MY SELECTED WRITINGS

నా పేరు శివ..! (నవల)

ఆంగ్ల మూలం: రాఘవ్ వరదరాజన్

అనువాదం: మూర్తి కె.వి.వి.ఎస్.  

Post no: 1 


ప్రోలోగ్  

" నువు నా పార్వతివి కావు.ఎవరో అబద్దాల కోరువి.అలగా మనిషివి.నన్ను నమ్మించాలని చూడకు,అవును ..నేను నీ మాయ లో చిక్కింది నిజమే..!అప్పుడు నాకు ఆలోచన లేకపోయింది.ఇప్పుడు తరచి చూస్తే నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలుస్తోంది." నా భుజాల్ని కుదుపుతూ అన్నాడు తను.

"ముందులాగ ఇప్పుడు నిన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నానో తెలుసా ? నువు ఒట్ఠి బజారు రకం.కావాలా దానికి ఆధారం..?చెప్పనా..నువు నీ స్కూల్ రోజుల్లో జరిపిన ఆ రెండు ప్రేమ యవ్వారాలు చాలావా..?అసలు మొత్తం నీ గురించి గుణ ఒక్కడికే బాగా తెలుసు.పైగా నిన్ను నా దేవత గా భావించాలా..?నవ్వు వస్తోంది." అతను లేచి రూం లో కలియదిరుగుతున్నాడు.

" అన్నట్లు ఓ సేల్స్ టెక్నిక్ చెప్పనా ..!నీ రహస్య స్నేహితురాలు ప్రియాంక చెప్పింది లే.సేల్స్ మేన్, కష్టమర్ ని ఏమని అడుగుతాడు వచ్చిన వెంటనే... మీరు చెక్ ఇస్తారా లేదా క్యాష్ ఇస్తారా అని.అంటే కష్టమర్ కొనాలా లేదా అని తేల్చుకోకుండానే అతనికి చాయిస్ ఇవ్వడం జరుగుతుంది.అంటే అతను కొనేసినట్లుగానే భావిస్తున్నాడు ఆ సేల్స్ మేన్.ఇదొక అద్భుతమైన టెక్నిక్ "

" సరే..ఇదంతా నాకెందుకు చెబుతున్నావు..?" అడిగాను నేను.

" ఎందుకా..ఇపుడు అదే టెక్నిక్ నీ మీద ప్రయోగించ బోతున్నాను.నువు ఎలా చావాలని అనుకుంటున్నావు...నా బ్యాగ్ లో ఓ కత్తి ఉందిలే...దానితో నీ గొంతు కోసేదా లేదా ఊపిరి ఆడకుండా చేసి చంపేదా ..అంటే నువు ఆల్ రెడీ చనిపొయినట్లు గానే భావించేస్తున్నాను.ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం.." అతగాడి మొహం లో ఓ దెయ్యపు నవ్వు.

" వరుణ్" అంటూ ఏడవటం ప్రారంభించాను.చావు కి నేను భయపడటం లేదు గాని నేను ఎంతో గాఢంగా ప్రేమించిన మనిషి చేతి లో చావడమే నాకు బాధ గా ఉంది.

" నువు ఏడుస్తుంటే నీ అందం పది రెట్లు అవుతుంది.అది నీకు ఎవరైనా చెప్పారా.." అతను  బ్యాగ్ వేపు గా నడిచాడు.

" చెప్పు ..ఏ రకం చావు ని నువు కోరుకునేది.." పదునైన చాకు ని బ్యాగ్ లోనుంచి తీశాడు.

దేవుడిని ప్రార్ధించ సాగాను..భయం తో..!ఒక వేపు వదిలిపెట్టమని అర్ధిస్తూనే.నరకం లాంటి ఈ గది నుంచి ఎలా బయటపడేది..ఎలాగైనా సరే బయట పడవలసిందే..!

*    *    *    *   *   *

వరుణ్ (పార్ట్ -1,చాప్టర్ -1)

వాతావరణం అంతా గందరగోళం గా ఉంది.మా కాలేజ్ లో జరిగే కల్చరల్ ఫెస్టివల్ అంటే పెద్ద పేరు.ఇక దాంట్లో జరిగే మ్యూజిక్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.జనాలు విరగబడతారు.ఇప్పుడదే జరుగుతున్నది. ఎవరి సీట్ల లో వారు కూర్చోవాలని ఒకటే ఆతృత.తోసుకుంటూ వస్తున్నారు.

ఈ సందర్భంగా మా హడావుడి కొంత ఉన్నది.అంటే Audi force అనే పేరు తో ఉండే మా స్టూడెంట్స్ గ్యాంగ్ ఇలాంటి వేళ ల్లో లేని అధికారాన్ని జనాల మీద చూపుతూ ఉంటుంది.ఎవరు సిగరెట్లు,లైటర్లు,వెపన్లు ఇలాంటివి తెచ్చినా మేము వాటిని రూల్స్ కి విరుద్దం అనే పేరు తో లాక్కుంటూ ఉంటాము.ఇపుడు మా పని లో యమ బిజి.ఒక్కొక్కళ్ళని చెక్ చేస్తున్నామా ..ఎంట్రెన్స్ దగ్గర లేట్ అవుతోంది.

" బ్రొ ..రెండు సిగరెట్ పాకెట్స్ దొరికాయి నీ వద్ద..రోజుకి ఎన్ని కాలుస్తావేమిటి.." అడిగాడు రాం ఒకతన్ని.

" చాలానే ఉండొచ్చు..నేను లెక్క పెట్టలేదు.."

" కనీసం ఇంకో ఇరవై ఏళ్ళు అయినా బతకాలా వద్దా నువు..." అలా అడుగుతూనే ఆ సిగరెట్ పాకెట్స్ ని నాకు అందించాడు రాం.

"అంటే ఏమిటి నీ అర్ధం"

" నీ మేలు కోరే నేను చెప్పినది" అంటూ రాం లెక్చర్ దంచసాగాడు.అవతల వాడికి చికాకు లేచినట్లయింది.

" మీ కాలేజ్ వాళ్ళకి ఏమయిందిరా అసలు..పెద్ద హెల్త్,ఫిట్నెస్ గురూ లు అనుకొంటున్నారా..?ఇక్కడకి వచ్చింది మీ బోధలు విండానికి కాదు.." అవతలి వాడు చెలరేగాడు.రాం చేస్తున్నది కొద్ది గా ఓవర్ అయిందని నాకే అనిపిస్తోంది.ఇక్కడ జరుగుతున్న వాదనల్ని విని మా సీనియర్ లు రక్షకుల్లా వచ్చారు.

" ఒక్క అయిది నిమిషాలు ఓపిక పట్టండి బ్రో..జనాలు అంతా వెళ్ళచ్చు" అన్నాడు కెవిన్.ఇదే అదను గా మేము ఇద్దరం దారిని బ్లాక్ చేస్తున్నట్లు నిలబడ్డాము.

" మీ ఇద్దరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు..అసలు పొండి ఇక్కడనుంచి " అంటూ మరో సీనియర్ రూపేష్ గదమాయించడం తో ఇవతలికి వచ్చేశాము.జనాల నుంచి వసూలు చేసిన సిగరెట్ పెట్టెలు మా వద్ద  దండిగా ఉన్నాయిప్పుడు.అవన్నీ ఇపుడు మావి.

" డ్యూడ్...ఇదంతా అవసరమా.." ఆ సిగరెట్ పెట్టెల్లోంచి ఒకటి తీసి వెలిగిస్తూ అన్నాను నేను.

" చెప్తాలే గాని...ఏయ్ వరుణ్ ...నాకో సిగరెట్ ఇవ్వు." అన్నాడు రాం .నేను తీసి ఇచ్చాను.

" జనాల మీద అలా పెత్తనం చేయటం నాకో హాబీనోయ్...మాంచి థ్రిల్లింగ్ అనుకో..ప్రేమ లో మునిగి తేలినంత ఇది గా ఉంటుంది " సిగరెట్ కాలుస్తూ అన్నాడు రాం.

" ఏమిటి ఆ పోలిక.."

" మా నాన్న ని చిన్నప్ట్నుంచి చూస్తున్నానా ..అది అలా చెయ్..ఇలా చెయ్..ఒకటే ఆధిపత్య చెలాయింపు,దానికి కారణం ఆయన మీద నాకున్న భయం ఇంకా గౌరవం ఇలా ఏదైనా అనుకో...! నాకు ఎక్కడ సమయం కలిసి వచ్చినా అలా నా తడాఖా చూపిస్తుంటాను.మరి ఇలాంటి సందర్భాల్లోనే గదా జనాల మీద మన అధికారం చూపించేది.."

రాం చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు.గతం లో ఎవరో మేధావి చెప్పింది జ్ఞాపకం వచ్చింది."మనిషికి సంపూర్తి అధికారం ఇచ్చి చూడు..అతను అచ్చం ఒక దేవుని గా నే భావించుకుంటాడు ప్రవర్తనలో" అని. ఏది ఏమైనా మా కాలేజ్ Audi gang లో ఉన్నందువల్ల ఒనగూరే సౌకర్యం ఇది. (సశేషం)


 నా పేరు శివ (నవల) Post no: 2

మా కాలేజ్ లో అనేక బ్రాంచ్ లు ఉన్నాయి.ఒక్కోదానివల్ల ఒక్కో లాభం అనుకోండి.ఉదాహరణకి ఫోటోగ్రఫీ బ్రాంచ్ లో సభ్యులు గా ఉన్నవాళ్ళ లో అందమైన అమ్మాయిలు ఉంటారు.డెకరేషన్ బ్రాంచ్ లో క్రియేటివ్ స్పిరిట్ ఉన్న అమ్మాయిలు ఉంటారు.ఇక బ్యాక్ స్టేజ్ విభాగం కి వస్తే అల్లరి గా ఉండే టైపు ..ఆ విధంగా..!కేవలం మా Audi force లోనే అంతా మగపురుషులు ఉండేది.అయితే ఒకటి ఇలాంటి షోలు జరిగేప్పుడు జనాల మీద అధికారం చలాయించవచ్చు.ఇంకా ఉచిత స్మోక్స్ ..లభ్యం అవుతుంటాయి.

" సరే..పద, మ్యూజిక్ షో లో ఏం జరుగుతోందో చూద్దాం" అన్నాను సిగరెట్ ని నేలకి కుక్కుతూ..!

"అలాగే"

రాం,నేను ఆడిటోరియం వైపు నడిచాము.లోపల ఓ మారు కలియజూస్తే..చివరి వరస లో సీట్లు ఖాళీ గా కనిపించాయి.వెళ్ళి కూర్చున్నాం.అదే క్లాస్ లో అయితే ముందు సీట్లు ఖాళీ గా ఉంటాయి.దాని లెక్క వేరు.సీట్లో ఒరిగి ఆవలించాను.షో స్టార్ట్ కాబోతోంది.వెస్ట్రన్ రాక్,పాప్ గీతాలు పాడుతున్నారు ఆ మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు.ఇలాంటి దానికి అటెండ్ కావడం ఇదే మొదటిసారి.నేను గాని,రాం గాని ఈ కాలేజ్  లో చేరింది ఈ సంవత్సరమే.రాగింగ్ దశ దాటేశాం.సీనియర్,జూనియర్ లు ఫ్రీ గా మూవ్ అయ్యే దశ కి చేరుకున్నాం.

నాకు ఆసక్తి లేక కళ్ళు మూసుకొని వింటున్నా.రాం మాత్రం పాట తో శృతి కలుపుతున్నాడు..కొంత సంగీత జ్ఞానం ఉన్నవాడే.నేను తిరుచ్చి లో ఉన్న ఈ MIIT కాలేజ్ లో చేరింది ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవడానికే తప్ప ,వీటన్నిటి కోసం కాదు.ఎప్పుడూ మంచి గ్రేడు లు తెచ్చుకోవాలి.ఆ తర్వాత మాంచి జాబ్ తెచ్చుకోవాలి.నా ధ్యాసంతా అదే.
స్టేజ్ మీద నుంచి అరిచే యాంకర్లు,దానికి ధీటుగా స్పందించే జనాలు,అంతా గోల గా ఉంది.

"ఇపుడు లవ్ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ లవ్ అనే పాట ప్రెజెంట్ చేయబోతున్నాం .." అలా అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు నిర్వాహకుడు.అందరూ ఉద్వేగంగా ఎదురుచూస్తున్నారు.అందరి తో బాటు నేనూనూ.డ్రంస్ దగ్గర ఒకరు,గిటారిస్టులు ముగ్గురు,కీబోర్డ్ దగ్గర ఒకరు ఉన్నారు వాద్య సహకారం అందించడానికి.ఓ అందమైన అమ్మాయి మైక్ పట్టుకొని ఉంది పాడటానికి.అందరి అటెన్షన్ ఆమె వైపే.సాంగ్ మొదలైంది.ఆమె ని నా భార్య లాగానూ,ఆమె కి పుట్టిన పిల్లలు సూపర్ మోడల్ గానూ ఊహించుకోసాగాను.

ఆమె అయిదు అడుగుల ఆరంగుళాలు ఉండవచ్చునేమో.శిల్ప సుందరి అనే పదానికి అర్ధం లా ఉంది.పోనీ టైల్ లో ఉంది.ఆ జుట్టు కర్లింగ్ దా సాపుగా ఉండేదా.అయినా అది నాకంత అవసరమా..నాకు నేనే అనుకున్నా.ఆ టైట్ బ్లూ సల్వార్ కమీజ్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.

ఇలాంటి అందాల రాశి ని చూడటం వరుణ్ జీవితం లో ఇదే మొదటిసారి.ఎన్ని అవరోధాలు రానీ.నేను ప్రేమించబోయే అమ్మాయి ఈమె నే.ఎంత పోటీ అయినా ఉండనీ ..నో కాంప్రమైజ్ ..నేను ప్రేమించబోయేది ఈ అమ్మాయినే అనుకున్నాడు.ఆమె పాడుతున్న పాట ప్రేమ గురించింది..నేను ఇప్పటికే నిండా మునిగిపోయాను దానిలో.ఆమె కూడా అంత లీనమయింది పాట లో.

ఆ పాట అర్ధం చేసుకోడానికి ప్రయత్నించా గాని ...ఆమె అందమే నా మనసు ని డామినేట్ చేస్తోంది.రాం వైపు తిరిగి అన్నాను." ఆ పాడుతున్న సింగర్ ఎవరు" అని.

" డ్యూడ్ ..పాట గాని తర్వాత చెబుతా.." అన్నాడు రాం.

అమ్మయ్యా అనుకున్నాను లోలోపల..!
ఒక్కసారి వివరాలు తెలుసుకుంటే ఆ తర్వాత ఫాలో అప్ కి ఈజీ గా ఉంటుంది.పాట వీనుల విందు గాను,ఆమె మోము నయనానందకరం గాను ఉన్నాయి.ఆడియన్స్ చప్పట్ల మోతలు అయిన తర్వాత అడిగాను." ఆ..ఇపుడు చెప్పు ఆ వివరాలు" అని.

" ఎవరి గురించి"

" అదే..ఆ చివర పాడిన అమ్మాయి గురించి"

" ఆమె గురించా..నీకు ఎంత తెలుసో..నాకూ అంతే తెలుసు..హ్మ్..మ్యూజిక్ ట్రూప్ లో మెంబర్ అనుకుంటా "  

"ఆహా ఎంత గొప్ప ఇంఫర్మేషన్..నాకు కావాల్సింది ఆమె పేరు ..ఏ ఇయర్ చదువుతోంది ఇలాంటివి "

" అవన్నీ ఎందుకు నీకు" 

" చాలా గాఢంగా లవ్ లో పడ్డాను ..మేన్"  చెప్పాడు వరుణ్ .

" నువ్వు మాత్రమేనా..నేను కూడా పడ్డా " ఉడికిస్తున్నట్లు గా అన్నాడు రాం.

" ఆ సంగతి మర్చిపో..ఇక మీదట ఆమె నీకు సిస్టర్ లాంటిది అని భావించుకో.." 

" నువు చెప్పేది సీరియస్ గానా..అయితే ఈ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకోవలసిందే.." 

" ముందు నా ప్రేమ ఫలించాలి గదా..సెలెబ్రేట్ చేసుకోడానికి" 

" అసలు ప్రేమ లో ముందుకు పోవాలంటే మొదటి స్టెప్ ఏమిటో తెలుసా.." 

" ఏముంది ...ఆమె తో మాట కలపడమేగదా.." 

" దానికంటే కూడా ఒకటుంది" 

" ఆమె ఎవరో..ఎక్కడ ఉంటుంది ..ఇలాంటివి కనిపెట్టాలి అంతేగా.."

" అది కాదురా అబ్బాయ్..ఇంకోటి ఉంది"

" మాకు తెలీదులే గాని..నువు జ్ఞాన బోధ చెయ్యి ఈ విషయం లో " 

" నీకు,ఆ అమ్మాయికి మధ్య  ప్రేమ వారధి నిర్మించడానికి ఒకమ్మాయి ఇంకెవరైనా ఉన్నారా ..అదెవరు..అది కనిపెట్టాలి ముందు.." 

" థాంక్స్" 

" నీకు సలహా ఇచ్చా..సెలెబ్రేషన్ కి సరిపడా .."

" నువు చెప్పిందానిలో విషయముంది" అన్నాను.రాం సామాన్యుడు గాడు.

" మరి వైన్ షాప్ కి ఇకనైనా లాక్కెళతావా..లేదా.."

" తర్వాత ప్రోగ్రాం చూడవా.."

" నీకు నేను,నాకు నువ్వు ..మనకి మనమే ఎంటర్టైన్మెంట్ " రాం నన్ను లేవదీశాడు.

మా క్యాంపస్ కి కుడివేపున,కొద్ది దూరం లో ఉన్న వైన్ షాప్ కి నడిచాం.ఆ గేట్ల దగ్గర వసూలు చేసిన సిగరెట్ ల లో చెరొకటి వెలిగించాం.మా కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్ అంటే పెద్ద పేరు..నార్త్ నుంచి కూడా వస్తారు దీనికి.ఆమె ఎవరో త్వరగా కనిపెట్టాలి.నా ఆలోచనలన్నీ అటే సాగుతున్నాయి.త్వరలో ఆమె ని నేను చూడగలనా..!?    (సశేషం) 

నా పేరు శివ  (Post no:3)

" అబ్బా..దెబ్బ అయింది రా బాబు.." TASMAC ని సమీపించగానే నిట్టూర్చాడు రాం.ఆ షాప్ మూసి ఉంది.

" ఈ రోజు గాంధీ జయంతి,డ్రై డే.అందుకే వైన్ షాప్ మూసేశారు." నేనూ బాధ గానే ఫీలయ్యాను.నా లోపలి ఫీల్ నంతా ఆ మంది కొట్టే సమయం లో వెళ్ళగక్కుదామనుకున్నాను.విధి ఇంకో లా తలచింది.

"అసలు నిన్ననే మందు కొని దాచి ఉంచాల్సింది.." అన్నాడు రాం.

" డ్యూడ్ ...ఈ రోజు డ్రైడే అని నిన్న ఎక్కడ గుర్తుందని...అయినా సెలెబ్రేట్ చేసుకుండానికి నిన్న కారణం మాత్రం ఎలా ఊహించగలం"

"అసలీ రోజున ఎందుకు మూయడం.."

"డ్రైడే గదా .."

" ఇది బాగా లేదు..వరుణ్"

"సరే..ఇప్పుడు మన రూం కి పోదామా.." అడిగాను నేను.ఆ షాపు ముందు నిలబడి మా దురదృష్టానికి చింతిస్తున్నాము..!

" ఇది మూసేశార్లే గాని ...ఈ రోజు నాకు నువు నాకు ట్రీట్ ఇవ్వాల్సిందే.కనక ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ కి పోదాం పద "

" సరే కానీ..అయితే ఒకటి మనకి ఇరువురు కి ఆమోదయోగ్యం గా అది ఉండాలి.."

" నువు తింటూ ఎంతైనా ఎంజొయ్ చెయి..నో ప్రోబ్లం"

" నా ఉద్దేశ్యం అది కాదు.ఆ సింగర్ విషయం లో నీ ప్లాన్ ద్వారా నాకు సాయం చేయాలి..నువు ఇలాంటి వాటిల్లో గొప్ప ఎక్స్ పర్ట్ ని అంటావు గదా.. "అన్నాను నేను.

" తప్పకుండా నా నుంచి లబ్ది పొందుతావు.నీ కోరిక నెరవేరుతుంది.పద D3 రెస్టారెంట్ లోకి పొయి మాట్లాడుకుందాం." అన్నాడు రాం.

" గాంధీ జయంతి రోజున మందు బందు ఎందుకో..ఏ విధంగా అది ఆయన్ని అగౌరవ పరిచినట్లు అవుతుంది" తనే ప్రశ్నించాడు.

" నీలాంటి వాళ్ళు కొందరు ఉంటారు గా..తాగి చికాకు చేసేవాళ్ళు...దాని కోసమే అయి ఉంటుంది.."

" నిజంగానా...నేను తాగుతా..కాని కంట్రోల్ లోనే ఉంటా ..మనం మొదటి సారి తాగినప్పుడు ఆ రోజు ని గుర్తు చేసుకో బ్రో...నాకు పూస గుచ్చినట్లు గుర్తుంది..చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చావ్ ఆ రోజు...నేను ..నాకూ అదే మొదటిసారి అయినా కంట్రోల్ నే ఉన్నా .."

" ఓకె మేన్ ..ఒప్పుకుంటున్నా..ఆల్కాహాల్ శక్తి ని తక్కువ అంచనా వేశా...అదంతా నాకు ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావ్..అది నీకు ఆనందం అవునా.."

" నువు మొదలుపెడితేనే గదా నేను చెప్పింది...సరే గాని నా బాధంతా ఒకటే ఈ రోప్పుడు డ్రై డే ఏంట్రా బాబు అని "

" ఇంకా ఎక్కువ దాని గురించి కావాలంటే నెట్ లో కి వెళ్ళి సెర్చ్ చెయ్యి.." మొత్తానికి దాబా లోకి ప్రవేశించి ఆర్డర్ ఇచ్చాం.స్క్రాంబుల్డ్ ఎగ్స్,ఆరు పరోటాలు,రెంటు మసాలా దోశెలు,అలా..!మా కేంపస్ కి ఈ దాబా దగ్గరే.అన్నీ పదార్ధాలు బాగా చేస్తారు.

" అసలు విషయానికి వద్దాము.ఆ అమ్మాయి నా ప్రేమికురాలి గా మారాలి.నీ ప్లానింగ్ చెప్పు ఇపుడు .." అడిగాను.

" ఓకె ..దానికి ముందు గా ఒకటి..నీ టేస్ట్ ని అభినందించాలి"

" సరే..ఒకరికొకరు ఎత్తెసుకోవడం ఎందుకు లే గాని...ముందు అసలు పాయింట్ లోకి వస్తావా "  
"నేనూ అదే అనుకుంటున్నా"

"ఆమె మన సీనియర్ అయ్యే అవకాశం ఉందా"

"మిత్రమా ఏజ్ అనేది సమస్య కాదిక్కడ,ఒకరికి ఒకరు కనెక్ట్ అయే విషయం చూడాలిక్కడ"

"ఆ..చెప్పు.."

" ముందు ఐ కాంటక్ట్ మెథడ్ అనుసరించు.నువు ఆమె నే చూస్తున్నపుడు ...నీకేసి చూసిందే అనుకో...నువు కళ్ళు అవతలకి తిప్పుకోకుండా ఉండాలి..ఉండి.."

" ష్యూర్.. ఆ తర్వాత"

" అప్పుడు నువు చిన్నగా నవ్వుతూ ఆమె వైపు కి వెళ్ళు...షేక్ హేండ్ ఇచ్చి నిన్ను నువ్వు పరిచయం చేసుకో...అప్పుడు ఆమె రెస్పాండ్ ఎలా అవుతుందో చూసి నువు ముందుకి వెళ్ళాలి.సింపుల్ ప్లాన్.." 

" చూడటానికి సింపుల్ గానే ఉంది...రోడ్ మీద పోయే దానయ్య తోనే మాట కలపడం ఇబ్బంది గా ఉంటుంది నాకు,అలాంటిది..సర్లే ..ఏదో మిష వెతుకుతా మాట్లాడటానికి.." 

" అదేకాదు ప్లాన్ బి కూడా ఉంది నా దగ్గర.మరీ క్రేజీ గా ఉంటుంది అది.టోటల్ డెడికేషన్ కావాలి దానికి.నీ వల్ల అవుతుందా అని" 

"ఏదో ఒకటి..మంచి ఇది గా ఉండాలి,ఏదైనా ఫాలో అవడానికి రెడీ" 

" అది స్పిరిట్ అంటే..!ఏంచెస్తావంటే గిటార్ ఒకటి తీసుకో..ప్రాక్టిస్ చెయ్...అలా నీ టాలెంట్ చూపించు "

"దానివల్ల ఒరిగేదేముంది" 

" వచ్చే సంవత్సరం ..మన కాలేజి మ్యూజిక్ ట్రూప్ లో చేరు.ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేశావనుకో...ఆడిషన్ లో ఈజీ గా నెగ్గవచ్చు" 

"నువు జీనియస్ వి డ్యూడ్ ...ఇలాటి ఆలోచనే రాలేదు నాకు"  లేచి ఒకరికొకరు హత్తుకొని భుజాలు చరుచుకున్నారు.

" నీకు నచ్చినందుకు హేపీ గా ఉంది బ్రో.నాకు ఇక్కడ తినిపించావు.నీకు అదిరిపొయే  ప్లాన్ దొరికింది చూశావా..విన్ విన్ సిట్చుయేషన్ అని నువ్వు అనేది ఇలాటిదేగా.." 

"కరెక్ట్" 

" మరి గిటార్ కొనబోయేది ఎపుడు" 

" అవసరం లేదు" 

" ఎందుకు" 

" నీ దగ్గర ఉందిగా ..దాన్ని అందాకా వాడుకుంటా " 

" నిరభ్యంతరంగా వాడుకో..నేను ఎలాగూ పెద్ద గిటారిస్ట్ ని కాలేక పోయాను,నువ్వైనా పేరు తెచ్చుకో" 

" ఒక పురావస్తువు లా దాన్ని మూల పారేశావు..నీకంటే ఆ సాలె పురుగు లే దాన్ని ఎక్కవ వాయిస్తున్నాయి..దానికి ఇక ఫుల్ స్టాప్ పెడదాము" అన్నాను. (సశేషం)  

 నా పేరు శివ (నవల) Post no: 4

జనవరి 13,2011.

రెండవ సెమిస్టర్ ప్రారంభమయింది.మొదట సెమిస్టర్ విషయానికి వస్తె 10 కి 8.6 CGPA సాధించాను.రాం కూడా ఫరవాలేదు.అతను 6.3 దాకా సాధించాడు.పాసవుతాడు.అంతే.తను ఎక్కువ గా ఇంటర్నెట్ లో సినిమాలు అవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.సరే,ఆ పని చేసినా చదువు పై ధ్యాస ఎక్కువగా పెట్టాను.రాం,నేను బి హాస్టల్ లో 409 వ నెంబర్ గల రూం లో ఉంటాము.మొత్తం మీద పది హాస్టల్స్ ఉంటాయి.మూడు గర్ల్స్ కి ఏడు మగ పిల్లలకి ..కంబైండ్ గా ఏమీ లేవు.

పొద్దున మొహం కడిగినతర్వాత సిగరెట్ వెలిగించాను.మధ్యానం పన్నెండున్నర కి మొదటి లెక్చర్ ప్రారంభం అవుతుంది .వాచీ చూసుకున్నాడు. ఇంకా ఇరవై నిమిషాలు ఉంది.రాం కూడా రూం లో లేడు.క్లాస్ కి వెళ్ళి ఉండవచ్చును.ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దాపు లోని టీ షాప్ లో ఉండే అవకాశమూ ఉంది.

జీన్స్,టీ షర్ట్ వేసుకుని రూం కి తాళం వేశాను. వేగంగా ఇన్స్టిట్యూట్ వేపు నడవ సాగాను.గతరోజు జరిగిన లెస్సన్స్ గుర్తుకు తెచ్చుకోసాగాను.అది ఈరోజు కి హెల్ప్ అవుతుంది.మా ప్రొఫెసర్ వద్ద మంచి రిమార్క్ కొట్టేయాలని కూడా నా కోరిక.చక్కగా క్లాస్ అటెండ్ అయితే దానికి కొన్ని మార్కులు ఉన్నాయి.

ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది.ఆ మ్యూజిక్ ట్రూప్ లో పాడిన నా డ్రీం గర్ల్  వెళుతూ కనిపించింది.ఆమేనా అని సందేహం గా చూశాను.పోనీటైల్ వేసుకొని ఉంది.గత మూడు నెలల నిరీక్షణ కి ఇప్పుడు ఫలితం దక్కింది.ఆమె ని ఫాలో చేయాలని అనిపించినా క్లాస్ పోతుందేమో అని సందేహం పీడించసాగింది.ఇప్పుడు ఈ చాన్స్ వదులుకున్నా అదో రకమైన నష్టం.ఆమె నడుస్తున్న నడక లో,తనను అందరూ చూస్తుంటారు అనే ఆధిపత్య ధోరణి వ్యక్తం అవుతున్నది.
 ఆమె వాళ్ళ క్లాస్ రూం దగ్గర ఆగి ఫ్రెండ్స్ తో ఏదో మాట్లాడుతోంది.నవుతూ సంభాషిస్తున్నది.చాలా ఆకర్షణీయం గా ఉంది.రూం లోకి వెళ్ళి నేను ఒకరి కోసం వేచిచూస్తుండగా ఆమె హఠాత్తు గా నాకేసి చూసింది.నా చూపు వేరే వైపు మళ్ళించాను.రాం చెప్పిన సలహా కి ఇది పూర్తి వ్యతిరేకం.మళ్ళీ సర్దుకున్నాను.ఆమె వైపు చూస్తూ.అంతసేపూ నాకేసి చూసిందల్లా ఇంకో వైపు చూస్తున్నట్లు గా కటింగ్ ఇచ్చింది.మంచి ప్రోగ్రెస్ అనుకున్నా.

" ఒక నిమిషం ఆగుతావా ..మాట్లాడాలి.." అమాయక పక్షి లా అగుపించిన ఒకతన్ని ఉద్దేశించి అన్నాను.

" తప్పకుండా... చెప్పు ఏమిటది"

" అడుగుతున్నందుకు వింత గా ఉండొచ్చు.ఆ పింక్ టాప్ వేసుకున్న ఆ అమ్మాయి పేరు ఏమిటి..అదే ఆ ముందు వరస లో ..లేదూ ఆమె "

" అసలు నువ్వు ఎవరో నేను తెలుసుకోవచ్చా " తను తిరిగి నన్ను ప్రశ్నించాడు.ప్రమాదకరం గా ఏమీ అనిపించలేదు అతగాని వాలకం.నిజాయితీ గా ఉండాలనే నిర్ణయించుకున్నాను.

" ఆమె కి సీక్రెట్ అభిమానిని" చెప్పాను.

"  ఆమె కి ఉన్న అనేకమంది సీక్రెట్ అభిమానుల్లో ఒకడిని అని అంటే సబబు గా ఉంటుంది" నవ్వుతూ అన్నాడతను.

" బావుంది..అలాగే అనుకో బో..ఆమె పేరు చెప్పి ఆదుకోగలవా "

" ఆమె పేరు యామిని.ఈ మన కాలేజ్ కంప్యూటర్ విభాగానికే గర్వకారణం"

" అలా అంటున్నావేం"

" క్లాస్ లో అందరూ ఆమెని అభిమానించేవారే.. ఆ అందానికి..తెలివి కి "

" అలా ఉన్నవాళ్ళకి శత్రువులే ఎక్కువ ఉంటారేమో..అంటే అసూయ వల్ల"

"కావచ్చు..ఆమె కి శత్రువుల కంటే ఫాన్సే ఎక్కువ "

"మంచిది.ఏ సంవత్సరం చదువుతోంది.." ఫైనల్ ఇయర్ మాత్రం కాకూడదని దేవుడిని కోరుకున్నా.

" మేము ఫస్ట్ ఇయర్ బ్రో "

" నేను ఫస్ట్ ఇయర్ నే...కలుసుకున్నందుకు సంతోషం...నీ పేరేమిటి "

" నా పేరు వరుణ్ "

" చాలా గ్రేట్ నేం" అన్నాను.

"నీ పేరు"

" నా పేరూ వరుణ్ నే.అందుకే నీ పేరు గ్రేట్ అన్నది.." పరస్పరం అభినందించుకున్నాం.

" సరే బ్రొ..నాకు ఓ ఫేవర్ చేయగలవా...నేను ఇలా అడిగానని ఆమె కి మాత్రం చెప్పకు సుమా.."

" అలాంటిది ఏమీ ఉండదు..ఎక్కడిది అక్కడే వదిలిపెట్టే రకం నేను"

" బాగా చెప్పావు బై.."

" బై" తను వెళ్ళిపోయాడు.

యామినికేసి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతోంది.ఈ తమిళనాడు లోనే ..కాదు కాదు ఇండియా లోనే ఇలాంటి అందం లేదు అనిపించింది.నా ఈ రోజు ని కలర్ ఫుల్ గా మార్చేసింది.రూం కి తిరిగి వచ్చాను మాంచి జాలీ మూడ్ లో.నేను ఆమె ని గమనించానని ఆమె గమనించింది.రాం కి ఈ విశేషాలు చెప్పాలి అనుకున్నాను.
వెళ్ళేసరికల్లా రాం తీరిగ్గా నేల మీద కూర్చొని స్మొక్ చేస్తూ కనిపించాడు.

" హాయ్ రాం..మిత్రమా..సోదరా " అంటూ ఆనందం గా పిలిచాను.

" ఏమిటి బ్రో ..మంచి జాలీ గా ఉన్నావ్.." అడిగాడు రాం.తన కళ్ళు మత్తు లో జోగుతున్నట్లు ఉన్నాయి.

" TASMAC నుంచి వచ్చానని మాత్రం చెప్పక"

" అక్కడకి పోలేదు అరుణ్ .."

" మత్తు లో ఉండే వాడికి,మామూలు గా ఉండే వాడికీ తేడా తెలియదా ఆ మాత్రం"

" నేను మత్తు లో లేను అని నీకు చెప్పలేదు గా .."

" అక్కడకి పోకుండా ..ఎలా "

"నేను ఇప్పుడు తాగేది మారిజువానా "

"అదేమిటి"

"వీడ్..పాట్ అని కూడా అంటారు"

"అర్ధం కాలేదు"

" మరీ చిన్నపిలగానిలా చెబుతున్నావే...గంజాయి అనే పేరు వినలేదా ఎప్పుడూ "

" మరి అది డ్రగ్ గదా.." షాకయ్యాను నేను.రాం మొదటి జీవిత ధ్యేయం ఆనంద ఆస్వాదనే.కాని ఈ రేంజ్ దాకా వస్తాడని అనుకోలేదు.

" మరి ఎక్కువ ఇది గాకు డ్యూడ్,ఇది అదే "

" గంజాయి సేవించే అంత అవసరం ఏం వచ్చింది నీకు..విస్కీ సరిపోలేదా "

" ఇది దొరికేవరకూ అదే గొప్ప గా అనుకునేవాణ్ణి,దీన్ని పరిచయం చేసిన మిత్రుడు అజయ్..వాడికి థాంక్స్ చెప్పాలి "

"ఓ..ఇది అజయ్ యొక్క పనా....వాడి దగ్గరకి మళ్ళీ వెళ్ళక...అసలు నువు పాడయిపోయావు ..చదువు ధ్యాస లేకుండా,ఇలాంటి వాటిని అదుపు లో ఉంచుకో  " 
"మరీ ఎక్కువ చేయకు బ్రో...ఒకసారి నువ్వు పీల్చి చూడు..దీని మజా ఏమిటో తెలుస్తుంది.." తన చేతి లోది ఇవ్వబోయాడు.

" అలాంటి పని నేను ఎప్పుడూ చేయను.భవిష్యత్ మంచి గా ఉండాలంటే ఇలాంటి వాటికి ఎడిక్ట్ కాకు..ఒక మంచి న్యూస్ చెబుతామనుకున్నా...మూడ్ అంతా చెడగొట్టావ్ "అన్నాను.

" నువు తాగక పోతే పోయావు..నువు సలహా మాత్రం ఇవ్వకు నాకు..నువు మా డాడీ వి కావు" 

" మంచిది..నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో " 

" అది సరే...ఇంతకీ నీ న్యూస్ ఏమిటి..ఏదో అన్నావ్"  సిగరెట్ ని నేలకు రాస్తూఅడిగాడు రాం.

" ఆమె పేరు తెలిసింది.యామిని అని" చెప్పాను నేను.(సశేషం)


నా పేరు శివ (నవల), Post no:5

నా రెండవ సెమిస్టర్ అయిపొయింది.అనుకున్నంత స్కోర్ చేయలేకపోయాను.తరువాత ఇంకా శ్రద్ధ పెట్టి చదవాలి,దాన్ని పూడ్చుకోవాలి.చదువు పట్ల ఏకాగ్రత తగ్గింది.జీవితం అంటే ఏదో చెప్పలేని ఒక అననుకూలతా భావం ఏర్పడింది.ఎందుకని...అలా..!గత రెండేళ్ళుగా బాయ్స్ మాత్రమే ఉన్న స్కూల్ లో చదివినందుకా..లేకా యామిని తో మాట్లాడే చాన్స్ దొరకనందుకా...మెటాలికా వారి ఆ ప్రత్యేక విషాద గీతాన్ని పదే పదే గత ఆరు నెలలు గా వింటున్నందుకా..లేకా ఇవి అన్నీ కలిపా..?ఏదైతేనేం..మళ్ళీ ఇపుడు మా ఊరు చెన్నైకి వెళుతున్నా..సెలవులకి...ఇంకో మూడు నెలలదాకా నో కాలేజ్..!!

యూట్యూబ్ లోని గిటార్ పాఠాల్ని వింటూ ,చూస్తూ నేను  గిటార్ సాధన చేస్తున్నా.క్రమేపి అభివృద్ది సాధిస్తున్నాను.సోలోస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను.నా ఉద్దేశ్యం లో ఖార్డ్స్ అనేవి కొత్త వాళ్ళకి, సోలోస్ అనేవి ప్రొఫెషనల్స్ కి.ఫేడ్ టు బ్లాక్ అనే మెటాలికా వారి సాంగ్ ని ప్లే చేయడం లో నిపుణత సాధిస్తున్నాను.అంటే ఆ మ్యూజిక్ వాళ్ళు ఆడిషన్స్ నిర్వహించినపుడు నాకిది ఉపయోగపడుతుంది.

అలా గిటారిస్ట్ గా ఆ ట్రూప్ లో చేరి యామిని కి చేరువ అవడం జరుగుతుందని నా ఆలోచన.సకల ఉద్వేగాల్ని దీని ద్వారా ప్రవహింప జేసే అవకాశం నాకిలా లభించింది.ఇక రాం ఆల్కాహాల్ శాతం తగ్గిస్తూ మారిజువానా మత్తు లో ఎక్కువ ఉంటున్నాడు.ప్రస్తుతానికి అతనితో ప్రాబ్లం ఏమీ లేదు గాని దానిలోనే ఎక్కువ కాలం ఉంటూన్నాడు.అయితే తాను పెద్ద ప్రపంచ స్థాయి మేధావి లా తనని తాను ఊహించుకుంటూ ఉంటాడు.అది ఆ గంజాయి ప్రభావమే అనుకుంటా.నన్ను కూడా తీసుకోమని అడిగే వాడు కాని నేను తిరస్కరించేవాడిని.చివరకి ఓ మత్తు బాబు లా మిగిలి పోవడం నాకిష్టం లేక.

" మగాడి గా పుట్టడం అంటేనే ఒక పెద్ద సమస్య బో" అన్నాడు రాం.

" డ్యూడ్...అలా ఎందుకు అనుకోవడం..చాలెంజ్ గా తీసుకోవాలి దేన్నైనా.." అన్నాను.

" సరే..నువ్వు అన్నట్లు గానే తీసు చాలెంజ్ గానే తీసుకుందాం" లాప్టాప్ తీసి బ్యాగ్ లో పెడుతూ అన్నాడు రాం.
" ఏదో ఫిలాసఫీ చెప్పబోతున్నట్లున్నావు ..నీ రూం మేట్ గా దాన్ని వినేతీరాలి గదా ..చెప్పు.."

" ఈ మద్య నేను ఒక డేటింగ్ సైట్ ని చూస్తున్నాను.."

" రైట్ ..అయితే.."

" నా ప్రొఫైల్ తయారు చేసుకొని ఓ నలభై మంది అమ్మాయిల కి పంపించా ...ఒక్కరూ రిప్లై ఇవ్వలేదు  బ్రో"

" ఇదొక జీవిత గాధ..ఊఫ్.."

" ఒక ప్రయోగం చేద్దామని అమ్మాయి మాదిరి గా ఒక ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి పంపించా ..ఏం జరిగిందో తెలుసా"

" పోలీస్ లు పట్టుకుని ఉంటారే.."

" షటప్ మేన్.....మెసేజ్ ల వరద పారింది..ప్రతి రెండు నిమిషాలకి ఒక మెసేజ్ వస్తోంది..అప్పటికి నేను దాంట్లో ఫోటో కూడా అప్ లోడ్ చేయలేదు"

"దీన్నిబట్టి అర్ధమైంది ఏమిటంటే స్త్రీ గా పుట్టడమే చాలెంజ్ అని "

" ఏమిటి నీ అర్ధం"

" స్త్రీల ప్రపంచం ని చూడు...ఒక ప్రొఫైల్ కే ఎంతమంది పురుషులు స్పందించారో...నీలాంటి వాళ్ళు ...! పైగా దాంట్లో 99 శాతం మంది ఎందుకూ కొరగాకుండా పోతారు.అర్ధమయిందా నేనన్నది.."

" కాలేదు"

" ఒక స్త్రీ గా పురుషుల్ని ఆకర్షించడమే ఈజీ...అదే పురుషుని గా ఉంటే ఇతర పురుషులు నుంచి కాపిటేషన్ ఎక్కువ.."

" ఒక్క అయిదు నిమిషాల్లో రైల్ స్టేషన్ లో ఉండాలి మనం.లేనట్లయితే నేను చెప్పేది అబద్ధమని సంపూర్తి గా ప్రూవ్ చేయవలసి ఉంటుంది నువు"

" సరే ..మిగతాది రైల్ లో మాట్లాడదాము..నిన్ను వాదన లో ఓడించడమే నాకు ఓ వినోదం "

" సేం హియర్ మ్యాన్..!ఈ మధ్య ఓ చిత్రం జరిగింది"

" ఆ డేటింగ్ సైట్ ద్వారానే చెన్నై కి చెందిన ఒక బై సెక్సువల్ పరిచయం అయింది.గత కొన్ని రోజులు గా ఒకటే డర్టీ టాక్స్ బ్రో..నువే గనక పురుషుని వి అయితే నేను మ్యారేజ్ చేసుకునే దాన్ని అన్నది ..నమ్మగలవా.."

" నీకంతా బాగానే జరుగుతోంది బ్రో" షేక్ హేండ్ ఇచ్చాను.నా పరిస్థితి ఏమిటో అనుకున్నాను.

మా లగేజి సర్దుకొని ,రూం కి తాళం వేసి రైల్ స్టేషన్ కి బయలు దేరాం.మా స్వంత ఊరు చెన్నై కి వెళ్ళడానికి.

ఆగస్టు 9,2011.
--------------
ఈ రోజు నాలో ఎన్నో భావోద్వేగాలు.ఆత్రుత,భయం,ఆసక్తి ...ఇలా కలగా పులగంగా ముసురుకున్నాయి.ఎన్నాళగానో ఎదురుచూసిన రోజు ఇది.ఈ రోజే మ్యూజిక్ ట్రూప్ లో చేరడానికి ఆడిషన్స్ జరిగే రోజు.రాం నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు.గిటార్ పుచ్చుకొని బయలుదేరాను.ఇన్నాళ్ళ నా శ్రమ ఫలిస్తుందా...నేను యామినికి మిత్రుడిని కాగలనా...ఆడిషన్స్ లో నెగ్గగలనా ..? (సశేషం)

--English Original: Raghav Varada Rajan
--Telugu Translation: Murthy Kvvs   

 నా పేరు శివ (నవల), Post no:6

CHAPTER-2

"అదిగో విజేత వచ్చేశాడు..నా ఊహ నిజమే అయింది గదూ" రాం అన్నాడు,నేను రూం లోకి ప్రవేశిస్తుండగానే!గిటార్ ని గోడ కి ఆనించాను,నీరసం గా మంచం లో కూలబడ్డాను.ఆడిషన్స్ సంగతి ఏం చెప్పకుండా..!

" నన్ను విన్నర్ అనేకంటే..ఫైటర్ అనడమే సబబు "

" ఏమయింది మిత్రమా ..ఊహించిన దానికి భిన్నంగా ఏమైనా జరిగిందా " నాలోని నిరాశని పసిగట్టి అన్నాడు రాం.

" నా ప్రయత్నాలన్నీ నేల పాలయ్యాయి బ్రో.."

"కిర్క్ హామెట్,స్లాష్ ల్ని కలిపి గిటార్ మీద పలికించేవాడివి...నా కయితే నీ వాయించే విధానం నచ్చేది.."

" చాలా కష్టమైన వాటిని ఆడిషన్స్ లో అడిగారు బ్రో...యామిని ఎదురుగా వాటిని తట్టుకోవడం కాస్త కష్టం గానే తోచింది "

" అసలు జరిగిందేమిటో చెప్పు నాతో"

" అయితే ఒక కండిషన్"

" చెప్పు"

" మందు కి కంపెనీ ఇవ్వాలి నువ్వు,ఒక హాఫ్ ఇంపీరియల్ బ్లూ నాకు సేద దీర్చినట్లుగా ఉంటుంది "

" ఒక హాఫ్ బాటిల్ విస్కీ కావాలి నీకు..అంతేనా "

" బాగా చెప్పావ్"

" నిన్ను అర్ధం చేసుకోవడం లో నేను ప్రధముడిని...కంగారు లేకుండా నీ బాధ అంతా నాతో చెప్పు"
"మ్యూజిక్ ట్రూప్ లోకి సెలెక్ట్ అవుతాననుకున్నా ..ఆ విధంగా యామిని తో మాట్లాడే అవకాశం వస్తుందని కలగన్నాను.సరే ...ఇపుడు హాఫ్ బాటిల్ విస్కీ తీసుకోవాలనేది నా కోరిక"

" మొదటి రెండు అలా రిజర్వ్ లో ఉండనీ ...మందు విషయమా ..ఇక్కడే గ్రాంటెడ్" అలా అంటూ రాం రెండు బాటిళ్ళని తీసి టేబుల్ మీద పెట్టాడు..!

" రాం ..నువ్వు నిజంగా గొప్ప మైండ్ రీడర్ వి ...నువు ముందుగానే ఎలా ఊహించగలిగావ్ ..నా పరిస్థితి" అన్నాను.

" నువు గెలిస్తే సెలెబ్రట్ చేసుకోవాలని తెచ్చా.మందు లో ఉన్నగొప్పదనం ఏమిటంటే సంతోషం గా ఉన్నప్పుడూ తీసుకోవచ్చు ,విషాదం లో ఉన్నప్పుడూ తీసుకోవచ్చు.రెండు సమయాల్లోను తీసుకోవచ్చు.మందేసుకుంటూ మాట్లాడుకుందాము లే"

" కాని గొప్ప ప్రణాలిక"

"పద పోదాం"

" మందు ఇక్కడే ఉందిగా..ఇంకెక్కడికి.."

"అజయ్ వాళ్ళ రూం కే...నీ గురించి చాల గొప్పగా చెప్పాను,నిన్ను మీట్ అవాలని అన్నాడు "

" సరే..పద..ఒక కొత్త ఫ్రెండ్ కి పరిచయమైనట్లు ఉంటుంది"
రాం బాటిల్స్ ని బ్యాగ్ లో పెట్టాడు. తలుపులు వేసి తాళం వేశాడు.నడవసాగాము.

" ఏ హాస్టల్ లో ఉంటాడు.." రెండు సిగరెట్స్ వెలిగించి ఒకటి రాం కి ఇచ్చి నేను ఒకటి తీసుకున్నాను.
" హాస్టల్ ఎక్స్ అని"

" అదేం పేరు" అడిగాను.

