ లమీద రేడియేషన్ ప్రభావం చూపిస్తుందని కొందరు మిత్రులు కూడా అన్నారు.ఎందుకో గాని చిన్న కారణానికే బాగా కోపం రావడం,మతిమరుపు ఎక్కువ కావడం ఇలాంటి లక్షణాలన్నీ సెల్ ఫోన్ బాగా మాట్లాడేవాళ్ళలో ఎక్కువ అవుతున్నట్లు నా చుట్టుప్రక్కల వారిని గమనిస్తే అనిపించింది.ఎందుకైనా మంచిదని మొబైల్ వాడకం బాగా తగ్గించాను.Click here











Sunday 24 August 2014

యు.ఆర్.అనంతమూర్తి చిన్నతనం లో గడిపిన ఇల్లు..!



ప్రఖ్యాత భారతీయ రచయిత యు.ఆర్.అనంతమూర్తి ఇటీవల పరమపదించిన విష్యం అందరకీ తెలిసినదే.ఆయన బాల్యం గడిచిన Melige అనే గ్రామానికి ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం మంచి గుర్తింపునివ్వబోతోంది.ఆయన మేనమామ ఇంట్లో ఇక్కడనే ఆయన జన్మించి..నాల్గవ తరగతి వరకు చదువుకున్నారు. తాను బెంగుళూరు లో ఆ తర్వాత స్థిరపడిన ప్రతి ఏటా ఆయన ఈ పల్లె కి వస్తుండే వారు.వచ్చినప్పుడల్లా అక్కడి పాత స్నేహితుల్ని కలవడం తప్పనిసరి.అలాగే మేనమామ ఇంట్లో పెట్టే మామిడికాయ పచ్చడి తప్పనిసరిగా తీసుకెళుతూ ఉండేవారు.అక్కడ ప్రవహించే తుంగ ఒడ్డున ఏకాంతంగా  కూర్చోవడం కూడా ఆయనకి చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు తెలిపారు.Click here











Saturday 23 August 2014

"సీనియర్ సిటిజన్ వాణి " చూశారా..?



రిటైర్ అయిన వారి కోసం,సీనియర్ సిటిజన్స్ కోసం నడుపబడుతున్న మాసపత్రిక   "సీనియర్ సిటిజన్ వాణి ".ఇది మచిలీపట్నం నుంచి వస్తున్నది.కధలు,కవితలు,వివిధ వార్తలు దీనిలో ప్రచురిస్తూ ఉంటారు.పత్రిక సైజు లో బాగానే ఉన్నది.అయితే పేజీలు 20 దాకా ఉంటాయి.అట్ట కాకుండా.సీనియర్లు రాసే వ్యాసాలు ఇంకా ఇతర ప్రక్రియలు ప్రచురిస్తూ ఉంటారు.ఒక ఉద్దేశ్యం తో నడుపబడే పత్రికలు క్రమేపి ఆయా వర్గాలకి చేరువ అవుతుంటాయి.పునుకొల్లు సత్యనారాయణ గారు దీని సంపాదకులు.ఆయన సెల్ నెంబర్.9949308664 .మీకు కావలిస్తే సంప్రదించవచ్చు.Click here









Tuesday 19 August 2014

ఇలాంటి ఒక బ్లాగు ఇంగ్లీష్ లో మన తెలుగు జర్నలిష్టులలో ఎవరైనా రాస్తే బాగుండును..!



కటక్ దగ్గర తిగిరియా కి చెందిన సుభాష్ చంద్ర పట్నాయక్ అనే ఆయన ఒడిశా చరిత్ర,సమకాలీన రాజకీయాలు,వార్త వ్యాఖ్యానాలు సమాహారంగా రాసే ఒక బ్లాగు ని తప్పకుండా చదువుతాను.చాలా బాగుంటుంది.చెప్పే విధానం గాని.. ఎంచుకునే అంశం గాని..టూకీగా ఆ రాష్ట్రం గురించి ..అక్కడి సంఘటన ల గురించి చక్కటి అవగాహన కలుగుతుంది.ఏదో మూడ్ వచ్చి ఒకటి రెండు ఏళ్ళు అని గాకుండా చాలా కాలం నుంచి అసిధారవ్రతంగా రాస్తూ ఉంటాడాయన.జాతీయ సంఘటనల గూర్చి కూడా ఉంటాయి.  

పూరి లోని జగన్నాధుడు వాస్తవానికి బుద్ధుడని..ఆ తరువాత దాని అలా మార్చడం జరిగిందని చాల ఆధారాలు చూపుతూ కొన్ని వ్యాసాలు రాశారు పట్నాయక్.ఆయన ఇంగ్లీష్ శైలి చాలా హృద్యంగా ఉంటుంది.సాధికారత తో చెప్పినట్లు ఉంటుంది.ఇలాంటి ఒక ఇంగ్లీష్ బ్లాగు మన తెలుగు జర్నలిస్టులు ఎవరైనా రాస్తుంటే తెలుపగలరు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మన లాంటి పెద్ద కార్పోరేట్ కాలేజీలు ఒడిశా లో లేకపోయినా ఎందుకనో క్రియేటివ్ ఇంగ్లీష్ రైటింగ్ అనేది ఒక సాంప్రదాయం లా వస్తున్నది.
సరే..ఆ బ్లాగు సైట్ కావాలా ..అయితే ఇక్కడ నొక్కండి.www.orissamatters.com