" కొత్త నిర్మాణం లే..బి.ఆర్క్ వాళ్ళ కోసం కట్టారు ఈ మధ్య లో "

" నా గురించి అజయ్ కి ఏం చెప్పావేం"

" నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను.చదువు ని,వినోదం ని చక్క గా బేలన్స్ చేసాడని..మూడు గంటలైనా రోజు గిటార్ వాయిస్తాడని..అలా చెప్పానులే"

" కొంచెం ఎక్కువ చెప్పావేమో"

" దానిదేముంది లే గాని... ఆడిషన్స్ లో ఏం జరిగింది.."

"నాకు నచ్చిన పాటని ప్లే చేయమన్నారు"

" ఏం ప్లే చేశావు"

"ఫేడ్ టు బ్లాక్ అని సోలో ప్లే చేశా ...రెండు మూడు చోట్ల పొరబాట్లు చేశానులే...స్టేజ్ ఫియర్ వల్ల...ఎలాగో ముగించాను"

" యామిని నిన్ను గమనించిందా "  
" అదే గదా నా బాధంతా...!ఈ ప్రొఫెషనల్ గిటారిస్ట్ లు ఒక్క బిట్ తప్పుపోకుండా ఎలా వాయిస్తారో..ఆశ్చర్యం గానే ఉంటుంది.వాయించేప్పుడు కాం గా ,కాన్ ఫిడెంట్ గా  ఉంటారు.అదో మేజిక్ లానే చెప్పాలి"

" అవునవును"

" కొంతమంది ఖార్డ్స్ ప్లే చేసి ,దాని మీద సోలో వేయమన్నారు.మళ్ళీ ఓ సోలో సొంతంగా చేమన్నారు.అదీ మళ్ళీ స్పాట్ లో.మొదటి సారి ఇలా వినడం"

" షిట్"

" అది చాలదన్నట్లు ఒకడు పాడుతూ బ్యాక్ గ్రౌండ్ వాయించమన్నాడు.కొంచెమైనా మనస్సాక్షి ఉందా వాళ్ళ కి"

"చూస్తే లేనట్లే ఉంది"

"ఇది చాలదన్నట్లు యామిని నా వేపు చూసిన జాలి చూపు...ఇంకా బాధ గా అనిపించింది.ఆ ట్రూప్ వాళ్ళు నన్ను ఓ జోకర్ లా ఆడుకున్నారనుకో..బాగా ఎంజాయ్ చేశారు వెధవలు.."

అలా మాటల్లోనే అజయ్ రూం కి వచ్చేశాము.

" కూల్ గా ఉండు..దీన్ని మరీ ఎక్కువ గా తీసుకోకు మిత్రమా.."

హాస్టల్ లోని ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకుని ..డోర్ మీద తట్టాడు రాం.ఆ రూం నబర్ 418.తలుపు తెరువబడింది.సన్నగా ,షర్ట్ షర్ట్ షర్ట్ లేకుండా నల్లటి షార్ట్స్ ధరించి ఉన్నడు ఒకతను.గ్లాస్ లు సర్దుతున్నాడు.ఇతనేనా అజయ్ అనుకున్నాను.

" హలో గైస్..తొందరగా లోపలకి రండి...వార్డెన్ ఇటు రాకముందే" అన్నాడతను.

మేము లోపలకి వెళ్ళగానే అంతే వేగంగా తలుపు వేసి ఘడియ పెట్టాడు అజయ్.గది అంతా గందరగోళం గా ఉంది.నేలమీద పాత సిగరెట్ పీకలు ..ఓ కుర్చీ మీద పుతకాల దొంతరలు అగుపించాయి.మంచం మీద బెడ్ షీట్ లేదు.ఆ గాలి లో ఒక రకమైన గంజాయి వాసన.

అజయ్ నేనూ షేక్ హేండ్స్ ఇచ్చుకున్నాము.

" మీ రూం మేట్స్ కి ఇబ్బంది ఏం ఉండదు గా మేం ఇలా వచ్చినందుకు" అన్నాను.

" నాకు రూం మేట్స్ అంటూ ఎవరూ లేరు బ్రో...ఈ ఎక్స్ హాస్టల్ లో ట్రిపుల్ ఎక్స్ లు చూసినా ఎవరూ పట్టించుకోరు "

" మేం వచ్చినప్పుడు లోపల నువ్వు చేస్తున్న ఘనకార్యం అదేనా ఏమిటి"

రాం మందు సీసాల్ని బ్యాగ్ లోనుంచి తీసి నేల మీద జాగ్రత్త గా పెట్టాడు.

" ఇందాకనే పింక్ ఫ్లాయిడ్ ఇంకా గంజాయి రెండూ కలిపి తీసుకున్నా సూపర్ ..డెడ్లీ కాంబినేషన్ బ్రో,మత్తు లోనుంచి బయటకి వచ్చిన ప్రతి సారిఒక కొత్త మనిషి లా అయిపొయాను,నా గురించి నాకు ఏదో కొత్త సంగతి తెలుస్తానే ఉన్నది " అన్నాడు అజయ్. (సశేషం) 

--English Original: Raghav Varada Rajan

--Telugu Translation: Murthy Kvvs   



నా పేరు శివ (నవల) Post No: 7

" ఇక నేను మొదలెట్టనా" అన్నాను భావ యుక్తంగా..!కొత్త వ్యక్తి తో ఉన్నట్టుండి మరీ ఎక్కువ చొరవ గా నేను మాట్లాడలేను.అజయ్ ఏదో భాష లో గొణిగినట్లు చేసి నాకు వాటర్ బాటిల్ ని,ప్లాస్టిక్ గ్లాస్ ని అందించాడు.

" మరి మీ సంగతో" మందు లో నీళ్ళు కలుపుతూ అన్నాను.

" మేము ఈ మందు ని ఆపుజేశాం వరుణ్. మేం ఇప్పుడంతా గంజాయి లోకి వెళ్ళిపోయాం" అన్నాడు రాం ,అజయ్ కి సైగ చేస్తూ.

" ఈ రోజు గంజాయి ట్రిప్ లో వెళ్ళినపుడు ..ఏమి జరిగాయి విశేషాలు " అజయ్ వేపు చూస్తూ అడిగాడు రాం.

" సరే..మన సరుకు ని జాయింట్ చుట్టమంటావా ..నువు ఓ.కె గదా" అడిగాడు రాం ని అజయ్.

" ఓ.కె చీర్స్" అన్నాను నా మందు గ్లాస్ ని లేపుతూ.

"ఈ రోజు గంజాయి లో ఒక కొత్త విషయం ని తెలుసుకున్నాను బ్రో...నా జీవిత లక్ష్యం ఏమిటి అనేది తెలుసుకున్నాను " అజయ్ అన్నాడు.

" చాలా గొప్ప సంగతి" రాం షేక్ హేండ్ ఇచ్చాడు అజయ్ కి.

" నీ సంగతేమిటి బ్రో...నీ జీవిత లక్ష్యం నీకు బోధ పడిందా " అజయ్ అడిగాడు వరుణ్ ని.

" అదంతా అలా పోనివ్వండి...నాకు కొద్దిగా కూడ సంతోషం లేదిప్పుడు" అరిచినంత ఇదిగా బదులిచ్చాను.

" ఏమయింది అసలు..చెప్పు" అజయ్ అడిగాడు.

" నా తలలో ఎప్పుడూ ఏదో గందర గోళం...గత రెండేళ్ళ నుంచి...ఎలా చెప్పాలో తెలియట్లేదు" చికాకు గా అన్నాను.

" ఓ పని చెయి బ్రో ...లోపల గందరగోళం అంతా పోతుంది...ఈ గంజాయి ని ఒకసారి ప్రయత్నించు " అన్నాడు అజయ్.
" లేదు..లేదు..నేను డ్రగ్ ఎడిక్ట్ కాదలుచుకోలేదు.నా గ్రేడ్స్ ని నాశనం చేసుకొని ,భవిష్యత్ ని పాడుచేసుకోదలచ లేదు.నా భవిష్యత్ కూడాపాడవుతుందని భయం" అన్నాను.

" ఎదవ గ్రేడ్స్ ని బట్టి ఇవ్వడం ఏంటి...టాలెంట్ ఉన్నప్పుడు ఈ గ్రేడ్స్ ఎందుకు..." అన్నాడు రాం.

" టాప్ కంపెనీలు...మంచి గ్రేడ్స్ రాకపోతే పిలవవు గా..వాళ్ళు కటాఫ్ అనేది పెట్టుకుంటారు గా " ఈ చిన్న విషయం వాళ్ళకి అర్ధం కావాలని చెప్పాను.

" వాళ్ళంతా నేరో మైండెడ్ ..వాళ్ళకి ఎప్పుడూ గ్రేడ్ లే.." నేను ఆలోచనల్లో మునిగాము అజయ్ మాటలకి .

"గ్రేడ్ లు కాకుండా టాలెంట్ ని చూస్తే మటుకు మాకే వస్తాయి జాబ్ లు" రాం అన్నాడు

" అలాంటి మంచి కంపెనీలు చాలా ఉన్నాయి బ్రో... ఎంత సేపు బట్టీ కొట్టుడు వాళ్ళ ని మోసే కంపెనీ ల్లో చేరితే ఏం ఫ్యూచర్ ఏముంటుంది " అజయ్ అన్నాడు.ఓరీ దేవుడా వీళ్ళేమిటి ఇలా ఉన్నారు అనిపించింది.సరే టాపిక్ మారిస్తే మంచిదని అనిపించింది నాకు..!

" మీరు చెప్పేదాని లోను పాయింట్ ఉందిలే..అవును యామిని తో నా గాధ ని రాం నీతో చెప్పలేదా" అన్నాను అజయ్ తో.

" యామిని యా ..ఎవరు ఆమె " అన్నాడు అజయ్.
" అదే..ఆ సింగర్ బ్రో.." అన్నాడు రాం. " ఓ..ఆమె నా..సరే ..అంతా నువ్వు అనుకున్నట్లు గానే జరుగుతోంది గా " అజయ్ అడిగాడు నన్ను.

" ఆడిషన్స్ నన్ను దెబ్బ కొట్టాయి...సర్లే ఏ రోడ్డు మీద నో మాట కలపడానికి ట్రయ్ చేస్తా..ఇంకో ఏడు వృధా చేయడం నా వల్ల కాని పని" అన్నాను.

" అవును బ్రో ..అదే మంచిది.." రాం అన్నాడు.

" మీకు తోస్తే ఏమైనా ఐడియాలు ఇవ్వండి " రిక్వెస్ట్ చేశాను.

" ఇలాంటి వాటిల్లో రాం నే ఎక్స్ పర్ట్" చెప్పాడు అజయ్.

" నీ అభిప్రాయానికి థాంక్స్ బ్రో...చూడు వరుణ్...మూడు గోల్డెన్ రూల్స్ ఉన్నాయి లవ్ లో..! వాటిని నీ జీవితమే అవీ అన్నట్లు పాటించాలి.నిజానికి నీ జీవితమే వాటి పై ఆధారపడి ఉంది.వాటిని ఫాలో అయితే యామిని నీకు చేరువ కావలసిందే.." రాం అన్నాడు.

" ఏమిటొ అవి " అన్నాడు అజయ్.

" రూల్ వన్...ఆమె నీకు దగ్గర లో ఉన్నప్పుడు ఫన్నీ గా ,ఉత్సాహభరితం గా ఉండాలి,ఎవరైనా చనిపోయారు అని చెపితే అప్పుడు నువు జోక్ వేసేట్టు గా ఉండకూడదు.మంచి అదును చూసి నీ మాటల చాతుర్యం చూపాలి"

" అది ఓ.కె."

" నీ గత సంభాషణల్లోనుంచి మంచి ఘట్టాలు అలాంటివి ఉంటే ..పరిశీలించి తీసుకో.."

" సరే..రెండో రూల్" అజయ్ అడిగాడు.

" నువు ఆమె ని ఇష్టపడుతున్నావా లేదా అనేది ఆమె గెస్ చేసేంత ఇది గా ఉండకూడదు,కొంత సస్పెన్స్ ఉంచాలి"

" ఎందుకని"

" అన్ని విధాలా నూటికి నూరు మార్కులు వేయదగ్గ కేండ్డేట్ గనక ఇప్పటికే ఆమె కి అనేకమంది లైను వేసి ఉంటారు.నువు వాళ్ళ లో ఒకడి గా కనిపించకూడదు."

" లేదు..లేదు..ఆ విషయం లో జాగ్రత్త గా ఉంటా" అన్నాను.

" అదీ..ఇక రూల్ నంబర్ త్రీ...సంభాషణ ఏ ఇబ్బందీ లేకుండా సాగుతున్నప్పుడు..నీ మాటే చివరది గా ఉండాలి.సరదా గా ఉన్నట్లుండాలి.మళ్ళీ కొద్దిగా లేనట్లుగానూ ఉండాలి.అదో మాదిరిగా ఉందా" అడిగాడు రాం.

" అలానే ఉంది.సరే..నువు మాత్రం జీనియస్ డ్యూడ్ ..ఇవన్నీ నీకు ఎలా తెలుసు " నేను అడిగాను.

"ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతి" చెప్పాడు రాం.అజయ్ అభినందిస్తున్నట్లు చప్పట్లు కొట్టాడు.

" బహుశా నీ జీవిత లక్ష్యం ఇదే అనుకుంటా బ్రో,ఇలాంటి విషయాల్లో సాయపడటం "రాం తో అన్నాడు అజయ్.

" మరి ఇది ఎప్పుడు అమలు చేయబోతున్నావు.." తనే అన్నాడు.

" టైం వేస్ట్ ఎందుకు..వెంటనే అమల్లో పెడతా " చెప్పాను.

" ఎప్పుడు"

" రేపే"

(సశేషం)
--English Original: Raghav Varada Rajan
--Telugu Translation: Murthy Kvvs  



నా పేరు శివ (నవల) Post no:8


ఆగస్ట్ 10,2011

పొద్దున్నే అయిదు గంటలకి తెలివి వొచ్చింది.ఒకటికి పోసి వచ్చిన తర్వాత నిద్రపట్టట్లేదు.ఎప్పుడో జూనియర్ కాలేజి రోజుల్లో పరీక్షలు రాసి ఆత్రుత గా రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన ఆ రోజులు మాదిరి గా ఉంది ఇప్పటి పరిస్థితి.రాబోయే సన్నివేశాల్ని ఫలితం ఏదైనా ఫెస్ చేసి తీరవలసిందే అని అనుకుని నిశ్చయించుకున్నాను.

అద్దం లో నన్ను నేను చూసుకున్నాను.ఒప్పుకు తీరాలి.టాల్ అండ్ అత్లెటిక్,మంచి కలరు,చక్కని జుట్టు... అందగాడివేరా అని భావించుకున్నాను.ఎన్ని ఉన్నా తళ తళ మెరిసే నా పళ్ళ వరసే వేరు.అందుకే సాధ్యమైనంత ఎక్కువ సార్లు నవ్వాలి.అంతకన్నా ముందు ఆమె ని నవ్వేట్లు గా మాటాడాలి.

మంచం మీద పడుకొని మళ్ళీ ఒక్కసారి రాం చెప్పిన గోల్డెన్ రూల్స్ ని నెమరు వేసుకున్నాను.అయితే మొదటి రూల్ కొంచెం ఇబ్బందే..ఆత్మ విశ్వాసం తో మాట్లాడటం...! అందుకనే అతను మొదట సన్నివేశాల్ని ఊహించుకుని ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ ఫుల్ గా ఉంటుందని చెప్పినది.కొన్ని పుష్ ఉప్స్ తీసి తల స్నానం కానిచ్చాను.నన్ను నేను బాత్ రూం లో చూసుకొని నీకేమి రా సూపర్ అని కితాబు ఇచ్చుకున్నాను.చక్కటి బ్లూ షర్ట్ ఇంకా జీన్స్ ధరించాను.

ముందుగా ఆమె గానకళ ని ప్రశంసించాలి.ఆ తర్వాత నా గిటార్ వాదనకి ఏమైనా సలహాలు అడగాలి.ఆమె ఏ బ్రాంచ్ లో చదువుతోంది..ఇలాంటివి అడగాలి.నా గురించి కొంత ఏదో చెప్పాలి.అయితే ఆడంబరం గా ఉన్నట్లు గాక సహజం గా మాట్లాడాలి.ఆ తర్వాత కేంటిన్ వేపు గా తీసుకు వెళ్ళాలి.చాలా సింపుల్ ప్లాన్.ఇన్స్టిట్యూట్ కి వెళ్ళే లోపు ఒక సిగరెట్ కాల్చాను.
బయటపడి మెస్ లో ఏడున్నర కల్లా ఏదో తిండి తిన్నాను.తర్వాత యామిని వాళ్ళ క్లాస్ రూం కేసి నడిచాను.ఆ లొకేషన్ గురించి ముందే వాకబు చేశాను.బ్లాక్ 3 లో 22 వ రూం.రిలాక్స్ కావడానికి గట్టిగా గాలి పీల్చి వదిలాను.స్టూడెంట్స్ అంతా లోపలికి వెళ్ళి వారి సీట్ల లో కూర్చుంటున్నారు.యామిని మొదట వరస లో ఉండి ఉండవచ్చు.నేను కారిడార్ లో పచార్లు చేయసాగాను.అలా ఓ అయిదు నిమిషాలు గడిచిన పిమ్మట నిరీక్షణ ఫలించింది.ఆమె ముందు సీటు లోనే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాటాడుతూ కనిపించింది.కరెక్ట్ గా 8 కల్లా ప్రొఫెసర్ క్లాస్ లోకి ప్రవేశించాడు.ఆహా..ఏమి సమయ పాలన..!

9.05 కల్లా క్లాస్ ముగిసింది.నేను అలానే బయట నిలబడిపోయాను...ఎర కోసం చూసే ఒక ప్రాణి లా..!నేను అనుకోవడం ఇది ఎక్స్ ట్రా క్లాస్ వంటిది.గుంపులు గుంపులు గా స్టూడెంట్స్ బయటకి వస్తున్నారు.నేను ఊహించినట్లుగానే గడుస్తున్నాయి నిమిషాలు.యామిని మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి బయటకి వచ్చింది.తగినంత దూరం లో ఉంటూనే ఫాలో కాసాగాను.ఇపుడు ఆమె ఒక్కతే కేంటిన్ వైపు రాసాగింది.అన్నీ నాకు అనుకూలం గానే జరుగుతున్నాయి.నువ్వు లక్కీ రా అనుకున్నాను.

ఆమె తినడానికి ఆర్డర్ ఇచ్చి ..ఆ ఐటెం రాగానే ని పట్టుకొని టేబుల్ వద్దకి వస్తుండగా ..ఇదే తగిన టైం గా భావించాను.రిలాక్స్ గా ఫీల్ అయి..నెమ్మది గా ఆమె టేబుల్ వేపు గా వచ్చాను." హాయ్" అని పలకరించాను.చెయ్యి చాపాను.

" మొత్తానికి ఈరోజు కి నాతో మాట్లాడటం కుదిరిందా" అన్నది ఆమె నాకు షేక్ హేండ్ ఇస్తూ.స్టన్ అవడం నా వంతు అయింది.

" ఏమంటున్నావు" నాకు కంఫ్యూజన్ గా అనిపించి ప్రశ్నించాను.

" నా ఉద్దేశ్యం ..ఇన్నాళ్ళకి నాతో మాట్లాడే ధైర్యం వచ్చిందా అని "

" ఎందుకని నీకు అలా అనిపించింది"

" ఎందుకంటే అదే నిజం గనక.ఇన్నాళ్ళకి మగవాడి లా మారావ్"

నా పాత్రని ఈమె పోషిస్తున్నదేమిటబ్బా అనిపించింది,రాం చెప్పిన గోల్డెన్ రూల్స్ అవీ జ్ఞాపకం వచ్చి..!

" ఆ రోజున ఆడిషన్స్ జరిగిన రోజునే నిన్ను పలకరిద్దామని అనుకున్నాను.అప్పుడు ఎందుకులే..అనుకొని ఇదిగో ఇప్పటి దాకా ఆగాను." ఎలాగో కవర్ చేశాను.రాం చెప్పిన రూల్స్ అన్నీ గాలికి పోతున్నాయి.ఏమైనా డామేజ్ కంట్రోల్ కాకుండా చూసుకోవాలి.

" నిజమా..లాస్ట్ సెమిస్టర్ టైం లో మా క్లాస్ రూం దగ్గర్లో కనిపించింది మీ ట్విన్ బ్రదరా " అన్నది.అంటే ఈమె కి అప్పటి రోజు బాగానే గుర్తుందన్నమాట.

" ఔను..అది నేనే.బలే గుర్తు పెట్టుకున్నావే..నన్ను ఎవరు చూసినా అంత తొందరగా మర్చిపోరు..అలాంటి రూపం నాది..నీ మాటలు అర్ధం అయ్యాయి."  కూల్ గా బదులిచ్చాను.

" అవును నువు చెప్పింది నిజమే అయితే అది మరొకలా కూడా ఉంది బ్రదర్" అంది.నా గొంతు లో ఏదో అడ్డం పడ్డట్లు అయింది.

" అది ఏమిటి సిస్టర్" అడిగాను. నేనూ తక్కువ వాడిని కాదు ఈ రకం వాటికి అన్నట్లుగా..!

" ఒకమ్మాయిని కలవడానికి వచ్చి అతని ఫ్రెండ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకొని..మళ్ళీ తిరిగి ఈ విషయం చెప్పొద్దు అని అతడిని బతిమాలడం..అది ఏ అమ్మాయి అయినా మరిచిపోగలదా "

ఆ మాటలు వినడం తో నా నెత్తి మీద సుత్తి తో మోదినట్లయింది.నా పేరు గల ఆ వరుణ్ గాడు ఎంత పనిచేశాడు..వెధవ కబుర్లు ఎన్నో చెప్పి.

" ఇప్పుడు తెలిసింది..ఆ వరుణ్ నన్ను మోసం చేశాడని " అన్నాను.

" దానిదేముంది లే..ఇలాంటివి జరుగుతుంటాయి" నవ్వుతూ అన్నది.  
" నేను ఇక్కడ కూర్చోవచ్చా" అడిగాను

" నన్ను పర్మిషన్ అడగనవసరం లేదు..కూర్చో" అన్నదామె.

" అయితే నా పేరు నీకు తెలుసు ..అంతేగా " ఆమె ముందు కూర్చున్నాను.

" వాన ఇచ్చే దేవుడి పేరు ..అదెలా మర్చిపోగలం"  అన్నది .నా వెర్షన్ ఈమె పోషిస్తున్నదే అనిపించింది.

" ఒక మంచి అమ్మాయి లా అనిపిస్తున్నావు..ఇంకా నీ గురించి చెప్పు" అన్నాను.

" ఇప్పుడు దేవత మంచి మూడ్ లో ఉంది..ఏదడిగినా చెబుతుంది.."  సరదాగా కన్ను గీటుతూ అన్నది.

" బేసిక్స్ నుంచి వద్దాము..నీ పుట్టిన రోజు ఎప్పుడు.."

" ఎందుకు ..సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనా"

" ఇప్పుడే చెపితే అది సర్ప్రైజ్ ఎలా అవుద్ది"

" నవంబర్ 12  "

" ఓ..అయితే నీ రాశి వృశ్చికం అన్నమాట" అన్నాను.

" అవును..కనక జాగ్రత్త గా ఉండాలి"

" ఆ రాశి గురించి ఒక విశేషం చెప్పగలవా"

" చాలా సీక్రెట్  లు ఉంటాయి వాళ్ళ దగ్గర"

" నీకు సంబందించి అలా అనిపించడం లేదే"

" నువ్వు ఏదడిగితే అది చెబుతున్నానని..నాకు సీక్రెట్స్ లేవు అనుకోకు.. చాలా ఉన్నాయి "

" వినడానికే భయంకరంగా ఉంది.సరే..నీ హాబీలు "

" మూడు హాబీలు...రీడింగ్...రీడింగ్..రీడింగ్.."

" అబ్బో..వెరైటీ గా ఉన్నాయ్"

" మరి నీ హాబీస్"

" గిటార్ వాయించడం" మరీ ఏం చెప్పకపోతే బాగోదని చెప్పాను.

" ఆడిషన్స్ లో బాగా ప్లే చేశావ్..ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావ్.." అడిగింది.

" ఇంచు మించు పది నెలలు గా "

" నీకు మోటివేషన్ ఎవరు"

" అది చాలా సీక్రెట్ "

" ఓ..కాని నువు వృశ్చిక రాశి కాదే"

" కాదో ..అవునో నేను చెప్పలేదే"

" ఇలా అయితే దేవత తుఫాన్ సృష్టిస్తుంది జాగ్రత్త.."

" అది నాకు తెలుసు ..అందుకే మళ్ళీ సారి మనం కలిసినపుడు చెపుతా అది"

" మనం..మళ్ళీ కలుస్తాము అని ఎవరు చెప్పారు బ్రదర్ ?"

" అదే తాయత్తు మహిమ ..సిస్టర్ "

" నీ ఆత్మ విశ్వాసానికి అభినందనలు,నేనయితే గేరంటీ ఇవ్వలేను"
"నువు రానక్కర లేదు..నేనే కనుక్కుంటా"

" అంటే నువు వేధించే తరహా నా"

" కాదు నీ భక్తుడిని మాత్రమే.."

" నువ్వు.."  అలా అంటూ గట్టిగా నవ్వింది.టాపిక్ మార్చడం మంచిది అనిపించింది.

" నీ జీవిత లక్ష్యం ఏమిటి..?" అడిగాను నేను

" నువే ఎందుకు గెస్ చేయకూడదూ.." 

" ఓ సక్సెస్ ఫుల్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ కావాలని.."

" అది కాదు.." 

" నువే చెపితే బెటర్ " 

"వినే ఓపిక ఉందా..చాలా పెద్దగా ఉంటుంది" 

"తప్పకుండా" 

"ఆరు నవలలు,ఆరు సంవత్సరాల్లో కాలం లో రాయాలని నా కోరిక.ఇంకా అవి బాగా అమ్ముడయి ధనం తెచ్చిపెట్టాలి.ఆ తర్వాత భావి తరాల రచయితల కోసం ఓ స్కూల్ తెరవాలనేది నా లక్ష్యం.నా స్కూల్ ఫ్లాప్ అయినా నా బుక్స్ ద్వారా డబ్బులు ఎప్పుడూ వస్తుండాలి. " 

" భవిష్యత్ మొత్తాన్ని స్కెచ్ వేసి పెట్టావే" 

" అవును..అలా ఎక్కువగా ఆశిస్తున్నా  " 

"రైటింగ్ స్కూల్ ఎందుకు..నీకు టీచింగ్ అంటే ఇష్టమా..?" 

" అదేం లేదు డ్యూడ్..నాకు సరిపోయేంత డబ్బులు వస్తాయని అంతే" 

" అరవై ఏళ్ళ దాకా రాయోచ్చు గదా..ఆరేళ్ళే రాయాలని ఎందుకు రూల్ పెట్టుకున్నావ్" 

" మనుషులకి ఉండేది తక్కువ సృజనాత్మకత.."

" అది అనంతం అంటారు గదా"

" నన్ను ఓ ప్రశ్న అడగనీ ...జీవిత అనుభవం నుంచే గదా క్రియేటివిటీ వచ్చేది.." 

" ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు" 

" అయితే విను.జీవితం ఎలా లిమిటెడ్ నో అదే విధంగా అనుభవాలు..దానితోబాటు సృజనాత్మకత నూ " 

" ఐ సీ" 

" ఉదాహరణకి నా ఇరవై ఒక్క ఏళ్ళప్పుడు నేను ఒక నవల రాస్తే అది అప్పటి వరకు నేను పొందిన అనుభవ జ్ఞానం నుంచే రాయాలి.అలా ఆరు నవలలు జీవితానికి సరిపోతాయి..మిగతావి ఎన్ని రాసినా అవి పనికిమాలిన చెత్త గానే ఉంటాయి..అది నా ఆలోచన" 

" నిజమేనేమో..సినిమా,పేయింటింగ్,రచన ఇలా ఏ రంగం తీసుకున్నా కొంత కాలానికి ఆయా క్రియేటర్స్ యొక్క శక్తి క్రమేణా తగ్గినట్లు కనిపిస్తుంది ..కాలం తో బాటు గా.." 

" నా విశ్లేషణ తో సంతృప్తి ఏనా " 

" ఇంకొకటి అడగాలి" 

" ఓ.కె.." 

" నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా "

" ఇది మన జాబితా లో లేని ప్రశ్న కదా" 

" ఇదీ ఒకరికొకరు తెలుసుకునేదేగా.." 

" నాకే గనక అలా ఉండి ఉంటే నా మాటల్ని రెండు సెకండ్ల లో కట్ చేసేదాన్ని..పది గంటలకి క్విజ్ కార్యక్రమం ఉంది ,ఇక వస్తాను"  ఆమె లేచింది.

" ఆల్ ది బెస్ట్ " అన్నాను.

కేంటిన్ బయటకి పోయి ఒక దమ్ము కొట్టి ఈ జరిగిన దాన్ని అంతా అనలైజ్ చేసుకోవాలి.రాం చెప్పిన మొదటి రెండు రూల్స్ కొత్త వాళ్ళ కి మరీ అంత సులువైనవి కావు.కాని నేను చేయగలిగాను.ఆమె కి వేరే బాయ్ ఫ్రెండ్ లేరు అనే ముఖ్య విషయాన్ని తెలుసుకున్నాను. రాం కి శుభ వార్త చెప్పాలి.గుడ్ జాబ్ వరుణ్ ..కీపిటప్..! 

*  *  *  *  * 
నవంబర్ 12,2011
కేంటీన్ లో యామిని తో మాట్లాడి మూడు మాసాలు అవుతోంది.ఒకసారి ఆమె క్లాస్ ముందు కలిసినపుడు ఫోన్ నెంబర్ అడిగితీసుకున్నాను.అప్పటినుంచి ఫోన్ లో మాటలు సాగుతున్నాయి.ఆమె ఫేవరేట్ బుక్ హారీ పాటర్,మూవీ వచ్చి ద షషాంక్ రిడెంప్షన్ ..ఆహారం లో పాస్తా..! ఆమె స్వతహ గా తమిళ్ గాని ముంబాయి లో పుట్టి పెరిగింది.ఇలాంటి వి తెలియసాగాయి.

అయితే ఇప్పుడిప్పుడే నా లవ్ గురించి చెప్పదలచుకోలేదు.నా భయం కట్ చెబుతుందేమో నని...!ఆ రోజు ఆమె బర్త్ డే..వైల్డ్ వెస్ట్ బార్ లో ఆమెతో మాటాడుతున్నాను.ఆమె కొంచెం పై స్థాయి లో ఉన్నప్పుడు నా లవ్ వ్యక్తం చేయాలని అనుకున్నాను.ఒక తొందర లాంటిదే అది..అది ఇస్స్యూ కాదిక్కడ ..ఒప్పుకుంటుందా లేదా అనేదే ప్రధానం..! 

 (సశేషం)

--English Original: Raghav Varada Rajan


--Telugu Translation: Murthy Kvvs 


నా పేరు శివ (నవల),Post no:9

CHAPTER-3

"అమ్మాయిలు కాక్టైల్స్ తీసుకోరాని విన్నాను..నిజమేనా " అడిగాను నేను.

"వరుణ్..అమ్మాయిల పట్ల నీ అభిప్రాయాల్ని మార్చుకోవాలి..అవి బూజు పట్టినవి సుమా " యామిని జవాబిచ్చింది.

  మేము ఇప్పుడు తిరుచ్చి లోని వైల్డ్ వెస్ట్ బార్ లో ఉన్నాము.చాలా అకేషనల్ గా అమ్మాయిలు కూడా సందర్శించే బార్ అది.నాకు నెర్వస్ గా ఉంది..అయితే ఎలాగో విజయవంతం గా లోపలికి వెళ్ళాము.నా ప్రపోజల్ ని యామిని కాదంటుందా కాదంటే...మాట్లాడటం మానేస్తుంది.అంతేగా..!

రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు.అయితే ఈ రోజు నాలో ఉన్నది చెప్పెయ్యాలి.నా కంపెనీ ని ఆమె ఇష్టపడుతున్నట్టే ఉన్నది.నా జోక్స్ కి నవ్వడం,బోర్ ఫీలవ్వకుండా ఉండటం నేను గమనిస్తూనే ఉన్నాను.నేను అంటే కూడా అదే లాంటి ఇష్టం ఉండి ఉండచ్చుగా..ఏమో చెప్పలేను.

టేబుల్ మీదకి బీర్లు వచ్చాయి.చెరొకటి.ఆమె కి రెండు బీర్లు అయితే సరిపోవచ్చును..అప్పుడే నా లవ్ ప్రపోజల్ పెట్టాలి.

" నేను తీసుకొచ్చా ..నాకే తెలియదంటున్నావా అమ్మాయిల గురించి" అన్నాను.

" అదే నన్ను అనుమానం లో పడేసింది.బీర్లు తీసుకున్నాక నీకు ఏమైనా ఇతర ఆలోచనలు ఉన్నాయా..అలాంటివి ఉంటే ఇపుడే చెప్పు" అంది యామిని.

" అలాంటి స్థితి లో అడ్వాంటేజ్ తీసుకునే వాణ్ణి కాను నేను,ఆ విషయం లో ఎలాంటి అనుమానం పెట్టుకోనవసరం లేదు.ఈ మధురమైన రోజుని నీ తో గడపాలని ..అంతే.." బయటకి అలా అనేశాను.

" జస్ట్ జోకింగ్..లేకపోతే నా బర్త్ డే ని నీతో ఇలా చేసుకుంటానా..అవతల ఎంతోమంది కి నో చెప్పవలసి వచ్చింది కూడా"

" ఎంతమందికి... మూడువేల రెండువందల నలభైతొమ్మిది మందికి నో చెప్పావా "

" ఇదే నీలో నచ్చేది, అన్నీ తేలిగ్గా తీసుకుంటావు..నీ జీవితంలో ఇది మధురమైన రోజన్నావు..అది చాలు"

" ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా ఉండలేను ..ముందు నువ్వు ఉండగా "

" ఏది నీ చెయ్యి ఇటివ్వు" అంటూ నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొంది.ఈ మూడు నెలల్లో ఇలా ..ఇదే మొదటిసారి.హాయిగా ఉంది.

" ఒకటి చెప్పాలి నీతో" అన్నాను.

" తప్పకుండా.."

" హ్మ్మ్..ఇప్పుడు కాదులే ..తర్వాత" ఇది రైట్ టైం కాదనిపించింది నా లవ్ ప్రపోజల్ కి.

" నా బర్త్ డే నాడు నన్ను వెయిట్ చేపించడం బాలేదు.."

" నువ్వు వెయిట్ చేయొద్దు..ఏదో ఒకటి మాట్లాడు..నేను రెడీ అయినాక చెపుతా.."

" చాలా బిల్డ్ అప్ ఇస్తున్నావు..ఆ చెప్పేది తుస్ మంటే ..అక్కడ వేలాడ దీస్తా.."

" కనీసం అది నాకు పనికొచ్చే మాట గా అయినా ఉంటుంది అది "

" అది సరే..మరి నా గిఫ్ట్ ఏది.."

" నేను చెప్పేది కుంటి సాకు లా అనిపించవచ్చు..ఇదిగో ఉన్నది అంతా ఈ పార్టీ కే పెట్టేసా"

" అది పోనీలే..నువు నాతో ఉండటమే పెద్ద గిఫ్ట్ ..." అంది.హమ్మయ్యా గిఫ్ట్ సమస్య తీరింది.అయినా కొంత మనీ ఉంచితే బాగుండేది అని మళ్ళీ నాకే అనిపించింది.అలా కొంత సేపు స్వీట్ నథింగ్స్ నడిచాయి.

" అవును ..అన్నట్లు ఏదో న్యూస్ చెబుతా అన్నావు ఏమిటి" అడిగా.

"నా బర్త్ డే అంటే తిధి ప్రకారం వచ్చేది నవంబర్ 16 న.ఆ రోజు కూడా  ఇలాగే గడపాలి మనం.."

"తప్పకుండా..నీ పుట్టిన రోజున దేన్నైనా కాదనగలనా" అన్నాను..ఆమె కోరిక మేరకు మరో బీర్ ని చెబుతూ..!

" మరి నీ బర్త్ డే ఎప్పుడు .." అడిగింది యామిని.రెండు బీర్లు కంప్లీట్ అయినాయి.నా లవ్ ప్రపోజల్ కి ఇదే సమయం అనిపించింది.

"జూలై నాలుగున"

" ఓ..షిట్..కేన్సి రియన్ నా "
" ఔను..నా రాశి అదే"

" కేన్సెర్ ఇంకా స్కార్పియో గొప్ప జంట.."
" నేను ఒకటి   చెప్పనా"
" దానికి ముందు ..నేనొకటి చెప్పవచ్చునా..లేడీస్ ఫస్ట్ "

" ఒక వారం రోజులపాటు గోవా ట్రిప్ కి నన్ను తీసుకు వెళ్ళాలి..అది నీ బర్త్ డే నాడు జరగాలి..మనీ అంతా నాది.నో ప్రోబ్లం..ఎలా ఉంది" అంది యామిని.

" గొప్పగా చెప్పావు..తప్పకుండా " అన్నాను.గోవా లాంటి రొమాంటిక్ సిటీ లో కేండిల్ లైట్ డిన్నర్ లో నా ప్రపోజల్ పెడతాను అనుకుంటూ నా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను.

" సంతోషం..మరి నువు ఏదో చెప్పాలనుకున్నావు .."

" అదీ ..అంటే..నీ ముక్కు ఎంతో బాగుందని"  (సశేషం)

--English Original: Raghav Varada Rajan

--Telugu Translation: Murthy Kvvs 

  నా పేరు శివ (నవల) Post no:10

సెకండియర్ లో ఇంకా సెలవులు నెల ఉన్నాయి.రాం,నేను చెన్నై లో ఓ బార్ లో కూర్చొని ఉన్నాము.అది సెంట్రల్ రైల్వే స్టేషన్ కి దగ్గర గా ఉన్నటువంటిది.నేను ఎక్కాల్సిన బండి పదకొండు యాభై అయిదు నిమిషాలకి వస్తుంది.ఎంతగానొ ఎదురు చూసిన గోవా ట్రిప్ సాకారమవబోతోంది.అదీ యామిని తో కలిసి..!ఈ లోపు ఇక్కడ రాం తో రెండు పెగ్గులు తీసుకుందామని ఓ బార్ లో కూర్చున్నాను.సరదా గా పాత రోజులు నెమరేసుకుంటూ.

నేను గాని యామిని గాని ప్రేమికుల మాదిరి గానే వ్యవహరిస్తున్నాము.అయితే బయటకి మాత్రం వ్యక్తపరిచింది లేదు.ముద్దులు గాని,అంతకి మించి గాని ..అలాంటివి ఏమీ లేవు.ఈ గోవా ట్రిప్ లో ఆ దూరం చెరిగి మరింత దగ్గరయ్యే అవకాశం కలగవచ్చునేమో..!

" ఈ విస్కీ ముట్టి ..దాదాపు గా ఒక్క సంవత్సరం అయింది రమారమి,అసలు దీన్ని ఇన్నేళ్ళు ఎలా తాగానో తల్చుకుంటేనే చికాకు గా ఉంది." విస్కీ ని కొద్ది గా సిప్ చేస్తూ అన్నాడు రాం.

" త్వరగా కానిద్దాము ,రైలు వచ్చే టైమవుతోంది " అన్నాను.

" ముంబాయి వెళ్ళిన తర్వాత ఏమిటి నీ ప్లాన్" అడిగాడు రాం.చెరొక సిగరెట్ వెలిగించుకున్నాం.

" యామిని నన్ను ముంబాయి సి ఎస్ టి స్టేషన్ లో కలుస్తుంది,అక్కడినుంచి ఇద్దరం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి ఫ్లైట్ లో గోవా వెళ్ళిపోతాం" చెప్పాను.

" ఇంకా గోవా లో ఏం చేయబోతున్నారు" 

" అక్కడ్ ఓ బైక్ ని అద్దెకి తీసుకుంటాం. దాని మీద బీచ్ లు,పబ్ లు,కేసినో లు అలా చుట్టేస్తాం."

" ప్రపోజ్ చేసే ఉద్దేశ్యం ఉందా" 

" అనుకుంటున్నాను..ఏమవుతుందో" 

" ఎవరో ఒకరు ఆ పని చేయడానికి ముందే నువు త్వరపడటం మంచిది" 

" అలాంటిది కాదు ఆమె..మేమిద్దరం ఒకరంటే ఒకరకి చాలా ఇది" 

" మరీ ఎక్కువ కాన్ ఫిడెన్స్ వద్దు మిత్రమా"

" నువు అనేది కాదది..ఇంట్యూషన్ " 

" నువు ఏది చెప్పినా వినవు గా..నీ మంచికి చెప్పినా పట్టించుకోవు" 

" నా సంగతి వదిలి పెట్టు.అది నేను చూసుకుంటా.నీకు తెలిసింది ఒకటే గంజాయి పీల్చడం..క్లాస్ లు ఎగ్గొట్టడం..చదువు లో వెనకబడటం.." అసహనంగా అన్నాను.

" సరే వరుణ్..నీ యిష్టం వచ్చినట్లు నీవు చెయ్యి.." బాధ గా అన్నాడు రాం.

" సారీ డ్యూడ్ ...ఈ విషయం లో నన్ను నా యిష్టానుసారం పోనీ..నేనెప్పుడైనా సలహా అడిగినప్పుడు మాత్రం చెప్పు...సరేనా...మరి ఇక డ్రింక్స్ ఆపేద్దాం "  అన్నాను.

" అలాగే.." 

" నా సంగతి తెలిసింది గదా ..ఆ డేటింగ్ సైట్ లో నీకు తగిలిన ఆ బై సెక్సువల్ విషయం ఎందాక వచ్చింది.." 

" దాని గురించి ఎందుకు లే" 

" ఏమైంది"

" అది చీదేసింది లే డ్యూడ్" 

" ఏం జరిగింది..చెప్పరాదు" 

" చాటింగ్ ఆరు నెలలు చేశాక ...నేను ఉన్న నిజం అంటే నేను మగవాడినే అని చేప్పేశా ..క్షమాపణ కూడా అడిగాను..విచిత్రం గా అవతల వ్యక్తి కూడా మగవాడే ..అది చెప్పి తనూ సారీ చెప్పాడు"

"షిట్" నాకు నవ్వాగలేదు.

" నా పని డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కి పారిపోతున్న వాడిలా ఉంది బ్రో.." 
" మరి చాటింగ్ మానేశావా" 

" అప్పటంత క్రేజీ చాటింగ్ లేదు, కాని ఇద్దరం ఫ్రెండ్స్ మి అయ్యాము" 

" వాడూ నీ లాంటి వాడే" 

" నాకూ నీలానే ఎవరో ఒకరి తో సెటిల్ అవ్వాలని ఉంది లే గాని ...నీ అంత హేండ్సం అయితే కాదుగా డ్యూడ్"  

" మరీ అంత గా ఫీల్ కాకు,నీకేం బాగానే ఉన్నావ్" 

" సరే నా ప్రయత్నం లో నేను ఉండాలి,నీ రైలు కి టైం అయింది పద" అన్నాడు రాం.

" బై...బై" చెప్పాను చివరి చుక్క ని లోపలకి పోసుకొని.

" ఆల్ ద బెస్ట్ ..మంచి వార్త తో తిరిగి రా " అన్నాడు రాం. (సశేషం)  


 నా పేరు శివ (నవల) Post No: 11

జూలై 3,2012

నేను,యామిని గోవా చేరుకున్నాం.బాగా బీచ్ కి దగ్గర లో ఉన్న హసియాండా అనే హోటల్ లో రూం తీసుకున్నాం.ఆమె కొంత అలసట గా అయింది,నాకు ఉద్విగ్నంగా ఉంది.ఇదో రకమైన కొత్త అనుభవం. పెళ్ళి అయిన కొత్త లో ఉన్నట్లుగా..రాబోయే మా భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకునేదానికి ఇది ఓ అవకాశం.

" కొద్దిగా మగత గా ఉంది నాకు..వెళ్ళి స్నానం చేసి వస్తా..మనం చూడదగ్గవి చాలా ఉన్నాయి.టైం వేస్ట్ చేయడం ఎందుకు.."  యామిని అలా అనేసి బాత్ రూం లోకి వెళ్ళింది.

" నీ ఇష్టం.."

" పావు గంట లో వస్తా" బాత్ రూం డోర్ వేస్తూ అంది.

నేను బెడ్ మీద వాలి సిగరెట్ కాల్చసాగాను.ఈ వారం అంతా ఇక్కడ యామిని తో నే...ఆహా ఏమి నా అదృష్టం.. అజయ్ రూం లో అడిగాడు..నీ జీవిత లక్ష్యం నీకు తెలిసిందా అని..నా జీవిత లక్ష్యం ఇదిగో ఇదే ..యామిని ని ప్రేమించడం ...ఆమె తీసుకున్న నిర్ణయం సరి అయినదే అని ఆమె అనుకోవాలి.ఇంకా మంచి తరుణం రావలసే ఉన్నది.యామిని పక్కనే ఇలా నే నిదురిస్తూ ..ఏదో ఒక ప్రత్యేక  సంఘటన ..అలా జరుగుతుంది.గోవా నుంచి వెళ్ళే లోపు అది జరుగుతుంది.ఓర్పు గా ఉండాలి నేను.

ఇంకో సిగరెట్ వెలిగించి కళ్ళు మూసుకొని తాగసాగాను.ఇప్పటి ఈ గోవా ట్రిప్  లోని  ప్రతి సెకండ్ మరపురానిది గా మిగిలిపోతుంది.పది ఏళ్ళ తర్వాత ఈ సన్నివేశాలు ఊహించుకుంటే ఎంత మధురంగా ఉంటుంది.రాం అన్నది నిజమే ..ఆమె తో ఎలా ప్రేమ లో పడ్డది మొదటి నుంచి చివరి దాకా ..ఆ జ్ఞాపకాలన్నీ ఆమె తో చెప్పాలి.

" ఎందుకని అన్ని సిగరెట్లు కాల్చడం.." యామిని అంది,నేను మూడో సిగరెట్ వెలిగించుతుండగా..!

" ఏదీ ..రెండోదే ఇది " అన్నాను.బ్లాక్ ట్రాక్స్,గ్రే టీ షర్ట్ లో అందంగా ఉంది.

" ఈ రోజు ఎక్కువ స్మోక్ చేస్తున్నావు" నా చేతి లోది తీసుకొని యాష్ట్రే లో కుక్కింది.

" బాగా యాక్టివ్ గా ఉన్నట్లు తోస్తుంది.."

" చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంది.నాక్కూడా..!"

" అయితే ఓ పని చేద్దాం..బయటకి పోదాం"

హోండా యాక్టివా ని ఓ షాప్ లో రెంట్ కి తీసుకున్నాం.రోజుకి మూడు వందలు.పెట్రోల్ కొట్టించుకొని బాగా బీచ్ కి అటూ ఇటూ ఉన్న పబ్ లు,రెస్టారెంట్ లూ వాటి మీదు గా సాగిపోతున్నాం.రోడ్లు ఇక్కడ ఇరుకు గానే ఉన్నాయి.ఫారిన్ జంటలు,దేశీయ జంటలు బాగా కనిపిస్తున్నాయి.మాకు ఇది తగిన లొకేషన్ అనిపించింది.చివరకి ఓ డిస్కో బార్ లో కూర్చొని బీర్ కి ఆర్డర్ ఇచ్చాము.రెండు నిమిషాల్లో ఓ గాజు కుండ లో తెచ్చాడు.

" ఇలా మనం ఇక్కడ ఉన్నామూ అంటే నమ్మలేని విధంగానే ఉంది" అంది యామిని బీర్ ని సేవిస్తూ.

" నా జీవిత లక్ష్యం చేరుకున్నట్లుగా ఉంది నాకు" అన్నాను.

" అప్పుడే అలా అనకు.రేపు ఇంకా స్పేషల్ డే గా ఉండబోతోంది"

" అలాగా.."

" నీకు నాకు ..స్పెషల్ గా నే మిగిలి పోతుంది.నీకు నచ్చిన ఓ స్పెషల్ గిఫ్ట్ అది.ఎంతో కాలం గా నేనూ ఎదురు చూస్తున్నది అది"

" నన్ను బాగా ఊరిస్తున్నావు,అదేదో కొంచెం చెప్పొచ్చుగా "

" అది సర్ప్రైజ్ గా ఉంటేనే బాగుంటుంది"
" కొద్ది గా క్లూ ఇవ్వచ్చుగా "

" వేరే ఎదైనా మాటాడు..ఆ సస్పెన్స్ అలాగే ఉండాలి.అన్నట్లు నువు నేనూ ఇలా వస్తున్నట్లు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా తెలుసా..?"

" రాం ఒక్కడికి మాత్రం తెలుసు..నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ..వర్రీ కావలసిన పని లేదు"

" నాకేమి వర్రీ లేదు.మా క్లాస్ అందరకీ తెలుసు నేనిలా వచ్చేది"

" ఏంటది..నిజమా ..అందరూ అదోలా అనుకుంటారనే ఇది లేదా"

" నా గురించి ఇంకొకళ్ళు ఏమి అనుకున్నా నాకు లెక్క లేదు,నా ఇష్టం వచ్చింది నేను చేస్తా..నేను చేసేది ఇష్టపడతా, నీతో ఇలా గడిపినా ..ఏదైనా"

" నాకు దేవుడు కనబడితే బాగుండు..ఒకటి అడిగేవాణ్ణి.."

" ఏమిటది"

" గత జన్మ లో నేను చేసిన పుణ్యమేమిటని..అదే నిన్ను ఇలా కలిసినందుకు ఈ జన్మ లో"

" సరిగ్గా ..అలాంటిదే నేనూ అనుకుంటున్నా.."

" నా గురించి ఒకటి చెప్పానా యామినీ..ఈ కాలేజి లో చేరిన కొత్త లో నాకు చాలా నిరాశ గా ఉండేది.నాకు తెలుసు ఇది చాలా పేరున్న కాలేజి...చదివేతే మంచి గ్రేడ్స్ వచ్చి ఫ్యూచర్ బావుంటుంది...కాని ఏదో అసంతృప్తి లోపల ఈ తిరుచ్చి వచ్చిన దగ్గరనుంచి ...ఏదో కోపం...నా జీవితం లో ఏదో శని పట్టి పీడిస్తున్నట్లుగా అనిపించేది " నేను చెప్పుకుపోసాగాను.ఆమె తల ఊపింది.

" ఎవరినైనా సైకాలజిస్ట్ ని కలిస్తే బావుంటుంది గదా..డిప్రెషన్ కావచ్చును"

" పూర్తి గా చెప్పనీ...నీ బర్త్ డే నాడు నా చేతులు పట్టుకున్నావు చూడు ..అప్పటినుంచి నాలో ఏదో ఆనందం చిగురించసాగింది.నాకు ఎప్పుడు చికాకు గా ఉన్నా నీకు కాల్ చేసి మాటాడుతుంటానా ...హాయి గా అయిపోతుంది.ఆ బాధంతా పోయి.."

" ఈ లెక్కన నీ పాలిట సైకాలజిస్ట్ ని నేనేనన్న మాట.."

" అది ముమ్మాటికీ నిజం.లేనట్లయితే ఆ ఫ్రస్ట్రేషన్ లో నన్ను నేనే చంపుకునే వాణ్ణి"

" అలా ఎప్పుడు అనకు ఇంకోమారు..అన్నట్లు నన్ను మొదటి సారి ఎప్పుడు చూశావు "

" అది ఈ రాత్రికి నేను చెప్పలేను.."

"ఎందు చేత"

" స్పెషల్ డే అప్పుడే స్పెషల్ సంగతులు చెప్తే బాగుంటుంది,రేపటి దాకా ఆగు  "

" నువ్వు నా లాగానే ఆలోచిస్తున్నావ్ అన్నమాట "

" తప్పదు మరి"

" అయితే ఇపుడు చేసేది ఏమిటి.."

" లెట్స్ డాన్స్"  (సశేషం)  

--English Original: Raghav Varada Rajan
--Telugu Translation: Murthy Kvvs   

నా పేరు శివ (నవల)Post no:12

జూలై 4, 2012

బాగా బీచ్ దగ్గరున్న బ్రిట్టో రెస్టారెంట్ లో ఉన్నాము ఇప్పుడు.కేండిల్ లైట్ డిన్నర్.నా ఇరవై వ పుట్టినరోజు జరుపుకోడానికి ని ఇంతకంటే మంచి చోటు ఎక్కడుంది.చక్కటి మ్యూజిక్ ఇంకా ఇద్దరమే మేము.బీర్ తాగుతూ ఆమె అందమైన మోము ని గమనిస్తున్నాను.

" ఇది ప్రత్యేక సమయం కొన్ని ప్రత్యేక విషయాలకి" యామిని అన్నది.

" నువ్వు చెప్పు మొదట"

" లేదు..నువ్వే"

"లేడీస్ ఫస్ట్"

" ఈసారి అది వర్తించదు..నువ్వే చెప్పాలి"

" సరే..భక్తుడు అంగీకరిస్తున్నాడు...నిన్ను మొదట గా చూసింది ..ఆ కల్చరల్ ఫెస్టివల్ లో.పాట...అది గుర్తుకు రావడం లేదు.అయితే మంచి అర్ధవంతమైనదే.."

"లవ్ ఈజ్ లైఫ్...అండ్ లైఫ్ ఈజ్ లవ్ "

"ఆ...ఆ...అదే..!నువ్వే పర్ఫెక్ట్ ఆ సాంగ్ పాడాలంటే.."

" ఓ..దానిదేముంది లే...చాలామంది మంచి సింగర్స్ ఉన్నారు"

" కాని అది రాయబడింది నీ కోసమే..నేను వినడం కోసమే.."

"అది తెలీదు గాని క్రమేపి నీను నీ మాయ లో పడిపోతున్నాను"

" నీతో మాటాడటానికే నేను గిటార్ నేర్చుకున్నది...అలా అయినా ఆ ట్రూప్ లో చేరి నీతో స్నేహం చేయవచ్చుగా అని"

" ఏమిటి..నీకు పిచ్చి లా ఉందే " యామిని నవ్వింది.

" పిచ్చి అనేది ..హ్మ్ ..చాలా ఉన్నాయి కాకపోతే నేను నీ పిచ్చోడిని.."

" పది నెలల ప్రాక్టిస్ తో ఆ విధంగా బాగనే ప్లే చేశావే"

" ఒక భయం వల్లనే నేను నేర్చుకోగలిగాను.అయితే పూర్తి గా నేర్చుకోలేకపోయాను"

" మనం ఎప్పుడు ఇలానే ఉండాలి...ప్రామిస్ చెయి" యామిని కంటిలో కన్నీటి తడి.
" ప్రామిస్.."

"థాంక్స్" యామిని కన్నీళ్ళు తుడుచుకుంది.

"మరి ఇప్పుడు ..నీ వంతు"

" నేను నిన్ను మొదట గా చూసింది..మా క్లాస్ ఎదురు గా నించున్నప్పుడు..మంచిగానే ఉన్నాడే అనుకున్నా.."

" ఇన్షా అల్లా"

" నా ఫ్రెండ్ వరుణ్ ..నువు అతని తో చెప్పిందంతా ..నాతో చెప్పాడు.నాకు ఎక్సైటింగ్ గా అనిపించింది.అబ్బాయిలు నా పట్ల ఆసక్తి చూపించడం కామన్..గాని నీవు ఆసక్తి చూపించడం నాకు  బాగనిపించింది"

" మరొకసారి ఇన్షా అల్లా"

"ఆ తర్వాత నువు చాలా రోజులకి నాతో మాట్లాడావు."

" ఆ తర్వాత"

" ఏముంది..ఇలా..గోవా లో..ఎదురెదురు గా "

" మరి నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏది..

" అది గది లో ఉంది..ఓ అరగంట ఆగలేవా .."

" సరే..అందాకా మాట్లాడు"

" ఏమి మాట్లాడాలి"

" నీ మొదటి నవల ఇతివృత్తం ఏమిటో చెప్పు"

" అది నువు కాపీ కొట్టి...సొమ్ము చేసుకుంటేనో"

" నేను కధలల్లగలను లే గాని ..అంత గొప్ప రచయితనైతే కాదు సుమా"

" సినిమా తీస్తేనో"

" అదైతే జరగచ్చు..ఏయ్ ఈరోజు నా బర్త్ డే ..టీజ్ చేయకూడదు "

" నిజం..నాకే స్టోరీ అనేది తెలియదు..ఏలియన్స్ లవ్ స్టోరీ కావచ్చునేమో బహుశా"

" వాళ్ళ్ మార్స్ గ్రహానికి చెందిన వాళ్ళా "

" కాదు,ఆండ్రోమెడా గేలక్సీ కి చెందిన వాళ్ళు"
" ఆండ్రోమెడా నుంచా..మనుషుల మాదిరి గా నే ఉంటారా"

" ఉండరు..దే ఆర్ ఫకింగ్ ఎలియన్స్ ..ఓ సారీ"
" యూ ఆర్ క్రేజీ "

" నువ్వు అయితే కాదు గా"

" మా చుట్టాల్లో కొంతమంది తేడా ...అంటే పేరానోయా ..మా ఆంటి కూతురు,ఓ అంకుల్ కొడుకు..బైపోలార్ దిజార్డర్ తో బాధ పడుతున్నారు"

" పేరా నోయా..అంటే ఎవరో కొంతమంది తనకి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని భావించడం అంతేగా"

" నిజంగా నే అలా జరిగితేనో"

" కాని పేరా నోయా లో చుట్టు పక్కల వాళ్ళంతా అలా చేస్తూంటారని భావిస్తుంటారు.ఇంకా చెప్పాలంటే సొంత ఫేమిలీ లో వాళ్ళే అలా చేస్తారని ఊహించుకుంటూ ఉంటారు.మా అంకుల్ తన భార్య నే చంపబోయాడు.ఆమె చేసేదానికి చికాకు లేచి"

" ఈ లెక్కన ఎవరు సైకో.." నవ్వింది యామిని.
" నువ్వే పెద్ద సైకో..మా ఫేమిలీ వాళ్ళ కధలు విని చేస్తున్నావు చూడు" 

" నువు చెప్పినదానికి నవ్వు వచ్చింది"

" అంత బాగున్నాయా..నువు ఓకే గదా "

" ఇప్పడిదాకా ఫర్లేదు..నేనే పెద్ద మర్డరర్ గా మారతానేమో..ఎవరకి తెలుసు.." 

" జాక్ నికోల్సన్ లా" 

" షైనింగ్ లో లా" 

బీర్లు మూడు బాటిల్స్ దాకా ఫినిష్ చేశాము.యామిని నా బిల్ కూడా పే చెయ్యడం అదోలా అనిపించింది నాకు.ఒక డీసెంట్ సంపాదన రావాలంటే రెండేళ్ళు ఆగాల్సిందే. మేము రూం కి చేరుకున్నాము.ఆమె బ్యాగ్ లోనుంచి ఫ్రెష్నర్ తీసి గాలి లోకి కొట్టింది.ఆమె ఒకలాంటి చూపు చూసింది ..బెడ్ పైకి చేరి.ఆ సువాసన పరవశుణ్ణి చేయగా ఆమె పక్కకి వాలిపోయాను. నా గుండె వేగం పెరిగింది.ఇద్దరి మధ్య దూరం తరిగిపోయింది.ఆనంద లోకాల్లోకి పయనిస్తున్నాము.సమయం ఎలా గడిచిందో స్పృహ లేదు.

" నీ గిఫ్ట్ కోసం మరి రెడీ గా ఉన్నావా " అడిగింది యామిని..!రెడీ అన్నాను.ఆ తర్వాత జరిగినది అంతా మీరు ఊహించుకోవచ్చు.(సశేషం)  


నా పేరు శివ (నవల) Post no: 13

" ఎక్కడి కో ప్రపంచానికి దూరం గా వెళ్ళిన అనుభూతి " మంచం పై నే ఆమె ని చూస్తూ అన్నాను.సిగరెట్ వెలిగించి తాగుతూన్నాను.యామిని కి దగ్గర గా ఉంది నా తల.

" నువ్వు ప్రయత్నిస్తావా" 

" అదే నీ కోరిక అయితే ఓకె" నా భుజాల్ని చుట్టేస్తూ అంది ఆమె.

"ఒక అలవాటు గా కాకుండా ..సరదా గా " అన్నాను.ఈ సమయం లో ఇది ఒక హాయి అయిన విషయం గా తోచింది.

"అలాగయితే ఇటు తే" నా చేతి లోని సిగరెట్ తీసుకొని ఒక దమ్ము కొట్టి పొగ వదిలింది.

" అలా కాదు ఇలా" పొగ వదిలే విధానం ని తెలిపాను.ఆ వినోదం అలా కొంత సేపు గడిచింది.సర్లే మిగతాది మళ్ళా సారికి చూద్దాం అన్నాను.

" ఇలా ఒక అమ్మాయి తో గడపడం నా కిదే మొదటి సారి" అన్నాను.

" వేళా కోళం గా చెపుతున్నావా" 

" లేదు..ఇరవైవ ఏట ఒక అబ్బాయి తన మొదటి అనుభవాన్ని పొందటం ..అది సాధ్యమయ్యే ది గాదా " 

" నువ్వు ఎక్స్ పర్ట్ వి అనుకున్నా " 

" అలా ఎందుకు భావిస్తున్నావు..నీకు ఇంతకు ముందు అనుభం ఉందా " 

" ఎక్స్ పర్ట్ ని అని చెప్పలేను ,కాని అనుభవం లేనిదానిని గాను.." 

" నువ్వు అంటున్నది ఏమిటి...అంటే...అంటే" 

" నువు తెలుసుకోవాలని అనుకుంటే ..చెప్తున్నా విను.. నాకు ఇదివరకే అనుభవం ఉంది.నువు కూడా దీన్ని స్పోర్టివ్ గా తీసుకో" అన్నది.

" అంటే ..ఎప్పుడు ..నీ మొదటి అనుభవం" 

" నా పదవ తరగతి లో " 

" ఓసి నీ ..ఆ వయసు లో నే నా " 

" మరీ ఎక్కువ రియాక్ట్ అవకు వరుణ్ ...ముంబాయి లో అదంత పెద్ద విషయం కాదు" 

" మరీ బజారు దాని లా మాటాడుతున్నావే..పెద్ద యవ్వారం కాదట" 

" ప్లీజ్ దాన్ని అంతటి తో వదిలిపెట్టు" 

" చెప్పు ..అసలు నీ కేరక్టర్ ఏంటి.." రెండు బూతులు కూడా అన్నాను.

దానికి యామిని జవాబు గా తిట్టి, చెంప మీద ఒకటి ఇచ్చింది గట్టిగా..!  

నా మొహం మీద చర్రుమని తగిలింది ఆ దెబ్బ.నాకు ఇంకో మాట మాట్లాడటానికి కూడా బలం లేకుండా అయిపోయింది.కోపం గానూ,అసంతృప్తి గానూ అనిపించసాగింది.జీవితం మీద వ్యాకుల భావం ఆవరించింది.

ఇది దేనికి మొదలు..అంతానికేనా..? (సశేషం) ) 


--English Original : Raghav Varada Rajan, Telugu rendering: Murthy K V V S  


నేను శివ ని (నవల) Post no:14

బాగా బీచ్ లో ఉన్న రెస్టారెంట్ లోకి యామిని ని తీసుకువెళ్ళాను.నేను కాస్త నెమ్మదించాను.అయితే ఆ షాక్ నుంచి పూర్తి గా కవర్ అయ్యానని చెప్పలేను.యామిని తో మరొకరు పడక పంచుకున్నారనే నిజమే నాకు జీర్ణించుకుండానికి అదోలా ఉంది.ఓ రకంగా చెప్పాలంటే ప్యూర్ కాదు.

" సారీ బేబీ" అన్నాను నేను. నాకే లోపల కాస్త ఓవర్ యాక్టింగ్ లా అనిపించింది.

" నువ్వూ ..బయట అందరి లాంటి వాడివే" కోపంగా అంది ఆమె.

" అంటే.."

" అంటే ఏముంది..ఆలోచించకుండా వాగే చెత్త గాళ్ళ లానే నువు మాట్లాడావు,ఆ తర్వాత మళ్ళీ సారీలు చెప్పడం .."

" నేను జెన్యూన్ గా చెపుతున్నా..నాది పొరబాటే"

"పొరబాటే కాదు..ఇంకా అంతకు మించినది.నీ నిజరూపం తెలిసింది ఈ సంఘటన వల్ల "

" కొన్ని పొరబాటు మాటలు వాడింది నిజం.అయితే నా అర్ధం అది కాదు.కాస్త తొందరేపడ్డాను"

" చాలా నీచమైన మాటలు మాట్లాడావు.అసలు దాన్ని ఓ పెద్ద ఇష్యూ గా ఎందుకు తీసుకున్నావో నాకు అర్ధం కాలేదు"

" నా బ్యాక్ గ్రౌండ్ ని నువు కొద్ది గా అర్ధం చేసుకోవాలి ఇక్కడ.నేను చెన్నయ్ కి చెందిన ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడిని.ఇంటర్మీడియట్ దాకా బాయిస్ ఉన్న స్కూళ్ళ లోనే చదివాను.ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి అనే భావ జాలం లో పెరిగినవాడిని.నా యాంగిల్ లో నుంచి చూడు ఓ సారి"

" ఆడపిల్లలు అలా చేసి ఉండకూడదు అని నువు భావించే వాడివే అయితే మరి నువు నాతో ఎందుకు సెక్స్ చేశావు..అంటే నీతో అయితే ఫరవా లేదు..వేరొకరి తో కూడదు ..అంతేగా నీ అర్ధం ..దీన్నే హిపోక్రసీ అని అనేది"

" మన మధ్య ది వేరు.."

" ఎలా వేరు..అది చెప్పు.." ఆమె మాట లకి అడకత్తెరలో పోకచెక్క లా అయింది నా పరిస్థితి.

"యామిని..నువు సీరియస్ అవకు..నన్ను ప్రత్యేక వ్యక్తి గా చూడలేవా "

" వాళ్ళ తో నేను ఉన్నప్పుడు అప్పుడు నాకు స్పెషలే గా.వాళ్ళు నన్ను చికాకు చేసి వెళ్ళిపోయేంత వరకు..!ప్రపంచం లో ఎవరూ ఎవరకి స్పెషల్ కాదు.అందరం మనుషులమే..ఎవరూ పరిపూర్ణూలము కాము"

" అవును..వాళ్ళు అంటున్నావు...ఎంతమంది తో నీకు గతం లో ఆ పరిచయాలు ఉన్నాయి,చాలా మంది తోనా "

" కేవలం ఇద్దరి తో
  మాత్రమే..టెంత్ లో ఒకరు..ఇంటర్ లో ఒకరు "

"నాకు ముందు ఇద్దరతో..అంతేగా"

" నా గతం నే పట్టుకుని నువు వేలాడితే...నాకు పిచ్చి లేస్తుంది...అప్పుడు ఏమైనా జరగవచ్చు.నీతో నాకు తెగిపోవచ్చు కూడా "

" ఏమి అనుకోకు యామిని.నీ పై నాకు గల ప్రేమ వల్లనే  అలా హర్ట్ అయ్యాను అది అర్ధం చేసుకో .."

" ఏది పడితే అది అనడానికి..ప్రేమ అనే సాకు ని వాడకు వరుణ్ "

" నన్ను ప్రతి అణువణువు వేధించక..ప్లీజ్ ...అంటే మన మధ్య నున్నది ఏమిటి...ఎవరి లాభం వారు పొందే ఫ్రెండ్షిప్ లాంటిదా .."

" నా మాటలే నిన్ను ఇంత బాధిస్తే..రేపు పొద్దున్న నేను ఈ లోకం లో నుంచే పోతే.."

" ఏయ్ ..ఏమిటి మాట్లాడుతున్నావ్.."

" నా ఆయువు ఈ లోకం లో ముప్పై మూడు ఏళ్ళే.నా జాతకం చూసిన వాళ్ళు చెప్పారు." చెప్పింది యామిని. ఆమె అరచేతిని వరుణ్ పరిశీలనగా చూశాడు.ఆయుషు రేఖ చిన్నగా ఉంది.కన్నీళ్ళు వచ్చాయి.
   " నీవు లేకుండా ఈ కౄర ప్రపంచం లో నేను ఎలా ఉండగలను..ఐ లవ్ యూ సో మచ్" వరుణ్ బాధపడ్డాడు.మళ్ళీ అన్నాడు.." నీతో రూడ్ గా అనాలని అనలేదు.నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.నేను ఇన్నాళ్ళు ప్రేమ అని అనుకునేది కేవలం హర్మోన్ ప్రభావం వల్ల జరిగే మార్పే తప్ప మరొకటి కాదు.అంతకు మించి ఇంకొకటి కాదు"

" నువు ఒకదాన్ని గూర్చి చెపుతున్నావు,నేను మరొకదాన్ని గూర్చి మాట్లాడుతున్నా,  అదంతే పోనీ..మనం ఉన్నన్నాళ్ళు జాలీ గా ఉందాము. నాతో ఎలాంటి భవిష్యత్ ని ఊహించుకోకు..అంతా వర్క్ అవుట్ అయితే తరవాత సంగతి తర్వాత..కేవలం వర్తమానం లో జీవించుదాము.."

" నువు చెప్పింది నిజం..అంతా కాలానికి వదిలి హాయిగా గడుపుదాం" అన్నాను నేను.

ఆ క్షణం లో నోరు మూసుకోవడమే మంచిది,వాదిస్తే ఇంకా ప్రేమ అనేదే లేదు అని వాదించినా వాదిస్తుంది. ఆ ఘటన ఊహించుకోడానికే కష్టం..అందునా  నేను ఎంతో ఇష్టపడే ఒక మనిషి నుంచి..!ఎటువంటి వాదనలు లేకుండా ట్రిప్ గడిచింది.కొన్ని వాటికి ఓర్పే సరైనది. అంజునా,అరంబోల్,కలంగూట్ లాంటి బీచ్ లు అన్నీ చుట్టేశాము.అక్కడక్కడ ఆగటము..బీర్లు లోపల పోసుకోవడం..రూం కి వచ్చి శృంగార లోకాల్లో మునిగిపోవడం ..అలా సాగిపోయాయి రోజులు.కేసినో లో ఓ పూట ఆడి రెండు వేలు పోగొట్టుకొని అంతటితో ఆపుజేశాము.వచ్చేప్పుడు కాంప్లిమెంట్ గా రెండు బీర్లు ఇచ్చారు వాళ్ళు.

రోజు రోజు కి మా మధ్య శారీరక,మానసిక బంధం మరీ బలపడసాగింది.ఆ జాతకం విషయం జ్ఞాపకం వచ్చి ..బాధ కలిగేది.మళ్ళీ అదంతా ట్రాష్ అనిపించేది.తమిళ్ నాడ్ బయటకి వెళ్ళడం ఇదే ప్రధమం నాకు.నా డల్ లైఫ్ లో ఒక ఉత్సాహం పెరిగింది.భవిష్యత్ ఎలా ఉన్నా ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి జీవితం లో..! (సశేషం) 


--English Original : Raghav Varada Rajan, Telugu rendering: Murthy K V V S 


 నా పేరు శివ (నవల) Post no: 15

ఆగస్ట్ 2,2012

మూడో ఏడాది చదువు నిరాశ గా నే మొదలయింది.సెకండ్ ఇయర్ లో నా ర్యాంక్ తగ్గింది.కోర్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఎక్కువ గత ఏడాది..!ఇక మీదట బుద్ది కలిగి చదవకపోతే గడ్డు దినాలే ముందు ముందు.స్కూల్ లో ఐ ఐ టి సిలబస్ చదవటం మూలం గా ఈ మాత్రమైన లాగగలిగాను.యామిని తో రోజు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను.ఆమె ఏమిటో సరిగా అర్ధం కావడం లేదు.మా రిలేషన్ ఏ వేపు కి సాగాలో ఆమె కి ఒక ఆలోచన ఉందా లేదా అనిపిస్తోంది.ఏమైనా రాం ని ఓ మారు సలహా అడగాలి.దానిని తుచ పాటించాలి.

నా లోని కోపాన్ని అసంతృప్తిని బయటకి వ్యక్తం చేయడం లేదు.గతం లో కంటే అవి ఎక్కువ గా నాలో చెలరేగుతున్నాయి.ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశా గాని ఆ తర్వాత ఆ ఫీలింగ్ ని విరమించుకున్నా..రానున్నవి మంచి రోజులు గా ఉండవచ్చుననే ఆశతో..!

" పోదామా.." నేను సిగరెట్ పూర్తి చేయబోతుండగా రాం అడిగాడు.నా ఊహల్లో నుంచి తేరుకున్నాను.

" పద..పోదాం" అన్నాను.ఇద్దరం అజయ్ వాళ్ళ హాస్టల్ వేపు దారి తీశాం.

" హాయ్ లేడీస్" అన్నాడు అజయ్ మమ్మల్ని చూస్తూ .

" మమ్మల్ని అలా పిలవకు..రేపు ఇంకో పనికి కూడా మమ్మల్ని పిలిచినా పిలుస్తావ్.." రాం సరదాగా అన్నాడు అజయ్ తో. మమ్మల్ని లోపలకి రానిచ్చి వెంటనే రూం తలుపులు వేసేశాడు అతను.

" కిటికీ తలుపులన్నా తెరువు  బ్రో..గాలి కొద్దిగా అయినా రానీ " అన్నాను నేను.

" నా ఇది వేరు బ్రో..విండో తలుపులు తెరిస్తే గంజాయి పొగ బయటకి పోయి నాకు ఎఫెక్ట్ తగ్గుతుంది.బాడీ అంతటికీ దాని ఆస్వాదన ఉండాలి.సరే ఈ థియరీ బేటా టెస్టింగ్ లో ఉందిలే" అన్నాడు అజయ్.చూడబోతే ఇతను పెద్ద సిక్ పర్సన్ లా ఉన్నాడే అనుకున్నాను.

" ఎక్కువ మత్తు కావలిస్తే..ఎక్కువ సరుకు వేసుకోవచ్చుగా " అన్నాను.

" ఇది ఎకనామిక్స్ బ్రో.తక్కువ తో ఎక్కువ లాభం పొందాలి,సర్లే కిటికీ తెరుస్తా " అంటూ లేచి కిటికీ తీశాడు.

ఒక పెద్ద జాయింట్ చేసి రాం కి ఇచ్చాడు.దాన్ని డైనోసార్ అంటారట వీళ్ళ భాష లో.

" వరుణ్..నీ గోవా ట్రిప్ ఎలా సాగింది" అడిగాడు అజయ్.

" ఏంటి ..నువు చెప్పావా" అడిగాను రాం ని.

" అతను మన వాడే..ప్రమాదం ఏమి లేదులే " అన్నాడు రాం.

" ట్రిప్ బాగా సాగింది బ్రో" అన్నాను.

" అంటే..బాగా బాగా నా" అంటూ సాగదీశాడు .

" నీకు అర్ధం అయింది గా " చెప్పి నవ్వాను.

" మన గ్యాంగ్ లో మనోడే స్పీడ్ గా ఉన్నాడు..ఇదిగో మనం ఇలా రూం లో గడుపుతున్నాము..అనుభవించాల్సిన వి అన్నీ అనుభవించేస్తున్నాడు ..మనం చాలా నేర్చుకోవాలి వరుణ్ నుంచి" అన్నాడు రాం.

" మొత్తానికి హీరో అనిపించావ్..కంగ్రాట్స్ " అన్నాడు అజయ్.
" చాలా పొద్దుంది..నిమ్మది గా చెప్పు..కంగారేమీ లేదులే" రాం అన్నాడు.

" నా పర్సనల్ విషయం ఇది.సీక్రెట్ గా ఉండాలి.యామిని వర్జిన్ ని కాదని చెప్పింది.ఆమె కి గతం లో ఇద్దరితో అఫైర్ ఉందట. నేను ఆమెని దేవత లా భావించా.నేను ముందుకి పోవచ్చా ఆమెతో..నాకు చెప్పడానికే ఒకలా ఉంది.ఈ విషయం లో మీ సలహా కావాలి"

" ఇది వింటుంటే నా పాత అనుభవాలు గుర్తు వస్తున్నాయి" అన్నాడు రాం.

" ఏంటి ..ఏం జరిగింది"

" నా ఇంటర్ రోజుల్లో ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది.ఇలాంటి సమస్యే నాకూ ఏర్పడింది "

" ఏమయ్యింది"

" అప్పుడు నాకు అనుభవం లేదు..ఆలోచన లేదు.ఆమె కి వేరే లవర్ ఉన్నాడని తెలిసి ఒకటి పీకా..ఇప్పుడు అది తల్చుకుంటేనే సిల్లీ గా ఉంది"

"నిజమా.." నేనూ,అజయ్ ముక్తకంఠం తో అన్నాం.

"  అలా ఉండటం మానవ నైజం.నా రిసెర్చ్ లో తేలింది ఏమంటే మనం ఎలా వివిధ రుచుల కోసం చూస్తామో అలానే వాళ్ళ లో పిల్లల్ని కనడానికో,కలిసి జీవించడానికో అలా జరుగుతుంది.ఇది ప్యూర్ బయాలజి."

" ఓర్నీ" అజయ్ నిట్టూర్చాడు.

" అది డి ఎన్ ఏ లోనే ఉన్న విషయం.దాన్ని ఎక్కువ గా ఊహించి ఆ సమయం లో నా లవ్ ని పోగొట్టుకున్నా.అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదుగా .." రాం నిట్టూర్చాడు.

" యామిని కూడా ..పెద్ద విషయం గా తీసుకోవద్దు అంది" అన్నాన్నేను.

" ఆమె చెప్పింది పూర్తి నిజం బ్రో" రాం అన్నాడు.

" నువు చెప్పినదానిలో నిజం ఉంది బ్రో..కాకపోతే పోలీగమి వల్ల కుటుంబ సమస్యలు ఏర్పడతాయని..ఒకరికి ఒకరే అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు.." అన్నాడు అజయ్.

" ఆ..అది తప్ప మిగతాది అంతా బాగానే జరిగింది గా..అదే గోవా ట్రిప్ లో " రాం అడిగాడు నన్ను.

" నేను ఐ లవ్ యూ అని ఆమె తో చెప్పా..అది చాలా పెద్ద మాట అంది ఆమె..అలా ఎందుకు అని ఉంటుంది...కనీసం మాట వరసకైనా నాకు తిరిగి ఐ లవ్ యూ అని చెప్పి ఉండచ్చుగా.."

" దాని గురించి చెప్పాలంటే మూలం లోకి పోవాలి.విండానికి రెడీయేనా" అడిగాడు రాం.

" చూడబోతే నీదగ్గర అన్నిటికీ సొల్యూషన్ లు ఉన్నట్లున్నాయ్..నాలాంటి వాళ్ళతో నీకేం పనిలే ఇక్కడ" అజయ్ అన్నాడు.

" నీ రాడికల్ అప్రోచ్ ఏమిటది..చెప్పు" అన్నాను.

" జాగ్రత్త గా విను.యామిని తో లోతైనా సంబంధం పెట్టుకోవాలంటే స్త్రీ స్వభావం గురించి నువు ముందుగా తెలుసుకోవాలి " అన్నాడు రాం.

 అజయ్,నేను చాలా జాగ్రత్త గా వినసాగాము.

" ఇప్పటిదాకా తెలుసుకున్నదంతా ..విడిచిపెట్టండి మొదలంటా..!అది మీరు చేయగలరా " ప్రశ్నించాడు రాం.
--English Original : Raghav Varada Rajan, Telugu rendering: Murthy K V V S  


నా పేరు శివ..! (నవల) Post no: 16

" ఆ చెప్పు..ఆ తరవాత "

" విను.స్త్రీలు అనేవాళ్ళకి కూసింత ఎమోషన్స్ అనేవి ఎక్కువ.వాళ్ళ ప్రవర్తన గమనిస్తే నీకు అది తెలుస్తుంది.నాటకీయత నిండిన సీరియళ్ళు చూడటం,బోరింగ్ రొమాన్స్ నవల్స్ చదవడం వంటివి వాళ్ళకిష్టం.వాస్తవం కంటే ఎమోషన్స్ కే ప్రయారటీ ఇస్తారు" చెప్పాడు రాం.

" ఆ దోవ లో నేనెప్పుడూ ఆలోచించలేదు.నువు చెప్పింది రైటే" అన్నాను.

" నా వెర్షన్ లో సరుకుందా లేదా"

" ఇప్పుడే జడ్జ్ చేయలేను,ఇంకొంచెం ముందుకు పో"

" పురుషుడి నుంచి వాళ్ళు కోరుకునేది ఎమోషనల్ గా ఉండే ప్రవర్తననే...నువు ఆ పరంగా ఆమె కి  ఎలాంటి ఎమోషన్స్ ని అందించావు?.."

"ఆనందం..నవ్వడం...ప్రేమ ..అలా"

" అవన్నీ పాజిటివ్ ఎమోషన్స్...నువు కొన్నిసార్లు ఆమె కి నెగిటివ్ ఫీలింగ్స్ ని కూడా రుచి చూపించాలి.అంటే..నిరాశ,కోపం,అసూయ ఇలాంటివి అన్నమాట.అప్పుడు బేలన్స్ గా భోజనం చేసినట్లు అవుతుంది.ఒకసారి కోపం తెప్పించాలి..మళ్ళీ ఓ సారి నవ్వించాలి"

" నువ్వు చెప్తున్నది మత్తు గా ఉంది బ్రో" అజయ్ అన్నాడు.

" నెగిటివ్ ఎమోషన్స్ ఎలా కలిగించడం" నేను ప్రశ్నించాను.

" ఆమె తో పోట్లాడు.వాదన పెట్టుకో.ఆమె మిగతా వాళ్ళ లాంటిదానివని చెప్పు.నీ రిలేషన్షిప్ లో సమస్యలు సృష్టించు,అయితే మరీ ఓవర్ కాకు.కాసేపు మంచిగా కాసేపు చికాకు గా ..అలా బేలన్స్ గా ఉండు"

" అలా చేస్తే బాధ పడుతుందేమో"

" నువు ఆమెని బాధించట్లేదు.ఒక ఫేవర్ చేస్తున్నావ్.ఎంతమందికి ఈ ప్రపంచం లో ఆ యిది దొరుకుతుంది..?లోపల మనసు లో నీ పట్ల మంచి భావం ఏర్పడుతుంది.నన్ను నమ్ము"

" కావాలని సమస్యలు సృష్టించాలంటావు"

" అదే చెప్పేది.కొద్దిగా మానసిక బలం పెరుగుతుంది..ఇందా ఇది పీల్చు" అని చెప్పి రాం నాకు గంజాయి సిగరెట్ ని ఇచ్చాడు.

" బ్రో..ఒకసారి ప్రయత్నించు...ఎంత హాయి కలుగుతుంది అనేది నీకే తెలుస్తుంది" అజయ్ సపోర్ట్ చేశాడు.

గంజాయి ని ఓసారి రుచి చూడాలనే నా లోపలి కోరిక ని అణచుకోలేకపోయాను.ఇలాంటి వాటికి దూరం గా ఉండాలని నా పేరేంట్స్ ఎన్నోసార్లు చెప్పేవారు. ఆ మాటకి వస్తే సిగరెట్,మందు కూడా వద్దని చెప్పేవారు.కాని ఆగానా...ఇంకో అడుగు ముందుకి వేస్తే ఏమవుతుంది..ఈ కాలేజీ జీవితం మళ్ళీ వస్తుందా ఏమిటి ..?

ఓకే అని చెప్పి రాం చేతి లో దాన్ని తీసుకొని పీల్చాను.

" యో..యో..బ్రో" అంటూ అజయ్ చప్పట్లు కొట్టాడు.

" ఇప్పుడు ఫ్లాయిడ్ గీతాల్ని పాడుదాం" అన్నాడు రాం.

" నువు పైకి వెళ్ళిపోయావు..బ్రో.." అజయ్ అన్నాడు.ఆరు దమ్ములు కొట్టేసరికి కొద్ది గా దగ్గు వచ్చింది నాకు.అజయ్ లాప్ టాప్ మీద పింక్ ఫ్లాయిడ్ పాట ని పెట్టాడు రాం.నేను కళ్ళు మూసుకొని అజయ్ బెడ్ పై ఒరిగాను.ఫ్లాయిడ్ మ్యూజిక్ ప్రత్యేకత ఏమిటో తొలిసారి గా అర్ధమయింది..అంతకుముందు విన్నప్పటికీ..!

వేరే లోకానికి తీసుకెళ్ళింది ఆ పాట.ఒక అడవి లో ఉన్నాను..అంతా పచ్చదనం..ఒక చెట్టు నుంచి ఆకు కోసి నా కుడి చెవి లో పెట్టుకున్నా.ఆ ఆకు లోనుంచి సంగీతం నా లోపలకి ప్రవహించసాగింది.నా ముఖం మీద ఆ ఆకు ని నలుపుకున్నా...ఒకలాంటి నెమ్మదితనం నా మనసు లో...చెట్టు కొమ్మలన్నీ...నా చుట్టూ పరుచుకున్నాయి..ఒక గుడిసె లాటి ఆకారం..అక్కడున్న బురద లో పడి కళ్ళు మూసుకున్నాను.ప్రపంచం అంతా మాయమైన అనుభూతి.

శూన్యం లో తేలిపోతున్నాను.నా చుట్టూ తారలు..ఇంకా సంగీతం...సుమారు గా ఒక గంట పాటు ఆ భ్రాంతి లో తేలియాడాను.మెల్లిగా బయటకు వస్తున్నాను ఇప్పుడు.దీన్నే ట్రిప్ లోకి వెళ్ళడం గా పిలుస్తారు.నా కళ్ళు తెరిచాను.అడవి లో నిద్ర లేచిన అనుభూతి.మళ్ళి కళ్ళు మూసి తెరిచాను..ఇప్పుడు అజయ్ బెడ్ మీద ఉన్నట్లుగా అర్ధమవుతోంది.
"ఏయ్..దొబ్బరా" మూలిగాను.రాం ఇంకా అజయ్ మరో గంజాయి జాయింట్ పీలుస్తున్నారు.
" ఎలా ఉంది..అదుర్స్సా" అజయ్ అడిగాడు.
" అవును..చిత్రంగా ఉంది...అన్నట్టు ఆ పాటని అలాగే గంట సేపటినంచి ప్లే చేస్తూనే ఉన్నారా"అడిగాను.
" లేదు...పావు గంటసేపే దాన్ని ఉంచింది " రాం జవాబిచ్చాడు.

" అదేమిటి మరి...నాకు గంటసేపు విన్న అనుభూతి కలిగింది" ప్రశ్నించాను.

" అదే ఈ గంజాయి మహిమ...ఆ మత్తు లో ఉన్నప్పుడు టైం చాలా స్లో అయిపోతుంది..అదే నీకు జరిగింది" చెప్పాడు రాం.

" వావ్...భలే ఉందే...మళ్ళీ ఇంకో పట్టు పడతా "
" తప్పకుండా ..అయితే ఈసారి నువ్వు నిద్రపోకుండా మాతో మాట్లాడాలి" అన్నాడు రాం.

" ఒకె..అలాగే..." అని ఈసారి మరింత శ్రద్దగా గంజాయి దమ్ము కొట్టసాగాను.స్థాణువు అయిపొయిన స్థితి లో ఎలా మాట్లాడతానో చూడాలి.

"తగినంత పీల్చావు గా..ఇక అది రాం కి ఇవు...దీనికి కొన్ని సూత్రాలున్నాయి " న్నాడు రాం.

" ఈరోజు మొదటి రోజు గా అతనికి...కొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేయనీ " అన్నాడు రాం.

" దీని లాంటి దాని కోసమే ఇన్నాళ్ళు నేను వేచింది" రాం కి గంజాయి జాయింట్ ఇస్తూ అన్నాను.బేక్ గ్రౌండ్ లో పింక్ ఫ్లాయిడ్ పాట వినిపిస్తోంది.
"ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ద్వారా అమ్మాయిల్ని గురించి చాలా తెలుసుకున్నానంటావు"ప్రశ్నించాడు అజయ్.

"నా స్కూల్ రోజుల్లో నాకు అనేకమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు..వాళ్ళని అడిగి ఎన్నో తెలుసుకునేవాణ్ణి...కొన్ని వర్కవుట్ అయ్యేవి కొన్ని కానివి.." అదీ రాం సమాధానం.

" ఏమి చెప్పావు బ్రో...నాలాంటి బక్కోళ్ళ గతి ఏమిటి...అంటే వరుణ్ లాంటి అందగాళ్ళ కేనా అమ్మాయిలు పడేది..మాకా భాగ్యం లేదా" అజయ్ అడిగాడు.

" కొన్నిసార్లు అందం కూడా మేటర్ కాదు బ్రో...నీ వ్యక్తిత్వం ద్వారా నీలోని లోపాల్ని పూరించుకోవాలి,అదీ అసలు సంగతి "

" అయితే నేను ఓకే అంటావు"

" అది నన్నడిగితే ఎలా ..బయటికి వెళ్ళి అడుగు..." అట్లా నవ్వుకోసాగారు ఇద్దరు.ఏమైనా బాధలన్ని పక్కకి నెట్టి ఎంజాయ్ గా ఉండాలంటే ఈ గంజాయి నే సరైనది..దీనిముందు ఆల్కహాల్ ఏదైనా బలాదూరే...అందుకే కామోసు దీనికి ఎడిక్ట్ అయితే మానడం కష్టం అంటారు.వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఫన్ గా అనిపించసాగింది.ఇంతలో మొబైల్ మోగింది.

" గైస్ కొద్దిగా ..సైలెంట్ గా ఉండండి.." అన్నాను వారితో..!

" హలో..ఏమిటి సంగతులు" అవతల ఫోన్ లో యామిని.

" ఏం లేదు.ఫ్రెండ్స్ తో జస్ట్ చిల్లింగ్..అంతే" జవాబిచ్చాను.
" నేను షాపింగ్ వెళుతున్నా..వస్తావేమోనని"

" సముద్రపు లోతులో చేపల వేట కి అయితే వస్తా"

" నీకు ఎప్పుడూ అదే.."

" మరదే హర్మోన్స్ బేబీ "

" నాట్ ఫర్ టుడే"

" లెటజ్ సీ.."

" హాస్టల్ బయటనే ఉంటా ..వచ్చేయ్"

"ష్యూర్"

"బై"

"ఓ.కె గైస్..నేను వెళ్ళాలి మరి" ఫోన్ పెట్టేసి అన్నాను.

"డ్యూడ్..మర్చిపోయా..అదే..ఆమె తో నువు నెగిటివ్ ధోరణి లో పోవాలి..అది గుర్తుంది గా ..చెప్పింది" రాం అన్నాడు

"అలాగే"


అక్కడినుంచి బయటపడ్డాను.ఒకమ్మాయితో ఉత్త పుణ్యానికి గొడవ పెట్టుకోవడమా...ఇంతదాకా తనకి అలవాటు లేనిది...బాగా దగ్గరవ్వాలంటే ముందు ఇలా చేయాలని రాం యొక్క భొధ..అది సక్సెస్ అవుతుందో..లేదో..!  (సశేషం) 

నా పేరు శివ..! (నవల) Post no: 17

PART-2, CHAPTER-5,రాం చెబుతున్నాడు.

నవంబర్ 8,2012

ఇప్పుడు ఇద్దరమల్లా ముగ్గురం అయ్యాము.అజయ్ రూం లో గంజాయి దమ్ము కొట్టే అవకాశం ..రెండు కారణాల రీత్యా దానికి థాంక్స్ చెప్పాల్సిందే.ఆ రూం దగ్గరకి ఎవరూ రారు.కలగజేసుకుని చికాకు చేసే వాళ్ళు ఎవరూ లేరు.కాలేజీ లో అటెండెన్స్ కూడా ఆప్షనల్.మా మేధో శక్తులు పెంచుకోడానికి మేం గంజాయి ని వాడుతున్నాం.పెంచినా పెంచకున్నా అలా అని అనుకోవడం లో సుఖముంది.గంజాయి ముగ్గురు జీవితాల్లో ఓ భాగమై పోయింది.

ఇక వరుణ్,అజయ్ ల గూర్చి చెప్పాల్సివస్తే ...వరుణ్ కొంత సాహసోపేత నైజమే.గత రెండేళ్ళుగా అతని రూం మేట్ గా అతని గురించి నాకు బాగా తెలుసు.అతని తల్లిదండ్రుల ఆశయం మేరకు బాగా చదవడం,మంచి జాబ్ తెచ్చుకోవడం అతని పని గా తలచే వాడు గాని ఇప్పుడు తను దాని నుంచి దూరం అవుతున్నాడు.ఎందుకంటే తన నేచర్ అది కాదు.అతని లో కోపము,అసంతృప్తి మెండు ..ద్వైదీ భావాలు రూపు దాల్చిన వ్యక్తి.ఎట్టకేలకు మా సాన్నిహిత్యం లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు.
అజయ్ నాలాంటి వాడే.గ్రేడ్ లు రాకపోయినా,ఎవరేం అనుకున్నా పట్టించుకోడు.గంజాయి సేవిస్తూ,జ్ఞానాన్ని పెంచుకుంటున్న భ్రమ లో ఉండేవాళ్ళం.మాకు కేంపస్ సెలెక్షన్స్ లో జాబ్స్ వస్తాయి,ఆ తర్వాత ఎలాగు గొడ్డు చాకిరీ తప్పదు ..కనక ఈ లోపులో ఇక్కడ సాధ్యమైనంత ఆనందించాలనేది మా ధ్యాస.ఇదంతా ఇలా రాస్తూ ఉండంగానే..ఈ లోపులో అజయ్ ఒక పెద్ద గంజాయి జాయింట్ మాకోసం చుట్టాడు.వరుణ్ సిగరెట్ తాగుతూ ఒక లోకం లో ఉన్నాడు.అజయ్ లాప్ టాప్ లో ఇంఫెక్టెడ్ మష్ రూం అనే గీతం వస్తోంది.సరే..ఓ నా డైరీ నిన్ను తరవాత తీసుకుంటా అని చెప్పి పక్కన పెట్టాను.

" వరుణ్ ఏమిటి ఆలోచిస్తున్నావ్" అడిగాను డైరీ ని బ్యాగ్ లో పెడుతూ.

" యామిని తో కొంచెం ఓవర్ గా చేశాన అని అనుమానం వస్తోంది.ఇప్పటికి అయిదు సార్లు ఆమె ని ఏడ్చేలా చేశాను.గత కొన్ని నెలల్లో" చెప్పాడు వరుణ్.

" ఏమి జరిగింది చెప్పు" అడిగాను.

"లైట్ తీస్కో బ్రో...నీ రక్తం లో గంజాయి కలిస్తే నువు ఇంకా భావ యుక్తంగా తయారవుతావు.." అజయ్ అనునయించాడు వరుణ్ ని.ఆ తర్వాత దమ్ము ఇచ్చాడు.  

" నువు చెప్పింది రైటే" అన్నాడు వరుణ్

"ఆ ..ఇప్పుడు చెప్పు" అజయ్ అడిగాడు.

" నేను గంజాయి మత్తు లో ఉన్నట్టు ఈ రోజు కలిసినపుడు యామిని కనిపెట్టింది.ఈ విధంగా చేస్తే మళ్ళీ కలవనని చెప్పింది.గొడవకి ఇదే అదను గా భావించాను.పూర్తిగా అవకాశాన్ని వినియోగించుకున్నాను" చెప్పాడు వరుణ్.

" ఏమి చేశావు చెప్పు.." అసలు బండి సరైన దారి లో పోతోందా లేదా అని తెలుసుకుండానికి అడిగాను.

" నీ గురించి నా అలవాటు మానుకోలేను అని చెప్పేశా.ఆమె ని కలిస్తే వచ్చే సుఖం కంటే ఈ దమ్ము లోనే ఎక్కువ సుఖం ఉందని చెప్పేశాను.ఆమె కంటే నాకు ఫ్రెండ్సే ముఖ్యం అని కూడా చెప్పా" గంజాయి దమ్ము మళ్ళీ ఒకటి తీసి నాకు ఇస్తూ చెప్పాడు.

" చివరి మాట నిజమేనా" అజయ్ అడిగాడు.

" అఫ్కోర్స్ బ్రో...నాతో విడిపోయినా నీకు వచ్చే లోటేమీ లేదు లే అని కూడా ఆమె తో చెప్పా.మళ్ళీ నీకు ఎవరో ఒకరు దొరుకుతారు లే..అని అన్నా..ఏడవడం మొదలెట్టింది.." వరుణ్ చెప్పాడు.

" హోలీ షిట్" అన్నాను నేను.
" నేను చేసింది పొరబాటే.నాకు తెలుసు.ఆమె చాలా తలబిరుసు మనిషి.అది నాకు గిట్టదు.నన్ను ప్రేమిస్తున్నట్లు ఇప్పటికీ అంగీకరించలేదు.అలా మాటాడకుండా ఉంటే బాగుండేది" వరుణ్ తల నిమురుకుంటూ అన్నాడు.

" పోయి సారి చెప్పడం మంచిదని నా ఉద్దేశ్యం" అన్నాను.

"నేను అలా చేస్తే డైరెక్ట్ గా ఇక్కడకే వచ్చి బ్రేకప్ చెప్తుంది.ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన లవర్ గా ఉండాలనే ఆలోచన కూడా లేదు.ఏదో అలా గానీ " అన్నాడు వరుణ్.

" నీకు సలహా ఇవ్వడమే నేను చేసిన తప్పు లా ఉంది,రైట్ అడ్వైజ్  ఫర్ ఏ రాంగ్ పర్సన్.నువ్వు నీ లానే ఉండు" అన్నాన్నేను.

" రాత్రి అంతా మేలుకొని మూడు హారర్ సినిమాలు చూశాను,బయటకి పాస్ కి పోవాలన్నా భయమేసింది" అజయ్ ఇకిలిస్తూ టాపిక్ మార్చాడు.

" దెయ్యాలు నీ లాంటి మంచి వాణ్ణి ఏమీ చేయవు,అవి కనబడితే చెప్పు" వరుణ్ సలహా అది.

" ఎవరికీ దెయ్యాలు హాని చేయవు." అన్నాను

" అవి నెగిటివ్ ఎనర్జీ బ్రో..చాలా కౄరమైనవి" అజయ్ చెప్పాడు.

" ఒక చిన్న లాజిక్ చూడు...ఆత్మ అనేది వ్యవహరించేది ఈ పంచభూతాలు,ఇంద్రియాల ద్వారానే గా.. చనిపోయినతర్వాత అవి ఉండవు గా ..అప్పుడు ఎలా వ్యవహరిస్తాయి అవి..నీ గార్డెన్ లో చెట్టు లానే ఉంటుందది " నేను తెలివిగానే చెప్పాననుకున్నాను.

"  నేనొక ఇన్సిడెంట్ చెప్పాలా ..జరిగిందే అది" అజయ్ చెప్పుతున్నాడు.

"చెప్పు" ఇద్దరం ముక్త కంఠం తో అన్నాం.

" శిఖర్ అని ఒక పంజాబీ ఫ్రెండ్ ఉండేవాడు.మాకు అయిదు రూములకి పైన అతని రూం.ఫస్ట్ సెమిస్టర్ లో జరిగిందిది.అతనికి తెలిసిన కొన్ని దెయ్యపు కధలు..నిజంగా జరిగినవే కొన్ని చెప్పేవాడు.కొన్ని వింటే చాలా భయంకరంగా ఉంటాయి.మళ్ళీ రూం లో ఒంటరిగా పడుకోవడం ఒకటి.." 

" ఏం జరిగింది" వరుణ్ అడిగాడు. 

" ఒకరోజు రాత్రి..శిఖర్ రూం లో సరిగ్గా రాత్రి 11.11 కి అలారం మోగింది.ఆ అలారం తను పెట్టలేదట.అదే మోగింది.అసలు ట్విస్ట్ ఏమిటంటే అదే రాత్రి 10.50 కి డి హాస్టల్ లో పైనుంచి దూకి ఒకరు సూసైడ్ చేసుకున్నారు.అతని పేరు అభిషేక్" చెప్పాడు అజయ్.

" కో ఇన్సిడెన్స్ ..అంతకన్నా ఏమి ఉంటుందిలే" వరుణ్ అన్నాడు.

" మరట్లయితే అలారం ఎలా మోగిఉంటుంది" అజయ్ ప్రశ్న.

" పెట్టి మర్చిపోయి ఉండచ్చులే"  చెప్పాను.

" ఆ తర్వాత దెయ్యాల గురించి నేను చేసిన రిసెర్చ్ లో కొన్ని విషయాలు తెలిశాయి.. చనిపోయిన వాళ్ళు బతికి ఉన్నవాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి చూస్తారు.బాడీ లేకపోయినా..! దీని మీద అనేక మంది రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి.."       

"జనాన్ని వెర్రి వాళ్ళని చేయడానికి...ఇలాంటి పిట్టకధలు నేను నమ్మను.           
అసలు దేవుడిని కూడా నేను నమ్మను.చూస్తే వరుణ్ నమ్మేట్లు ఉన్నాడు.తీరిగ్గ మీరిద్దరూ కాఫీ తాగి మాట్లాడుకోండి.." చిరాగ్గా అన్నాను.

" నువు నమ్మలేదని నిజం అబద్దం కాబోదు బ్రో,వరుణ్ నేను చెప్పినది అవునా కాదా "అజయ్ అడిగాడు. 

" దెయ్యాలు,క్లెయర్ వాయిన్స్,ఇంకా కొద్దిగా జోతిష్యం లో కూడా నాకు నమ్మకముంది" వరుణ్ చెప్పాడు.

" ఏమైనా అనుకోండి మీరు..నన్ను భయపెట్టలేరు" అన్నాను.

" మర్చిపోయాను..యామిని ని కలవాలి నేను ..వస్తా మరి" అంటూ వరుణ్ సిద్ధమయ్యాడు.అతని కళ్ళ లో ఒక బాధ కనబడింది.

" ఈ సమయం లో వద్దు బ్రో" అజయ్ వారించాడు.

" లేదు లే..నేను వెళ్ళాలి" అంటూ వేగంగా వెళ్ళిపోయాడు.

" ఏమైంది ఇతనికి..! నువ్వు ఇచ్చిన సలహా వరుణ్ విషయం లో బెడిసికొట్టింది బ్రో  " అజయ్ అన్నాడు.

" ఇంకో రకమైన ఐడియా వెయ్యాలి ఈ సారి" అన్నాను. (సశేషం)    


నా పేరు శివ (నవల) Post no:18

జనవరి 10,2013

ప్రియమైన నా డైరీ...నా గ్రేడ్స్ ని పెంచుకోడానికి ఇదే కీలక సమయం.గ్రేడింగ్ ఘోరంగా,అయిదవ సెమిస్టర్ కి 5.2 కి దిగజారింది.ఇలా అయితే నేను కనీసం డిగ్రీ అయినా పొందగలనా...ఏదో ఒకటి చేయాలి.రేపటినుంచి మెకానికల్ ఇంజనీరింగ్ క్లాస్ లకి బోర్ అనుకోకుండా అటెండ్ కావాలి.వినాలి.రాసుకోవాలి.వారానికి రెండు మార్లు అయినా రివైజ్ చేసుకోవాలి.వరుణ్ పరిస్థితి దిగజారింది.గంజాయి దమ్ము విపరీతం గా లాగిస్తున్నాడు.మేము చుట్టడం లేటయితే తనే సరుకు ని చిదిమి రోల్స్ చుట్టడం చేస్తున్నాడు. తన మానసిక వత్తిడి ని ఈ రకంగా తగ్గించుకుంటున్నాడు.తన లైఫ్ ఈ రకంగా తిరగడం నాకే బాధ గా అనిపించసాగింది.

నా విషయం వేరు.నా బాధల్ని తగ్గించుకుండానికి కాక కేవలం కాలేజ్ రోజుల్ని ఎంజాయ్ చేయడానికే ఈ గంజాయి సేవనం చేస్తున్నాను.సరే..సెలవు.

" ఏమిటి నీ డైరీ లో ఏదో రాస్తున్నావు మిత్రమా" సిగరెట్ తాగుతూ అడిగాడు అజయ్.ఈ ఎక్స్ హాస్టల్ మొత్తానికి మా ముగ్గురుకి నెలవైంది.ఇప్పటికి పది సార్లు దాకా ఇక్కడ కూడాము.

" ఆ ఏమి లేదు బ్రో...ఏదో కెలికాను"  డైరీ మూస్తూ చెప్పాను.

" మాతోనూ పంచుకోవచ్చు గా అవి" అజయ్ అన్నాడు.వరుణ్ ఏదో గొణుగుతున్నాడు.

" నీ డైరీ తో మాట్లాడటం అంటే నీ ఫ్రెండ్ తో మాటాడుతున్నట్లు లెక్క"

" ఎట్లా"

"ఎవరి తోనూ పంచుకోలేని వాటిని దీని లో పంచుకోవచ్చు.మంచి లిజనర్ కూడా.కొత్తలో తెలియదది."

" ఒక గోడ తో మాటాడం వంటిదేగా అది"

" నువు రాసింది అంతా డైరీ లో ఉండిపోతుంది.అది గోడ మీద కుదరదు గా."

" ఎప్పటినుంచి ఈ డైరీ రాసే అలవాటు నీకు"

" నా సిక్స్త్ గ్రేడ్ నుంచి.నేను ఎందుకు పనికిరానివాడినని మా నాన్న తిడుతూండేవాడు.ఆయన కోపాన్నంత ఇంట్లో చూపించేవాడు.అందుకే నేను ఇంట్లో కాకుండా హాస్టల్ ఉండానికే ప్రిఫర్ చేసేవాడిని."

" చిల్ బ్రో"

" ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు" అడిగాడు వరుణ్.

" ఏమంటే...."

" అద్సరే..మళ్ళీ దమ్ము కొడుతూ మాట్టాడుకుందాం" వరుణ్ అన్నాడు.

" డ్యూడ్..పావు గంట క్రితమే గంజాయి దమ్ము కొట్టావు..మళ్ళీ అప్పుడేనా" అడిగాను.

" రిలాక్స్ బ్రో..కొద్దిగా రెస్ట్ తీసుకో...ఒక గంట ఆగి చుడదాము" అజయ్ అన్నాడు.

" గైస్..నా కోరిక ఏమిటో తెలుసా " వరుణ్ ప్రశ్నించాడు.

" ఏమిటి" అడిగాను.

" రోజు లో అధిక భాగం నేను గంజాయి మత్తు లో నే ఉండాలి.అసలు నేను మామూలు గా ఉన్న సమయమే నాకు పనికిరాని సమయం.జనాలు నన్ను మామూలు స్థితి లో చూసి ఆశ్చర్యపోవాలి." వరుణ్ నవ్వుతూ అన్నాడు. 
 " నువ్వు ఇలా మాటాడుతుంటే నాకు నేను తప్పు చేసిన భావన కలుగుతోంది.నువు చక్కగా చదువుకో..యామిని తో రొమాన్స్ చేసుకో ..కాని ఈ గంజాయి తాగే ఈ పాత్ర నీకు బాగ లేదు.మానెయ్ "అన్నాను.

" ఇది నా జీవితం ..ఇలా జరగాలని ఉంది.జరిగింది.నువు కాకపోతే వేరే ఎవరి ద్వారానైనా ఇలా జరిగేది" వరుణ్ జవాబు అది.

" బ్రో..అతడిని అలా ఉండనీ ...చూసుకోడానికి మనం ఉన్నాం గా" అన్నాడు అజయ్.

" ఏం చూసుకోవడం..గత సెమిస్టర్ లో అన్నీ డి లు,ఈ  లు వచ్చాయి.ఇలా అయితే అతనికి చదువు ఎలా తలకెక్కుతుంది..? " అడిగాను.

" ఒకప్పుడు నువ్వు ఏమన్నావు..గ్రేడ్ లు మాకవసరం లేదు.ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిపోతాము అన్నావా లేదా ..నేనూ అంతే ఈ దమ్ము కొట్టి వెళ్ళి ఇంటర్ వ్యూ లో కూర్చుంటా ..గ్రూప్ డిస్కషన్ లో కూర్చుంటా ..విజయం సాధిస్తా ..ఏమంటావు అజయ్" వరుణ్ రెట్టించాడు.

" నువు రైట్ బ్రో... మనకి మంచి ఫ్యూచర్ ఉంది" అజయ్ అన్నాడు.

" కొద్దిగా గేప్ ఇవ్వండి..గంజాయి దమ్ము కి ..వెంట వెంటనే ఎందుకు" అన్నాను .

" నీకేమయింది మధ్యలో" వరుణ్ కసిరాడు.

" నేను బాధ్యుడిని అవుతానేమొనని...నా గ్రేడ్ ఈ సారి బాగా తగ్గింది.కాలేజీ నుంచి పాసయి వెళతానా లేదా భయంగా ఉంది.ఇక మనం మన జీవితాన్ని మార్చుకోవాలి ...ఆ టైం వచ్చేసింది" అన్నాను.

" నువు వెళ్ళి బాగా చదువు..వద్దనట్లా...అజయ్ దగ్గర నేను హాయిగా గడుపుతా ..నన్ను అర్ధం చేసుకునేది అతనొక్కడే " వరుణ్ శాంఆఆఢాఆణాం ఆడీ.

" అతనొక గొప్ప మేధావి..అడుగు తన గ్రేడ్స్ ఏమిటో" 

" 5.5 బ్రో" అజయ్ చెప్పాడు. 

" వాదన మరీ ముదరకముందే ..వేరే టాపిక్ కి పోవడం అందరకీ మంచిది ..పోనీ వరుణ్ కి ఇంకో ప్లాన్ చెప్పు..యామిని తో ఎలా పీస్ ఫుల్ గా ఉండాలో ..." అజయ్ అన్నాడు నాతో.

" మాటాడితే యామిని జోలి ఎందుకు..ఇప్పుడు అవసరమా..? " వరుణ్ అన్నాడు.

" నువ్వు  ఆమెని లవ్ చేయడం లేదా .." అడిగాడు అజయ్ 

" మీతో ఇలా గంజాయి దమ్ము కొట్టడం ఆమె కిష్టం లేదట..అది చెప్పడానికి ఆమె ఎవరు?" అడిగాడు వరుణ్ 

" గైస్...మన జీవితాలు గాడి తప్పుతున్నాయి...మన గ్రేడ్ లు తగ్గుతున్నాయి..మిగతా మనుషుల్లాగా ఉండలేకపోతున్నాము..ఇంతటి తో ఈ అద్యాయాన్ని ముగిద్దాము" అన్నాను.

" బ్రో..ఎప్పటినుంచో అడగాలని అనుకుంటున్నా...చనిపోయిన వారి ఆత్మల తో మనం మాట్లాడవచ్చా" వరుణ్ అడిగాడు అజయ్ ని.

" నేను చెప్పేది బుర్రకి ఎక్కడం లేదా" చిరాగ్గా అన్నాను.

" నువు కూల్  గా ఉండు బ్రో..కాసేపు అలా బయటకి వెళ్ళి తిరిగి రా ..తర్వాత నీకు చుట్టి ఉంచుతాం గాని" అజయ్ నాతో అన్నాడు.

" ఈ రోజు కిదే చివరిది కావాలి.రోజు కి ఒక జాయింట్ మించి తీసుకోకూడదు.మిగతా సమయమంతా చదువుకే కేటాయించాలి..సరేనా.." అన్నాను.

" నీ సలహా బాగానే ఉంది" అన్నాడు అజయ్

" చనిపోయిన మా తాతయ్య తో మాట్లాడాలని నా కోరిక బ్రో...అదెలా .." అజయ్ ని అడిగాడు వరుణ్ .ఇప్పుడు వీడు చెప్పే అడ్డమైన చెత్త ని నేను వినాలి.

" నిజంగానే అడుగుతున్నావా" అజయ్ అడిగాడు.

" నా బాల్యం లో నాకు ఎన్నో కధలు చెప్పేవాడు...సినిమాలకి తీసుకెళ్ళేవాడు.నేను ఏది అడిగినా కాదనేవాడు కాదు.ఆయనతో వీలైతే మళ్ళీ మాట్లాడాలి.చాలా మిస్ అయ్యాను ఆయన్ని " చెప్పాడు వరుణ్. (సశేషం )  


 నా పేరు శివ (నవల) Post no: 19

" ఆత్మలు ముందు ఇష్టపడాలి..మనతో మాట్లాడడానికి..!ఆత్మలతో కాంటాక్ట్ పెట్టుకోవడం ఈజీ " చెప్పాడు  అజయ్.

" చనిపోయిన వారి ఆత్మ వేరే శరీరం లో గనక చేరితే ఎలా" ప్రశ్నించాను నేను.

" ఆ సంగతి వరుణ్ కి వదిలిపెట్టు" అదీ అజయ్ ముక్తాయింపు.

" చెప్పు బ్రో ..ఏం చేస్తే మంచిది" అడిగాడు వరుణ్

" గట్టిగా చెప్తూ ఉండు తనతో మాట్లాడాలని ఉందని..ఏమో ఒకనాటికి నీ ఆశ ఫలించవచ్చును" అజయ్ బదులిచ్చాడు.

" సరే..నేనిక వెళుతున్నా " ఇక భరించలేక బయటపడ్డాను.

జూలై 28,2013

మూడో సంవత్సరం హాలిడేస్ లో నేను ఇంటెర్న్షిప్ లో చేరాను.అది కోర్స్ లో ఓ భాగమే.ఒక రియల్ ఎస్టేట్ కంపెని లో సేల్స్ ఇంటెర్న్ గా చేరాను.సెల్లింగ్ అనేది అనుకున్నంత ఈజీ కాదు.ఎంతో ప్లానింగ్,తెలివి,కార్య శీలత అవసరం.ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న కెరీర్ ఇది.నాకు ఆశించిందే దొరికింది.వరుణ్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటెర్న్ గా చేరాడు.వర్క్ పెద్ద గా ఉండేది కాదు.కాపీ, పేస్ట్ పని.టైం బాగా లభిస్తోంది గనక గంజాయి దమ్ము బాగానే లాగిస్తున్నాడు.

ఈసారి నా గ్రేడ్స్ మెరుగవుతున్నాయి.గంజాయి ని బాగా తగ్గించాను.వరుణ్ ఇంకా అజయ్ మాత్రం రోజంతా అదే మత్తు లో ఉంటున్నారు.వాళ్ళు చదువు గురించి సీరియస్ గా తీసుకోవడం లేదు.నా స్నేహితులు బాగు పడాలనేది నా కోరిక.ఒకప్పుడు వాళ్ళ ని చెడగొట్టడం లో నా పాత్ర ఉండవచ్చు గాక.కాని ఇప్పుడు వాళ్ళు దాని లోనుంచి బయట పడాలనేదే నా కోరిక.

అశోక్ నగర్ లో వరుణ్  ఉండే చోటుకి వచ్చాను. పాత రోజుల మాదిరి గా బీర్లు తీసుకోవాలనేది మా ప్లాన్.అవన్నీ ఎంత మిస్ అయ్యాము.

" చాలా రోజులకి వచ్చావు" వరుణ్ నాకు షేక్ హేండ్ ఇచ్చాడు.

" చాలా సంతోషం ..నిన్ను చూడటం " నా బైక్ ఎక్కాడు తను.

" ఏంటి..ఇప్పుడు ఆ దమ్ము వద్దా" వరుణ్ అడిగాడు.

" అదేం వద్దు..నీకు కావలసినన్ని బీర్లు తాగు"

" నా సరుకు ఉన్నంత వరకు నో ప్రాబ్లం..సరే నీ ఇంటెర్న్ షిప్ ఎలా ఉంది"

" బాగుంది..త్వరలో కార్పోరేట్ ప్రపంచం లోకి ప్రవేశించాలనేది నా కోరిక"

" బాగుంది.నా పాత్ర లోకి నువు వచ్చావు.నీ పాత్ర లోకి నేను వచ్చాను.చూశావా కాలమహిమ"

" నీ ఫ్యూచర్ గురించి ప్లాన్స్ ఏమిటి.."

" మన కాలేజీ రోజుల మీద ఒక నవల రాయాలనేది నా కోరిక.మంచి టైటిల్ కూడా ఆలోచించా" అన్నాడు వరుణ్ .

" పేరేమిటి"

"ద బ్లాక్ బుక్ "

" అదేమిటి"

" ఏమో నాకు తెలీదు.నాకు మంచిగా అనిపించింది.జనాలు బ్రౌజింగ్ చేసినా వెంటనే కనిపిస్తుందని"

" నిజమా "

" ఇంతవరకు ఎవరూ రాయని విధంగా ఉంటుంది.ముందు నుంచి వెనకనుంచి ఎలా చదివినా ఒకేలా ఉంటుందది.వెరైటీ గా లేదూ..!

" కొత్తదనం ఏమో గాని...భ్రాంతి కలిగే మాట వాస్తవం.అసలు ఇలాంటి ఎదవ ఆలోచనలు నీకు ఎందుకు వస్తాయో "

" అంటే నీకు నేను పిచ్చోడి లా కనిపిస్తున్నానా "

" నేను అలా అనలేదు.భ్రాంతి కి పిచ్చికి తేడా ఉంది"

" ఏయ్ ఎక్కువ వాగకు..నీకు రాసే టాలెంట్ లేదని చెప్పి..నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు గదూ.." వరుణ్ గట్టిగా అరిచాడు.
" అజయ్ చెప్పింది నిజమే.ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద మేధావి లా పోజుకొడుతుంటావు.నువ్వు ఒక ఈగో సెంట్రియాక్ వి,నీది రైట్ అనిపించుకోడానికి ఏదైనా వాగుతావ్" వరుణ్ రెచ్చిపోతూ అరిచాడు.

ఇంతకు ముందు వరుణ్ ఇలా అరవడం ఎప్పుడూ చూడలేదు.అదీ చిన్న విషయానికి.అతను ఆర్గ్యూ చేసేది నిజమే అయినా బొత్తిగా లాజిక్ లేకుండా సీరియస్ కావడం ఇదే ప్రధమం.మాదక పదార్థాలు సేవించే వారికి అది కామనే..!అతను రాస్తాను అంటున్న బుక్ ఎంత అసంభవమో అతనికి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు.ఎందుకైనా మంచిది ఘర్షణ వైఖరి మంచిది కాదు అని నిశ్చయించుకున్నాను.

" సరే మంచి ది బాబూ...నువు రాయబొయే పుస్తకానికి ఆల్ ద బెస్ట్ " అన్నాను.

" థాంక్స్" 

" ఆ ఈమధ్య ఒకటి జరిగింది తెలుసా " వరుణ్ చెప్పాడు ,బార్ లో మేము ఇద్దరం కూర్చున్నాక.

" ఆసక్తి గా ఉంది..చెప్పు ఏంటది" 

" గుణ అని ఒకాయన తో స్నేహం కుదిరింది.నలభై అయిదేళ్ళు ఉంటాయి తనకి.నా గైడ్ ఇంకా వెల్ విషర్ నా ఇంటెర్న్ షిప్ కి సంబందించి" 

" అంటే మీ కంపెనీ లో పనిచేస్తాడా " 

" నో మేన్...మా యింటి దగ్గరున్న పార్క్ లో కలుస్తుంటాడు.తిరుచ్చి వచ్చాక చాలా మిస్ అయ్యాను తనని"

" మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారు" 

" నేను చెప్పా గదా నా వెల్ విషర్ అని.నా సమస్యలు అతనికి చెపితే వాటికి సొల్యూషన్స్ ఇస్తుంటాడు.ఇపుడు నేను రాయ బోయే  బుక్ ఉందే..ఆ సలహా అతను ఇచ్చినదే..! యామిని తో చక్కగా ప్రవర్తించమని కూడా సలహా ఇచ్చాడు.." చెప్పాడు వరుణ్.

ఓరి వాడి దుంప తెగ.ఆ దిక్కుమాలిన సలహా ఆ గుణ ఇచ్చినదేనా అనుకున్నాను.

" ఆ రెండో పాయింట్ బాగుంది.యామిని కి నువు నీకు ఆమె చాలా అవసరం.నీ గిటార్ మీద ఒక ప్రేమ పాట కంపోజ్ చెయ్యి,నేను రాస్తాను ..అలా ఆమెని సర్ప్రైజ్ చేద్దాం " 

" బ్రిలియంట్ ఐడియా.మనం తిరుచ్చి వెళ్ళగానే ఆ పని చేద్దాం" 

" గేరంటీనా" 

" గుణ ఉన్నాడే చాలా నిగూఢమైన మనిషి.అతని దగ్గర రెండు సీక్రెట్స్ ఉన్నాయిట.ఒకటి అతనికి సంబందించింది..రెండవది నాకు సంబందించినది.సమయం వచ్చినప్పుడు అవి చెబుతా అని అంటుంటాడు.నాకు మాత్రం చాలా ఆత్రంగా ఉంది.


" ఇంతకీ గుణ ఏం చేస్తుంటాడు" 

" అతనొక ఆధ్యాత్మిక వ్యక్తి. మనకి తెలిసిన ఆరు ఇంద్రియాలు కాదు మనిషికి పది ఇంద్రియాలు ఉన్నాయి అంటాడు.వాటన్నిటిని ఉద్దీపింప జేయడానికి పవిత్ర యాత్రలు చేస్తుంటాడు" 

" అంటే మహాత్ముడా" 

" తన వైనం అంతా అలాగే ఉంటుంది.పార్క్ లో అంత మంది ఉండగా అతను నన్నే ఎంచుకోవడం నా అదృష్టం.చాలా గొప్పవాడివి నువ్వు నేను చూసిన వారిలో..అంటూ నన్ను పొగిడాడు"

" సరే మంచిది.ఆ రెండు సీక్రెట్ లు అతను నీకు చెప్పినపుడు వాటిని నాకు కూడా చెప్పు,అన్నట్టు యామిని తో ఈమధ్య మాట్లాడావా" 

" ఏదో కొద్దిగా..ఇదివరకంత అయితే కాదు.నాకు తికమక అనిపిస్తుంది ఒక్కోసారి.ఆమెతో నాకేమి పని అనిపిస్తుంది,అంతలోనే మాట్లాడలనీ అనిపిస్తుంది..అది పోనీలే గాని...ఇంకో బీర్ చెప్పు" 

" యామిని నీకు సరిగ్గా సరిపోయే మనిషి,వదులుకోకు " 

" నేను చెప్పింది ఏమిటి..ఇంకో బీర్ చెప్పు" 


" సరే మంచిది..బాబూ ఇంకో రెండు బీర్లు పట్రా " అంటూ కేకేశాను (సశేషం)  


 నా పేరు శివ  (నవల) Post no:20

" డ్యూడ్ ...నీకు ఇంకోటి చెప్పాలి"రెండో బీర్ ని పూర్తి చేసి చెప్పాడు వరుణ్.

" చెప్పు..."

" ముందు నాకు ప్రామిస్ చెయ్..అది ఎవరకి చెప్పనని...అలా చేసినట్లయితే నీ జీవితం డేంజర్ లో పడుతుంది.అజయ్ కి,నీకు నాకు మాత్రమే తెలిసే విషయం అది "

" ఏంటిరా బాబూ అది" గట్టిగా నవ్వగా నా కళ్ళ లో నీళ్ళు వచ్చాయి.

" ఇంకోసారి గనక నవ్వితే ఏమవుతుందో చూడు" గట్టిగా తన పెడికిలి బిగిస్తూ అన్నాడు వరుణ్.వాడి వాలకం చూస్తే బెదురు గా అనిపించింది.

" సారీ.." అనునయంగా అన్నాను.

"ఎవరికైనా చెప్పావో నువు డేంజర్ లో పడతావ్ ..అర్ధమయిందా "

"అర్ధమయింది"

"అలా అన్నావ్ బావుంది. చనిపోయిన మా తాతయ్యతో నేను మాట్లాడాను మేన్.."

*    *    *
CHAPTER-6
వరుణ్ బయట కారిడార్ లో పచార్లు చేస్తున్నాడు.నేను, అజయ్ రూం లో ఉన్నాము.వరుణ్ పరిస్థితి దారుణం గా అయింది.అదే మాట్లాడుతున్నాము.ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి వచ్చాము.కాలేజీ లో జాయిన్ అయిన మొదట్లో చదువే వరుణ్ లోకం గా ఉండేది.ఇదిగో ఇప్పుడిలా..! ఏది ఏమైనా తనని మళ్ళీ దారి లో పెట్టి మంచిగా చేయాల్లి.అప్పుడు మాత్రమే నేను మిత్రుడిని అనిపించుకోగలుగుతాను.

" బ్రో..నువు ఒక సాయం చేస్తావా" అడిగాను అజయ్ ని.

" తప్పకుండా"

" వరుణ్ తో ఈరోజు తర్వాతనుంచి ఈ మాదక ద్రవ్యాలు వాడటం మానేస్తావా"

" నీకేమిటి బాధ..మేము తాగితే"

" మా బి.టెక్ వాళ్ళకి ఈ చివరి సంవత్సరం కేంపస్ ప్లేస్ మెంట్స్ ఉంటాయి.అతనికి జాబ్ రావాలా వద్దా..?అదలా పోనీ తన టాలెంట్ తగిన జీవితమైనా అతనికి దక్కాలా..లేదా"

" దానికి దీనికి లంకె ఏమిటి బ్రో"

" అతనీ మధ్య వింత గా ప్రవర్తిస్తున్నాడు.ఏ కారణం లేకుండా రేజ్ అవుతున్నాడు.మనం ఒకటి అడిగితే అతనేదో చెప్తున్నాడు.విపరీత మానసిక ధోరణులు కనిపిస్తున్నాయి తనలో..నీకు తెలిసే ఉంటుంది...చనిపోయిన వాళ్ళ తాతయ్య తో మాట్లాడట....నిజమేనా "

" ఆ ట్రిప్ లో ఉన్నప్పుడు అలా కొన్ని అనిపిస్తుంటాయి.ఏమో నిజంగా నే అతనికి ఆ గిఫ్ట్ గాని ఉందేమో..ఎవరకి తెలుసు..?"

" నువు తనలోని మార్పు ని గమనించలేదా"

" నాకైతే పాజిటివ్ గానే తోచింది.అతని జీవితాన్ని అతను పూర్తిగా జీవిస్తున్నాడు.జాబ్ రావడం ఏముంది...టాలెంట్ ఉన్నప్పుడు  అదే వస్తుంది.."

" అంటే..అతడిని పూర్తి గా నాశనం చేయదలుచుకున్నావా.." ఆవేశం గా అన్నాను.ఇతను సహకరించే పద్దతి కనిపించడం లేదు.

" జాయింట్ రెడీ అయిందా.." అరుణ్ లోపలికి వస్తూ అడిగాడు.

" పొడి గా చేశాను బ్రో..నువు సిగరెట్ లో చుడతావా" అలాడుగుతూ దాన్ని వరుణ్ కి ఇచ్చాడు.

" ఆనందం గా..చుడతాను "

" అవును ..చివరి సారిగా మీ తాతయ్య తో ఎప్పుడు మాట్లాడావు..." అడిగాడు అజయ్ వరుణ్ ని.ఓరి దేవుడా..వీడు ఇంకా లోతుకి ముంచుతున్నాడు వాడిని.

" గత రాత్రి బ్రో...అప్పుడప్పుడూ మాటాడుతూనే ఉంటాడు.ఆత్మలు రాత్రి పూటే యాక్టివ్ గా ఉంటాయి.అయితే ఒకటి..అవి పగలు కూడా అందుబాటులో నే ఉంటాయి." వరుణ్ జాయింట్ చుట్టడం పూర్తి చేశాడు.
" ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారేం" అజయ్ ఆతృత గా అడిగాడు.

" ఆ దయ్యాల లోకం చాలా సరదా గా ఉంటుందిట.ఎక్కడకంటే అక్కడకి ఎగురేసుకుంటూ పోవచ్చట.నాతో ఇక్కడ గడప లేకపోతున్నందుకు బాధ గానే ఉందన్నాడు.సందేహం తీరిందా" అలా చెప్పి వరుణ్ తన మత్తు సిగరెట్ వెలిగించుకున్నాడు.

" నాకు ఎలా క్లారిటీ వచ్చింది ..అదంతా ఆయనతో చెప్పాను.మన ముగ్గురి గురుంచి చెప్పాను.అంతలోనే మాయమయ్యాడు.మళ్ళీ మాటాడినపుడు ఆ సంగతులు చెపుతాలే" వరుణ్ స్టఫ్ ని అజయ్ కిచాడు.

" ఓ..అయితే మన ఫ్రెండ్షిప్ కాలేజ్ తర్వాత కూడా కొనసాగుతుందన్నమాట" అజయ్ అడిగాడు

" మన దగ్గరున్న సరుకు అయిపో వచ్చింది గా, తెచ్చుకుండానికి పోదామా" వరుణ్ అనాడు దాన్ని పట్టించుకోకుండానే.

" మీరు ఎటన్నా పొండి..నన్ను కలపకండి." ఇక నేను ఈ సరుకు కి మెల్లిగా దూరమయి అల్కాహాల్ కి వెళ్ళిపోదామని అనుకున్నాను.

" నో ప్రోబ్లం..నేను,వరుణ్ వెళతాం, మన ముగ్గురి ఫ్యూచర్ డిసైడ్ అవబోయే ఈ వేళ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి." అజయ్ అన్నాడు.తొందరపడి నోరు జారితే మళ్ళీ ఏం తెగులో అని మాటాడకుండా ఉండిపోయాను.(సశేషం) 



 నా పేరు శివ..! ( (నవల) Post no:21

" చూడబోతే రాం కి ఇదంతా నచ్చుతున్నట్లు లేదు" వరుణ్ అన్నాడు.

"నాకు సంతోషమే డ్యూడ్" అన్నాను.

" హ్మ్..సంతోషం..అంతకన్నా గొప్ప పదమే దొరకలేదా"

" ఇంకా చెప్పాలంటే మహదానందంగా..మబ్బుల్లో తేలుతున్నట్లుగా ఉంది" అన్నాను.

" గంజాయి సంపాయించడం కష్టం గా మారింది బ్రో...ఒక షాకింగ్ న్యూస్ విన్నాను గత రాత్రి"  అజయ్ చెప్పాడు వరుణ్ తో.

" విన్నదేమిటో చెప్పు ముందు...అది షాకింగ్ న్యూసో కాదో నేను తర్వాత చెపుతా" అలా అని నేను అండం తో వరుణ్ నాకేసి ఇష్టం లేనట్లుగా చూపు చూశాడు.

"సూర్య అని చెప్పి లోకల్ రౌడి ఒకడున్నాడు.రాత్రి పూట మన స్టూడెంట్స్ గంజాయి కోసం వెళ్ళే స్పాట్ లో నక్కి ,మన వాళ్ళ పర్స్ లు,మొబైల్స్ అన్నిటిని దొంగిలించాడు.అంతేకాదు మొబైల్స్ లో ఉన్న అమ్మాయిల ఫోటొస్ ని పోర్న్ సైట్ లకి అమ్ముకున్నాడు.మన బోటి వాళ్ళందరి మధ్య ఇదే పెద్ద టాపిక్ అయిపోయింది" చెప్పాడు అజయ్.

" ఓర్నీ.." అన్నాడు వరుణ్.

" ఎస్ బ్రో...మనం కూడా గంజాయి తెచ్చుకోడానికి రాత్రి పూట పోకుండా ఉండడం మంచిది.దానికంటే ఇప్పుడు..పగలు పోదాం పదా"అజయ్ చెప్పాడు.

"అమ్మాయిల ఫోటోల్ని అంత నీచంగా వాడాడు ..అంటే తప్పకుండా వాడికి తగిన శిక్ష పడాల్సిందే" వరుణ్ ఆవేశం గా అన్నాడు.

"వాడు దుర్మార్గుడు..అలాంటి వాళ్ళకి త్వరగా కాలం రాదు" అజయ్ అభిప్రాయం అది.

" తగిన సమయం వచ్చినపుడు అదే జరుగుతుంది." వరుణ్ ఎగబీలుస్తూ అన్నాడు.ఈ విషయాల్లో నాకు ఆసక్తి ఏమాత్రం లేదు.ఇలాంటి వారి తో కంటే కాస్త మామూలు లోకం లో ఉన్న వారిని కలిస్తే బెటర్ అనిపించింది.

" సూర్య గాడు..మనం మామూలు గా వెళ్ళే ఆ స్పాట్ లో కలుస్తాడా " వరుణ్ ప్రశ్నించాడు.

" నేను విన్నదాని ప్రకారం అయితే  ఆ ప్రదేశం లోనే దాక్కుని ఉంటాడు... అమాయిక విధ్యార్థుల్ని దోచుకోడానికి" అజయ్ చెప్పాడు.

" ఓకె..పాయింట్ నోట్ చేసుకున్నా..థాంక్స్" వరుణ్ చెప్పాడు.

" సరే..రాం మేము గంజాయి తెచ్చుకోడానికి బయటకి పోతున్నాము.ఇక్కడ ఉంటావా ,మాతో వస్తున్నావా" అజయ్ అడిగాడు.

" లేదులే ..నేను రూం కి పోతున్నా" అన్నాను.

" సరే..పద వరుణ్ మనం పోదాం" అలా అని వాళ్ళు బయట పడ్డారు.

నేను నా రూం కి చేరుకున్నాను.దీనికి విరుగుడు ఏమిటి ..వరుణ్ ని ఎలా ఈ అలవాటు నుంచి మానిపించాలి..అజయ్ తన జాగ్రత్త తాను తీసుకుంటాడు.వీళ్ళిద్దరూ కలవకుండా ప్లాన్ చేయాలి.ఎలా..ఒక గొప్ప ఆలోచన తట్టింది.ఒరే రాం ..నువ్వు సూపర్ రా అనుకున్నా.

ఫోన్ లో యామిని నెంబర్ కోసం సెర్చ్ చేయసాగాను.వరుణ్ లేనప్పుడు అతని గూర్చి వాకబు చేయడానికి ఆమె ఓ సారి నాకు కాల్ చేసింది.అప్పుడు ఆ నెంబర్ ని సేవ్ చేశాను.అది మంచిదయింది.డయల్ చేశాను.

" రాం.." అంది యామిని అవతల నుంచి.

" ఎలా ఉన్నావు" అడిగాను.

" నీకు తెలియదా"

" తెలుసు"

" ఏం చేయాలని ఇప్పుడు..నాకు బాధ గా ఉంది"

" నా దగ్గర ఒక ఐడియా ఉంది.ఒక అరగంట నీతో మాటాడాలి"

" నీతో మాటాడాలని లేదు.నీవల్లనే గా వరుణ్ ఆ గంజాయి కి మరిగింది.

 " ఒప్పుకుంటున్నా. దానికి నాకూ బాధ గా నే ఉంది.వరుణ్ ఇంత ఇదిగా బానిస అవుతాడని అనుకోలా"

" చేయాల్సింది చేసి ..అపాలజీ కోరేవాళ్ళంటే నాకు గిట్టదు"

" హేయ్..దానికోసం కాదు..నిన్ను పిలుస్తుంటా...వరుణ్ ని ఆ దారి నుంచి మళ్ళించడానికి నేనొక పని చేస్తున్నా..దానికి కొద్దిగా నీ సహాయం కావాలి"   
" అసలేమిటి నీ ఐడియా" 

"ఒకసారి కలిసి మాట్లాడితే వివరంగా ఉంటుంది గా"

"నాకు ప్రామిస్ చెయ్..ఇకమీదట తను డ్రగ్స్ ముట్టడని" 

"అలాగే..చేస్తున్నా..!ఓ సారి కేంపస్ కేంటిన్ దగ్గర కి రారాదు" 

" ఒకే..నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నది..అదే గుర్తు పట్టడానికి" 

" బ్లాక్ టీ షర్ట్ ఇంకా జీన్స్" 

" ఒకే..బై..వస్తున్నా.." 

నేను పది నిమిషాల్లో యామిని ని కలవడానికి కేంటిన్ వైపు పరిగెట్టాను.కాఫీ చెప్పి,రాగానే  తాగుతూ ఉన్నా. 

" రాం నువ్వేనా" 

అడిగింది ఆమె.మొహం లో కంగారు ఉంది. 

" హాయ్.. యామిని..నేనే రాం ని" అన్నాను చేయి చాపుతూ.

"వాటికి ఇది టైం కాదు.ముందు చెప్పు నీ మనసు లో ఏముందో" నా ముందు కూర్చుంటూ అన్నది.

"దానికి ముందు ఒకటి చెప్పు...వరుణ్ కి నీకు మధ్య ఏం జరిగింది అసలు" 

" నేను అవన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నా..ఎందుకు తవ్వుతావు.అవన్నీ బాధ తో కూడినవే"  

" అసలు సిట్యుయేషన్ అంచనా వేయడానికి...నా కోసం కాదు..అందరి మంచి కోసమే అడిగేది" 

" నీకు దానిలో భాగస్వామ్యం లేదు.. వర్రీ ఎందుకు నీకు" 

" వరుణ్ మళ్ళీ పాత మనిషి కావాలి.మంచి గా చదువుకోవాలి,నీతో మంచి గా ఉండాలి.అదే నా కోరిక..నీవు నమ్మకపోవచ్చు..నువ్వు ఎంత క్షేమం కోరుకుంటున్నావో వరుణ్ విషయం లో నేనూ అంతే.." 

" ఏదైనా కానీ" 

" నేనిప్పుడు ఇక్కడ ఉన్నాను,కావాలంటే అతనితో డ్రగ్స్ సేవిస్తూ అక్కడే ఉండేవాడినిగా ...నన్ను అసహ్యించుకుంటావు..తెలుసు నాకు...కాని జరిగింది చెప్పు ప్లీజ్" 

" సరే..నిన్ను నమ్ముతున్నా.మేము గోవా వెళ్ళివచ్చాక ఏం జరిగిందో చెబుతాను" 

" కానివ్వు" 

" ఏమో తెలీదు.నాలో ప్రతి దానికి తప్పులు వెదకడం మొదలెట్టాడు.నేను షాపింగ్ కి తీసుకెళితే ..తనకి ఏది కొనలేదని నేను సెల్ఫిష్ అని అనేవాడు.పోనీ కొనుక్కోమంటే అడిగిన తర్వాతనా అని అనేవాడు.అలా ఒకదాని మీద ఒకటి జరిగాయి." ఆమె విషాదం గా చెప్పింది యామిని.

" ఐయాం సారీ" 

" తాను డ్రగ్స్ తాగిన అనుభూతులు అన్నీ చెప్పి నన్ను సైతం ట్రై చేయమని అడిగాడు.నేను నిరాకరిస్తే మరీ పిల్లకాయ లా వ్యవహరిస్తున్నానని అనేవాడు.." 

" నువ్వు నన్ను క్షమించాలి.మీ బంధం గట్టిపడటానికి నన్ను కొన్ని టిప్స్ అడిగాడు తను.చిన్న చిన్న విషయాల్లో కోపపడినట్లు నటించమని నేనే చెప్పాను " నా తప్పు నేను ఒప్పుకున్నాను.

" అయితే అసలు ముసుగులోని దయ్యానివి నీవేనన్నమాట,ఎందుకలా చెప్పావ్ "

"  నువ్వు ప్రేమించినట్లుగా చెప్పలేదని ..నీ మనసు గెలుచుకోవాలని అతని ఇది" 

" దానికి దారి ఇదేనా..? మా గురించి ఏమి తెలుసునని ఆ సలహా ఇచ్చావు తనకి...ప్రేమ అనే పదం వాడనంత మాత్రాన నాలో ఏముందో నీకేమి తెలుసు..కమిట్ కావడానికి భయపడింది నిజం..దాని అర్ధం నేను తన పట్ల కేర్ తీసుకోలేదని కాదు"  (సశేషం)


 నా పేరు శివ (నవల) Post no: 22

" నేను చేసింది పొరబాటే,క్షమించు"

"సరే..మంచి ఉద్దేశ్యం తోనే నాతో పోట్లాడమని తనతో చెప్పావే అనుకో..వరుణ్ కి ఆ మత్తు ఎందుకు నేర్పినట్లు..చదువు లో నీ కంటే ముందు ఉన్నందు కా "

"అతనికి ఉన్న నిజమైన మిత్రుణ్ణి నేను..అలా అంటే నువ్వు నమ్మకపోవచ్చు,ఏదో ఆనందిస్తాడని దాన్ని పరిచయం చేశా అంతే "

"నేను లేనట్లుగా నే తను బిహేవ్ చేస్తున్నాడు.పది సార్లు కాల్ చేస్తే అప్పుడు ఎత్తుతున్నాడు ..అదీ నా మీద అరవడానికే...అతనిప్పుడు ఎలా ఉన్నాడో..అసలతని ఫ్యూచర్ ఏమవుతుందో ఊహకందని విషయం"

"నాదగ్గర ఓ ప్లాన్ ఉంది..తను బాగుపడటానికి"

"చెప్పు"

" అజయ్..తో కలిసి ఏమాత్రం తెరిపి లేకుండా రోజంతా మత్తు లోనే ఉంటున్నాడు.చాలా వింత గా ప్రవర్తిస్తున్నాడు.ఏదో పరలోక విషయాల గురించి,దెయ్యాల గురించి,రాయబొయే పుస్తకం గురించి ఏవో మాటాడుతున్నాడు.నేను అనుకోవడం అది గంజాయి ప్రభావం.ఒక వారం రోజులు ఆ మత్తుకి దూరం ఉంచితే తను మళ్ళీ బాగుపడతాడు.అది నీ చేతుల్లోనే ఉంది"

" దానికి నేనేం చేయాలి"

" అతని తో కలిసి ఏదైనా దూరం ట్రిప్ వెళ్ళు.అలా అజయ్ కి దూరం అయితే ..క్రమేణా అతని లో మార్పు వస్తుంది."

" నా కాల్ నే ఎత్తడం లేదు..అలాంటిది ట్రిప్ వెళ్ళడమా...?"

" ఏదో విధంగా నేను వర్కవుట్ అయ్యేలా చేస్తా...నీ ప్రయత్నం లో నువ్వు ఉండు.అయితే ఒకటి గుర్తుంచుకో..నోటికి తోచిన ఏదో మాటలు మాటాడుతుంటాడు.నువ్వు విభేదించకు.ఓ వారం రోజుల్లో బాగుపడతాడు.గేరంటీ."

" నువు చెప్పినది జరుగుతుందా"

" నూరు శాతం"

" ఇప్పుడు రిలీఫ్ గా ఉంది.మాకు హెల్ప్ చేస్తున్నందుకు థాంక్స్"

" నీ సహకారానికి సంతోషం.మరి ట్రిప్ ఓకే గా"

" తప్పక సాకారమవుతుంది"

ఆగస్ట్ 18,2013

ఒక వారం పాటు అజయ్ రూం కి వెళ్ళడం బంద్ చేశాను.నాకు ఉన్న ఇతర ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతున్నాను.వాళ్ళు చదువు పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు.ఈ లైఫ్ బాగుంది.గంజాయి ని ముట్టదలచలేదు.ఎప్పుడైన ఆల్కాహాల్ ..అంతే.మానాన్న కి కూడా సంతోషం కలిగే సంగతే ఇది.ప్రకృతి నాకు సహకరిస్తోది.

ఇప్పుడు వరుణ్ ఎక్కువగా అజయ్ తోనే గడుపుతున్నాడు.అతని రూం లోకి తన సామాన్లు షిఫ్ట్ చేసుకున్నాడు.అతను నాతో ఒక విషయం షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.బహుశా అది ఆ బుక్ గురించి కాదనుకుంటా.సరే ..అతను చెప్పేది విని అతడిని ఒక దరికి చేర్చాలనేది నా కోరిక.నా భయం అంతా అజయ్ తోనే..అతను వరుణ్ కి తప్పు గైడెన్స్ ఇస్తున్నాడు.యామిని తో అతను ట్రిప్ చేసేలా నా ప్రయత్నం నేను చేయాలి.అతను బాగుపడాలి.ఓ డైరీ ..అలా జరిగినపుడు..మొట్ట మొదట తెలుసుకునేది నువ్వే గా.సరే అంతదాకా సెలవు.

అజయ్ హాస్టల్ వైపు వెడుతున్నా.చాతి లో అలజడి గా ఉంది.ఇంకా ఏమేం వింత మాటలు వినాలో ఆ రూం లో.వరుణ్ కోసం కొంత త్యాగం చేద్దాం..!

" హాయ్ గైస్" అని పలకరించాను తలుపు తీయగానే.

"హాయ్ రాం..ఇన్నాళ్ళు పజిల్ లా మిస్ అయిన వ్యక్తి " అంటూ వరుణ్ పలకరించాడు.
" చూడబోతే రాం కి మనతో తిరగడం ఇష్టం లేదల్లే ఉంది.కొత్త ఫ్రెండ్స్ దొరికినట్లున్నారు" అజయ్ అన్నాడు,ఒక చేతిలో జాయింట్ పట్టుకుని.

"అదేం లేదు బ్రో.మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా." కూర్చుంటూ చెప్పాను.ఈ పిచ్చనాయళ్ళతో కొద్దిగా జాగ్రత్త గా ఉండటం ఎందుకైనా  మంచిదని.

" నీ నోరు చెప్పేది ఒకటి..మొహం చెప్పేది మరొకటి.మాతో ఉండే కంటే ఆ రూం లో ఉండి చదువుకోవడమే మంచిదని అనుకుంటున్నావు..కాదా?"

" బ్రో.." ఏదో అనబోయి ఆగిపోయాను.

" మేము కానివాళ్ళలాగా కనబడుతుంటే..మొక్కుబడిగా రావడం ఎందుకు...ఇక్కడకి రాకు.మంచి బాలుడిలా గా చదువు మీద దృష్టి పెట్టుకో.." నిష్టురంగా అన్నాడు అజయ్.ఏమీ జవాబివ్వకుండా ఉండిపోయాను.ఈ మాత్రం సంబంధాన్ని చెడగొట్టుకోకూడదని.

"ఏయ్ సరదాకి బ్రో...మాతో ఉండటం నీకు ఇష్టమనే సంగతి నాకు తెలియదా ఏంటి " మళ్ళీ తనే అన్నాడు.

" పాపం రాం మీద ఏంటి నీ జోకులు...అతను మళ్ళీ మనలో కలవబోతున్నాడు.. అవునా కాదా..బలే బ్రో...ఎందుకలా అతణ్ణి బాధిస్తావు వరుణ్ నవ్వుతూ అన్నాడు.

" నా లోపల గంజాయి ఉంది గా బ్రో"  అలా అంటూ దమ్ము నాకివ్వబోయాడు అజయ్.

" సరే..వస్తా నాకు పని ఉంది" అజయ్ చేతిని తోసేసి అన్నాను,

" తాగు బ్రో..నీకొక ముఖ్య మైన సంగతి చెప్తా." వరుణ్ చెప్పాడు.

" నన్ను వామప్ చేశావ్ బ్రో" అన్నాను.

" గంజాయి కొద్దిగా పీల్చుతాడులే తర్వాత.కొద్దిగా సేద తీరనీ.షార్ట్ బ్రేక్ తీసుకోనీ " అన్నాడు అజయ్.

" నువ్వు వినలేదా..నేను మానేద్దామని అనుకుంటున్నా.చెవులు పని చేయడం లేదా" నేను సహనం కోల్పోయాను.మొదటిసారిగా అజయ్ మీద చికాకు లేచింది.

" కూల్..కూల్.మనం మనుషులం కాదు.కాబట్టి మనుషుల్లా బిహేవ్ చేయకూడదు ..అర్ధమయిందా" అన్నాడు వరుణ్.అసలు ఏం మాటాడుతున్నాడు..వీడికి గాని మైండ్ దొబ్బిందా అనిపించింది.

" మన మధ్యన ఉన్న అపార్ధాలు మనమే తొలగించుకోవాలి,ఏకం కావాలి మళ్ళీ" తనే అన్నాడు.

" తప్పకుండా బ్రో..ఏమంటావు రాం..అంతేగదా " అడిగాడు అజయ్. (సశేషం) 


 నా పేరు శివ (నవల) Post no:23

"ఓ.కె రాం...ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రద్ధ గా విను.చాలా గొప్ప విషయం ఇది" వరుణ్ గంజాయి పొగ వదులుతూ చెప్పాడు.

" తప్పకుండా.."

" అజయ్...నువ్వేమైనా .." వరుణ్ అడిగాడు

" ఓ.కె.,కాని ఎక్కడనుంచి మొదలెట్టాలి" అజయ్ అడిగాడు

" మొదటనుంచి చెప్పు" వరుణ్ సమాధానం.

"వరుణ్ యొక్క కొత్త మిత్రుడు ...అదే గుణ అని ...ఒక బాబా లాంటి మనిషి అనుకో ..గుర్తుందా

గతం లో చెప్పినట్టున్నా" అజయ్ అడిగాడు నన్ను.

" తెలుసు..ఏమిటి అతని విశేషాలు"

" నేను చెప్పేది నువ్వు నమ్మడం కష్టమే...వరుణ్ చెప్పినపుడు మొదట్లో నాకు మాటరాలేదు.నేను చెప్పేది విని జాగ్రత్త గా జీర్ణించుకో.." అజయ్ అన్నాడు.

" సరే చెప్పు" అన్నాను.

" కొన్ని తేడాలు వదిలిపెడితే..వరుణ్ ఇంకా గుణ ఒక్కరే. గుణ వరుణ్ యొక్క గత జన్మ ని జీవిస్తున్నాడు.అలాగే వరుణ్ గుణ యొక్క రాబోయే జన్మ ని జీవిస్తున్నాడు.ఐనిస్టీన్ గాని ఇది వింటే ఒకసారి కాదు రెండు మూడుసార్లు మరణిస్తాడు." అజయ్ ఇలాంటి పైత్యపు మాటలు చెపుతాడని ఊహించా గాని మరీ ఈ రేంజ్ లో కి వెళ్ళిపోతాడని ఊహించలేదు.

" నమ్మేట్టుగా లేదుగదా "వరుణ్ అడిగాడు.

" అలాగే ఉంది" యామిని గురించి చెప్పడానికి అదును కోసం చూస్తున్నాను.దానికోసమే ఈ చెత్తంతా భరించుతున్నది.

"ఇప్పుడు అసలైన పార్ట్ ఉంది" అజయ్ ఊరించాడు.

" ఏంటది" అడిగాను.

" అది వింటే అదిరిపోతావ్.
" ఇది వింటే మతి పోతుంది" చెప్పాడు అజయ్. నాకు ఆల్రెడీ మతి పోయింది.అది వాడికి తెలీదు.

" ఆ సోది మొత్తం తొందర గా చెప్పవయ్యా" నాకు చికాకు లేచి అన్నాను.

" గుణ ఎవరో కాదు.శివుని అవతారం.అలా అంటే నమ్మగలవా.." అజయ్ గొప్ప గా చెప్పాడు.

" నమ్ముతున్నా" వస్తున్న నవ్వు ని ఆపుకున్నాను.

" గుణ వల్లనే వరుణ్ ఇలా ఉన్నాడు " అజయ్ ఉవాచ.

" ఆ లెక్కన వరుణ్ కూడా శివ యేనా ?" అడిగాను

" బింగో" వరుణ్ సమాధానం

" ఇప్పుడు వరుణ్ వాళ్ళ తాతాయ్య గురుంచి చెప్పుకుందామా...మనం  ముగ్గురం త్రిమూర్తులు లాగా అని చెప్పేవాడాయాన.నువు విష్ణు,నేను బ్రహమ ,మనం గొప్ప పనులు చెయ్యాలి,ఈ ప్రపంచాన్ని ఏలాలి "  అజయ్ అన్నాడు.

" మనం త్రిమూర్తులం" గొప్పగా చెప్పాడు వరుణ్

" వావ్" అన్నాను.నేనే గనక అజయ్ స్థానం లో ఉంటే వరుణ్ ని  బాగుచేయడానికి ప్రయత్నించేవాణ్ణి.కొద్దిగా మతి ఉండే మాటలు చెప్పేవాణ్ణి.

" ఆ విష్ణు..ఇప్పుడు ఎలా ఉంది...నీకు నీవే స్పెషల్ గా అనిపించడం లే...బాధ్యత గా అనిపించడం లే" వరుణ్ నన్ను అడిగాడు.

" అవును డ్యూడ్"

" నన్ను డ్యూడ్ అనకు...శివ అని పిలువు ..నేను శివ ని" వరుణ్ ఇకిలిస్తూ చెప్పాడు.
" నువు శివ అయితే మరి పార్వతి ఎవరు..." అడిగాను వరుణ్ ని. 
" నేను అనుకోవడం ..యామిని" కాసేపు యోచించి చెప్పాడు వరుణ్.

"మరి నీ అర్ధాంగి తో కొంత సమయం గడిపేది లేదా...ఈ దైవిక విషయం ఆమె కి చెప్పవా మరి" అడిగాను.

" ఆ పని చేయాలి" 

" మీరిద్దరూ ఒక లాంగ్ ట్రిప్ వేయండి.అప్పటి గోవా ట్రిప్ లాగే.ఏమంటావు" 

" మా బాగా చెప్పావు.నా పార్వతి ని కలిసి ఆ ఏర్పాట్లు చేయాలి.థాక్స్ విష్ణు" అన్నాడు వరుణ్.

" గ్రేట్ శివ" షేక్ హేండ్ ఇచ్చి చెప్పాను.

" దానికి ముందు ఒకటి చేయాలి నేను" 

" ఏవిటది" అజయ్ అడిగాడు.

" సమయం వచ్చినపుడు నీకు తెలుస్తుంది.చాల ప్రాధాన్యత గల అంశం అది" 

" కూల్ బ్రో" అజయ్ ఓదార్చాడు.

" సరే..దైవాంశ సంభూతులారా ..మరి వస్తా" అలా చెప్పి వరుణ్ బయటికి వెళ్ళిపోయాడు.

" కాని ఆ సత్యం ఆనందకరమైన అంశం గదా" అజయ్ నాతో అన్నాడు,వరుణ్ వెళ్ళిన తరువాత.

"ఔనవును..ఇప్పుడు మాటాడుకుందామా" అడిగాను.

" స్యూర్ ..అలాగే" 

" అయ్యా..లార్డ్ బ్రహ్మ ..అసలు నీ ఎజెండా ఏమిటి" 

" అంటే అది గుణ వరుణ్ కిచ్చే ఆదేశాల మీద ఆధారపడి ఉంది" 

" లోకాన్నంతటిని ఏలాలనా నీ ఇది" 

" ఎవరు కోరుకోరు దాన్ని" 

" నేను ఒకటి చెప్పనా బ్రహ్మ.."  

" దాందేముంది" 

" ఆ వరుణ్ తలకాయ మొత్తాన్ని పాడుచేస్తున్నావు నువ్వు...ఒకటి గంజాయి,రెండు నువ్వు ...మీరిద్దరూ అతణ్ణి నాశనం చేశారు..అర్ధమవుతోందా" 

" బ్రో..అతను బాగానే ఉన్నాడు.నువు మరీ ఎక్కువ చేయకు" 

" ఏయ్ నేను చెప్పేది బాగా విను..ఇకమీదట నువ్వు వరుణ్ కి గంజాయి ని తాగాటానికి ఇచ్చావో..నీ బుర్ర రామ కీర్తన పాడిస్తా.ప్రపంచాన్ని పాలించడం కాదు...అసలు నువు ఈ లోకం లో లేకుండా పోతావు.నేను చెప్పిన ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేశావో నీ జీవితాన్ని కౄరంగా నలుపుతా ..అది గుర్తు పెట్టుకో, అర్ధమయిందా బ్రహ్మ " అజయ్ కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇచ్చాను.

" బ్రో..నన్ను బెదిరిస్తున్నావు" 

" ఈ విషయాన్ని గాని వరుణ్ కి చెప్పావో పదింతలు ఎక్కువ పనిష్మెంట్ ఇస్తా .." 

" ఫైన్..అతనితో తాగనులే" 

" అది బాగుంది.అతనితో ఆడుకోకు..ఓ.కె?" 

" సరే" 

" సరే..పో" అజయ్ ని విడిచిపెట్టాను.

మొత్తానికి వరుణ్ ని కాపాడగలిగాను.ఈ మేరకైనా.రూం కి వెళ్ళి మంచి సంగీతం వినాలి.నేను చేసిన తప్పును సరిదిద్దుకున్నాను.చాలు అనుకున్నాను.

యామిని తో ఈ ట్రిప్ తర్వాత వరుణ్ బాగుపడవచ్చును.ఏమో ..ఏం జరుగుతుందో..! (సశేషం)  


నా పేరు శివ (నవల)Post no:24

పార్ట్-3, యామిని వైపు నుంచి

చాప్టర్ 7

ఆగస్ట్ 19,2013

మళ్ళీ మేము ఇద్దరం గోవా కి వచ్చాము.మధుర క్షణాలు ప్రోది చేసుకోవడానికి.ఇది నేను వరుణ్ కోసం బాకీ ఉన్నదే.వరుణ్ తో ఇక నా రోజులు ముగిసినట్లే అనుకున్నాను.భగ్న హృదయిని గా మిగలాలని ఉన్నదేమో అనుకున్నాను.వరుణ్ తో నా జీవితం ఎలా ఉండాలి అనేది ఈ సారి అనుభవం తో తేలిపోతుంది.ఇంకా ఎక్కువ పొరబాట్లని భరించే ఇది నాకు లేదు.తిరుచ్చి నుంచి గోవా వచ్చే ఫ్లైట్ లో అతను చాలా ఉద్వేగంగా ఫీలయినట్లు అనిపించింది.తాను శివుని అవతారంగా చెప్పుకుంటూ నన్ను పార్వతి గా పిలుస్తున్నాడు.

నేను దానికి అడ్డు చెప్పడం లేదు.ఆ సలహా రాం ఇచ్చినదే.వరుణ్ గంజాయి కి దూరం అయితే తను పాత వ్యక్తి అయినట్లే.ఒక లక్ష్యంతో,ప్రేమ తో చదువు పట్ల అనురక్తి తో తిరిగి పాత వ్యక్తి కావడానికి నా పాత్ర నేను పోషిస్తున్నాను.మేము హసియేండా అనే హోటల్ లో దిగాము.ఈ సారి పబ్ లకి కాకుండా బీచ్ లకి తిరగాలని చెప్పాను.ఆ విధంగా ప్లాన్ చేశాము.

" ఏ బీచ్ తిరగాలని నీ కోరిక" వరుణ్ నన్ను అడిగాడు,ఒక సిగరెట్ ఇస్తూ.

" కలంగూట్ అయితే ఎలా ఉంటుంది..?"

" తప్పక అక్కడకే పోదాము"

" లెట్స్ గో బేబీ " అన్నాను అతని బుగ్గని ముద్దిడుతూ.

ఆ బీచ్ కేసి సాగిపోతున్నాము.నేను చేతులు పైకెత్తి ఆనందిస్తున్నాను.సరైన సమయం లో,సరైన చోట సరైన వ్యక్తి తో ఉన్నాను.వరుణ్ కూడా అలా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా.అయితే అతను తన లోకం లో నే విహరిస్తున్నట్లు అనిపించింది.తనలో తనే ఏదో గొణుగుకుంటున్నాడు.అది అర్ధం కావట్లేదు.బీచ్ కి పది నిమిషాల్లో వచ్చాము.

" నువు నన్ను నమ్ముతున్నావా" ఉనట్టుండు నన్ను అడిగాడు.బండి పార్క్ చేస్తూ.

" ఏమిటది"

" నేను అడిగింది..నువ్వు నమ్ముతున్నావా" నా చేతిని పట్టుకుని ,సముద్రం వేపు నడుస్తూ అడిగాడు.

" అంటే నీలో నాకు నమ్మకముందా..లేదా అనా" అడిగాను.

వరుణ్ ఉన్నట్టుండి నవ్వసాగాడు.నాకు చికాకు గా అనిపించింది.

" పార్వతి..నువ్వు దైవ స్వభావి లా కనిపించడం లేదు.ఒక సాధారణ మనిషి లా నే బిహేవ్ చేస్తున్నావ్.నేను గాడ్ ని అని చెప్పినపుడు నువు నమ్మావా లేదా ..? నీ నోరు ఒకటి చెప్పుతోంది నీ ముఖం ఇంకొకటి చెప్పుతోంది."

" వరుణ్ ..నువు దేవుడివే..నమ్ముతున్నా పూర్తిగా ..నువు నన్ను నమ్మాలి "

" నా వెనుక ఇంకోలా చెప్పడం లేదుగా ...నాకు మతి పోయిందని..ఇంకేదో అయిందని"

" ఎంతమాత్రం లేదు స్వీటీ "

" సరే..చిన్న మైండ్ రీడింగ్ గేం ఆడదాం...అలా నా నిజ స్వరూపం నీకు తెలుస్తుంది.ఒకటి నుంచి అయిదు లోపు ఓ సంఖ్య అనుకో లోపల...ఆ సంఖ్య ని నేను  చెపుతా... రెడీనా..? "

" ఇప్పుడంత అవసరం ఉందా "

" ముందు చెపుతావా...లేదా...లేకపోతే ..మామూలుగా తగలవ్..." గట్టిగా అరుస్తూ చెయ్యి ఎత్తాడు.నాకు భయమేసింది.వరుణ్ ఆ విధంగా బిహేవ్ చేయగా నేను ఎప్పుడూ చూడలేదు.
" నేను అనుకున్నట్లు నీ సమాధానం ఉంటే రివార్డ్ ఉంటుంది లేదా దానికి మూల్యం చెల్లించాలి.బఠాణి అంత ఉన్న నీ బ్రెయిన్ కిది ముందే తెలియాలి. నా భార్య తో ఇలా అనకూడదు.నాకు తెలుసు గాని నువు చిన్న పిల్ల లా వ్యవహరిస్తున్నావు " వరుణ్ బాధ నిండిన గొంతు తో అన్నాడు.నేను నా తలని భయం తో ఊపాను.నేను సెన్సిటివ్ అని నాతో అలా బిహేవ్ చేయకూడదని తనకి తెలియదా...!

" ఏమిటి ..ఏమి చేయాలి" నేను అడిగాను.

" ఒకటి నుంచి అయిదు లోపు ఓ అంకె చెప్పు"

"అదీ..అదీ"

" మూడు..అంతేనా"

" ఔను..అదే"

"నేను అనుకున్నదే..! సరే ఇప్పుడు ఒకటి నుంచి పది లోపు ఓ అంకె చెప్పు"

" సరే"

"ఏడు..అంతేనా"

" వావ్..ఈసారీ నువు బాగా ఊహించావ్"

" సరే..ఈసారి ఒకటి నుంచి ఇరవై లోపు ఓ అంకె ని ఊహించు"

"ఆ..ఊహించాను"

"పదమూడు..అంతేనా"

"ఔను" చెప్పాను.మూడు సార్లు తను బాగానే గెస్ చేశాడు.అదేలా..?

"నా పవర్స్ ని ఇపుడు నమ్ముతున్నావా"

" నమ్ముతున్నా" ఇకనైనా ఈ గేం కి తెర పడుతుందా అనుకోసాగాను.

"అంటే ఇంతకు ముందు నమ్మలేదనేగా...అబద్ధం చెబుతున్నావ్.." 
" నేను.." 

"చివరి గా విను.నువు నాతో ఏ చిన్న విషయం లో అయినా అబద్ధమాడావో దానికి బాధ పడతావు ..మామూలు గా కాదు.నువు మంచి అమ్మాయి లా ప్రవర్తించావో ఈ లోకాన్ని ఏలవచ్చు.నీ మట్టి బుర్రలోకి ఇది బాగా ఎక్కించుకో..." అసలు నా పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు ..తనకి నేనేం చేశాను..మిగతా అతని ఫ్రెండ్స్ తో ఇలా ఐయితే బిహేవ్ చేయడు.

" ఇంకోటి..అజయ్ ని నేను చాలా మిస్ అవుతున్నాను..అదే బ్రహ్మ ..! నన్ను అర్ధం చేసుకున్నది తను ఒక్కడే.స్నేహానికి నిజమైన అర్ధం ...నిన్ను తనకి పరిచయం చేయాలి...ఫెంటాస్టిక్ గయ్ అనుకో" మళ్ళీ అన్నాడు.

" గొప్పవాడే కావచ్చును" 

" ఒకటి తెలుసా..అతని జీవిత లక్ష్యం ఏమిటో తెలుసా ..ఈ ప్రపంచం లో సాధ్యమైనంత ఎక్కువమంది తో గంజాయి తాగించడం...ఎంత స్వార్దరాహిత్యం.గొప్ప మనిషి..విష్ణు కూడా మంచివాడే..అయితే మానుంచి కొద్దిగా దూరమవుతున్నాడు.గుణ కి ఒక్కసారి తనని పరిచయం చేయాలి ..అప్పుడు గాని మారడు" 

" ఓహ్.." 

" గుణ గురించి నీకు చెప్పానా..?" 

" లేదు.." 

" అసలు ఏమిటి నీ ఇది..పొడి పొడి గా ఒక్కమాట లో జవాబు  చెబుతున్నావ్" స్వరం పెంచి భయపెడుతున్నట్లు అన్నాడు వరుణ్.

" నా లోని ఓర్పు అంతా కరిగిపోసాగింది.నిశ్శబ్దం గా ఏడవసాగాను.నా మొహం ని చేతులతో మూసుకున్నాను.అసలు ఇతనేనా వరుణ్ ..లేదా ఇతనిలో ఏదైనా దెయ్యం పూనిందా..!

" పార్వతి.. చిన్న పిల్ల లా ఏడవకు.నువు బలం గా ఉండాలి.ఈ జన్మ లో నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి.ఇలా అయితే అవన్నీ ఎలా చేస్తావ్..నువు ఎలా వ్యవహరించాలో నేను చెప్పాల్సిన అవసరం ఉంది..చిన్న చిన్న జవాబులు చెప్పడం అంటే నన్ను అవమానించడమే,నా సమ ఉజ్జీ గా నువు ఉండాలి  " నా భుజాల్ని తాటిస్తూ చెప్పాడు. (సశేషం)  


 నా పేరు శివ (నవల) Post no:25

"సర్లే" కళ్ళు తుడుచుకున్నాను.

"నువు మాట్లాడు ఇపుడు..ఒక ముప్ఫై సెకండ్లు..నీ వంతు" వరుణ్ చెప్పాడు.

" నేనేం మాట్లాడాలి"

" పోనీ నాకు కాంప్లిమెంట్ ఇవ్వు"

" నువు ఒక.." నా నోటిలోనుంచి మాట రాబోతుంది ,ఇంతలో తను అందుకున్నాడు.

" కానీ పార్వతి..నోటిలోంచి ధారగా మాట్లాడు"

" ఏమి చెప్పాలో తెలియడం లేదు"

" అంటే నా గురించి పొగడటానికి ఏమీ లేదా..అసలు గుణ నా గురించి ఏమని అంటుంటాడో నీకు తెలుసా "

"ఏమంటాడేం"

"నేను ఓ గొప్ప మనిషినని...కారణ జన్ముడినని..అలా...ఆ లెక్కన నువు కూడా గొప్పదానివేగదా "

" ఆ..అంతే"

" విధి చాలా బలీయమైనది.కదా..!నా కోసం నువు..నీ కోసం నేను ..వెయిట్ చేయడం...ఈ జన్మలో ఇలా కలుసుకోవడం ..చాలా గొప్ప విషయం"

" గ్రేట్"

" ఏమిటి ..మళ్ళీ ఆ పొడి పొడి గా మాట్లాడటం" కోపం ధ్వనించింది అతని లో.

" ఓ విషయం గురుంచి మనం చక్కగా మాట్లాడుకోలేమా.." వరుణ్ అన్నాడు మళ్ళీ.ఇపుడు తను గంజాయి మత్తు లో లేడు,కాని విచిత్రం గా మాటాడుతున్నాడు.అంటే దాని ప్రభావం ఎప్పటికీ మనిషి లో అలా ఉంటుందా ..? ఇక నా గతి ఇంతేనా అనిపించింది.

" ఇవ్వాళ అంతా నేనే మాట్లాడుతున్నా...ఒక చేంజ్ కోసం..నువు మాటాడు నా బదులు " అన్నాడు వరుణ్.

" నా గురించి ఏమనుకుంటున్నావో ..అవన్నీ నువు చెప్పు" అన్నాను.ఆ విధంగా అయినా కొన్ని మంచి మాటలు నా గురించి మాటాడతాడని.

" నువు నా అవసరం.కాని నేను నిన్ను కోరడం లేదు.వినడానికి కష్టం గా ఉందా..? అదే విశ్వ రహస్యం.నా జీవితం లో నువు ఓ భాగం.కొన్నిటిని మనం కలిసి చేయాలి.మనం ఏం చేయాలనేది గుణ ఎప్పటికపుడు చెబుతాడు.ఈ లోపులో అంతా నువు అర్ధం చేసుకోవాలి.ఈ లవ్వు గివ్వు కంటే మించిన బాధ్యతలు నాకున్నాయని "

" నీ అర్ధం... గతం లో నువ్వు  నా గురించి చెప్పినదంతా ఉట్టిదేనా "

"నేను ఎంతో చెప్పాను జీవితం గురించి ..నీకు అర్ధం కావడం లేదు. ఇవన్నీ అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నీకు...కొన్ని బీర్లు తాగుతూ మాటాడుకుందాం ..పద"

" ఈ సారి ట్రిప్ లో అలాంటి వేమి వద్దనుకున్నాం గదా...ప్రామిస్ చేశావ్ కూడా ..!నా కోసం కంట్రోల్ చేసుకో ఈ సారికి,నీ బెటర్ ఆఫ్ గా చెబుతున్నా "

"వావ్..ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నావ్...బాగుంది...ఒకే ఒక్క బీర్..అంతే ..!కనీసం ఈ ఒక్కదాన్ని ఆమోదించలేవా ?"

" దయచేసి విను.నువు ఆల్కాహాల్ కి దూరం గా ఉండు.నువు అడిగింది ఏదైనా చేస్తా..నీ మంచికోసం చెప్తున్నా"

" నా మంచి ఏమిటి అనేది గుణ కి మాత్రమే తెలుసు.మీ ఈగోలు అన్నీ నాకు అసహ్యం. మీ అందరి కంటే గుణ కొన్ని వందల రెట్లు  తెలివైన వాడు ఇంకా అనుభవం ఉన్నవాడు.ఆల్కాహాల్ గాని డోప్ గాని ముట్టవద్దని అతను ఎప్పడు చెప్పలేదు.అలాంటిది నువ్వు ఎవరవి చెప్పడానికి..? " కోపంగా చూశాడు వరుణ్.

నాకు ఇప్పుడు ఒకటే తోచింది.టాపిక్ మళ్ళించడం మంచిదని.

" సరే..అసలు ఆ గుణ అనే వ్యక్తి ఎవరు,నాతో చెప్పకూడదా తన గురించి" అడిగాను.

" ఓహ్..గుణ నా...నా గత జన్మని జీవించాడు తను .నాకు గైడెన్స్ ఇచ్చేది తనే..ఈ జన్మ లో నేనేమి చేయాలనేది అతనికి మాత్రమే తెలుసు..ఎందుచేత నా జీవితాన్ని జీవించాడు గనక గతం లో..!తను ఒక మార్మిక వ్యక్తి.క్రమ క్రమంగా అంచెలు ప్రకారం నేనేం చేయాలో చెబుతుంటాడు.ఒకేసారి చెప్పాడే అనుకో ఈ సిస్టం తట్టుకోలేదు ఓవర్ లోడయి పొయి " హిస్టీరిక్ గా నవ్వుతూ చెప్పాడు వరుణ్..!
 ఈ రోజు కూడా అతని కోసమే వేచి చూస్తున్నా...మరి ఈ గోవా లోకి వస్తాడో,రాడో ..అంతా అతని దయ.నాకు కనిపిస్తే మటుకు నీకు తప్పకుండా పరిచయం చేస్తా.." నవ్వి చెప్పాడు వరుణ్.

" అతణ్ణి ఓసారి చూడాలని నాకు చాలా ఇది గా ఉంది" అన్నాను.వరుణ్ చెప్పేది తలతిక్కగా ఉన్నా నేను కావాలనే అన్నాను.

" నా ఈ జీవితం లో శివ గా నా పాత్ర నేను చక్కగా పోషించాను..ముఖ్యంగా నా ప్రధమ కర్తవ్యం నిర్వర్తించాను.ఒక దుష్ట శక్తిని అంతమొందించాను " గర్వంగా చెప్పాడు వరుణ్.

" కంగ్రాట్స్"

" నిజంగా నా"

"ఒక కధ చెపుతా విను.ఒకానొకప్పుడు సూర్య అని చెప్పి ఒకడుండేవాడు.భూత కాలం లో ఎందుకు చెపుతున్నానంటే వాడు ఇప్పుడు లేడు.సర్వ దుష్ట గుణాలూ ఉన్న వ్యక్తి.అమాయకులైన విద్యార్తుల యొక్క పర్సులు,మొబైల్స్ కొల్లగొట్టేవాడు.అంతేగాక మొబైల్స్ లో ఉన్న అమ్మాయిల ఫోటోల్ని పోర్నో సైట్ లకి అమ్మేసేవాడు.డబ్బు సంపాదించే పద్ధతుల్లో నీచమైన వి గదా అవి...అందుకే తనని నేను క్షమించలేకపోయాను" వరుణ్ లో ఉద్రేకం తొంగి చూసింది.

" అప్పుడు ఏమయింది" ఆత్రుత గా అడిగాను.

" నా స్థానం లో నువ్వే ఉంటే ఏమి చేస్తావు"

" నాకు తెలీదు.."

" ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే వాడి జీవితాన్ని ముగించాను.వాడు ఉండాల్సింది నరకం లో..అక్కడికే పోయాడు"

" ఏమిటి..నువు చెప్పేది నిజమేనా " నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను.అసలు ఇలాంటి సీరియస్ సంగతి ని అలవోకగా చెప్పేసేడేంటి.తనకి ఏమి కాకూడదు అనేది నా కోరిక.ఇదే గనక నిజమైతే పోలీస్ కేసు అయ్యి అతని జీవితం నాశనం అవుతుంది.
" వాడు అంత ఈజీ గా దొరికాడా ...కనిపెట్టలేనని అనుకున్నాడు.నాలోని దైవ శక్తే వాడి అనుపానులను గురించి చెప్పింది.సీక్రెట్ ప్లేస్ లో నక్కాడు వెధవ..ఆరు సార్లు కత్తి తో పొడిచా.ఆ విధంగా గుణ నాతో మొదటి పనిని నెరవేర్చాడు.తర్వాత పని ఏమిటో..దాని కోసమే ఎదురు చూస్తున్నాను "

అదే గనక నిజమైతే..దాని పర్యవసానాలు ఏమిటో తను ఆలోచిస్తున్నట్లుగా లేదు.నాకిప్పుడు వెంటనే తిరుచ్చి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది.అసలు గోవా కి తన తో వచ్చిఉండకుండా ఉంటే బాగుండేది.

" నా గొప్ప పనిని ఒక బీర్ తో సెలెబ్రేట్ చేసుకుందామా"  అడిగాడు వరుణ్.

" ఇంకో బీచ్ కి పోదాం పద.."

" చాలా చికాకు గా ఉంది.ఓ బీర్ పడాల్సిందే..పారూ..ప్లీజ్ ..ప్లీజ్ "

"బైక్ లో పోతుంటే హాయి గా ఉంటుంది..పద"

"ఎలాంటి వైఫ్ వి నువు.."

" నీ మంచి కోసం ఆలోచించే తరహా "

" అదే నిజమైతే ఒక బీర్ ని తాగనివ్వాలి.నా లో వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలంటే,నిద్ర పోవాలంటే ఓ బీర్ ఉండాలి"

" సరే..ఒకే బీర్ ..!" అన్నాను.నాకిక చాయిస్ లేదు.వేరే ఏమి చేయడానికైనా..!నేను ఇప్పుడు ఉన్నది ఒక సైకోపాత్ కిల్లర్ తో...నా క్షేమం నేను చూసుకోక తప్పదు.

" సరే..బ్రిట్టో స్ కి పోదామా"

" సరే"

పావు గంట లో అక్కడికి చేరుకున్నాము.అక్కడ మేము డిన్నర్ చేశాము గతం లో వచ్చినపుడు ..అప్పటికి ఇప్పటికి ఎంత తేడా జీవితాల్లో.అప్పుడు స్వర్గం అనుకుంటే ఇప్పుడు నరకం అనుకోవాలి.నేను గమ్మున ఉండి తననే మాటాడనిస్తున్నాను.నాకు ఏమి తట్టలేదు అతని తో ఏది..ఎలా మాటాడాలో..!బీర్లు సర్వ్ చేయబడ్డాయి.

" నీకు సరదాగా ఉందా.. నాకైతే చాలా బాగుంది " బీర్ ని సిప్ చేస్తూ అన్నాడు వరుణ్.

" నాకూ బాగుంది" ఏదో అనాలని అన్నాను.నిజానికి ఇంకా షాక్ లోనే ఉన్నాను. (సశేషం)  



 నా పేరు శివ (నవల),Post no:26

" పారు ...నువు నన్ను చూసి భయపడుతున్నావా,నీ గొంతు లో ఆ వణుకు ఎందుకు "

" అబ్బే..అదేం లేదు"

"నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు...నేను నిన్ను బాధించను..తెలిసిందా..?మహా అయితే ఒకటి రెండు చెంప దెబ్బలు కొడతా..అంతే " అలా అని నవ్వసాగాడు.

" నన్ను ఎందుకు కొడతావు..నేను ఏం చేశానని " అడిగాను నేను.

"నువు నాతో మాటాడే విధానం అదేనా..మనం దైవాంశ కలిగిన వ్యక్తులం..ఆ ఇదే లేదు నీకు..!నేను సూర్య గురించి చెప్పినపుడు స్పందించే పద్ధతి అదేనా..?ఆ కారణాలు చాలవా ..ఇంకా ఏమైనా చెప్పాలా..?ఓ పదైనా చెప్పగలను నీ పొరపాట్ల గురించి"

" ఇప్పుడు చెప్పినవి చాల్లే"

" బాగా చెప్పావు..ఏది నీ ఫేస్ కొద్దిగా తిప్పుకో ఇటు...మొదటి దెబ్బ పడబోతోంది"

" వరుణ్"

"సరదాగా అన్నాను పారు.నువు నన్ను వరుణ్ అని పిలవకూడదు.శివ అని పిలవాలి.నేను శివ ని"

నా కడుపు లో దేవినట్లుగా అవుతోంది.రెస్ట్ రూం కి పోవాలనిపించింది.

" నేను రెస్ట్ రూం కి వెళ్ళాలి" అలా అని పైకి లేచాను.

" ఎందుకు..రెస్ట్ తీసుకోడానికా" ఇకిలించాడు వరుణ్.

" ఇప్పుడే వస్తా" అని బయలుదేరాను.

యూరినల్స్ అవీ అయినాక మొహం కడుక్కున్నాను.జరిగినదంతా తలుచుకుంటే కన్నీళ్ళు వచ్చాయి. లోపల బాధ అంతా అలా రిలీవ్ చేసుకొని మొహం కడుక్కున్నాను.ఈ ట్రిప్ ని ఇంతటితో ముగించి  ఇతణ్ణి ఇక కలవడం చేయకూడదని నిర్ణయించుకున్నాను.ఈ మెంటల్ హెరాస్మెంట్ ని తట్టుకునే ఓర్పు నాకు లేదు.

" ఓహ్ థాంక్స్.ఒక గుడ్ న్యూస్ పార్వతి కి.నాలాగే ఆమె సంతోషిస్తుంది ఇది వింటే.." అలా తనలో తనే మాటాడుకుంటున్నాడు వరుణ్ నేను తిరిగి వచ్చేసరికి.

" ఒక మంచి వార్త నీకు.." చెప్పాడు తను.

" ఏమిటది" కూర్చుని అడిగాను.

" ఇప్పుడే మా తాతయ్య తో మాట్లాడాను ,నీతో ఒక మాట చెప్పమన్నాడు.."

" ఇక్కడెవరూ లేరే"

" నీకు కనబడరు డార్లింగ్.ఆయన చనిపోయాడు" చాలా తాపీగా చెప్పాడు.చచ్చిన వాళ్ళతో మాటాడ్డం కామన్ అన్నట్లుగా చెప్పుకుపోతున్నాడు.నాలో అసహనం రేగుతోంది.

" ఏమిటి నువు అంటున్నది.." అడిగాను.

" ఆ వాయిస్ ని నేను వినగలుగుతాను.నీవు ఇంకా ఆ స్థాయికి చేరలేదు.నీకు ఒక విషయం చెప్పమన్నాడు మా తాతయ్య" చెప్పాడు తను.

" ఏమిటది"

"నీకు ముప్ఫై అయిదేళ్ళు వయసు తర్వాత కూడా  ఏమి కాదు.ఆ జ్యోతిషుడెవడో చెప్పాడన్నావు గా.వాడెవడో గాని పనిష్మెంట్ ఇవ్వాల్సిందే"

" ప్లీజ్ వరుణ్..అలాంటి పని చేయకు"

" నీ జీవితం గురించి అంత అబద్ధం చెప్పినవాణ్ణి ఏమీ చేయవద్దా ...డబ్బులు కోసం ఎలా అంటే అలా చెప్తారా...మిగతా జనాల్నయినా వాడినుంచి కాపాడాలి.అది మంచిది కాదా"

" ఆ జ్యోతిష్యాల్ని నేను నమ్మను..దాన్ని పెద్ద విషయం గా తీసుకోకు"

" జ్యోతిష్యం గుప్త విద్యే అయినా  చాలా విలువైనది.మన రుషులు కనిపెట్టిన విలువైన విజ్ఞానం..దాన్ని పాడు చేస్తున్న వీళ్ళని ఏమీ అనవద్దా..?"

" తొందరగా ఆ రెండు బీర్లు లాగించు..నేను మళ్ళి రెస్ట్ రూం కి వెళ్ళి రావాలి"

" నువు ఎక్కడకి పోవడానికి వీల్లేదు.ఎక్కడున్నావో అక్కడే కూర్చో.నన్ను అగౌరవపర్చడానికి ఎంత ధైర్యం" అతను సహనాన్ని కోల్పోయాడు.

" సర్లే..ఉంటాను" నాలో భయం మొదలయింది.

" నాతో మా తాతయ్య మాటాడిన అంశం నువు సీక్రెట్ గా ఉంచాలి.మనలాంటి దైవాంశ సంభూతులే అలాంటి వాటికి అర్హులు.ఎవరకీ చెప్పకు..లేకపోతే నువు చిక్కుల్లో పడతావు..అర్ధమయిందా"

" ఎవరకీ చెప్పనులే "  
  " అది మంచిది.నీ ఫేస్ లో కొద్దిగా కూడా ఆశ్చర్యం అనేది లేదేమిటి...నువు చనిపోవు ఆ జ్యొతిష్యుడు చెప్పినట్లు అని నేను చెప్పానా...కనీసం హేపీ గా అయినా ఫీలయ్యావా..నా కోసమైనా..!ప్రతిదీ నేనే నేర్పాలా"

" వరుణ్ ..సారీ..శివ"

" అది... ఇప్పుడు దార్లోకి వచ్చావ్...నా అసలు పేరు పెట్టి పిలిచావ్...ఇప్పటికి ఒక మంచి పని చేశావ్...నీకో బహుమతి ఇవ్వాలి..అదేమిటో తెలుసా నీకు"

" ఏమిటి"

" నిన్ను ప్రేమిస్తున్నా పార్వతి .. ఈ ప్రయాణం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.చాలా కష్టపడ్డావ్ దీని కోసం...మనం రూం కి పోయి శృంగారం లో తేలియాడాలి"

ఏమి చెప్పాలో అర్ధం కాలేదు నాకు.ఈ సైకోపాత్ తో ఆ ఘనకార్యమా ఇప్పుడు..వీలే లేదు.

వరుణ్ తనలో తాను ఏదో గొణొక్కోసాగాడు. అదేమిటో అర్ధం కావడం లేదు.జిబ్బరిష్ గా ఉంది.పోనిలే నాతో అయితే కాదు మాట్లాడేది... సంతోషం.

బీర్లు అయిపోయాయి.బిల్ పే చేశాను.రూం కి వెళ్ళాలంటేనే భయం గా ఉంది.అక్కడ ఏ రాద్ధాంతం జరుగుతుందో.చెప్పిన విషయం మీద అసలు నిలబడట్లేదు ఈ మనిషి.ఇతనితో ఈ పరిస్థితి లో శృంగారం అంటే అది ఒక టార్చరే.మొత్తానికి రూం కి చేరాము.నా ఫోన్ మోగసాగింది.అది చేసింది రాం.హమ్మయ్యా అనుకున్నాను.ఒక తిక్క లేని మనిషి తో మాటాడబోతున్నాను , హాయిగా అనిపించింది.బాత్ రూం లో దూరి తలుపు వేసుకొని మాట్లాడసాగాను.

" హాయ్..ఏమైనా మంచి వార్త ఉందా" అడిగాడు రాం.

" ఈ ట్రిప్ చాలా చండాలం గా అయింది డ్యూడ్ " బయటకి వినబడకుండా చిన్నగా చెప్పాను .

" ఏమి జరిగింది..వరుణ్ తాగాడా ఏమిటి"

" తాగింది లెక్క కాదు.అతని మాటలు,చేష్టలు అన్ని పరమ చికాకు గా ఉన్నాయి"

" కొంత సమయం ఇవ్వు యామిని.నేను చెప్పానుగా కొంత అసాధారణ ప్రవర్తన ఉంటుందని...అతను బాగయ్యేదాకా కొద్దిగా ఓర్పు వహించు"

" అసాధారణం కాదు...సైకోపాత్ లా ఉంది తన యవ్వారం..."

" కొద్దిగా టైం తీసుకుంటుంది.."

" ఈ వ్యవహారాన్ని నేను భరించలేను.తిరుచ్చి కి వచ్చేయాలని అనుకుంటున్నాను. అసలు ఎంత ఇదిగా నా పట్ల ప్రవర్తిస్తున్నాడంటే నమ్మలేవు"

వరుణ్ బాత్ రూం తలుపు మీద చేతి తో దబ దబ కొట్టసాగాడు.

" సరే..ఇక ఉంటా" అలా ఫోన్ లో చెప్పేసి తలుపు తెరిచాను.

" ఎవరి తో మాటాడుతున్నావ్" అనుమానంగా అడిగాడు.

" ప్రియాంక అని మా ఫ్రెండ్" నవ్వాను చెబుతూ.

" ఏదో తప్పు జరుగుతోంది ఇక్కడ" అంటూ దగ్గరగా వచ్చాడు.

" అంటే ఏమిటి నీ అర్ధం " మళ్ళీ నవ్వుతూ అన్నాను.

" గత మూడు గంటల్లో ..ఒక్క చిరునవ్వు చిందించని దానివి ..ఇప్పుడు ఇంత నవ్వు నవ్వావు ఏదో ప్రొఫెషనల్ కెమేరా మెన్ కి పోజ్ ఇస్తున్నట్లు ..చెప్పు ఎవరి తో మాట్లాడావు .."

" ప్రియాంక"

" ఎవరాళ్ళు.." నా చేతి లోనుంచి ఫోన్ లాక్కున్నాడు.ఎవరకి కాల్ చేశానో అని కాల్ లాగ్ లోకి వెళ్ళి చూస్తున్నాడు.నాకు ఊపిరి ఆగినంత పని అయింది.(సశేషం)  


 నా పేరు శివ (నవల) Post no:27

చాప్టర్-8

" వావ్..రాం కి ప్రియాక అని  ఇంకో పేరు ఉందా..అది నాకు తెలీదే..!ముద్దు పేరా అది? ఈ రోజు నేను చెబుతున్నది సరిగా వినకుండా పరధ్యానంగా ఉండానికి అదా కారణం..ఆ యావ లో ఉన్నావా ఆ ప్రియాంక తో" దెయ్యం లా నవ్వాడు వరుణ్.ఆ తర్వాత నా జుట్టు గట్టిగా పట్టుకున్నాడు.

" నన్ను వదులు" నా జుట్టు విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

" నేను ముందే చెప్పాను..నాతో అబద్ధం ఆడితే దానికి అనుభవిస్తావు అని.నా వార్నింగ్ సీరియస్ గా తీసుకోలేదు గదూ ..దానికి గాను మూల్యం చెల్లించవలసిందే..." లోపల దడదడ లాడసాగింది.చావగొడితేనో..!

"అంటే నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే దొరికాడా నీకు ఈ సారి అఫైర్ పెట్టుకోడానికి...నువు పెద్ద బోకు వి అని తెలుసు ..కానీ ఈ స్థాయి లో అని ఊహించలేదు" అలా అంటూ నా జుట్టు పట్టుకుని రూం లోకి లాక్కొచ్చాడు.

" ప్లీజ్ వరుణ్..వదిలి పెట్టు జుట్టు ని ...నొప్పి గా ఉంది" అన్నాను.

" అలాగే ఉంటుంది ప్రియతమా..నేను అనుభవిస్తున్న నొప్పి తో పోల్చితే ఇదెంతా..?నేను అనుభవించినంత నువూ అనుభవించాలిగా నొప్పి" బెడ్ మీదకి తోశాడు నన్ను.

" రాం కి నాకు మధ్య ఏమీ లేదు.అదంతా నువు ఊహించుకుంటున్నావు.మేము మంచి స్నేహితులము మాత్రమే...కావాలంటే నువే అతడిని అడుగు " కన్నీళ్ళతో చెప్పాను.

" నేను పిచ్చొడిలా కనిపిస్తున్నానా..ఆ మాత్రం తేడా తెలియదనుకుంటున్నావా..నీ నంగనాచి కబుర్లు కి పడిపోతానా" నా భుజాలు పట్టుకుని చెప్పాడు.

" దయచేసి నన్ను నమ్ము.నేను నిన్ను ప్రేమించే నీ పార్వతిని" చెప్పాను.

" నువు నా పార్వతి వి కావు.నువు ఒక బజారు సరుకు వి..నన్ను వెధవని చేస్తున్నావా ..నిన్ను పూర్తిగా పరిశీలించకుండానే నీ వల లో ఇంచుమించు పడిపోయాను.లోపలకంటా వెళ్ళి చూస్తే నీ నిజరూపం ఇదన్నమాట.పూర్వం లా నేను ఎందుకు లవ్ చేయడం లేదో తెలుసా,దానికి కారణం నీ పనికిమాలిన ప్రవర్తనే ..దానికి రుజువులు కావాలా..నీ స్కూల్ డేస్ లోనే ఇద్దరి తో పోయావు..నీ మొత్తం జాతకం అంతా ఆ గుణ కే తెలుసు ,నువ్వు ఒక దేవతవి ..అది నేను నమ్మాలి ,వింటే నవ్వొస్తున్నది"ఆ రూం లో తిరుగుతూ వాగుతున్నాడు వరుణ్.
    " నీకొక సేల్స్ టెక్నిక్ చెప్పనా...అదే నీ సీక్రెట్ లవర్ ప్రియాంక చెప్పిందిలే...కష్టమర్ ఏదైనా కొనాలని  వచ్చినపుడు సేల్స్ మేన్ ఏమని చెబుతాడో తెలుసా... చెక్ ఇస్తారా కేష్ ఇస్తారా అని.అంటే ప్రొడక్ట్ ని అతను ఆల్రెడీ కొన్నట్లు గా ఊహిస్తాడన్నమాట.అంటే కొనకుండా ఉండానికి ఆస్కారం లేదక్కడ.అదో టెక్నిక్ లే.వండర్ఫుల్ గా ఉంది గదూ" వరుణ్ చెప్పాడు.

" ఇది నాకెందుకు చెబుతున్నావు ఇప్పుడు" నేను అడిగాను.

" నీ మీద అదే టెక్నిక్ ప్రయొగించబోతున్నా.నువు ఎలా చావ బోతున్నావు..ఎలా అయితే నీ కిష్టం...నీ గొంతు కోసి చంపాలా లేదా ఊపిరాడకుండా చేసి చంపాలా ...నువు ఆల్రెడీ చనిపోయావు అంతే...చాయిస్ నువు చెప్పు ఎలా చస్తావో" అతని ముఖం లో మళ్ళీ  ఆ దెయ్యపు నవ్వు.

"వరుణ్.."  నేను రోదించసాగాను.చావడానికి భయపడి కాదు.నేను ప్రేమించిన వాడి చేతిలోనే చావవలసి  వస్తోందే అని.

" నీకు ఎవరైనా చెప్పారో లేదో...ఏడ్చినప్పుడే చాలా బాగుంటావు నువు" అలా అంటూ తన బ్యాగ్ వైపు నడిచాడు.

" ఆప్షన్ ఒకటా లేదా రెండా ..చెప్పు " అలా అంటూ పదునైన కత్తి ని తీశాడు బ్యాగ్ లోనుంచి.

నేను దేవుణ్ణి ప్రార్దిస్తూ ఏడవసాగాను.ఈ రూం లో నుంచి బయటపడాలి ఎలాగైనా...తప్పించుకుని ..జీవించాలి..!

" ఏయ్ ..ఎవరు ఆ తలుపు కొట్టేది " అని అంటూ తలుపు దగ్గరకెళ్ళి వాటిని తీశాడు వరుణ్.

" గుణా..నువ్వా ..సరైనా సమయానికి వచ్చావ్...లేకపోతే యామిని బతికుండగా చూసే చాన్స్ మిస్ అయ్యేవాడివి..అఫ్కోర్స్..ఆమె చావడానికి అర్హురాలు ..ఇలాంటి చెడు ప్రవర్తనని మనలాంటి దైవాంశ సంభూతులు సహించరు గదా  " అంటూ మాట్లాడసాగాడు.

విచిత్రం ఏమిటంటే రూం లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు.వరుణ్ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.పరిస్థితి అర్ధమయింది.పర్సు తీసుకుని మెల్లిగా తలుపు కి దగ్గరగా వచ్చి బతుకు జీవుడా అని దౌడు తీశాను.ఆ విధంగా దేవుడు నా మొరని ఆలకించాడనుకున్నాను. మొత్తానికి ఆటో లో కూలబడి ఏర్ పోర్ట్ కి వచ్చాను.

*   *   *    *
ఆగస్ట్ 20,2013
క్లాస్ లో ప్రొఫెసర్ చెప్పే పాఠం బుర్ర లోకి ఎక్కడం లేదు.క్లాస్ లోనే ఉన్నప్పటికి.ఆ గోవా ట్రిప్ ఇప్పటికీ భయంకరంగా అనిపిస్తోంది.నా బాయ్ ఫ్రెండ్ చేతి లోనే మర్డర్ కావాలసినదాన్ని ..ఏదో దైవం రక్షించి ఉండకబోతే..! నిజానికి వరుణ్ తో బంధం బలపడుతుందనే వెళ్ళా ..కాని అతను ఎలా ప్రవర్తించాడు...చంపేదాకా పోయాడు.ఏది ఏమైనా గాని ఇకమీదట అతడిని అసలు కలవకూడదు.ఓర్పు కి కూడా ఓ హద్దు ఉంటుంది.

క్లాస్ లోనుంచి అంతా బయటకి వస్తున్నారు.క్లాస్ అయిపోవడం తో..!చాలా అలసిపోయాను అన్ని రకాలుగా.ఇదంతా మరిచిపోవాలని జీవితం లో ముందుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

" హాయ్.." అనే పిలుపు వినబడింది.నేను కూర్చున్న బెంచ్ మీదనుంచే తల తిప్పి చూస్తే ప్రవీణ్.నా క్లాస్ మేట్.

" హాయ్ ప్రవీణ్" నవ్వడానికి ప్రయత్నించాను.

" వారం ట్రిప్ అని చెప్పావు.ఏమిటి ఒక రోజు కే వెనక్కి వచ్చావ్" అడిగాడు.

" అదెందుకులే డ్యూడ్"

" తను నన్ను చక్కగా ట్రీట్ చేయలేదు అని వెయ్యవసారి మాత్రం చెప్పకు"

" ప్లీజ్ ప్రవీణ్..నన్ను ఆటపట్టించకు..రెస్ట్ తీసుకోనీ కొద్దిగా,ఒంటరి గా వదులు నన్ను  "

" నిన్ను నీ మానాన బాధపడేట్లు చెయ్యడం..అది నా వల్ల కాదు.నీ బాధ లో నన్ను పాలుపంచుకోనీ ..కొద్దిగా కూర్చోనీ"

" కూర్చో.కాని ట్రిప్ గురించి ఏమీ అడగకు.ఆ ఒక్కటీ చేయగలవా"

" నిన్ను డిస్టర్బ్ చేయను.హామీ ఇస్తున్నా.నువు మాట్లాడు అనేంత దాకా నేను మాట్లాడను..సరేనా" బెంచ్ పక్కనే కూర్చుంటూ అన్నాడు ప్రవీణ్.అలా పావు గంట గడిచింది.గత ఎనిమిది నెలలు గా నా గాధలన్నీ మాటాడకుండా వింటూ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్నాడు.ఎలాంటి సొల్యూషన్ కూడా ఇవ్వడు..అది నాకు నచ్చిన అంశం.

" థాంక్స్" అన్నాను నేను కొద్దిగా ఉన్నతర్వాత. ( సశేషం) 


నా పేరు శివ (నవల),Post no:28

"ఫార్మాలిటీస్ మన మధ్య ఎందుకు లే యామిని...ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఫ్రెండ్స్...గత ఎనిమిది నెలలు గా మనం ఇంకొద్ది గా దగ్గర అయ్యాం...నీ సంతోషమే నా సంతోషం...నాతో మాట్లేడేటప్పుడు థాంక్స్ లాంటివి వద్దు" ఆ విధంగా అంటూ ప్రవీణ్ నా భుజం చుట్టూ చేతులు వేశాడు.నాకు ఓదార్పు గా అనిపించి అలాగే నేనూ ఒరిగిపోయాను.

" సో..అలాంటి మాటలు వద్దంటావు " అడిగాను.నవ్వుతూ..!

" నన్ను బాధపెట్టాలనుకుంటే తప్పా.." తనూ నాతో కలిపాడు నవ్వు లో.

" మరి ఏం చేయాలి"

" అనేకం ఉన్నాయి..చేయడానికి..ఏదని చెప్పమంటావ్"

" నీకు బాగా అనిపించింది చెప్పు"

"నువ్వు అందం గా ఉండకూడదు..అది పాపం.సరే అది నీ చేతిలో లేదుగా ..క్షమిస్తున్నా పో"

" రైట్" అంటూ ఆకతాయి గా అతని చేతిని గిచ్చాను.ఎంత మార్పు ..నిన్న సాయంత్రానికి ఇప్పటికి.

" ఆ ..ఇంకోటి..చక్కగా పాడకూడదు...ఎందుకంటే అది నీ ఫాన్స్ ని బాధిస్తుంది...నిద్రపోతున్నా నిన్నే వినాలనిపిస్తుంది"

" ఆ విధంగా పొగడటం..ఆపు...!నీకు తెలుసు గా నా సంగతి ..ఉట్టినే కరిగిపోతా"

" అలా అయితే నా కోసం నువ్వు ఒకటి చేయాలి"

" ఏమిటి"

" అలా కేంపస్ చుట్టూ నడుద్దాం..మాటాడుకుంటూ..! అన్ని బాధలు మరిచిపోయి చిన్న పిల్లల మాదిరి గా"

" ఆ విధంగా నీకు నచ్చుతుందన్న మాట..అదే చిన్న పిల్లల్లా "

" అందుకే నీ మాట తీరు నచ్చుతుంది..అది చిన్న పిల్ల లా ఉంటుంది  "

" నాకలా ఇష్టం ఉండదు.."

" అంటే దానర్ధం ఇంకా చిన్నపిల్లలా ..బేబీ లా ..అంతేనా"

" ఆ విధంగా  అయితే నీతో మాటాడను..ఇక మర్చిపో నడక గురించి"

" నీ పెద్ద ఫేన్ ని ఇలా బ్లాక్ మెయిల్ చేయడం తగునా "

" నువు అలా ఏమీ కాదు"

" మరయితే నేను ఎవరిని చెప్పు.."

" తెలుసు" ,నా బాధలు మర్చిపోవడానికే ప్రవీణ్ అలా పొడిగిస్తూ ఉంటాడు నాకు తెలుసు.

" అయితే నీ యొక్క పెద్ద ఫేన్ ఎవరు ..చెప్పు"

" ఇంకెవరు ..నువ్వే" ఆకాశానికి ఎత్తేశాను.

" అది లెక్కంటే..మరి ఇక అలా నడుద్దామా"

" సరే..పద"  క్లాస్ రూం వదిలి నడవ సాగాము.

" ఆ ..తిరువెంబూర్ లో ఓ మర్డర్ జరిగింది ..నీకు తెలుసా" అడిగాడు ప్రవీణ్.నాకు లోపల దేవినట్లయింది.

" ఏమో తెలీదు" ఎరగనట్లుగా చెప్పాను.

" సూర్య అని ఒకడు మర్డర్ కాబడ్డాడు.ఎవరో బాగా పగ ఉన్నవాళ్ళే చేసి ఉంటారు"

" ఓ..నిజమా"

" పేపర్ లో చదివిన దాని ప్రకారం ఆ సూర్య పరమ దుర్మార్గుడు.ఇక వాడలా చావడం లో వింత ఏముంది.ఆ ధైర్యవంతుడు ఎవరా అని ..అంత రిస్క్ తీసుకుంది"

" చూడబోతే ఎవడో పిచ్చోడు చేసినట్లే ఉంది "

" ఆ పిచ్చోడు ధైర్యవంతుడే.. " నవ్వాడు ప్రవీణ్.నాకు ఎందుకో నవ్వే వార్త లా అనిపించలేదు.
" అలాంటి సీరియస్ విషయాలు ఇప్పుడెందుకులే.." అన్నాను.

" కూల్.ఏదో తెలుసుకుందాం అని..వరుణ్ ని ఇంకా ప్రేమిస్తున్నావా..అతను నీ పట్ల అంత ఇది గా ప్రవర్తించినా"

" ఏమో..కాసేపు అతన్ని మళ్ళీ కలవకూడదు అనిపిస్తుంది...మళ్ళీ మాటాడాలనీ అనిపిస్తుంది. ఒకానొక సమయం లో పది మిస్డ్ కాల్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి.ఆ గోవా ట్రిప్ కి వెళ్ళి వచ్చినాక ఇంకెప్పుడు కలవకూడదనిపించింది.అతనితో వేగడం నా వల్ల కాని పని"

" అసలు ఏమి జరిగింది..నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు.కొంత బాధ తగ్గుతుందని నీకు..అంతే తప్ప నీకేమి సలహాలు ఇవ్వను "

" ఏముందని ఇవ్వడానికి సలహా.."

" దీనికి ఓ దారి లేకపోలేదు.నీ పరిస్థితి చూస్తే సిద్ధంగా లేనట్లు గా ఉంది...దేనికైనా..ఇది రైట్ టైం కాదులే"

" అదేం లేదు.చెప్పు ఏం చేస్తే బాగుంటుంది"

" మూడు అంచెలు గా ఉండే ప్లాన్ అది"

" ఏమిటి ఆ మూడు .."

" మొదటిది..నువ్వు అతనితో కలవడం మానెయ్... నీకెంత అనిపించినా సరే..!నీకు అతను కాల్ చేసినా లేదా నీకే కాల్ చేయాలనిపించినా నువు కంట్రోల్ చేసుకోవాలి"

" సరే.."

" రెండవది ..ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కోవాలి.అంటే నీ పట్ల సానుకూలంగా ఉండే వాణ్ణి.అన్ని విధాలుగా"

" ఇంకో రిలేషన్ కి అప్పుడే సిద్ధం గా లేను డ్యూడ్"

" ఇది రిలేషన్ పునరుద్ధరించుకోవడం కాదు..ఒక ఫ్రెష్ రిలేషన్...గా అనుకో"

" ఏదైనా గాని...దానికి ఇప్పుడే రెడీ గా లేను"


" అదే విషయమైతే ..మూడవది చెప్పడం అసంబద్ధమే"


" లేదు..లేదు..చెప్పు"

" హ్మ్...నీ కొత్త బాయ్ ఫ్రెండ్ తో హేపీ గా ఉండటానికి ప్రయత్నించు.అంటే వరుణ్ తో ఎంత ఇది గా ఉన్నావో అలా"

" హ్మ్మ్.."

" అక్కడే ఆగు" చుట్టుపక్కలా ఎవరూ లేరు.

" ఎందుకు"

" నీ కళ్ళు ముయ్యి"
" మూస్తున్నా"

" ఇప్పుడు తెరువు"

ఇపుడు ప్రవీణ్  నా ముందు మోకాళ్ళ మీద ఉన్నాడు.అతని చేతిలో ఓ వజ్రాల ఉంగరం ఉంది.కలవరపడిపోయాను.

" ప్లీజ్ ఇది ధరించు"

" ప్రవీణ్..నా వల్ల కాదిప్పుడు"

" దేవత నా కోరిక తీర్చాలి.ఇది ధరించాలి"

" ఓకె..చాలా థాంక్స్" అతని చేతిలొని ఉంగరం తీసుకొని ధరించాను (సశేషం)


  నా పేరు శివ (నవల),Post no:29

" థాంక్ యూ" అన్నాడు ప్రవీణ్ మామూలు గా నిలబడుతూ." ఈ రింగ్ నా దగ్గర ఎప్పటినుంచో ఉంది.నీకు ఇవ్వడానికి గాను వేచిచూస్తుంటే ఇన్నాళ్ళకి ఫలించింది.నా కెందుకో లోపల అనిపించుతూనే ఉంది ఈ రోజు వస్తుందని"

నేను నిశ్శబంగా నిలబడిపోయాను.ఆనందం లో.

" పద..మన నడక కంటిన్యూ చేద్దాం" అన్నాడు తనే.

" అసలు ఇంత విలువైన బహుమతిని నేను ఊహించలేదు. ఎలా వచ్చింది ఇంత డబ్బు" అడిగాను తబ్బిబ్బు అవుతూనే.నడక మొదలెట్టాము మళ్ళీ.

"ఇదంతా నా జీవిత కాలపు పొదుపు లోంచి తీసింది.నా స్పెషల్ మనిషి కోసం స్పెషల్ కానుక"

" నేను నీకు నిజంగానే స్పెషలా"

" నీకు అలాంటి అనుమానం ఉంటే ఇదిగో ఈ కవిత చదువు.పెద్ద కవిని కాదులే గాని వచ్చిన ఎమోషన్స్ అదుపు చేసుకొని ఎలానో రాశాను" అంటూ ఓ పేపర్ ఇచ్చాడు.

" నేను బయటకి చదవవచ్చా "

" అయ్యో...దానికోసమేగదా ఇచ్చింది"

" ఒకేసారి నా జీవితం లో ఆ అవకాశం ..నువు లేని జీవితం నాకు వ్యర్ధం...నీ వయసు ఇరవై ఒక్క ఏళ్ళు...బాధలు వెంటాడే రోజుల్లో మాటాడుకున్నాం ఎన్నో...దేవుడు నీకు రక్షకుని గా నన్ను నియమించాడు...నీతో నా జీవితం ప్రేమ మయం,స్వప్నమయం..యామిని నువు నా కల...పట్టాను నీతో ప్రేమ లో" అదీ ప్రేమ కవిత ప్రవీణ్ రాసింది.

చదువుతుంటే నాకు కళ్ళు చెమర్చాయి.ఇలాంటి దాని కోసం గదా నేను ఆశించింది.వరుణ్ నుంచి నేను కోరుకున్నది ఇలాంటి మాటలే గదా.అటు వరుణ్ ఇటు ప్రవీణ్  ..నేను చిక్కులో పడ్డాను.వెంటనే తేల్చుకోలేక.

" ప్రవీణ్ నానుంచి ఏమి కోరుతున్నావు.." అడిగాను,నా బాధ నుంచి తేరుకున్నాక.

" నువే చెప్పు..ఏమనుకుంటున్నావు నా గురించి"

" నీలాంటి జెంటిల్మేన్ చేత ప్రేమించబడటం నా అదృష్టం.అయితే నేను ఇంకా వరుణ్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేదు. నాకు కొద్దిగా సమయం కావాలి" అన్నాను.

" దానిదేముంది.తీసుకో.నన్ను లవ్ చేయకపోయినా నా ఒంటరి జీవితం లో నీ కంపెనీ కావాలి నాకు.నిన్ను ఎంతో ఓదార్చాను నువు కష్టం లో ఉన్నప్పుడు...వరుణ్ కంటే ముందు నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను.అయితే చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను.ఇక అవి అన్నీ దాచుకోలేక ఈ రోజు ముందు పెట్టాను.నా సంతోషమైనా ఏదైనా నాకు నువ్వే"

" నీ నిజాయితి ని అభినందిస్తున్నా.సాధ్యమైనంత త్వరలో విషయం నీకు తెలియబరుస్తాను.ఏదైమైన గత ఎనిమిది నెలలుగా నాకు సపోర్ట్ గా ఉన్నందుకు థాంక్స్.నేను నో అనీ చెప్పవచ్చు కూడా.అన్నిటికీ రెడీ గా ఉండు.నాకు కంఫ్యూజన్ గా ఉంది.క్షమించు"

" ఫర్వాలేదు..నేను వేచిచూస్తుంటాను"

*   *   *   *

సెప్టెంబర్ 22,2013

ఒక నెల రోజులు గడిచాయి అలా..!ఎదురుపడినప్పుడల్లా నా నిర్ణయం గురించి అడిగేవాడు. నేనేమీ చెప్పేదాన్ని కాదు.ఆ కవిత నాపై బాగా ప్రభావం చూపింది.ఎన్నో రాత్రులు తీపి కలలు వచ్చేవి..అది చదివిన తర్వాత.మంచి నిద్ర కి తోడ్పడింది అది.ఆ గోవా ట్రిప్ తర్వాత మళ్ళీ నేను వరుణ్ కి ఫోన్ చేయలేదు.వళ్ళు జలదరించే సన్నివేశం అది.చావు కి దగ్గరగా వెళ్ళి వచ్చాను.మర్చిపోలేను ఆ రోజు.అతని గురించి జాలి పడాలా..కోప పడాలా అర్థం కాలేదు.ఏమి జరుగుతుందో తెలుసుకునే సోయ లో లేడు కనుక అది అతని తప్పు అనడానికీ లేదు.

పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉంటే బాగుండును.మళ్ళీ పాత రోజులు వస్తాయో లేదో తెలీదు.ఉన్నట్టుండి ఫోన్ మోగసాగింది.అది వరుణ్ నుంచి వస్తోంది.

" హలో" అన్నాను.సరే ఏదో చూద్దాం అనిపించి.

" ఓ పార్వతి..ప్రియా " అంటూ వరుణ్ దీనంగా ..ఉంది తన స్వరం

" హాయ్"

" గోవా లో జరిగినదానికి నేను చాలా సారీ..చెబుతున్నాను.గుణ కూడా తిట్టాడు అలా చేయకూడదని ! ఏదైనా హింస తో కాదు,మంచి గా ఉంటూ ప్రపంచాన్ని పాలించాలని చెప్పాడు.నేను ఇప్పుడు చాలా మారిపోయాను.మళ్ళీ చెపుతున్నా నన్ను క్షమించు"

" అలాగా" అన్నాను.నాకు నమ్మబుద్ధి కావడంలా.నిజంగా మారాడో లేదో ఎవరకి తెలుసు.

" ఒక్క సారి మనం మాట్లాడాలి.కుదురుతుందా..?ఒక గొప్ప వార్త చెప్పాలి.నేను చాలా మారాను" అలా చెపుతున్నాడు.ఒక వైపు వెళ్ళాలని ఉంది.
మరో వైపు భయమూ వేస్తోంది.

" ఎట్టి  పరిస్థితి లో నీకు ఎలాటి హాని చేయను" ప్రాధేయపడుతున్నాడు.

నేను నిర్ణయించుకోలేకపోతున్నాను.

"ఒక్క అయిదు నిముషాలు..అంతే"

" సరే..కాలేజ్ కేంటిన్ దగ్గరకి రా..." అన్నాను.అక్కడైతే జనాలు ఉంటారు.హాని చేసే అవకాశం తక్కువ.

" అలాగే..వస్తున్నా"

చక్కగా ముస్తాబయ్యాను.వెళ్ళడానికి.ఒకవేపు ప్రవీణ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.అసలు అలా చెప్పకుండా ఉంటే బాగుండేది.ఎంత చంచల మనసు నాది.నేను కేంటిన్ కి వెళ్ళేసరికి వరుణ్ వేచిచూస్తున్నాడు.

" మనం మొదటిసారి మాటాడింది ఇక్కడే ..గుర్తుందా " లోపలికి వెళ్ళి కూర్చున్నాక అడిగాను.అవును అన్నట్లు తలాడించాడు.

" నేను నిన్ను కలవాలని చెప్పింది ఎందుకంటే నా జీవితం లో ని కొన్ని మార్పులు గురించి చెప్పాలని"

" ఏమిటవి"

" నా కెరీర్ ని సీరియస్ గా తీసుకోదలుచుకున్నాను ఇక ..అదే ఆ నవల ద బ్లాక్ బుక్ అనే నవల ని రాయబోతున్నా"

"దేని గురించి అది"

" అది నా ఆత్మకధ.ఒక దేవుడు తన కాలేజ్ రోజులు గురించి రాయడం చరిత్ర లోనే మొదటిసారి ..క్రేజీ గా ఉంటుంది గదూ"

" అవును.మంచిది"  
" సంతోషంగా ఉందా నావి వింటుంటే"

" అవును..ఉంది"

"నన్ను చూతుంటే పిచ్చోడి లా అనిపించడం లేదా"

" అలాంటిది ఏమీ లేదు"

" మంచిది.నేను ఈ రోజే చెన్నై వెళుతున్నా.బుక్ రాసిన తర్వాత తిరిగి వస్తా.దాని మొదటి పాఠకురాలివి నువ్వే"

" మరి కాలేజీ అది"

" నా పుస్తకం ద్వారా కావలసినంత సంపాదిస్తా.ఆ బోడి డిగ్రీ ఎవరికి కావాలి..?65 కోట్లు సంపాదిస్తా.మనం బతకడానికి అది సరిపోదా ..ఏమిటి"

"చదువు అయిన తవాత ఎన్నైనా రాయి.అప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తా ..నా మాట విను"


" నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నావు కలిసిన ప్రతిసారి...ఏంటది..?నా ఒపీనియన్ ని ఒప్పుకోవచ్చుగా ...నా బ్లాక్ బుక్ చాలా పెద్ద హిట్ అవుతుంది పారు"

" వరుణ్ ..అది మంచి గా అనిపించడం లేదు"

" నీ దగ్గర అరవనని గుణ కి ప్రామిస్ చేశా.ఇక్కడ రచ్చ కాకముందే నేను చెన్నై వెళ్ళిపోవాలి.ఎవరెక్కడ పడాలో ఆ నరకమే చెపుతుంది.జీవితమే రానీ..భార్య యే పోనీ.. నీకేమి తెలీదు నీవేమి చెప్పకు "  అలా గొణగసాగాడు.ఏదోదో జిబ్బరిష్ గా మాటాడుతున్నాడు.ఇతడిని సైకియాట్రిస్ట్ వద్ద కి తీసుకెళ్ళడం మంచిది అనిపించింది.ఈ కండిషన్ ని వాళ్ళ పేరేంట్స్ కి తెలియబరిస్తే బాగుండేది.రాం చెప్పినట్లు గోవా ట్రిప్ తర్వాత వరుణ్ బాగుపడలేదు.ఒకటి తోచింది ఇతడిని చెన్నై తీసుకుపోయి వాళ్ళ పేరేంట్స్ కి విషయం అంతా తెలియబరిస్తే బాగుంటుంది.

" ఓకే..నీతో పాటు నేను కూడా చెన్నై వస్తాను" అని చెప్పాను.(సశేషం)


 నాపేరు శివ (నవల)Post no:30

చాప్టర్-9

తిరుచ్చి నుంచి చెన్నై ప్రయాణం లో వరుణ్ మరీ పిచ్చి గా ప్రవర్తించసాగాడు.అది బస్ ప్రయాణం.అర్ధం పర్ధం లేని మాటలు ఏవేవో నోటికి వచ్చినట్లు గొణుక్కునేవాడు.అయితే నా జోలికి మాత్రం రాలేదు.అంత వరకు నయం.నేను కూడా తనకి కోపం రాకుండా మసలుకున్నాను.తను చెప్పేదాన్ని వింటూ చిరునవ్వు చిందించేదాణ్ణి.మొత్తానికి ఈ అంకం చివరకి వస్తోంది.ఇతడిని ఏ సైకియాట్రిస్ట్ కో చూపెడితే నయం అవుతుంది.

చెన్నై చేరి కోయం బేడు నుంచి అశోక్ నగర్ లో ఉన్న వరుణ్ ఇంటికి పోవడానికి ఆటో ఎక్కాము ఇద్దరం.ఇదే సరైన సమయం అనిపించింది.డాక్టర్ దగ్గర కి వెళ్ళే విషయాన్ని ఇప్పుడే కదపాలి.చాలా  జాగ్రత్త గా డీల్ చేయాలి.

" ఓ విషయం అడగనా" అడిగాను వరుణ్ ని.

" చాలానాళ్ళకి ..నన్ను ఒకటి అడగాలనిపించింది.గ్రేట్..రెండు వేపులా చానెల్ లా ఉంది.ఇన్నాళ్ళు నీ చానెల్ పని చేయట్లేదేమో అని అనుకున్నా.." వరుణ్ ఇకిలించాడు.

" నువు శివ వని ఎంతమందికి తెలుసు..?"

" నాకు ..నాకు తెలుసు..నాకు తెలుసు.."

" నువు కాకుండా ..ఇంకా ఎంతమందికి తెలుసు"

" నువు..నువు..నువు"

"   మన ఇద్దరం కాక"

" దేవుడు చెడ్డవాడు కాడు..పడ్డ వాడు కాడు..అడ్డ వాడు కాడు..అర్ధం అయిందా "  నోటికి తోచింది ఏదో చెప్పాడు.

" అయింది.."

" అదీ నా పారు అంటే...నువు కూడా కాలేజి మానేసి నాతో కలిసి ఆ బ్లాక్ బుక్ రాయబోతున్నావా"

" అది సాధ్యం అయ్యేది కాదు"

" నువు బుక్ ని కుక్ చేయకపోతే బక్ ని ఎవరు టక్ చేస్తారు"

" మంచోడివి గదా..కొద్దిగా ఆలోచించు నువు శివ అని మొత్తం ఎంత మందికి తెలుసు"

" ఓ..సారి..నేను నా బుక్ గురించి ఆలోచిస్తున్నా..ఇప్పుడు చెప్పు ఏమి అడిగావు ? "

" నువు నేను కాక నువు శివ అని మొత్తం ఎంతమందికి తెలుసు ..?"

" చాలా మందికి తెలుసు...అయితే ఇప్పటికీ వాళ్ళకి తెలీదు నేను శివ నని"

" అంటే..."

" ముందు మనం ఇంటికి పోయి శృంగారం లో తేలాలి... మనం దేవతలు అయిన తర్వాత అలా ఏం చేయలేదు గదా .."

" నేను అడిగినదానికి చెబితేనే అది ..తెలిసిందా"

" ఆవు తో శృంగారం..ఆవు తో శృంగారం" విపరీతం గా నవ్వుతూన్నాడు.నాకు మహా చికాకు లేచింది.

" మనం ఒక డాక్టర్ ని కలవాలి" మెల్లిగా పాయింట్ కి  వచ్చాను.

" ఎందుకు పారు...?ఏమయ్యింది..నీవు ప్రెగ్నేంటా ..అంటే నేను తండ్రిని కాబోతున్నానా.."

" అదీఅం కాదు.నాకు డిప్రెషన్ గా ఉంది...అందుకు" తెలివిగా నాకన్నట్లుగా అబద్ధమాడాను.

" మనం దేవతలం...ఈ మానవులైన డాక్టర్లని కలవడమేమిటి...ఉండు, నేను గుణ ని అడుగుతా దీనికి ఏంచేయాలో" అన్నాడతను.

" ఈ చిన్న విషయాలకి ఆ గుణ దాకా ఎందుకు..ఈ ఒక్క ఫేవర్ నాకు చేయలేవా..?"

" నువు నా లాగే ఆలోచిస్తున్నందుకు..గర్వంగా ఉంది.ఇది వింటే గుణ ఎంత సంతోషపడతాడో తెలుసా..? " నా భుజాల మీద తడుతూ చెప్పాడు వరుణ్.

" అంటే నాతో పాటు డాక్టర్ వద్దకి వస్తున్నావు గా" ప్రశ్నించాను.
" వస్తా..మరి నేనన్నదానికి ఓకె గదా" అడిగాడు వరుణ్.

" అలాగే..డన్"

" అద్భుతం"

" తిరుచ్చి లో ఉన్నప్పుడు మీ పేరేంట్స్ తో ఫోన్ లో ఎన్నిసార్లు మాట్లాడుతుంటావ్"

" వారానికి ఒకటి రెండు సార్లు"

" ఏమేం మాట్లాడతావు"

" బాగున్నావా..అని అడుగుతారు.బాగున్నాను అంటా.నా దైవత్వం గురించి వాళ్ళకి తెలియదు.వాళ్ళు ఇంకా ఆ వార్త విండానికి టైం ఉంది.మనం దేవుళ్ళం అనే విషయం వాళ్ళ దగ్గర అనకు..వాళ్ళు ముందు మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాత,గుణ చెప్పమని అన్నప్పుడు  అప్పుడు చెప్పాలి.."

" అలాగే..కాని ఏమని చెబుతావ్...వాళ్ళకి"

"నేను కాలేజ్ అదీ మానేసి  ,ఒక నవల రాయబోతున్నానని...అరవై అయిదు కోట్లు సంపాదించి ఆ తర్వాత నిన్ను పెళ్ళి చేసుకోబోతున్నానని..అలా"

" బాగుంది.."

" ఈ బుక్ యొక్క గొప్పదనం ఏమిటో తెలుసా...పాలిండ్రోం బుక్ ..!వెనక నుంచి చదివినా ముందు నుంచి చదివినా స్టోరీ ఒకేలా ఉంటుంది.అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరకీ ఇంతదాకా తట్టలేదెందుకో...ఆ తెలివి..ఊహా ..గ్రాహ్యత లేక అనుకుంటాను.."

"హ్మ్మ్"

"ఏంటి పారు...నీ రెస్పాన్స్ చాలా  నిరాశ గా ఉంది..?"

" నీ అంత మేధస్సు ఎవరకీ ఉండదు ...చాలా గొప్ప విషయం...! ఇంకోటి డాక్టర్ దగ్గర కి నాతో పాటు వస్తున్నందుకు నాకు ఆనందం గా ఉంది"

" ఫేక్టర్ ద డాక్టర్ ఇంకా డాక్టర్ ద ట్రాక్టర్ " నోటికి వచ్చింది అర్ధం పర్ధం లేకుండా అన్నాడు.

అలా నోటికి తోచినట్లుగా ఏవేవో వాగుతూనే ఉన్నాడు.రిలీఫ్ అనిపించింది డాక్టర్ దగ్గరకి వస్తా అన్నందుకు.ఇంతకు ముందు ఎప్పుడో చూపెడితే బాగుపడి ఉండేవాడేమో.పోనీలే ఇప్పటికైనా ఏ ఒక నెల లోనో బాగుపడి ..ఆ తర్వాత తన చదువు పూర్తయ్యి ఏ మంచి కంపెనీ లోనో ఉద్యోగం తెచ్చుకుంటే చాలు.ప్రవీణ్ ..విషయం గుర్తొచింది.తన డబ్బులన్నీ పెట్టి ఖరీదైన రింగ్ కొని ఇచ్చాడు.తను నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి నే.కాని అతని తో జీవితం ఊహించుకోలేకపోతున్నాను.ఏమో..అంతా అసందిగ్ధం గా ఉంది.కొన్ని కాలానికే వదిలేయడం మంచిది.

వరుణ్ వాళ్ళ ఇల్లు వచ్చింది.ఆటో డబ్బులిచ్చాను.అపార్ట్మెంట్ కి లిఫ్ట్ లేదు.మెట్లు ఎక్కి వెళ్ళి బెల్ నొక్కగానే ఓ నడికారు ఆంటీ వచ్చి తలుపు తీసింది.

" వరుణ్..." అంటూ కౌగలించుకుంది.

" హాయ్..మాం..ఈమె పార్వతి..అని..నా..నా.." ఏమని చెప్పాలో పదం దొరక్కా ఆగిపోయాడు.

" నేను అతని ఫ్రెండ్ ని.ఆంటీ ప్లీజ్ టు మీట్ యూ.." నన్ను నేను ఆమెకి పరిచయం కావించుకున్నాను.ఆమె ఇద్దర్ని సోఫా లో కూర్చోమని సైగ చేసింది.

" రేపు కాలేజ్ లేదా..చెన్నై లో ఉన్నారు..." కూర్చున్నాక అడిగింది ఆంటి.

" నేను స్నానం చేసి వస్తా " అంటూ వరుణ్ లోపలికి వెళ్ళాడు.  
ఇప్పుడు నార్మల్ గా కనిపిస్తున్నాడు..అందాక సంతోషం.స్నానానికి వెళ్ళిన ఈ గేప్ ని ఉపయోగించికుని చెప్పాల్సిన వివరాలన్ని ఇప్పుడే చెప్పేయాలి.

" అవును నీ పేరు యామిని యా పార్వతి యా" అడిగింది ఆంటి.

" నా అసలు పేరు యామిని.మీ  అబ్బాయి నన్ను పార్వతి అని పిలుస్తాడు" చెప్పాను.

" మంచి పేరు.టీ తాగుతావా"

" నో థాంక్స్...ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడకి వచ్చాను.అది విండానికి కష్టం గానే ఉండచ్చు.కాని నాకు వేరే దారి లేదు ..చెప్పే తీరాలి "

" ఏమయింది" ఆందోళనగా అడిగింది ఆంటి.

"వరుణ్ ..ఒక సీరియస్ మానసిక వ్యాధి తో బాధపడుతున్నాడు.అది ఏమిటి అనేది పూర్తి గా నాకు కూడా తెలీదు.పిచ్చి పిచ్చి గా మాటాడడం,లేని మనుషులు ఉన్నట్లుగా ఊహించుకోవడం..ఇలా చేస్తున్నాడు.ఎంతకాలం నుంచి ఇలా ఉందీ అన్నది నాకు తెలీదు.ఒక నెల క్రితమే గమనించాను.మనం సాధ్యమైనంత త్వరగా డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళడం మంచిది..." చెప్పాను ఆమె కి.

" ఇప్పుడు బాగానే కనిపించాడే...ఫొన్ లో కూడా బాగనే మాట్లాడేవాడు.."

"ఒక అయిదు నిమిషాలు కంటిన్యూ గా మాట్లాడండి..తేడా కనిపిస్తుంది.ఈ మద్య ఏదో బుక్ రాస్తా అంటున్నాడు దానితో 65 కోట్లు సంపాయిస్తాడట.దానికోసం కాలేజ్ కూడా మానేస్తా అంటున్నాడు.ఏదో ఒకటి చేయాలి..లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకునేలా ఉన్నాడు"

" నిజంగా నా..కాలేజ్ మానేస్తా అన్నాడా.." ఆంటీ కలత గా అయిపోయింది.

" ఈసారి చెన్నై వెళ్ళి ఇక కాలేజ్ కి రాను అని అన్నాడు.అందుకే ఇక్కడదాకా వచ్చి ఈ విషయం మీకు చెపుతున్నాను,మనం డాక్టర్ ని కలవడం మంచిది"

" దానికి వొప్పుకుంటాడా .." దిగాలుగా అన్నది.

" నాకు ఏదో ప్రాబ్లెం ఉందని...నాతో పాటు ఆసుపత్రికి రమ్మని తనతో చెప్పాను.ఓకె అన్నాడు.అతను బాగా కోపం గా ఉన్నప్పుడు మీరు విభేదించడం చేయకండి.." చెప్పాను.

" అంకుల్ వేరే ఊరు వెళ్ళాడు...ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా "

" ఇప్పుడే అంత అవసరం లేదులెండి.రేపు మనం ముగ్గురం కలిసి సైకియాట్రిస్ట్ ని కలుద్దాం.ఎవరైనా మంచి డాక్టర్ మీకు తెలుసునా"

" తెలుసు.వరుణ్ వాళ్ళ కజిన్స్ కి కూడా మెంటల్ హెల్త్ బాగ లేక ఓ డాక్టర్ ని కలుస్తుంటారు.అతని పేరు నిర్మల్.అక్కడకే వెళదాం" అన్నది ఆంటి.ఆమె లో ఇంకా ఆందోళన పూర్తి గా పోలేదు.

" హలో..ఎవ్రీ వన్ " బాత్ రూం నుంచి బయటకి వచ్చాడు వరుణ్.

" హాయ్" అన్నాను.ఆంటి నిశ్శబ్దం గా ఉంది.

" ఏం చెప్పుకుంటున్నారు ఇద్దరు..దెయ్యం కధలా" అడిగాడు వరుణ్.

" అసలు ఈ మధ్య నువు ఎంత మంచిగా ఉంటున్నావు అదే చెపుతున్నా..ఆంటీ కి"

" నేను పదిమంది లో ఒకడిని..నా పాపాన్ని గెలిచేవాడిని" నోటికి వచ్చింది అన్నాడు వరుణ్.

" వరుణ్..కాలేజ్ మానేస్తానని అన్నావా యామిని తో..?" ఆంటీ అడిగింది.

" ఆమె పేరు యామిని కావచ్చు..కాని కాదు..నువు నా తల్లివి కావచ్చు..కాని నీను నీకు ఫాదర్ ని" పిచ్చి పిచ్చి గా మాటాడసాగాడు.ఆంటీ ఏడవసాగింది.

" ముందు అడిగిందానికి చెప్పు..కాలేజ్ మానేస్తా అన్నావా  లేదా " ఆంటీ అడిగింది  మళ్ళీ.

" ఏమయింది అమ్మా నీకు... ఏదో చావు ఇంట్లో మాదిరిగా ఉన్నారేంటి అంతా..! పారు..ఒక సాంగ్ ఎందుకు పాడకూడదూ డింగ్ డాంగ్ అనుకుంటూ ..ఆనందపరచడానికి.." వరుణ్ అన్నాడు.

" మీ అమ్మ కి నా డిప్రెషన్ సమస్య గురించి చెపుతున్నాను.రేపు సైకియాట్రిస్ట్ ని కలువబోతున్నాము...ఇప్పుడు డిన్నర్ చేసి పడుకోవాలి,మాతో పాటు నువూ రావాలి " చెప్పాను.

" అమ్మా...పారు ఏమి చెప్పిందో తెలుసా ..ఇలాంటి చిన్న చిన్న వాటికి గుణ ని డిస్టర్బ్ చేయకూడదంది.ఎంత మంచిదో..నువు ఒప్పుకుంటావా "

" గుణ ఎవరు" ఆంటి అడిగింది కళ్ళు తుడుచుకుంటూ.

" గుణ అంటే నేను.గుణ అంటే శివ.నేనే శివ.." అలా చెప్పి,అటు ఇటు రూం లో తిరగసాగాడు.

" పదండి భోంచేద్దాం" అన్నాను.(సశేషం)   


నాపేరు శివ (నవల) Post no:31

సెప్టెంబర్ 23,2013

"వరుణ్ ..కాసేపు నువు బయట వెయిట్ చెయ్యి,ఈ లోగా యామిని కండిషన్ గురించి మాట్లాడాలి" ఓ గంట పాటు వరుణ్ తో మాటాడిన డాక్టర్ అలా కోరాడు.

అదృష్టం..వరుణ్ కి ఏ అనుమానం రాకుండా డాక్టర్ మాట్లాడాడు.చాకచక్యం గా వరుణ్ పరిస్థితి ని తెలుసుకున్నాడు.తనకు తాను దేవుని లా ఫీల్ అవ్వడం,కనిపించని వ్యక్తులతో మాటాడం..ఇలా అన్నిటిని.

" అలాగే ..బయటకి వెళ్ళి స్మోక్ చేసుకుంటా " అని వరుణ్ బయటకి వచ్చేశాడు.

నేను లోపల కి వెళ్ళిన తర్వాత వరుణ్ వాళ్ళ అమ్మని లోపలకి పిలిచాడు డాక్టర్.తలుపు సందు లోనుంచి చూస్తే  వరుణ్ కనుచూపు మేర దూరం లో లేడు.కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాను.

" అతని తో మాట్లాడి అతని ప్రాబ్లెం ఏమిటో అంచనా వేశాను.స్కిజోఫ్రెనియ అనే మానసిక సమస్య తో బాధపడుతున్నాడు తను.భ్రాంతి కరమైన మాటలు వినపడటం,లేని మనుషులు కనిపించడం ఇలాంటివి ఈ వ్యాధి లో జరుగుతుంటాయి.గుణ ఇంకా వాళ్ళ తాతయ్య లు కనబడటం దానిలో భాగాలే..." చెప్పాడు డాక్టర్ .

" ఎలా ..డాక్టర్,మాకు భయం గా ఉంది.." ఆంటి దిగులు గా అంది.

"ఇది పూర్తి గా క్యూర్ కాకపోవచ్చు ..అయితే మందుల ద్వారా ట్రీట్మెంట్ ద్వారా అదుపు లో ఉంచవచ్చు.జీవితాంతం మందులు వాడుతుండాలి.ప్రారంభ దశ లోనే తీసుకొచ్చారు.అది మంచిదయింది.తన అసాధారణ ప్రవర్తన అంతా వచ్చే రోజుల్లో మర్చిపోయేలా చేయవచ్చు.మామూలు అయ్యేలా ..ఆ దశకి తీసుకు రావచ్చు..ఒక ముఖ్యమైన సంగతి ఏమిటంటే.."

" ఏమిటి డాక్టర్.." అడిగింది ఆంటి.

" షిజోఫ్రెనిక్ అనేది జెనిటిక్ డిజార్డర్ అయినప్పటికీ...మీ అబ్బాయికి గంజాయి మితిమీరి సేవించడం వల్ల ఇది అంకురించింది.కాబట్టి ఆ తరహా మత్తు పదార్థాలకి దూరం గా ఉంచాలి.అంటే ..నో స్మోకింగ్..నో డ్రింకింగ్ ...అది గుర్తుంచుకోవాలి.అతనికి ట్రీట్ మెంట్ ప్రారంభించిన తర్వాత ఆల్కాహాల్ అంటే విరక్తి కలిగేలా కొన్ని మందులు ఇస్తాము.దానివల్ల తను తాగలేడు.అయినా ఎలాంటి కాని పరిస్థితి లో ఇంకో విధంగా అయి మత్తు పదార్థాలు సేవించాడో చాలా ఇబ్బందుల్లో పడ్డట్లే ...అది గుర్తుంచుకొండి" అన్నాడు డాక్టర్.

కొడుకు ఇన్ని దుర్వ్యసనాల పాలవడం ఆంటీకి బాధ గా నే ఉన్నది.ఆమె స్థితి ని నేను అర్ధం చేసుకోగలను.

" అలాగేనండి..మీరు చెప్పినవన్ని గుర్తుంచుకుంటాను" అంది ఆంటి.

" గతం  లో జరిగిన వాటిని జ్ఞాపకం చేయకండి..అతను చెప్పమని అడిగినా సరే.." అన్నాడాయన.

" మరి ట్రీట్మెంట్ కి ఎలా తీసుకురావాలి మేము" నేను అడిగాను.

" అది వీలు పడదు..తాను ఒక దేవుణ్ణి అని తనకు శక్తులు ఉన్నాయని వరుణ్ నమ్ముతున్నాడు.మీరు తీసుకురావాలని ప్రయత్నించినా ఇంకా తీవ్రంగా మారతాడు.అలా చేయద్దు"

" తన చదువు అదీ ఎలా డాక్టర్" ఆంటీ అడిగింది.

" మీకు తెలుసో లేదో ..అతను నిద్రపోయి సుమారు రెండు వారాలు అయి ఉంటుంది.మీ ఇంట్లోనే కొన్ని రోజులు ఫ్రీ గా మసలనివ్వండి.ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత అతని బాడి తట్టుకోలేని స్థితి లో స్పృహ తప్పి పడిపోతాడు.అప్పుడు ఆసుపత్రి లో అడ్మిట్ చేసుకొని ట్రీట్ మెంట్ ని ప్రారంభిస్తాము. చెప్పాడు డాక్టర్.

" అలాగే డాక్టర్..థాంక్ యూ " చెప్పాను నేను.

" నా ఫోన్ నంబర్ నోట్ చేసుకొండి.నేను చెప్పిన సమయం రాగానే  నాకు వెంటనే కాల్ చేయండి"

" అలాగే నండి" అన్నాను.
సెప్టెంబర్ 27,2013

నేనిప్పుడు క్లాస్ లో ఉన్నాననే గాని ప్రొఫెసర్ చెప్పేది వినలేకపోతున్నాను.ఏకాగ్రత కుదరడం లేదు.వరుణ్ వాళ్ళ అమ్మ గారికి ఫోన్ చేసి తన బాగోగులు కనుక్కుంటూనే ఉన్నాను.తను అలాగే తనదైన లోకం లో ఉంటున్నాడని చెప్పి,ఆమె రోదిస్తూ ఉండేది.అది నాకూ బాధ గా నే అనిపించేది.నేను ఊహించినట్టు గానే క్లాస్ అయిపోగానే ప్రవీణ్ నా వద్ద కి వచ్చాడు.చిరునవ్వు నవ్వాను.

" హాయ్ కేట్..." అని పకరించాడు.నాకు ప్రవీణ్ పెట్టిన నిక్ నేం అది.

" చూస్తున్నా నీకోసమే..పీరియడ్ అవగానే కలుస్తావని " అంటూ నా పక్క సీట్ ఇచ్చాను.

" నేనూ సేం అదే అనుకుంటున్నా...చెప్పగలవా అది" ప్రవీణ్ అన్నాడు.

" నేను బాగున్నానని..అంతేగా"

" అఫ్ కోర్స్..అది తెలిసిందే...క్లాస్ లో గడిపిన సమయం నీతో ఉన్న సమయం ..ఈ రెండిటిని పోల్చి చూస్తున్నా.."

" అది హాస్యాస్పదం"

" ఆ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి.."

" నాతో ఉన్న సమయం..ఎనెర్జిటిక్ ఇంకా సంతోషమయం..అంతేనా.."

" అది నేను క్లాస్ గురించి అనుకుంటున్నా .." కన్ను గీటుతూ అన్నాడు ప్రవీణ్ .

" ముయ్యి నోరు... ఆ విధంగా కన్ను గీటడాలు నాకు ఇష్టం ఉండదు" అదే విధంగా వరుణ్ తో కూడా తొలి రోజుల్లో అన్న గుర్తు.తనకే అదోలా అనిపించింది.

" అవి నా కళ్ళు..నా యిష్టం..నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా " ప్రవీణ్ అన్నాడు.

" ఎందుకో వరుణ్ పరిస్థితి గుర్తు కి వచ్చి గిల్టీ గా ఉంది"

" ఏమయ్యింది..ఎదైనా సమస్యా"

"సారీ..నేను వరుణ్ గూర్చి ఆలోచిస్తున్నందుకు నీకు తప్పుగా అనిపించడం లేదా .."

" ఏం చేద్దాం..నాకు బాధ గానే ఉంది.కాని అక్కడే ఉండలేము గదా..ముందుకు నడవాలి గదా.అతని ఫ్రెండ్స్ అతని కి ఉన్నారు దమ్ము కొడుతూ ..కంపెనీ ఇవ్వడానికి.నాతో నువు లేకపోతే నీను ఇంకా బాధపడతాను"

" ఆ విధంగా అనకులే ప్రవీణ్..ఈ విధంగా అవుతుందని అతను మాత్రం అనుకున్నాడా.కనీసం వచ్చే ఏడు అయినా తిరిగి మంచిగా అయి కాలేజి కి రావాలి .."

" నువ్వు ఏమయినా అనుకో..ఒకసారి దొంగ అయినోడు ఎప్పుడూ దొంగే"

" ఎందుకు అతడిని ద్వేషిస్తున్నావు...నీకేమి చేసాడని"

" అవును..అసూయ నే..నిన్ను పోగొట్టుకోకూడదనే స్వార్ధం ..సరేనా"
" అతను నిజానికి మంచివాడే..రాం చెప్పినదాని ప్రకారం తను నా చేత ఐ లవ్ యూ అని చెప్పించే దారి లోనే వీటి దారి లోకి వెళ్ళాడు.నేను ఎంత ఇది గా ప్రవర్తించాను..ఆ చిన్న మాట చెప్పడానికి అనిపిస్తోంది"

" ఆ విధంగా చెప్పొద్దు ప్లీజ్"

" ఇక అతడిని ఇంకెంతమాత్రం నేను ప్రేమించలేకపోవచ్చు.కాని నా గుండెలో ఒక జాలి అనేది మాత్రం ఉంది.అతనికి మంచి జాబ్ దొరికి అన్ని విధాలా చక్కగా స్థిరపడాలనేది నా కోరిక"

" ఏది మళ్ళీ చెప్పు"

"నేను అది మర్చిపొయి ముందుకి వెళ్ళడానికి సిద్ధం ప్రవీణ్ "

" యూ మీన్ లవ్ మి"

" నీతో వెంటనే రిలేషన్షిప్ లో ఉండలేను.కొంత టైం కావాలి.అది ఇద్దరకీ మంచిది.నన్ను శక్తి పుంజుకోనీ కొత్త ప్రేమకి"

" నువు ఆ రెండు రోజులు చెన్నై వెళ్ళావు చూడు..ఆ సమయం లో నాకు చాలా బాధ గా అనిపించింది.క్లాస్ లో ,బయటా ఒంటరి గా ఫీలయ్యాను.కొంపదీసి నేను షిజోఫ్రెనిక్ అవుతానేమో,నువు ఒప్పుకోకపోతే నా ప్రేమని"

(సశేషం)


 నా పేరు శివ (నవల),Post no:32

" నీ ప్రేమ నేను అంగీకరించడానికి తొంభై తొమ్మిది పాళ్ళు చాన్స్ ఉంది.ఆందోళన చెందకు.రిలాక్స్ గా ఇలాగే నాతో ఉంటూ ఉండు" అంది యామిని.

" నేను నిరాశావాదిని యామిని.నువు చెప్పింది విని నేనిప్పుడు కొండ ఎక్కినంత గా ఆనందపడాలి,కాని పడను.ఆ ఒక్క పర్సెంట్ మేరకు భయమే...నన్ను నిరాకరిస్తావేమోనని"

" అంత ఇదిగా నన్ను ప్రేమిస్తున్నావా"

" మనం సరైన జంట.ఒకేలాంటి జాబ్ ల్లోకి వెళతాం.మనం...చూస్తూనే ఉన్నావు గా...ఇప్పటిదాకా ఎప్పుడైనా పోట్లాడుకున్నామా ...అది చాలదా ...మనం భవిష్యత్ లో సైతం చక్కగా ఉంటామని..!

" నువు చెప్పింది నిజమే.కాని ఒక సాఫ్ట్ వేర్ జీక్ గా మిగిలిపోవాలని లేదు నాకు .నేను ఒక రచయిత్రి గా కూడా  కావాలని ఆశిస్తున్నా"

" ఏదీ నువ్వింత దాకా ఒక్క స్టోరీ కూడా రాసినట్లు లేదే..!అసలు దాన్ని నువ్వింత సీరియస్ గా తీసుకుంటావని అనుకోలేదు"

" ఇప్పుడు చెప్పాను గా..సరేనా...అది ఏలియన్స్ ల  లవ్ స్టోరీ"

" కనీసం దానిలోనైనా మన ఇద్దరి పేర్లు పెట్టు పాత్రలకి" నవ్వుతూ అన్నాడు ప్రవీణ్ .

" వాటికి మన ఆచారాలు అవీ ఉండవు..అవి ఏలియన్స్ ..అది గుర్తుంచుకో"

" అప్పుడు ఓ పని చెయ్...నన్ను ఎడిటర్ గా పెట్టుకో...హీరో హీరొయిన్ల మధ్య లవ్ సన్నివేశాలు లేని భాగాల్ని తీసేస్తా ..అసలు ఆ నవల అంతా శృంగారమే ఉండాలి.."

" అప్పుడు బోర్ తో పాఠకులు చచ్చి ఊరుకుంటారు"

"ఏమైనా అను..ప్రతి పదిమంది లో ఒకడు నాలాంటి వాడు ఉంటాడు.వాళ్ళకి కావాల్సింది లవ్ సన్నివేశాలే..సరే త్వరలోనే పెద్ద రైటర్ వి అయిపో.."

" నువ్వు పిచ్చివాడివి"

" మా బాగా చెప్పావు"

అక్టోబర్ 12,2013

అనుకున్నదానికంటే ముందు గానే నేను ప్రవీణ్ తో ప్రేమ లో పడ్డాను.ప్రతి రోజు గంటల కొద్దీ మాటలు సాగేవి.నేను చెప్పే ఆ తీపి వార్తకి ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి.ఆ క్షణాన్ని ఫోటో తీయాలి.మళ్ళీ మళ్ళీ చూసేందుకు.

వరుణ్ వాళ్ళ అమ్మతో ఈమధ్య మాటాడినదాని ప్రకారం అతని పరిస్థితి ఏమీ మెరుగు పడినట్లు లేదు.దినమంతా డ్రగ్స్ తోనూ,డ్రింక్స్ తోనూ వెళ్ళబుచ్చుతున్నాడు.ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో తెలియదు.ఎక్కువ కాలం ఉండకూడదనే కోరుకుంటున్నాను.

వరుణ్ కి ఇద్దామని ఒక వాచీ కొన్నాను..బాగుపడినాక ఇద్దామని.కానీ ఇప్పుడు అది ఆసుపత్రి బెడ్ మీద ఉండేప్పుడు ఇవ్వాల్సి వస్తోంది.ఏమైనా ఇక ..ఇదే చివరి సారి అతడిని  చూడటం..నీకు బెస్ట్ ఆఫ్ లక్ వరుణ్..మన పాత రోజుల్ని తలుచుకుంటూ..ఇదే ఇక వీడ్కోలు.

ఉన్నట్టుండి నా ఫోన్ మోగింది.అవతల వరుణ్ వాళ్ళ అమ్మ.

" హలో ఆంటీ .." అన్నాను.

" యామిని..మనం ఎదురుచూసిన సమయం వచ్చింది.పది నిమిషాలక్రితమే వరుణ్ కిందపడిపోయాడు.స్పృహ లేదు.అంబులెన్స్ కాసేపటిలో వస్తుంది.ఆసుపత్రికి తీసుకుపోవడానికి"

" థాంక్ గాడ్..ఆంటీ..! నేను ఈ రాత్రికల్లా అక్కడకి వస్తా.."

" థాంక్స్ అమ్మా...తెలివి వచ్చిన తర్వాత వరుణ్ నిన్ను చూస్తే సంతోషిస్తాడు.."

" తప్పకుండా..ఆంటీ"

" బై"

"బై"

ఎన్నో ఏళ్ళ తర్వాత వరుణ్ ని చూడబోతున్నానా అన్నట్లుగా ఉద్వేగం నాలో..!చెన్నై నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా ప్రేమ ని ప్రవీణ్ కి తెలియబరుస్తా.ఇప్పుడు వరుణ్ దగ్గరకి వెళ్ళి ఈ వాచ్ ఇచ్చేసి వీడ్కోలు పలుకుతా..! ఇక నీకు నాకు చివరి పలుకులే వరుణ్ ..గుడ్ బై..!

(సశేషం)   


 నా పేరు శివ (నవల),Post no:33

పార్ట్-4 ,(Chapter-10)..వరుణ్ చెబుతున్నాడు.

అక్టోబర్ 13,2013

బాగా పట్టేసిన నిద్ర నుంచి లేచిన అనుభూతి కలుగుతోంది.నేను కిందపడిపోవడం,ఆసుపత్రి కి తీసుకురావడం లీల గా గుర్తుకొస్తోంది.చేర్చబడిన ఆసుపత్రి లోనే బెడ్ మీద ఉన్నాను.యామిని నా పక్కనే ఉన్నది.ఆమె కళ్ళు మూసుకొని ఉన్నది.ఆమె ని ఇక్కడ ఇలా చూడటం హాయి గా తోచింది.

అంతా మగత గా ,గందరగోళం గానూ ఉంది.సరిగా ఆలోచన చేయలేక పోతున్నాను.విపరీతమైన తలనొప్పి..నిస్త్రాణ గా ఉన్నది.కొన్ని నెలల పాటు నేను చికాకు గా ప్రవర్తించి ఉండవచ్చు.చాలా కాలం నిద్ర కూడా లేదు.ఆ రోజుల్లో ఏమి జరిగిందో ప్రతిదీ చెప్పమంటే చెప్పలేను.పరిస్థితి అలా ఉంది.యామిని ని అడిగితే చెప్పవచ్చునేమో.

పొగ త్రాగాలని ఆత్రం గా ఉంది.జేబుల్లో చూస్తే ఎక్కడా సిగరెట్స్ కనబడలేదు.అలసిపోయినట్లుగా ,తలపోటు గా ఉంది.ఇప్పుడు సిగరెట్ తాగితే కుతి దీరి కొంత మామూలు గా అవుతానేమీనని నా ఆశ.
నేను కదలడం చూసి యామిని కళ్ళు తెరిచింది." ఎలా ఉంది ఇప్పుడు" నా పై చెయ్యి ఉంచి అడిగింది.

"అన్నీ కోల్పోయినట్లుగా ఉంది.ఇప్పుడు సిగరెట్ తాగాలి,నువ్వు హెల్ప్ చేయగలవా"అడిగాను.

" ఆసుపత్రి లో అలా స్మోక్ చేయడం మంచిది కాదు"

" పావు గంట లో స్మొక్ చేయకపోయినట్లయితే హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది.."

" పోనీ డాక్టర్ ని ఓ మాట అడగనా.."

" అదేం వద్దు..బాత్ రూం లోకి పోయి తాగుతా ..కాస్త తెచ్చిపెట్టు"

"సరే..ఇప్పుడు ఎలా ఉంది..ఫర్లేదా "

" ఒక్క దమ్ము కొట్టి అడిగినదానికి మొత్తం చెబుతా...గోల్డ్ ఫ్లేక్ లైట్స్ తెచ్చిపెట్టు"

" సరే..అయిదు నిమిషాలు ఆగు" అలా అని ఆమె లేచి వెళ్ళింది.

"ఆవలించాను లేచి.గతం పూర్తిగా గుర్తుకు రావడం లేదు.ఈ ఆసుపత్రి నుంచి ఎప్పుడు బయట పడతానో..!మిగతా పనులు చేసుకోవచ్చు.నా మెదడు ని ఎవరో అటు ఇటు నుంచి బలం గా నొక్కుతున్న భావన కలుగుతోంది.ఒక దమ్ము కొడితే సర్దుకోవచ్చునేమో.

యామిని సిగరెట్ లని తెచ్చి ఇచ్చింది.ఆ వెంటనే రూం లోకి నడిచాము.బాత్ రూం లోకి వెళ్ళాము.

" వరుణ్ ఇప్పుడు ఎలా ఉంది " అడిగింది యామిని.నేను సిగరెట్ ముట్టించి తాగుతున్నాను.

" ఇంకా ఓ వారం నిద్ర పోతే బాగుండు అనిపిస్తోంది" అన్నాను.

"ఔను ..రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం ఇప్పుడు"

" మా పేరెంట్స్ ఎక్కడ..?"

" గత రాత్రి ఇక్కడే నిద్రించారు..ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తారు.అందాకా ఏమైనా చెప్పేది ఉంటే చెప్పు"

" నన్ను చూడటానికి వచ్చినందుకు థాంక్స్ యామిని"

" నో ప్రొబ్లం"

సిగరెట్ ఆర్పేసి బయటకి వచ్చి మంచం మీద కూర్చున్నాను.

"నీకు బాగా లేనప్పుడు ఏమి జరిగిందో ..ఆ విషయాలు నీకు గుర్తున్నాయా " అడిగింది యామిని.
" అంతా కలగా పులగం గా ఉంది లోపల"

"అంటే"

"నేను రాం ని కోపపడటం,నిన్ను గోవా లో చికాకు చేయడం,ఇలా కొన్ని గుర్తుకు వస్తున్నాయి.అయితే కారణం ఏమిటో అంతు పట్టడం లేదు."

"అది తప్ప ఏమి గుర్తుకు రావట్లేదా "

కాసేపు ఆలోచించాను." ఆ ..ఇంకొకటి..నేను ఏదో బుక్ రాస్తాను అని చెప్పాను ..రైట్"

" కరెక్ట్.."

" అసలేమయింది నాకు..ఏమిటీ సమస్య"

" ఏమి కాలేదు..కొద్దిగా మతి మరుపు లాంటిది..అంతే"

" నేను ఏమి చేశాను"

" ఈ మతి మరుపు కూడా నీ ట్రీట్మెంట్ లో ఓ భాగమే" చెప్పింది.ఆమె కళ్ళ లో నీళ్ళు.

"ఎందుకు ఏడుస్తున్నావు...నీకు ఏమైనా హాని కలిగించానా" అడిగాను.

"అదంతా తర్వాత మాట్లాడదాము" కళ్ళు తుడుచుకుంటూ అన్నదామె.

" ఇంకోసారి కొద్దిగా స్మోక్  చేయాలి" అలా అని లేచాను.

"ఓకె"
మళ్ళీ మేము బాత్ రూం లోకి వెళ్ళాము.ఎందుకు ఏడ్చింది యామిని..ఎంతగానో గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించాను.నేను ఆమె పట్ల కోపం గా ప్రవర్తించింది గుర్తుకు వస్తోంది.కాని పూర్తి గా ఆ కారణం గుర్తుకు రావడం లేదు.ఏది ఏమైనా ఆమె కి కోపం కలిగించేలా ఇక నేను ప్రవర్తించరాదు అనుకున్నాను.ఇంకో సిగరెట్ పూర్తి చేసి ,వచ్చి మంచం లో కూర్చున్నాను.అప్పుడే నర్స్ వచ్చింది.

" మీరు లోపల స్మోక్ చేస్తే ఎలా " అన్నది ఆమె  వాసన పసిగట్టి.

" అసలు..ఏమిటంటే.." నసిగాను.

" మీరు ఉన్నది ఆసుపత్రి లో..ఇక్కడ పొగతాగరాదు " చెప్పింది నర్స్.

" చూడండి మేడం.. నేను బాగా అలిసిపోయాను.పడుకోవాలి అనిపించి..కాస్త దానికి ముందు స్మోక్ చేస్తే ఉపయోగం ఉంటుందేమోనని చేశా.ఒకప్పుడు చైన్ స్మోకర్ ని.నా పరిస్థితి అర్ధం చేసుకొండి.." చెప్పాను నా స్థితి.

" సరే..అంతకీ అలా అనిపిస్తే పక్కనే రెస్ట్ రూం ఉంది.." చెప్పిదామె.

" తప్పకుండా.థాంక్స్" అన్నాను.
"టేబుల్ మీద మీ బ్రేక్ ఫాస్ట్ ఉంది.అది తినండి..డాక్టర్ గారు కాసేపటి లో వస్తారు.." చెప్పింది నర్స్.

" అలాగే" బుర్ర ఊపాను.ఆమె వెళ్ళిపోయింది.

పళ్ళు తోముకున్నాను గబగబా.యామిని ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నది.ఆమెతో మంచి గా మాట్లాడి ఆనందింప చేయాలని అనుకున్నాను.నా నోటిలో నుంచి మాటలు సరిగా రావడం లేదు.ప్రయత్నించాను వచ్చినంతమేరకు.

" ఏమిటి ఆలోచిస్తున్నావు" అడిగాను యామినిని.

" అసలు నువు ఆ మత్తు పదార్థం ఎందుకు వాడావు..అదే గనక వాడక పోతే నీకు ఇలా అయ్యేది కాదు" మెల్లిగా అన్నది.

" నన్ను క్షమించు" అన్నాను.కొన్ని నిమిషాల నిశ్శబ్దం.ఆ ముద్దులొలికే మోము ని చుంబించాలని అనిపించింది.దగ్గరకి జరగ్గా ఆమె నన్ను పక్కకి తోసింది.(సశేషం)


నా పేరు శివ (నవల),Post no:34

"కనీసం నేను ముద్దు పెట్టుకోకూడదా"అడిగాను తృణీకార బాధ లో..!

"ఇప్పుడు కాదు వరుణ్.."దూరంగా చూస్తూ అంది యామిని.

" నన్ను ప్రేమించడం లేదా "

" అదని కాదు.ప్రస్తుతం నాకు మూడ్ లేదు"

"నువు మారిపోయిన ఫీలింగ్ కలుగుతోంది..దూరం ని మెయింటైన్ చేస్తున్నావు"

" నా ప్రాధాన్యతలు ఇప్పుడు వేరు వరుణ్ .."

"అంటే దానిలో నేను లేను అన్నట్టేగా .."

"నేను ఎన్నో వాటిని భరించాను.నువు దానికి కారణం.మన మధ్య కొన్ని జరిగాయి.ఆ జ్ఞాపకాల నుంచి నేనిప్పుడే బయటకి రాలేను.ఆ ప్రేమ చిగురించిన దినాల్ని ఇప్పుడు ఊహించను కూడా లేను.నాలో ని ఆ గందరగోళం ఇంకా పెరుగుతోంది.."

"అంటే ఇంకో అతడిని ప్రేమించావా ..." ఆమె ఇచ్చే సమాధానం నన్ను కలవరపెట్టినా ..సరే అనుకొని ప్రశ్నించాను.

" లేదు.." కాసేపు ఆగి అన్నదామె.ఎందుకో ఆమె వాలకం చూస్తే ఒక దూరం ని కోరుకుంటున్నట్లు అర్ధమవసాగింది.అలా మౌనంగా పదినిమిషాలు గడిచింది.ఆమె చేతికి ఉన్న ఉంగరం ని చూశాను.మాటాడ్డానికి ఒక అంశం దొరికింది.మౌనంగా ఉండడం కంటే.

" నీ వేలికి ఒక ఉంగరం కొత్త గా కనిపిస్తోంది" అడిగాను.

"ఒక ఫ్రెండ్ ఇచ్చింది"  నవ్వుతూ అన్నది.

" ఆడ ఫ్రెండ్  నా లేక మగ నా"
"అది నీకు అనవసరం.ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చినది అని చెప్పాగా..అది చాలు"చెప్పింది ఆమె.

" ఎందుకు..యామిని ఈ విధంగా నటిస్తున్నావు..?ఈ మత్తు పధార్థాల్ని వదిలేస్తాను.నిన్ను మంచిగా చూసుకుంటా..." నిరాశ గా అయిపోయాను.ఈ ట్రీట్మెంట్ వల్లనేమో ఎక్కువ ఆలోచించడానికి గాని మాటాడానికి గాని శరీరం సహకరించడం లేదు.

"నీ మంచి కోసమైన నువు మారాలి,చక్కగా రికవర్ అయి భవిష్యత్ లో మంచి జాబ్ తెచ్చుకోవాలి.."

" నువు లేకుండా అది ఎలా..?నీకు తెలుసు అది.." నా కంటి లో నీళ్ళు అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించాను.ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను.

" ఇప్పుడు అవన్నీ ఎందుకు..వద్దులే"

"సర్లే"

" నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను..నీకు బాగా నచ్చుతుంది" అన్నది యామిని.టేబుల్ మీద ఉన్న పర్స్ లోనుంచి తీసింది.అది ఒక వాచ్.

" మన తీపి గుర్తులు అన్నిటికీ కలిపి ఈ గిఫ్ట్ ఇస్తున్నా.ఇది ఎప్పటికీ అలా ఉండిపోతుంది ఇద్దరి లో.ఎక్కువ కాలం కొనసాగని ప్రేమ కి కూడా ఓ గుర్తు గా ..." అలా చెప్పి ఆ వాచ్ నాకు ఇచ్చింది.

" దయచేసి అలా అనవద్దు యామిని" నాకు కన్నీళ్ళ పర్యంతమయింది.

" బాధపడకు..ఇలా చేయడం నాకూ బాధ నే కాని నా చేతి లో ఇంతకంటే ఏమీ లేదు.." అందామె.

"ఓ కె" వస్తున్న కన్నీళ్ళని ఆపుకున్నాను.ఇంతలో రాం వచ్చాడు లోపలకి.ఇద్దర్నీ విష్ చేసి మంచం మీద కూర్చున్నాడు.

" రాం.నువు ఇక వరుణ్ ని చూసుకో..నేను తిరుచ్చి వెళ్ళిపోతున్నా" చెప్పింది యామిని.

" తప్పకుండా.థాంక్స్ ఇప్పటిదాకా ఉన్నందుకు" అన్నాడు రాం.

" బాయ్ వరుణ్...ఆల్ ద బెస్ట్ " అలా చెప్పి ఆమె కి సంబందించిన సరంజామా అంతా తీసుకొని బయటకి నడిచింది.
"ఎందుకు అదోలా ఉన్నావ్" అడిగాడు రాం.నా పక్కనే కూర్చుని.

" యామిని నా నుంచి దూరం అవుతోంది డ్యూడ్.."నా రెండు చేతుల్తో తల పట్టుకొని చెప్పాను.

"ఏమిటి..ఇప్పుడు గాని గొడవ పెట్టుకున్నావా ఏమిటి..?"

" అసలు సరిగా మాటాడ్డానికే ఇపుడు నాకు ఓపిక లేదు.నేనేం అంటాను.ఎందుకో ఆ నిశ్శబ్దం..ఆ మాటలు అన్నీ అలా నే ఉన్నాయి..నా మీద ఇంటెరెస్ట్ పోయింది ఆమెకి "

" ఏమి బాధపడకు మిత్రమా..!నీనుంచి అంత ఈజీ గా ఏమీ వెళ్ళిపోదు.నీకు ఆరోగ్యం కుదుటపడే దాకా కాస్త ఓర్పు గా ఉండు.మళ్ళీ ఓ ట్రిప్ కి ప్లాన్ చేసుకో బాగయినతర్వాత.."

"సరే..ఆశిస్తా.ఆ తిరుచ్చి నుంచి నన్ను బాధపెట్టడానికే వచ్చినట్లుంది...ఎంత ప్రేమించా ఆమె ని "

" ఇది బాధపడే సమయం కాదు.ముందు నీ మానసిక ఆరోగ్యం బాగుపడనీ"

" అవును..నా సమస్య ఏమిటి..ఖచ్చింతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు" ప్రశ్నించాను రాం ని.

" జీవితం లో ఉండేవన్నీ సవాళ్ళే తప్పా సమస్యలు కాదు..నీకెదురైంది అలాంటి వాటిలో ఒకటి.."

" నా మెదడు సరిగ్గా ఉన్నట్టులేదు.ఏదో సీరియస్ గా నే ఉన్నట్లుంది.యామిని ఆమె  ప్రాధాన్యతల్లో నేను లేనని చెప్పింది.పుండుమీద కారం లా ఓ వాచ్ కూడా గిఫ్ట్ ఇచ్చింది గుడ్ బై చెబుతున్నట్టు గా ..ఏ సవాల్ గా భావించాలి దీన్ని"

" అవును సవాలు గా నే తీసుకోవాలి.ఇకమీదట చక్కగా మందులు తీసుకోవాలి.నీ ఆరోగ్యం బాగుచేసుకోవాలి.నిన్ను చూసి యామిని నే వచ్చేలా చేయాలి.అవునా కాదా .."

" ఏమో..ఆమె నన్ను మళ్ళీ ప్రేమిస్తుందా ..నమ్మకం లేదు"

" నువు కాసేపు ఆమె వైపు నుంచి కూడా ఆలోచించు.షాక్ నుంచి ఆమె కూడా ఇప్పుడే రికవర్ అవుతోంది.నీకు తెలియని స్థితి లో ఆమె భరించలేని కొన్ని పనులు నువు చేశావు.కాలం గడుస్తున్న కొద్దీ ఆమె మర్చిపోతుంది.ఎప్పటిలానే మళ్ళీ ఉంటుంది.."

" ఇంకో బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుంటే"

" అలా ఏం జరగదు.."

" పద..అలా బాత్ రూం లోకి పోయి సిగరెట్ కాలుద్దాం.."

" హాస్పిటల్ లో ఎలా.."

" నర్స్ నాకు పర్మిషన్ ఇచ్చిందిలే.." చెప్పాను.అలా ఇద్దరం రూం లోకి వెళ్ళి పొగ తాగసాగాము.

" నేను బాగా లేనప్పుడు..ఆ సమయం లో ఏమేం చేశాను " అడిగాను రాం ని ఆసక్తి గా.ఏ స్థితి లో ఇక్కడికి వచ్చాను..ఇంకా జరిగినవి అన్నీ జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాను.యామిని కూడా దాట వేసింది.రాం అయినా చెపుతాడని ఓ ఆశ.

" ఇప్పుడు అవన్నీ ఎందుకు ..తల్చుకొని చేసేది ఏమిటి.." రాం దాటవేశాడు.

" ఒక చిన్న హింట్ ఇవ్వకూడదా..?"

" నీ సోయి లో నువ్వు లేవు.ఏదేదో మాటాడేవాడివి..చిన్నదానికి కోపం వచ్చేది..అలా"

"ఓహో.."

"ఇప్పుడు అవన్నీ ఆలోచించకు ...నీ స్థితి హాయిగా ఉందిప్పుడు.ఈ ప్రశ్న మరీ మరీ అడగకు.జరిగిందేదో జరిగింది.వాటిని తల్చుకోకు.సరేనా.."

" నేను ఒక బుక్ రాస్తా అని చెప్పినట్టు గుర్తు..అది కూడా అర్ధం  లేనిదేనా..?"

" అంతే..అనుకో"

"మంచిది" (సశేషం)


 నా పేరు శివ (నవల) Post no:35

" నేను నీతో రెండు విషయాలు చెప్పాలి.ఒకటి చాలా ముఖ్యమైనది.రెండవది సాధారణమైనది.ఏది ముందు చెప్పమంటావు..." రాం ప్రశ్నించాడు.

" నీ ఇష్టం"

"సరే..ముందు ముఖ్యమైనదే చెప్తాను.మన కాలేజ్ పరిధి లో ఉన్న పోలీస్ అధికారి నీ గురించి అడిగాడు.నిన్ను కలిసి మాట్లాడాలి అన్నాడు.ఓ రెండు రోజుల క్రితం చెప్పిన సంగతి ఇది "

"ఏమి పని నాతో..నాతో మాట్లాడేది ఏముంటుంది"

" ఆ వివరాలు అతను చెప్పలేదు.నీ ఆరోగ్యం బాలేదని చెన్నై ఆసుపత్రి లో ఉన్నావని నేను తెలిపాను.బాగయిన తర్వాత నిన్ను ఓసారి కలవమన్నాడు"

"సరే..కలుస్తాను "

"ఆ..ఇంకొకటి...అప్పుడు ..నాకు ఓ అమ్మాయి పరిచయం అయిందని..ఒక వింత టైప్ అని చెప్పా.." నవ్వుతూ అన్నాడు రాం.

"నాకు గుర్తు రావడం లేదు"

" అదే డేటింగ్ సైట్..లో"

""సారీ మేన్..ఈ ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా సమస్య ఉందిలే..గుర్తు రావట్లేదు"

"నేను చెబుతా.కంగారు పడకు.నేను ఒక అమ్మాయి లా అకౌంట్ ఓపెన్ చేసి ఆన్ లైన్ లో మరో వ్యక్తి తో పరిచయం చేసుకోవడం..ఆ అమ్మాయి తర్వాత నాకు ఝలక్ ఇవ్వడం.."

"ఆ..ఆ..గుర్తుకు వస్తోంది" నవ్వుతూ అన్నాను.

" మొత్తానికి అనేక మలుపులు తిరిగి కధ సుఖాంత మయింది.. నా ప్రియురాలిగా మారిపోయింది "
"చాలా సంతోషం...చెన్నై అమ్మాయేగా.."

"అవును"

" పేరు"

"అనూష"

"బాగుంది"

"ఆ..ఇంకోటి..."చెప్పాడు రాం.బాత్ రూం నుంచి స్మోకింగ్ ముగించి బయటకి వచ్చాము.

"చెప్పు.."

"ఇంకెప్పుడూ ఆ గంజాయి జోలికి వెళ్ళకు...నిన్ను పాడు చేసింది "

"ఇక మీదట వెళ్ళను.."నాకిలా అవుతుందని ఏ మాత్రం అవగాహన ఉన్నా దీని జోలికే వెళ్ళేవాణ్ణి కాను.

"నువు నమ్మవు.నేను పూర్తి గా మానేశాను ఆ అలవాటుని.దాన్ని తీసుకోవడం వల్ల ఏదో గొప్ప మేధోశక్తి వస్తుందనే భ్రమ లో నుంచి బయటపట్టాను.ఆ వల లో నేనూ పడి నిన్నూ లాగాను.దానికి సారీ.."

"నిన్ను క్షమించాను డ్యూడ్ ..అదేం ఫీలవ్వకు"

ఇంతలో మా అమ్మానాన్నలు లోపలికి వచ్చారు.

"వరుణ్..ఇప్పుడు ఎలా ఉన్నది" మా అమ్మ అడిగింది.

"ఫరవాలేదు మాం.రాం కి థాంక్స్ చెప్పాలి" అన్నాను.

" బ్రేక్ ఫాస్ట్ చేశావు గదా" అడిగాడు నాన్న.

"అయింది డాడ్.."

" ఇందాకనే డాక్టర్ తో మాట్లాడాము.అయిదు రోజుల్లో డిస్చార్జ్ చేస్తాను అన్నారు" నాన్న వివరించాడు.  
  "ఓహో..అయితే ఆ తర్వాత నేను తిరుచ్చి కి తిరిగి వెళిపోతాను" చెప్పాను.

"అయితే డాక్టర్ గారు..ఈ ఒక్క సంవత్సరం ఇంటి వద్దనే ఉండమంటున్నారు.ఒక వేళ కాలేజ్ కి వెళ్ళగలిగినా చదువు కి సంబందించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి..అర్ధం చేసుకోవడం లో ఇంకా అలా.." అమ్మ వివరించింది.

" ఏంటి మాం..తొమ్మిది నెలలు ఇంటివద్దనే ఉండాలా" నిరాశ గా స్పందించాను.

"చెన్నై లో ఉన్న గుళ్ళు అన్నీ దర్శించుకుందాము.అందరం కలిసి ఉన్నట్టూ ఉంటుంది.నీ ఆరోగ్యానికీ గాని దైవాన్ని దర్శించుకోవడం లో గాని ఒక స్వాంత్వన ఏర్పడుతుంది.." చెప్పింది అమ్మ.
" ఆనందం గా ఉండు మిత్రమా.ఇదొక వెకేషన్ లా అనుకో.ఫైనల్ ఇయర్ కి ప్రిపేర్ అవుతున్నా అనుకో.." రాం అనునయించాడు.

" ఇది ఓ సమస్య లా అనుకోకు వరుణ్..మేమంతా ఉన్నాంగా.." నాన్న మాట అది.

" సరే..ఓ రిలాక్స్ లా ఫీలవుతా చెన్నై లో ఉంటూ.." అన్నాను చివరకి.

" చాలా చక్కగా చెప్పావ్.." నాన్న ఆభినందించాడు నన్ను.అంత లో డాక్టర్ వచ్చాడు.

" హాయిగా నే ఉంది గదా వరుణ్.." డాక్టర్ ప్రశ్నించాడు.

" బాగానే ఉంది.అయితే తలనొప్పి మాత్రం అనిపిస్తోంది.ఆలోచించడానికి గాని మాట్లాడాడానికి గాని ఓపిక ఉండడం లేదు " చెప్పాను.

"తాత్కాలికంగా అలా ఉంటుంది.నిన్న ECT రెండు సిటింగ్స్ అయినాయి గదా ..బలమైన డోస్.అలా అనిపిస్తుంది.నిన్ను డిస్చార్జ్ చేసే రోజుకల్లా అంతా సర్దుకుంటుంది.మామూలు గా అయిపోతుంది.ఓ రెండు నెలల్లో నువు మొత్తం గా ఈ సమస్య నుంచి కోలుకుంటావు" డాక్టర్ చెప్పాడు.

" ECT అంటే ఏమిటి సార్" అడిగాను.

" ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపి అని..నీ విషయం లో ఆ ట్రీట్మెంట్ జరిగింది"

" నా జబ్బు కి ఏమైనా పేరు ఉందా"

" లేకేం..ప్రతి దానికి ఓ పేరు ఉంటుంది.."

"ఏమిటి అది"

" షిజోఫ్రెనియా " డాక్టర్ చెప్పాడు.

" దీని లక్షణాలు ఏమిటి"

" అర్ధం లేని మాటలు మాట్లాడటం..లేని మనుషులు ఉన్నట్లు కనబడటం...లేని శబ్దాలు వినబడటం..ఇలా .."

" అలా నాకు  జరిగిందా" ప్రశ్నించాను.

"గతం గురించి ఆలోచించకు.నీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము.రోజు చక్కగా మందులు వేసుకో.ఆనందం గా ఉండు.అంతా నయమవుతుంది.నేను గ్యారంటీ ఇస్తున్నాను.." చెప్పాడు డాక్టర్.

ఇక నేను ఏమీ అడగదలుచుకోలేదు.రాం చెప్పింది నిజం.ఇలాంటిది మళ్ళీ రాకుండా నా జాఫ్రత్త నేను తీసుకోవాలి.గతం ని మర్చిపోవడమే మేలు.

" థాంక్స్ డాక్టర్.." చెప్పాడు నాన్న ఆయనకి.

" ఆ దేవుడికే చెప్పాలి ఆ మాట.ఆ..అన్నట్టు ఒక ముఖ్యమైన మాట...వరుణ్..! " డాక్టర్ నాకేసి తిరిగి చెప్పాడు.

" ఏమిటి అది"

"ఎట్టి పరిస్థితి లోనూ నువు ఆల్కాహాల్ గాని ఆ మత్తు పదార్థం గంజాయి గాని వాడకూడదు.."

అక్టోబర్ 18,2013

నేను డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చేశాను.ఆ చివరి అయిదు రోజులు పది ECT సిటింగ్స్ అయ్యాయి.ట్రీట్మెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా నా మతిమరుపు కొనసాగింది.పొద్దున తిన్న పదార్థం ఏమిటో గుర్తుండేది కాదు.క్రమేణా ట్రీట్మెంట్ పాళ్ళు తగ్గుతూ వచ్చింది.రెండు వారాలకి ఓ సిటింగ్ ఉండేది.ఇంకో పది సిటింగ్స్ తర్వాత మామూలు జీవితం లోకి ప్రవేశిస్తాను.ఒక కొత్త జీవితం లోకి. (సశేషం)


 నా పేరు శివ (నవల),Post no:36

యామిని ని నుంచిబయటపడలేకపోతున్నాను.ఎప్పుడూ ఆమె ఆలోచనలే వస్తున్నాయి.ఒక చిత్ర హింస లా ఉంది.రోజు కి రెండు సార్లు చొప్పున కాల్ చేసినా ఆమె నుంచి జవాబు రావట్లేదు.ఆమె  ప్రాధాన్యతలు నిజం గానే మారాయా ఏమిటి ఆ రోజు చెప్పినట్టు..!ఇక నా జీవితం అంతేనా..!గోడ గడియారం కేసి చూస్తే పదింబావు అయింది.పొద్దున్నే ఏం చేస్తాం..కొద్దిగా గిటార్ వాయించుదాము అని తీశాను.Led Zepplin పాట Stairway to heaven వాయించుదామని ప్రయత్నించాను.ఇది ఆశ ని పాదుకొల్పే పాట గా ఆ గాయకుడు భావించేవాడు.నా భవిష్యత్ కి అన్వయించుకుంటూ పాడాలని ప్రత్నించాను.

విచిత్రం..ఆ నోట్స్ ఏమీ గుర్తు కి రావడం లేదు.ఇంకోటి ట్రై చేద్దామని అనుకున్నాను.స్వీట్ చైల్డ్ ఆఫ్ మైన్ అని ..!ప్చ్ ..లాభం లేదు.ఇదీ మర్చిపోయాను.ఇక ఎందుకు లే అని గిటార్ ని అవతల పెట్టేశాను.నా లాప్ టాప్ తీసి చూస్తే..గతం లో ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనే ఆంగ్ల సినిమా చూసినట్లు గా ఉన్నది.మళ్ళీ చూద్దామని ప్రయత్నించా.పదిహేను నిమిషాలు చూసిన తర్వాత ఇక చూడలేకపోయా..ఏకాగ్రత కుదరడం లేదు.నిజానికి అది నాకు బాగా నచ్చిన మూవీ.చ..ఏమిటో ఇలా ..!

యామిని ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఇక ఎక్కువ గుర్తుకు రాసాగింది.అలానే ఉన్నా కాసేపు.స్లం డాగ్ మిలియనీర్ లో పాట బెడ్ మీద వాలి పాడసాగాను.ఆ పాత రోజుల్లోని మాధుర్యాన్ని ఊహించుకుంటూ..!ఇది పాడుతున్న కొద్దీ నిరాశ గానే ఉంది..కాని మంచి అనుభూతి కలుగుతోంది మరో వేపు. అంత లోనే డోర్ బెల్ మోగింది.అది యామిని యా.కాదు..మహా అయితే ఒక శాతం అయ్యే చాన్స్ ఉంది.వెళ్ళి తలుపు తీశాను.

" ఆంటీ ఉన్నారా" ఒక యువతి అడిగింది.ఆమె ఆరంజ్ రంగు చీర లో ఉంది.చామన చాయ రంగు.కొద్ది గా బొద్దు గా ఉంది.అయితే మంచి ఆకర్షణీయం గా ఉన్నది.

" లోపలకి రండి.." ఆహ్వానించాను.ఇంతలో అమ్మ వచ్చింది.

" హలో..ప్రియా...ఏమిటి ఇవాళ చీర లో ఉన్నావు..? చాలా బాగుంది నీకు  " అమ్మ అన్నది ఆ అమ్మాయితొ.

"థాంక్స్ ఆంటీ.ఈ రోజు నా బర్త్ డే.స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాను" ఆ అమ్మాయి నవ్వుతూ స్వీట్ బాక్స్ ని అమ్మ కి ఇచ్చింది.

" హేపీ బర్త్ డే అమ్మాయ్.." అమ్మ విష్ చేసింది.

"థాంక్స్" అంది ఆ అమ్మాయి.

"చక్కని మసాలా చాయ్ పెట్టిస్తాను..అలా కూర్చో ప్రియా"

" నాక్కూడా ఇవ్వు" అన్నాన్నేను.

" ప్రియా..ఇతను మా అబ్బాయి వరుణ్ " నన్ను పరిచయం చేసింది అమ్మ ఆమెకి.

" హాయ్ వరుణ్" అంది ఆమె.

"ఆంటీ మీ గురించి చాలా చెప్పింది" మళ్ళీ ప్రియ నే అన్నది.

" ఓహో..అలాగా" అన్నాను.

" తిరుచ్చి లో MIIT లో చదువుతున్నారట గదా "

" ఔను"

"అయితే మీరు మంచి ఇంటిలిజెంట్ అనే అర్ధం.నా లాంటి వారికి అది ఒక కల లానే మిగిలిపోయింది"

" అలా ఏమీ అనుకోవద్దు"

"హాస్టల్ లైఫ్ ఎలా ఉంది" ప్రియ అడిగింది నన్ను.
"డే స్కాలర్ గా ఉండడమే మంచిది.హాస్టల్ లో ఉన్నదగ్గర్నుంచి లేనిపోని అలవాట్లు అవుతాయి"

" అలా ఎందుకు అవుతుంది..దేనికైనా మన నిగ్రహాన్ని బట్టే ఉంటుంది"

"సరే..ఏదైనా కాని" అన్నాను.

ఇంతలో అమ్మ టీ ఇచ్చింది.తాగుతూ ఇరువురము చూసుకోసాగాము.ఏమి మాటాడట్లేదు.అదోలా ఉంది.బైక్ మీద అలా తిరిగొస్తే బాగుంటుంది అనిపించసాగింది.

" ప్రియ వాళ్ళు ఉండేది మన అపార్ట్మెంట్ లో నే.గుళ్ళో పరిచయం అయింది.తీరా చూస్తే మన పొరుగు ఇల్లే.చాలా మంచి అమ్మాయి" అమ్మ చెప్పింది.

" ఓకె" అన్నాను.

"అలా బయటకి వెళ్ళి రండి" అన్నది అమ్మ.

"అలాగే ఆంటి.అలా నడుచుకుంటూ వెళతాము" అంది ప్రియా.ఇద్దరమూ బయటకి నడిచాము.

"చదువు అయిన తవాత ఏమి చేద్దామని..." అడిగింది ప్రియా నడుస్తూ.

"ఏదో జాబ్"

"బావుంది.."

చాలా సేపు అలా నడుస్తున్నాము.బయట.మాటాడుకోకుండానే.మరీ నిశ్శబ్దం గా ఎందుకని" హేపీ బర్త్ డే ..మీరేమి చేస్తున్నారు" అని అడిగాను.

"వెలాచెరి లో కాల్ సెంటర్ లో పనిచేస్తున్నా.నాకు ఒకటి చెప్పండి"

" ఏమిటి.."

"ఇంటిలిజెన్స్ అనేది జన్మతహ వస్తుందా లేదా ప్రయత్నం తో వస్తుందా"

" గూగుల్ కొట్టి చూస్తే సరి"

"మీరు మిత భాషి అనుకుంటాను"

"నేను బోరు కొట్టేస్తే సారీ"

"అలా అని కాదు..మీరు దేని గురించో ఆలోచిస్తున్నట్లుగా ఉంది"

"మీరు చెప్పింది రైటే.నేను అంత మంచి మూడ్ లో లేను"

" నాతో చెప్పవచ్చుగా ..ఏమిటి విషయం"

"మళ్ళీ కలిసినపుడు చెపుతా.."

"అంటే మళ్ళీ మనం కలుస్తామని భావిస్తున్నారా.."

"
దానిదేముంది..మీకు ఏ సమస్య లేకపోతే నే.."

" మీ ఫ్రెండ్ గా ఉండాలనే నా కోరిక.మీ వంటి తెలివైన వారినుంచి నేను ఎంతో నేర్చుకోవచ్చు"

" అది పెద్ద విషయం కాదు"

"నేను చాలా చిన్నతనం గా ఫీలవుతుంటా.మంచి తెలివైన వారిని చూసినపుడు.నాకెందుకు దేవుడు అలాంటి తెలివి ఇవ్వలేదని"

" అన్నిటికన్నా ముఖ్యం మనం హేపీ గా ఉన్నామా లేదా అన్నదే ప్రధానం.నాకు ఎన్నో ఫార్ములాలు గట్రా తెలిసి ఉండచ్చు.కాని సంతోషం లేకపోతే..అంతా వృధానే.కాబట్టి అలా యోచించడం మానేసి హాయి గా ఉండడం మీద దృష్టి పెట్టడం మంచిది."

" మీరు ఆనందం గా ఎందుకు లేరు..?"

"చాలా ఉన్నాయి.చెప్పానుగా.మళ్ళీ కలిసినప్పుడు మాటాడుదాం"

"అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా" అన్నది ప్రియా.

" నాకు ఫోన్ లేదు" అన్నాను.

" బావుంది"

"ఇంటికి పోదామా" అడిగాను.

" అలాగే"

ఆమె కి గుడ్ బై చెప్పి ఇంటిలోకి వచ్చాను.డ్రీంస్ ఆన్ ఫైర్ పాట వినాలి.కొన్ని సార్లైనా.అలా నా విచారాన్ని కప్పిపెట్టాలి.ఇప్పుడు యామిని నా దరికి వచ్చే మాటయితే ఆ అవకాశాన్ని నేను పూర్తి గా ఉపయోగించుకుంటాను.గతం లో లా కాకుండా ఆ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడతాను.అయితే మరో రకమైన ఆలోచన నాలో కలిగింది.ఆమె ఎవరితోనో తన బంధాన్ని కొనసాగిస్తుంటేనో...అసలు ఆమె ఎప్పటికి నాతో మాట్లాడటానికి ఇష్టపడకపోతేనో..!ఎప్పుడు ఈ పాట వింటూ ఊహించుకుండమేనా..లేదా బయటపడగలనా ఈ స్థితి నుంచి..కొత్త జీవితం ని మొదలు పెట్టగలనా మళ్ళీ..? (సశేషం)


నా పేరు శివ (నవల)Post no:37

చాప్టర్-11

డిసెంబర్ 22,2013.

గత రెండు నెలల్లో యామిని కి రెండు వందలసార్లు అయినా ఫోన్ చేసి ఉంటా.ఒక మూడు సార్లు ఎత్తినా, బిజీ గా ఉన్నానని చెప్పి పెట్టేసింది.పరీక్షల కి చదువుకోవలసి ఉందని చెప్పినా , నాకు తెలుసు అది అబద్ధమని.ఈ ఒంటరి తనం లో మరీ బాధ గా అనిపించింది.రోజుకి పన్నెండు నుంచి పదమూడు గంటలు నిద్ర లోనే ఉంటున్నాను.వేసుకుంటునా మాత్రల ప్రభావం..అది.సరిగా ఆలోచించడానికి గాని మాటాడ్డానికి గాని ఓపిక సరిపోవడం లేదు.కొంత కాలం అయినాక అంటే కాలేజ్ కి వెళ్ళే సమయం కల్లా మందుల డోస్ తగ్గిస్తానని డాక్టర్ చెప్పాడు.అప్పుడు నేను పూర్తి గా బాగయినట్టు లెక్క.

టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో ఇప్పుడు రాం ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ అనూష లతో కలిసి ఒక బార్ లో కూర్చుని ఉన్నాను.వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయారు.నా ముందరే ఏవో స్వీట్ నధింగ్స్ చెప్పుకుంటున్నారు.ఇక మామూలప్పుడు ఎలా ఉంటారో ఊహించగలను.

" రాం తన ఫ్రెండ్స్ లో నిన్నే మొదట గా నాకు ఇంట్రడ్యూస్ చేసింది" అన్నది అనూష నాతో.

"దానికి చాలా కారణాలున్నాయి" రాం చెప్పాడు.

"ఏమిటి అవి" అడిగందామె.

" మొదటిది...నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ లేరు...నాకు ఫ్రెండ్స్ క్వాంటిటీ లో కంటే క్వాలిటి లో కావాలి.రెండవది..నాకు వరుణ్ బెస్ట్ ఫ్రెండ్...మూడవది..అతను నిన్ను సిస్టర్ మాదిరి గా భావిస్తాడు.అది నాకు చాలా ముఖ్యం..ఇక నాల్గవది.." అనబోతున్నాడు.

" అక్కడే ఆగిపో.ఓ రోమియో..అదే నీలో నాకు నచ్చింది ఇంకా నచ్చనిది..!ప్రతిదానికి బారెడు  చెపుతావు.ఈ సారికి వదిలెయ్యి" అన్నది అనూష.

" నా నిర్ణయాలు అన్నిటికి బలమైన కారణాలు ఉంటాయి.అవి వినడం నీ డ్యూటి కాదా" అనూష చేతులు పట్టుకుంటూ అన్నాడు రాం.

"నాకు అలాంటి డ్యూటీలు సుతారమూ గిట్టవు.." నవ్వుతూ అన్నది ఆమె.
"కనీసం మన పుట్టబోయే కొడుకు ముందు అయినా నా మాట విను..ఇప్పుటి సంగతి ఎలా ఉన్నా" అన్నాడు రాం

"కూతురే కావచ్చు గా అది..నాలానే అవుతుంది" ఉడికించింది ఆమె.

"కాదు కొడుకే కావాలి..వాడు నాలాగే అవ్వాలి.పోనీ వరుణ్ అడుగు"

" నువ్వే చెప్పు వరుణ్.." అందామె.

" ఆడ అయినా మగ అయినా..ఎవరైనా ఒకటే.అయితే నాలా మాత్రం కాకూడదు"  అన్నాను.

" మిత్రమా..నీది ఏం తప్పు లేదు.జరిగినవాటి గురించి మరీ ఆలోచించకు.దానివల్ల ఏం ఉపయోగం చెప్పు.ఒక మలేరియా లాంటిదే వచ్చింది అనుకో..ట్రీట్మెంట్ తీసుకోవా..ఇదీ ఆ మాదిరిగానే భావించు.."అన్నాడు రాం.

"నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఏదో ప్రయత్నిస్తున్నా,చివరకి ఇలా మిగిలిపోయాను" నిరాశగా  చెప్పాను.

" నీ బాధ..యామిని గురించేగా" ప్రశించాడు రాం.

"ఔను"

" మీరిద్దరూ మళ్ళీ కలిసేలా ఓ అద్భుతమైన ప్లాన్ వేద్దాం..నువు ఫీల్ అవకు.అందాక ఓపిక పట్టు" నన్ను ఓదార్చుతూ అన్నాడు రాం.

" ఆ..అదంతా..ఎందుకులే గాని మీ ప్రేమ కధ వివరాలు చెప్పండి" అనూష ని అడిగాను.

" నిజంగానేనా" అంది.

" నా మిత్రుడి యొక్క ప్రేమ కధ గదా.."

" ఈ అబద్దాల కోరు ఓ డేటింగ్ సైట్ లో ఫాస్ అకౌంట్ ఓపెన్ చేసాడు.." చెప్పుకుపోతోంది.

" అసలు అబద్దాలకోరు గురించి నేను కూడా చెపుతా" రాం కల్పించుకున్నాడు.

"నేను అబద్ధం ఆడిందానికి కారణం ఉంది..భయం చేత" అన్నది ఆమె.

" ఏదైనా అబద్ధం అబద్ధమేగా" రాం వాదించాడు.

"నేను వరుణ్ కి చెపుతున్నా..మధ్యలో నువు కల్పించుకోకు" అంది అనూష.

" కానీ..నువు చెప్పాల్సినది అంతా చెప్పు" రాం నెమ్మదించాడు.
"బాయ్స్ తో చాట్ చేసి చికాకు లేచి గర్ల్స్ తో చాట్ చేద్దామని ప్రయత్నిస్తున్నానా..ఇతను గర్ల్ రూపం లో నాకు తగిలాడు"

" నన్ను గర్ల్ అనుకున్నందుకు నేను ఎక్సైట్ అయ్యాను.సరే..తర్వాత నా నిజ రూపాన్ని తెలిపానుగా...క్లోజ్ అయినాకా" అన్నాడు రాం.

" నా ఈగో మీద దెబ్బ తగిలినట్టయి..నేను బాయ్ నని చెప్పా.." అందామె.అలా కొంతసేపు మాటలు నడిచాయి.

"సరే..మొత్తానికి మీ ఇద్దర్నీ చూస్తే నాకు హేపీ గా ఉంది" అన్నాను.

మళ్ళీ నేనే అడిగాను" కొద్దిగా బీర్ తాగాలని ఉంది బ్రో" అని.

" మిత్రమా..అసలు వద్దు.నీ ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పినదాన్ని బాగా గుర్తుంచుకో..ఆల్కాహాల్ గాని గంజాయి లాంటిది గాని ఎంతమాత్రం ముట్టవద్దు అని చెప్పారు గదా" రాం అన్నాడు.

"ఎంతో కాదు..జస్ట్ కొద్దిగా బీర్" అన్నాను.

" సరే..మరి.కొద్దిగానే.అది గుర్తుంచుకో" రాం బేరర్ ని పిలిచి కొద్దిగా ఓ గ్లాస్ లో తెమ్మన్నాడు.

" సరే..ఇప్పుడు నువు ఏం చేస్తున్నావు" అడిగాను అనూష ని.

" ఒక స్టార్ట్ అప్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నా" చెప్పింది.

" అంటే రాం లానే.."

" తేడా ఉంది. రాం వర్క్ చేసిది సేల్స్ విభాగం లో.నేను మార్కెటింగ్ లో" అన్నది అనూష.

" ఆ రెండు ఒకటి కాదా..? తేడా ఏమిటి చెప్పు "

" అక్కడే..చాలా మంది పొరబాటు పడుతుంటారు.మార్కెటింగ్ అనేది ..ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ కలిగించేది.అంటే టార్గెట్ మార్కెట్ లో ఎలా మెలగాలి..ఎలా ఉత్పత్తిని జనాల్లోకి తీసుకెళ్ళాలి...బ్రాండింగ్,ఎస్ ఈ ఓ ,యాడింగ్,వినియోగదారుని ప్రవర్తన ఎలా ఉంది  ఇలాంటి అంశాలు ఇమిడి ఉంటాయి. ఇక సేల్స్ అనేది ఫైనల్ స్టెప్..యాక్చువల్ కష్టమర్స్ చేత కొనిపించేది " ఆ విధంగా అనూష వివరించింది.

"ఒక అద్భుతమైన మాట ఉంది.మార్కెటింగ్ యొక్క అంతిమ లక్ష్యం అవసరం లేకపోయినా వినియోగదారుని చేత కొనిపించడం.ఉదాహరణకి ఆపిల్ ప్రొడక్ట్స్ ..!అలా అనీ చెప్పలేం.కొన్నిసార్లు ఓ వస్తువు కొనడం కూడా మార్కెటింగ్ కంటే కూడా ముఖ్యమైనది" రాం అందుకుని చెప్పాడు.

" నా బ్రెయిన్ లో లోపమో ఏమో..కొన్ని అర్ధం అవడం లేదు.సరే..ఇప్పటికైనా ఓ ముఖ్యమైన సంగతి ..మార్కెటింగ్,సేల్స్ వేరు వేరు అని తెలిసింది " అన్నాను.

" అబ్బా..మిత్రమా..ఇవన్నీ నీకు అంత అవసరం ఏం ఉందనీ...నీకు IT లో జాబ్ వస్తుంది ఎలాగూ" రాం సర్ది చెప్పాడు.

"నేను నేర్చుకునే సామార్ధ్యాన్ని కూడా ఈ మందులు వాడి వాడి కోల్పోతున్నాను" చెప్పాను.

" త్వరలో నే అంతా మంచిగా అవుతుంది" చెప్పాడు రాం.

"అవును..నువు రాం కంటే పెద్ద, వయసు లో అవునా"అడిగాను అనూష ని.

" అవును పదకొండు నెలలు చిల్లర"

" అగ్రజురాలి మాదిరిగా...సరే అది కూడా ఓకే "

" షటప్ ..యూ పర్వర్ట్.." అందామె.

" ఏయ్..ఆగు.అదేమిటి నీ కళ్ళు చాలా ఎర్రగా అయిపోయాయి" రాం కంగారు గా అన్నాడు నాతో.

"నిద్ర వస్తున్నట్లుగా..మగత గా ఉంది రాం"

" బహుశా..బీర్ వల్ల కావచ్చును..పోయి మొహం వాష్ చేసుకో " అన్నాడు రాం.

నడవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది నాకు.నా బాడీ మీద బీర్ ప్రభావాన్ని చూపించింది.లేవలేకపోతున్నాను.వెనక్కి పోయి సీట్ లో కూర్చొని  టేబిల్ మీద తల ఆనించడం తో ఎక్కడలేని నిద్ర కమ్ముకొచ్చింది.అలాగే కళ్ళు మూసి నిద్రలోకి జారుకున్నాను. (సశేషం) 


నా పేరు శివ (నవల),Post no:38

జనవరి 4, 2014

ఆ బార్ లో ఆల్కాహాల్ ని తాగడానికి ప్రయత్నించి ఇబ్బంది లో పడ్డాను గదా.దాని పర్యవసానాలు తీవృంగా గాఉంటాయని అర్ధమయి ఇక మందు జోలికి పోవట్లేదు.ఓ గంట పైగానే నిద్ర లోకి జారుకున్నాను,ఆ రోజు ఆ కొద్ది బీరు తాగిన దానికే..!ఆ తర్వాత నీళ్ళు చల్లి ఎలాగో తెలివి లోకి రప్పించి ఇంటికి చేర్చారు.ఇంకా నయం..అదే సీను ని యామిని గనక చూసి ఉంటే ఘోరంగా ఉండేది.

రాం ని,అనూష ని చూసిన తర్వాత యామిని తో మాట్లాడాలనే కోరిక ఎక్కువ అయింది.ఒక రోజు ఫోన్ చేశాను.లిఫ్ట్ చేస్తుందా లేదా అని ఎదురు చూడసాగాను.

" వరుణ్" అవతల నుంచి యామిని. ఆనందమనిపించింది.

" ఎలా ఉన్నావు.." అడిగాను.

"బాగున్నా.ఇక్కడ చాలా బిజీ గా ఉన్నాను..ఏమి అనుకోకు "

"నా కాల్ కి స్పందించినందుకు సంతోషం"

"నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..తిరుచ్చి రాగలవా ఒకసారి"

" దానికేం..ఈ రాత్రికే చెన్నై లో బయలు దేరి రేపు తిరుచ్చి లో కలుస్తా.."

"సరే..రేపు కేంపస్ లో కలుద్దాం"

"మంచిది"

" బాయ్"

"ఇప్పుడే ఎందుకు బాయ్ చెప్పడం"

" చేయవలసిన పనులు ఉన్నాయి..వెళ్ళాలి"

" సరే అయితే..రేపు కలుద్దాం" అలా చెప్పి ఫోన్ పెట్టేశాను.

మళ్ళీ యామిని ని చూడబోతున్నాననే ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేసింది.ఆ ప్రత్యేక సందర్భానికి చక్కగా తయారవ్వాలి.నా అనారోగ్యం నుంచి కోలుకుని మళ్ళీ చక్కగా ఉన్నాననే ఫీల్ ఆమె కి కలగాలి.హెయిర్ కట్ చేయించుకున్నా...మంచి షర్ట్ వేసుకున్నా.చక్కగా తయారయ్యా అన్ని విధాలా.యామిని ని చూసి వస్తానని మా అమ్మ తో చెప్పి కన్విన్స్ చేసి బయలు దేరాను.బైక్ మీద కోయంబేడు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడే బైక్ ని పార్క్ చేసి బస్ ఎక్కాను.ఈ సారి నా పొరబాట్లకి సారీ చెప్పాలి ..ఎలాగో అలా ఆమె ని బాధించకుండా మాట్లాడాలి.ఇలా ఆలోచించసాగాను.తిరుచ్చి వచ్చేసరికి తెల్లారింది.నిద్ర అంత గా పట్టలేదు.మేము మొదట సారి కలిసిన ఆ కేంటిన్ వద్ద కే వెళుతున్నట్లుగా ఉంది.ఈ సారి ఆశ కన్నా భయమే ఎక్కువ గా ఉంది.ఫలితం ఎలా ఉంటుందోనని..!

సమయం చూస్తే ఉదయం అయిదు అవుతోంది.సిగరెట్ లు కొని ఓ గంట కాలక్షేపం చేశాను.ఆ కేంపస్ లోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చాను.సరిగ్గా ఏడింటికల్లా యామిని ని కలుస్తానికి ఆ ప్రదేశానికి వెళ్ళాను.అక్కడినుంచి కాల్ చేశాను.

" హలో" అంది నా ఫోన్ కాల్ కి .

" నా కాల్ తో నే లేచావా" అడిగాను.

" లేదు.నేను తయరవుతుండగా నువు కాల్ చేశావు,పావు గంట లో కేంటిన్ వద్ద కి వస్తాను" అన్నది యామిని.

ఆ కేంటిన్ వాతావరణం ని చూడగానే నాకు పాత జ్ఞాపకాలు మది లోకి రాసాగాయి.ఆమె కి కూడా అలా నే రావాలి.లేదా నేనే కదిపి ఆ ప్రస్తావన తీసుకురావాలి.కాసేపటి లో ఆమె కనపడింది వస్తూ..!

" హాయ్" అని ఆమె కి షేక్ హేండ్ ఇచ్చాను.

" నీ ఆరోగ్యం ఎలా ఉంది" ఆమె వాకబు చేసింది.

"మెడిసిన్స్ కొంచెం హై డోస్ లో ఇస్తున్నారు.ఫర్లేదు.అయితే మాట్లాడేదానికి కొంత ఇబ్బంది ఉంది" చెప్పాను.

"అంటే ఏవో మాటలు వినబడటం...కనబడటం ..అలాంటివి..ఓకేనా.."

" ఇప్పుడు అవేమీ లేవు"

" అయితే ఫర్లేదు.చెన్నై లో ఎలా గడుస్తోంది"

"రోజు లో సగం నిద్ర పోవడం.. సగం బోర్ గా నే ఉంది"

" బోర్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు"

" ఎవరైనా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ తో..చాట్ చేయడం..మ్యూజిక్ వినడం..అమ్మ వాళ్ళ తో గుడి కి వెళ్ళడం..అలా..!ఒక్కోసారి లాప్ టాప్ లో సినిమాలు చూస్తా..అర్ధం చేసుకోవడం కష్టమే.."

" అర్ధం చేసుకోడానికి ఏముంది"
"అంటే ఆ ఇతివృత్తం అదీ .."

" క్ర్రమేణా అన్నీ సర్దుకుంటాయిలే"

"అందరూ అదే అంటున్నారు"

"అది నిజమే గదా..వర్రీ అవకు..సర్దుకుంటుంది"

" అయితే ఇక్కడ నా ప్రియురాలు ఎలా ఉంది" ప్రశ్నించాను.

"నేను నీ ప్రియురాల్ని కాదు..ఓకె..?" ఆమె సమాధానం నా మొహం మీద ముష్టి ఘాతం లా తగిలింది.

" ఏమంటున్నావు.."

"ఇప్పుడు అన్నదే మళ్ళీ చెపుతున్నా...కాబట్టి తెలుసుకో ఇకనైనా.."

" మరైతే నువు.."

" కేవలం యామినిని..ఎవరి ప్రియురాల్నీ కాదు"

" నేను గతం లో చేసిన వాటికి చెంపదెబ్బ వేసినా భరిస్తా..ఈ విధంగా నువు అనడం నేను భరించలేను..నువు లేనిదే నా  జీవితం లేదు.."

"నీ పరిస్థితి కి పిటీ గానే ఉంది.కాని నన్ను దయనీయ స్థితి లోకి నెట్టకు..మత్తు లోకి జారిన నీ ఫ్రెండ్స్ అందరి కంటే నువ్వే ఇలా పాతాళానికి దిగజారావు"

"అయితే ఇప్పుడు ఏమంటావు..?"

" నా గురుంచి మర్చిపోలేనిది ఏముంది..ఇలా మాటాడి నన్ను ఇబ్బంది పెట్టకు .."

"నీ ప్రశ్న కి జవాబు చెపుతా ..ముందు ఓ కప్పు కాఫీ  తాగుదాం"

" దీనికి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.."

సరే..మొత్తానికి రెండు కాఫీ చెప్పాను.కూర్చొని తాగుతున్నాము.

" గతం లో మనం గడిపిన మధుర క్షణాలు...ఆ రోజుల్ని మళ్ళీ గడపాలని లేదా" అడిగాను.

" స్కూల్ రోజుల్లోనే ఇద్దరితో పోయావు అని నన్ను తిట్టావు..అది గుర్తు లేదా" అన్నది యామిని.

" అవి ఇప్పుడు ఎందుకు...బేబీ"

'ఆ పిలుపే వద్దనేది..!ఇంకో సంగతి నీకు చెప్పాలి.ఆ ఇద్దరు నాకు ఎలాగో నువు అంతే నాకు.అంత కంటే ఏమీలేదు.."

"అంతేనా"

" అంత హాస్యాస్పదం గా ఉన్నాయి నీ మాటలు..అర్ధం అయిందా"

"మొదట్లో నువు పాడిన ఆ డ్రీంస్ ఆన్ ఫైర్ పాటనే పాడుకుంటూ ఇప్పటికీ నువు నా తో ఉన్నట్లుగా ఫీలవుతుంటా నేను.ఆ డిప్రెషన్ వల్లనే నేను ఇలా దిగజారాను.ఇప్పటికీ అదే పాడుకుంటూ ఉంటా..ఎందుకో తెలుసా..?"

" ఎందుకు"

" నేను అలా నీ జ్ఞాపకాల్లో ఎడిక్ట్ అయిపోయాను..అదే నా దురదృష్టం"

" దానికంటే ముందు ఇంకోటి తెలుసుకో...డ్రగ్స్ వల్ల ఎలా అవుతారు అనేదానికి నువు ఉదాహరణ లా నిలిచిపోయావు..? ముందు నీ మైండ్ సెట్ మార్చుకో..."

" అది చెప్పినంత సులభమా.."

" అదంతా నాకు తెలియదు.నీ భవిష్యత్ నీ చేతి లో ఉంది.గతం లో నే ఉండిపోతావా..లేదా..ముందుకు వెళతావా అని నన్ను అడిగితే మాత్రం నేను రెండవదే కోరుకుంటాను.."

" అంటే దాని అర్ధం ఇక నన్ను ప్రేమించడం కుదరదంటావా..?" ఆమె చెప్పే ఏ సమాధానికైనా సిద్ధపడిపోయాను.

" ఆ విషయం చెప్పడానికే నిన్ను ఇక్కడకి పిలిచింది.."

" సరే..చెప్పు"

" అలా నడుస్తూ మాట్లాడదామా"

" అలాగే"

" అలా ఆ గేటు దగ్గర వరకు వెళదాము.అటునుంచి అటే నువు చెన్నై వెళ్ళిపోవడానికి అనువు గా ఉంటుంది" అన్నది ఆమె.ఇద్దరమూ నడవసాగాము.

" ఈ రోజు నాతో గడపడం లేదా ..అయితే" అన్నాను.

"సారీ.మనం ఇక కలిసి మాట్లాడటం అనేది ఇక జరగదు.ఇదే మన చివరి కలయిక.ఫ్రెండ్స్ గానే విడిపోవడం మంచిదనే ఇదంతా చెపుతున్నా"

" నాకు ఒక చివరి అవకాశం ఇవ్వకూడదా.."


" లేదు.నా ప్రణాళికలు వేరే ఉన్నాయి"

 " అంటే వేరే వ్యక్తి తోనా" అడిగాను.కన్నీళ్ళపర్యంతమయ్యాను.

" అవును" నవ్వుతూ అన్నది యామిని.
"అతని పేరు..?" నా గుండెలో పిడుగు పడినట్లుగా అయింది.

"ప్రవీణ్.నా క్లాస్ మేట్.చాలా మంచి వ్యక్తి.." మళ్ళీ నవ్వుతూ చెప్పింది.నాకు బేస్ బాల్ బేట్ తో ఆమె తల చెక్కలయ్యేలా కొట్టాలనిపించింది.

" అతడిని ప్రేమించావా" నేను నిరాశకి సిద్ధపడే అడిగాను.

" నాకు తెలియదు.కాని తను నాతో ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది"

" నీకు ఆ రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది తనేనా"

" అవును.తన జీవితకాల పొదుపు తో మరీ కొన్నాడు.నీ వంటి వారికది ఆలోచన కైనా వస్తుందా"

" అంటే నీకు నేను ఏమి గిఫ్ట్ ఇవ్వలేదనా..?"

" ఆ గిఫ్ట్ ..అది రింగ్ కావచ్చు లేదా కీచైన్ కావచ్చు,దాని వెనుక ఉండే భావం ముఖ్యం,ఆ తేడా కే నాకు నవ్వు వచ్చేది,ముఖ్యంగా తన ప్రేమ ప్రకటనకి"

" అంతలా ప్రేమ కలగడానికి తను నీకు ఏం చేశాడని..?"

"నువు నన్ను ఏడ్చేలా చేసినప్పుడు తను నన్ను ఓదార్చాడు.నా బాధల్ని పంచుకున్నాడు.ఎవరినుంచి పొందని అభిమానాన్ని కురిపించాడు.నా మీద ఒక కవిత కూడా రాశాడు,దాన్ని ప్రతి రేయి నిద్రకి ముందర చదువుకుంటాను.."

" సరే" నా మెదడు మొద్దుబారినట్లయింది.ఏమి మాట్లాడటానికి తోచలేదు.

"ప్రవీణ్ కనక లేకపోతే నా మెంటల్ టార్చర్ కి ఏమయిపోయేదాన్నో ఆ దేవుడికే తెలియాలి.రెండోసారి గోవా వెళ్ళినప్పుడు నువు ఎంత టార్చర్ పెట్టావో కొద్దిగా అయినా గుర్తుందా..?" అడిగింది ఆమె.

" లేదు.."

" సర్లే..వదిలెయ్"

" నువు నాకు ఇచ్చిన మెసేజ్ అర్ధమయింది"

" అది మంచిది.ఇవే నా చివరి పలుకులు నీతో.ఇక నన్ను ఎప్పుడూ ఫోన్ చేసి పిలవకు.అది ప్రవీణ్ కి ఇష్టం ఉండదు.తన కోరిక ని నేను మన్నించాలి.అదీ గాక కేంపస్ ప్లేస్ మెంట్స్ దగ్గరకొస్తున్నాయి.ఇక నేను బిజీ అయిపోతాను.."

"మంచిది"

"సరే..ఆల్ ద బెస్ట్.వచ్చే సంవత్సరం కాలేజ్ లో చేరి ఆ తర్వాత జాబ్ సంపాదించుకో.నువు కోరుకున్నవిధంగా .."

" థాంక్స్.ప్రవీణ్ కి నీకు బెస్ట్ ఆఫ్ లక్.బాయ్" అలా చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను.ఈ బాధ నుంచి విముక్తి పొందాలి.ఎంతో ప్రేమించిన అమ్మాయి కాదన్నప్పుడు..హృదయరహితం గా ప్రవర్తించినపుడు ..నేను బతికి ఉండడం అనవసరం అనిపించింది.

గతం లో ఓసారి నేను సూసైడ్ కి ప్రయత్నించిన వాని గా ఆ అనుభవం ఏమిటో నాకు తెలుసు.సూసైడ్ చేసుకునే వారు పిరికి వారు అని అన్న ఆ వెధవ ఎవడో గాని నాకు కనపడితే వాణ్ణి ఖండ ఖండాలుగా టార్చర్ చేసి చంపుతా.వాడు తప్పు అని ఒప్పుకునేదాకా..!నిజానికి సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి.అప్పుడు నాకది లేకపోయింది.రకరకాలు విధానాలు వెదకాలి..సులభంగా ..మొదటి అటెంప్ట్ లోనే చనిపోవాలి.అలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నాను.ఎంత బాధ అయినా ..ఒకసారేగా..!

అయితే నా తల్లిదండ్రులతో కొంత కాలం గడపాలి.వారికి నేను ఎంతో రుణపడిఉన్నాను.నా ఆత్మహత్య గురించి కొన్ని ఫోరం ల లో కూడా పోస్ట్ చెయ్యాలి.ప్రతి వివరం దానిలో రాయాలి.లవ్ ఫెయిల్యూర్,ఇంకా షిజోఫ్రెనియ ల తో ముగించిన కధ గా అది నిలిచిపోవాలి.ఈ జీవితం తర్వాత ఉండే జీవితం ఇంత నరకం గా మాత్రం ఉండదు. (సశేషం)


 నా పేరు శివ (నవల),Post no:39

చాప్టర్-12

సిబ్రవరి 9, 2014

సూసైడ్ పద్ధతుల గురించి కొన్ని ఆర్టికల్స్ చదివి బాగా సూటవుద్ది అనుకున్నది ఎంచుకున్నాను.నాకు ఈత రాదు.కాబట్టి ఎవరూ లేని సమయం లో మునిగి చనిపోవడం దగ్గరి దారి.ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని బీచ్ అనువుగా ఉంటుది దానికి.ఎవరూ పెద్ద గా కనిపించరు.అది బాగా బాధాకరమా..?ఒక ఇరవై సెకండ్లు అలా ఊపిరి బిగబట్టి ఆ ప్రక్రియ ప్రాక్టీస్ చేశాను.నా లంగ్స్ పాడవడం వల్ల అంత కంటే ఎక్కువ సమయం కుదరలేదు.ఒక మూడు నిమిషాలు అలా కష్టమే అయినా బిగబడితే పైకి పోవడం ఖాయం.

ప్రతి రోజు దేవుడిని నేను చేయ బోయే పనిని గురించి తల్చుకుని క్షమించమని కోరేవాణ్ణి.నా తల్లిదండులకి ఈ చర్య ఎంతో బాధ ని కలిగిస్తుంది.నేను ఇతరుల గురించి యోచించకుండా ఈ పనికి పూనుకోవడం స్వార్ధమే కావచ్చు.కాని నా ఈ ఒంటరితనాన్ని,యామిని లేని బాధని నేను తట్టుకోలేని విషయాలే.

అయితే ఒకటి నేను సూసైడ్ చేసుకునే ముందు అజయ్ ని,రాం ని ఓసారి కలవాలి.వచ్చే ఆదివారం తిరుచ్చి వెళ్ళాలి.ఆ మరునాడు నా ప్లాన్ అమలుచేసుకోవాలి.ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి..! సారీ అమ్మ నాన్నలారా..!!!

ఇంతలో ఫోన్ మోగింది.అది యామిని యేమో అనుకొని తీశాను.కాని ప్రియ చేసింది.నిరుత్సాహపడ్డాను..ఎలాగూ ఎత్తాను గదా అని మాట్లాడసాగాను.

" హెలో" అన్నాను.

" హాయ్ వరుణ్...ఎలా ఉన్నావ్.." ప్రియా ప్రశ్నించింది.

" బ్రతికే ఉన్నాను"

" ఈ రోజు ఆదివారం గదా ..ఫ్రీ గా ఉంది...వారం లో మంచి రోజు అంటే ఇదే గదా "
" కావచ్చు"

"నా కోసం ఒక చిన్న పని చేయగలవా.."

" నువు అడిదేదాని మీద అది ఉంటుంది"

" చాల సింపుల్...నాతో కొద్ది సమయం గడపాలి"

" హ్మ్మ్.."

" బాగా నే ఉంటుంది"

" ఎక్కడున్నావ్"

" మా అపార్ట్ మెంట్ ముందర..బయటకి వస్తే కనబడతాను"

" అయిదు నిమిషాలు.."

" థాంక్స్"

"బాయ్"

నా ఫేస్ వాష్ చేసుకున్నాను.

" అమ్మా..అలా బయటకి వెళ్తున్నా..ప్రియ తో " చెప్పాను వచ్చే ముందు.

" మంచిది వెళ్ళిరా" అన్నదామె.

కిందికి వెళ్ళాను."ఉండు..బైక్ తీసుకొస్తా" అని ప్రియ తో అన్నాను.

" అది అవసరం లేదు" అంది ఆమె.

" మరీ.."

" బస్ ఎక్కి చెన్నై సిటీ అంతా చుట్టి వద్దాము" అందామె .
" ఎందుకు"

"అలా బస్ స్టాప్ దాకా మాటాడుకుంటూ పోదాము"

" నాకు ముందు కారణం చెప్పు.అలా అయితేనే అక్కడి దాకా వస్తా"

" MIIT కి చెందిన కోపిష్టి విద్యార్థి లా ఉన్నావే" అన్నది ప్రియ.

" నువ్వు ఏమైనా అనుకో.." భుజాలెగరేస్తూ అన్నాను.

" రైలు లో కంటే..బస్ లో కిటికీ పక్కనే కూర్చుని సిటీ లో తిరుగుతుంటే ఆహ్లాదం గా ఉంటుంది.అదే నాకు ఇష్టం."

" నువే వెళ్ళు..మరి నేను ఎందుకు"

" నీకు ఒక చేజ్ లా ఉంటుందని"

"నా విషయం నీకు ఎందుకు...నా శ్రేయోభిలాషివా"

" అనుకోవచ్చు.టెంపుల్ వద్ద కొన్ని రోజుల క్రితం మీ అమ్మ గారిని కలిసినపుడు చెప్పారు..నీకు కొద్దిగా అనారోగ్యం ఉందని..కాలేజ్ కి వెళ్ళడం లేదని..ఒంటరిగా ఉంటున్నాడు..కొద్దిగా కంపెనీ ఇమ్మని"

" అయినా బస్ లో వెళ్ళడం ఏం సరదా"

" నన్ను నమ్ము.బాగుంటుంది.ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ అలా.."

" నా గురిచి ఎందుకులే..దివాళా వ్యవహారం.."

" అలా ఎందుకు అనుకోవడం..నువు తెలివైనవాడివే...నాకు ఓ అవకాశం ఇవ్వకూడదా ..ఆనందింప చేయడానికి"

" నువు తప్పని తేలడానికైనా ..సరే పదా"

" అంటే బస్ లోనే గా" అడిగిందామె.ఉత్సాహంగా!

" ఔను"

అశోక్ పిల్లార్ బస్ స్టాప్ దాకా నడుచుకుంటూ వెళ్ళాం.నేను ఎలా ఉన్నా...ఆమె సహృదయత కి సంతోషమనిపించింది.నాకు ఒక స్వాంతన ఇవ్వడానికి ఆమె ప్రయత్నిస్తోంది.మంచిది,అయితే అంతా నన్ను చూసి జాలిపడటం అనేది కూడా ఎందుకో మంచిగా అనిపించడం లేదు.

" ఈ చీర నాకు ఎలా ఉంది" బస్ స్టాప్ కి వెళ్ళినతర్వాత అడిగింది.

" బావుంది" అన్నాను.

" థాంక్స్..ఈ గాజులు.."

"అవీ బాగనే ఉన్నాయి"

" ఓ విషయం తెలుసా ..ఈ గాజుల కోసం బ్రాండెడ్ షాప్ కి వెళితే వెయ్యి రూపాయలు అన్నారు.ఇవే గాజులు పాండి బజార్ లో మూడు వందలకి కొన్నాను"

" అంటే అర్ధం"

" ఇలాంటివి పెద్ద షాపుల్లో కంటే చిన్న షాపుల్లో కొనడమే ఉత్తమం.."

" తెలివైన నిర్ణయం..సంతోషం"

" ఏదో కామన్సెన్స్ తో లేని తెలివి ని పూరించుకుంటున్నాను..ఏమంటావు "

"ఇంటెలిజెన్స్ అనేది పెద్ద ఇదని ఎందుకనుకోవడం"

" నాకు ఇంటెలిజెంట్స్ అంటే అసూయ.."

"సరే..కానీ"

కొన్ని నిమిషాలు వెయిట్ చేసినతర్వాత 12G బస్ వచ్చింది.

" బస్ ఎక్కుదాం" అన్నది ఆమె.

ప్రియా కిటికీ పక్క సీటు లో కూర్చున్నది.(సశేషం)


 నా పేరు శివ (నవల)Post no:40

" నా కంపెనీ బాగానే ఉంది గా" అడిగింది ప్రియ.

"నిజం చెప్పనా" ప్రశ్నించాను.

"అనేగదా"

"నాకు చాలా బాగుంది..ఈ సండే ప్లాన్ లో నన్ను చేర్చినందుకు థాంక్స్"

" మీ అమ్మ గారు నీ ఆరోగ్యం గూర్చి  చెప్పిన రోజునే పిలుద్దామనుకున్నా గాని,కుదరలేదు.నాకు నైట్ షిఫ్ట్ ఉంది గా అందుకని పగలు నిద్రపోవలసి వచ్చింది.ఆ తరువాత అనుకున్నా పడలేదు.సంతోషం ఇప్పటికి కుదిరింది.నెంబర్ ఇచ్చిపుచ్చుకున్నాక వారానికి ఓ మారైనా కాల్ చేద్దామనుకున్నా..!ఇన్నాళ్ళూ కుదర్లా"

" ఆ ఆలోచనే నాకు రాలేదు.నా బాధ లో నేను ఉన్నాను"

" ఆ..అన్నట్టు నీ స్టోరీ చెప్తా అని ప్రామిస్ చేశావు గా... చెప్పవూ"

"తప్పకుండా ..చెప్తా"

"మరి కానీ"

"యామిని అనే అమ్మాయిని నేను ప్రేమించాను.ఆమే ప్రేమించింది..మరి ఎందుకో ఇప్పుడు ..నేనంటేనే గిట్టడం లేదు,ఆమె గుర్తు వచ్చినప్పుడల్లా నా జీవితాన్ని ముగించాలనిపిస్తోంది "

"మీ ఇద్దరి నడుమ ఏమి జరిగింది" అడిగింది ప్రియ.

"ఆమె కి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదట"

"మరీ అర్ధం లేకుండా ఉందే...గిఫ్ట్ ఇవ్వనంతమాత్రాన నో చెప్తారా"

"ఏమో నాకయితే తెలియడం లేదు.ఎంతో బాగా ఉండేవాళ్ళం..అన్నిరకాలుగా...!నాకూ అది కారణం కాదనే మరో వేపు అనిపిస్తోంది"

"అలాగా"

" బహుశా నాకు ఆరోగ్యం..బాగాలేనప్పుడు ఏమైనా అన్నానేమో..అవి ఏమి నాకిప్పుడు గుర్తు వచ్చి చావడం లేదు"

" ఎందుకు గుర్తుకు  రావడం లేదు..?"

" నాకు జరిగిన ట్రీట్మెంట్ వల్ల..అలా జరిగింది.దానివల్లనే నా మాట్లాడే సామార్ధ్యం కూడా దెబ్బతిన్నది..నా  జీవితమే చికాకైపొయింది"

"ఇంతకీ నీకు ఏ అనారోగ్యం..."

" అది పర్సనల్.ఇప్పుడు వద్దులే.మంచిగా ఉన్నప్పుడు చెబుతా"

" ఎందుకంత రహస్యం ..?నువు నాతో చెప్పవచ్చు..ఏం జరగదు" అన్నదామె.

" ఆ..అన్నట్టు ..నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ..?"

" లేరు.చెప్పాలంటే ఎప్పుడూ లేరు"

" అదేంటి..నీకు మగవాళ్ళంటే గిట్టదా"

" అలాని కాదు.చదివే రోజుల్లో ఇద్దర్ని ఇష్టబడ్డా ..అది ప్రేమ వరకూ పోలేదు"

" వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పలేదా"

" చెప్పలేదు.పిరికిదాన్ననే చెప్పాలి.వాళ్ళే నన్ను ప్రేమించినట్లు చెప్పాలని తలపోసేదాన్ని"

" ఇలాంటిది ఇదివరకు వినలేదు"

" నేను కాలేజ్ లో చదివేప్పుడు అశ్విన్ అనే అతనితో చనువు గా ఉన్నా,అతనే చెబుతాడని ఊహించా గాని..చివరకి తను వేరే అమ్మాయిని ప్రేమించినట్లు చివరకి చెప్పాడు.కొన్ని నెలలు బాధపడ్డాను.ఆ తవాత ఇంకో క్లాస్ మేట్ తో క్లోజ్ గా ఉన్నాను"

" అదేమయింది మరి"

" అతను సుబ్రమణి.ఫేస్ బుక్ ద్వారా బాగా చేరువ అయ్యాము.రెండు నెలలు ఎంతో చాటింగ్ చేసుకున్నాము.ఈసారి అయినా ఫలిస్తుందా అనుకున్నా.నేను కొన్ని సూచనలు ఇచ్చినా..అతని ప్రవర్తన మరీ రూడ్ గా ఉండేది.ఆ తర్వాత తన దారి లో తను పోయాడు..అలా ఓ కౄరమైన దారి నా జీవితానిది"

" ఈసారి వచ్చే వ్యక్తికైనా నీ ప్రేమ ని తెలియబరుచు..మరీ లేట్ కాకముందే"  
"అలా చెప్పడం బాయ్స్ డ్యూటి అని అనుకునే దాన్ని.అలా చెప్పే వారు ఆత్మవిశ్వాసం ఉండేవారు గా మార్కులు తెచ్చుకుంటారు..లోకరీతి లో"

"మంచిది.."

"నువు ఈసారి ఎవరినైనా అమ్మాయిని ప్రయత్నించినప్పుడు ఈ టిప్ ని గుర్తుంచుకో,ఎదుటి వారికీ  అది మంచిగా అనిపిస్తుంది"

" మళ్ళీ అలాంటిది జరగదు.ఏమైనా నీకు థాంక్స్.."

" లేదు.నువు ప్రేమలో పడతావనే నా నమ్మకం.."

" నీకు జ్యోతిష్యం లాటిది వచ్చా"

"లేదు"

"దయచేసి అలా ఊహించకు..అలాంటిది ఏమి ఉండదు.నా ఫ్యూచర్ ఇకంతే"

"వరుణ్"

"సిటీ ని ఎంజాయ్ చేస్తానికి గదా వచ్చింది ..నీ దారి లో నువు వెళ్ళు" చెప్పాను నేను.

ప్రియ అదోలా ఫీలయి విండో లోనుంచి చూడసాగింది.నేను మామూలు గా ఉండిపోయాను.ఇక ఎప్పుడూ యామిని గురించి ఎవరకీ చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను.నా ఫ్యూచర్ గురించి ఇంకొకరికి ఎందుకు..?నా ప్రేమ గురించి వీళ్ళందరికీ ఏం తెలుసు..?నేను ఎలా అయినా పోతా..ఏంటో ఈ జనాలు..!

నా ముందు సీట్లో ఒక పర్స్ పడి ఉంది.ఎవరూ లేరు.ముందుకు జరిగి తీశాను.లోపల చూస్తే పాస్ పోర్ట్,డ్రైవింగ్ లైసెన్స్,ATMకార్డులు,కొంత నగదు అలా కనిపించాయి.ఎవరో పోగొట్టుకున్నట్లు ఉంది. అడ్రెస్ చూస్తే టి నగర్ లోని తనికాచలం రోడ్ లో ఉంది ..పేరు గాయత్రి ..!ఆమె ఇంటికి వెళ్ళి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను.చాలా ముఖ్యమైనవి ఇవి అన్నీ.

" ఎవరో పోగొట్టుకున్నట్లు ఉన్నదే" అంది ప్రియ.ఆ పర్స్ ని చూసి.

" అవును"

" ఓసారి నా పర్స్ పోయింది.నరకం కనపడింది.పోనీలే నీకు దొరికింది,ఏ దొంగో పట్టుకుపోకుండా "

"ఏదో ఆలోచనల్లో పడి పారేసుకున్నట్లు ఉంది..దానికి ఎవరని ఏం అంటాం"

తనికాచలం రోడ్ లో దిగి ఆ అడ్రెస్ ని వెతుక్కుంటూ వెళుతున్నాము ఇద్దరం..!

"ఒక్కొసారి నువు కూడా ఏదో ఆలోచనలో మునిగితేలుతుంటావు..కదా" అంది ప్రియ.

" చాలాసార్లు ..అలానే ఉంటా"

" అలా ఏదైనా జరిగినపుడు ..నాకు కాల్ చెయ్యి"

"ఎందుకు నాతో మరీ మంచి గా ఉంటావు ప్రియ.నేను అంత మంచి వాడిని కాదు.నా తల్లిదండ్రులు గాని యామిని గాని ..ఎవరకీ నేను చేసింది ఏమీలేదు.నీ మంచితనానికి నేను ఏమీ ఇచ్చుకోలేను బదులు గా..!నేను అంత అర్హత గలవాడిని కూడా కాదు"

" నా ప్రమేయం లేకుండానే అలా ఉంటున్నాను నీతో...కావాలని కాదు"

" నీ సహాయానికి థాంక్స్"

" అలా అనకు.నాకూ మంచి కాలక్షేపం.ఇరువురికి లాభదాయకమైనదే ఇది"

" మరీ అబద్ధమాడకు,అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు.." అలా అని నవ్వలేకుండా ఉండలేకపోయాను.ప్రియ ఆ విధంగా విజయం సాధించింది నాలో ఉత్సాహం రేకెత్తించడం లో..!

" నీ నవ్వు మొదటి సారి చూస్తున్నా...దానికి సంతోషం" అంది.

" నీ వల్లనే ఇది.ఈ మార్పు నీ వల్లనే ప్రియ"

" కావాలసింది అదే గదా "  
  చివరకి మేము ఆ పర్స్ పోగొట్టుకున్న ఆమె ఇంటికి చేరుకున్నాము.గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది.బెల్ కొట్టగానే తలుపు తీసింది.రమారమి ముప్ఫై అయిదేళ్ళ స్త్రీ.

" ఎవరు కావాలి.." అడిగిందామె.

" మిసెస్ గాయత్రి అంటే మీరేనా..?" ఆ డ్రైవింగ్ లైసన్స్ లోని అడ్రెస్ లో ఆమె పేరు ని గుర్తుంచుకొని అడిగాను.

" అంటే..మీకు నా పర్స్ గాని దొరికిందా"

" అవును.12G బస్ లో దొరికింది.బహుశా మీరు మరిచిపోయారనుకుంటాను.ఇదిగోండి" అంటూ ఆమెకి దాన్ని ఇచ్చేశాను.

" థాంక్యూ సో మచ్..మీ పేరు ఏమిటి..?" ప్రశ్నించింది.

"నా పేరు వరుణ్..ఈ అమ్మాయి పేరు ప్రియ..నా  ఫ్రెండ్" చెప్పాను.ఆమె తన పర్స్ ని చెక్ చేసుకుంది.

"మీ వస్తువులన్నీ ఉన్నాయనుకుంటాను" అడిగాను.

" దేవుని దయవల్ల అన్నీ ఉన్నాయి.ముఖ్యంగా పాస్ పోర్ట్ పోతే ఎంత తలనొప్పో మళ్ళీ పొందడం..."

" నాకు తెలుసునండి"

" దేవుడే నా ప్రార్ధనలు ఆలకించినట్లున్నాడు.మళ్ళీ నా వస్తువులు నా చేతికి మీ ద్వారా అందించాడు.." అంది ఆ గాయత్రి.

" పోన్లెండి..సంతోషం"

" మీరు దేవుడో,దేవ దూత నో...ఎవరకి తెలుసు..సత్యం" ఆమె నవ్వుతూ అంది.

" అదేముంది మేడం"

" సారీ మిమ్మల్ని ఇలాగే నించొబెట్టి మాటాడుతున్నా...ఇద్దరూ లోనికి రండి.."

"వచ్చే మారైనా కొంచెం జాగ్రత్త గా ఉండండి..దానిదేముంది గాని"

" ఓ..తప్పకుండా.రండి లోనికి.జ్యూస్ తాగి వెళ్ళండి .."

" కొద్దిగా పనులు ఉన్నాయి..వెళ్ళాలి మేము.."

" ఓకె..సోదరా..మళ్ళీ మీకు థాంక్స్.ఇంత సాయం చేసినందుకు" అంది గాయత్రి.

" వెల్కం..మిసెస్ గాయత్రి" అలా చెప్పి బస్ స్టాప్ వేపు వస్తున్నాము.

" అయితే నువు దేవుని తో సమానమన్నమాట" ప్రియ నవ్వుతూ అన్నది.

" నేను దేవుడి ని కానని నాకు తెల్సు..కాని దేవుడు షిజోఫ్రెనిక్ కాగలడా" అడిగాను.

" ఏమిటి నువు అన్నది..షిజో ..అంటే"

" అదేం లేదులే ..తర్వాత చెపుతా"

" టైం తీసుకో..మళ్ళీ అడిగి నీకు కోపం తెప్పించడం నాకు ఇష్టం లేదు..నాకు తెలిసి వచ్చింది గా "

" నేను అలా ఏమి కాదు.ప్రియ  నీ విషయం లో నేను ఎప్పుడూ కోప్పడను.ప్రామిస్ చేస్తున్నా.."

" మరయితే అది ఏమిటి చెప్పు..షిజో..అది"

" వచ్చేసారి తప్పకుండా చెపుతా..అప్పుడు బస్ మీద కాకుండా ..బైక్ లో వద్దాము,సరేనా "

" ఓ మేధావి బండి ఎక్కబోతున్నా"

" ఇతరుల్ని మేధావుల్లా చూసే వారు..నా ఊహ లో గణితం,కెమిస్ట్రి,ఫిజిక్స్ లో పూర్ గా ఉండేవాళ్ళు...నేననుకోవడం.." నవ్వుతూ అన్నాను.

" కాలేజ్ లో నేను అన్నిట్లోనూ పూర్ నే.ఒక్క అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ లో తప్ప" (సశేషం)



  నా పేరు శివ (నవల),Post no:41



"ఆ..ఇంకొకటి...మర్చిపోయావు.మనిషి ని ఆనందపరచడం లో కూడా దిట్టవే,యూ డార్ట్"

"అలా అంటే నిన్ను పంది అనాల్సి ఉంటుంది" ప్రియ చనువు గా నా చేతుల పై కొట్టి అన్నది.

ప్రియా తో సమయం గడపడం హాయి గా ఉంది.ఈ విధంగా ఉంటుంది అనుకుంటే నేను ఈమె ని ఎప్పుడో ఫోన్ లో పిలిచి ఉండేవాడిని.నా జీవితపు చివరి రోజుల్లో అయినా కాస్త హేపీ గా అవకాశం దొరికింది.నేను యామిని కంటే ప్రియ ని ముందు గా కలిసిఉంటే పరిస్థితులు వేరు గా ఉండేవేమో..!ఎవరకి తెలుసు కొన్ని రోజులు పోయినతర్వాత ఈమె అలాగే బిహేవ్ చేస్తే..!

"మళ్ళీ ఏవో ఊహల్లో పడిపోయావా" అండి ప్రియ.

"అది నా ఫేవరేట్ హాబీ గదా" అన్నాను.

" నాకు కూడా నేర్పకూడదా"

" గతం లో నీకు రెండు ప్రేమ అనుభూతులు ఉన్నాయి..అవునా"

"అవును"

" ఫెయిల్ అయిన నాటి రోజుని తల్చుకో..అదే మొదటి స్టెప్ దానికి"

" అలా నేను పిటీ గా ఫీలవ్వను.నన్ను పోగోట్టుకున్నందుకు వాళ్ళే ఫీలవ్వాలి"

" నీలో ఎంత పాజిటివ్ స్పిరిట్ ఉంది..పైకి అలా అంటూంటావు ఏమి తెలియనిదానినని "

" ఓ..ఇడియట్ నా గురించి ఎప్పుడూ అలా నేను చెప్పలేదు..ఓ సారీ "
"తెలివి అనేదానికి వ్యతిరేక పదం మొద్దు అనేగదా, ఈ రెండిటిలో నువు ఏ రకం "

"రెండూ కాదు.అంతకు మించి ..చెప్పాలంటే మేధావిని..."

"నిజమేనా" ఆశ్చర్యంగా అన్నాను.

"ముందు ముందు నువే చూస్తావు గా..అదీ ఖచ్చితం గా " నవ్వుతూ అందామె.

" అలాంటి పిల్ల చేష్టలకి... వాటికి వెనకడుగు వేసే రకం కాదు నేను"

"నేను పిల్ల ని కాను..నీ కన్నా కొద్దిగా పెద్దదాన్నే..అది తెలుసుకో,దద్దమ్మ "

" అలాంటి పదాలు ఉపయోగిస్తే పర్యవసానాలు వేరు గా ఉంటాయి"

"నేను ఒక ఆట నే అనుకో..నా నుంచి ఏమి పొందుతావు ..అదీ చూద్దాం"

"నా కర్ధమయింది...నువు తమిళ్ సినిమాలు ఎక్కువ గా చూస్తావు "

" హాలీవుడ్ సినిమాలు చూడటానికి నేను MIIT స్టూడెంట్ నా ఏమైనా .."

"దానికి దీనికి లింక్ ఏమిటి..? హాలివుడ్ మూవీస్ ఎవరైనా చూడచ్చు..తెలివి లేని మూర్ఖురాలా "

"షట్ అప్" నవ్వుతూ అంది ప్రియ.

"నువు ఇంత సరదాగా ఉండడం ఎప్పుడూ చూడలేదు" నా భుజాల్ని తడుతూ అంది.

యామిని తో నా సరదా రోజులు గుర్తుకు రాసాగాయి.జాలీ గా ఉండడానికి ఇష్టపడే వ్యక్తిని నేను.ప్రియ నాలో కొత్త దీపాల్ని వెలిగించింది అని చెప్పాలి.నా పాత రోజుల్ని ఎలా మర్చిపోతున్నాను..దేవుడా..!మా బస్ ఆగింది...!దాని లోకి ఎక్కాము.ప్రియ విండో సీటు దగ్గరే కూర్చుంది.

" నిన్ను ఒకటి అడగాలి" ఆణ్ణాఆణూ.

" చెప్పు "

" ఈ ప్రపంచం లో నిజమైన ప్రేమ అనేది ఒకటి ఉందా లేదా కేవలం హర్మోన్స్ మార్పు వల్ల అలా అనిపిస్తుందా"

"వాట్ రబ్బిష్..ప్రేమ అనేది ఉంది"

"అలాంటప్పుడు యామిని నా గురించి అలా ఎందుకు ఆలోచించింది?" నాలో ఒక కన్నీటి తెర.

" ఆమె కి ప్రేమ గురించి తెలియదు,ఆ అదృష్టం ఆమె కి లేకపోయి ఉండవచ్చు.ఆమె ని అనుకోవడం వృధా!ఆమె తప్పు కూడా కాకపొయి ఉండచ్చు" అంది ప్రియ.
"ఖచ్చితం గా అలా చెప్పగలవా,ప్రతి వారికి లోపల అలా అనిపిస్తుందా " యామిని ని తల్చుకుని అడిగాను.

"అసలు ప్రేమ అనేదే లేకపోతే ఈ ప్రపంచంలో ఆ పదం ఎలా పుడుతుంది..?" ఆమె ప్రశ్నించింది తిరిగి.

" ఏమో..ఎదుటి వారిని ఫూల్ చెయ్యడానికి కావచ్చుగా"  నేను అన్నమాట అర్ధం పర్ధం లేనిదని నాకే తోచింది.

"ప్రతి ఒక్కరి జీవితం లో ప్రేమ అనేదాన్ని ఒక్కసారి అయినా ఫీలవుతారు.యామిని ఉదాహరణ వల్ల నీకు ఇంకోలా అనిపిస్తోంది.నేను రెండు సార్లు ప్రేమ లో పడ్డా ,ఇంకోసారికి కూడా రెడీ గా ఉన్నాను"

"నువు చెప్పినదానిలో అర్ధం ఉంది.ఆమె నాకు వ్యక్తీకరించినదాని ప్రకారం ఇంతదాకా ప్రేమ అనేది ఉండదనే అనుకున్నాను.. ఆమె తో నేను నిజమైన ప్రేమ లో పడ్డాను,కాని నా నమ్మకాన్ని ఆమె ముక్కలు చేసేసింది "

" ఊరుకో..హాయిగా ఉండు.ఆమె అదో రకం అనుకుంటా"

" అవును...అదో రకమే..!కాని నేను ప్రేమిస్తూనే ఉన్నానే...దీనిలో నుంచి ఎలా  బయట పడాలి..?"

" నేను అనుకోవడం..నువు నీ స్థితి ని ఎంత వివరించి చెప్పినా..ఆమె కి నీ మీద జాలి లాంటిది కలుగుతుందేమో గాని ప్రేమ అయితే కలగదు.."

" అవును.నువు చెప్పింది నిజమే,ఆ మాట తనూ ఒకమారు అంది.నా మీద జాలి చూపెట్టడం కన్నా ప్రేమించబడటమే నాకు కావాలి"

" కొన్నాళ్ళు అలా ఆమె ని కాంటాక్ట్  చేయకుండా ఉండటమే మేలు"

" దానివల్ల మేలు జరగదు.ప్రవీణ్ అని ఒకడు ఉన్నాడు..వాడితో తను లవ్ లో ఉన్నట్లు తెలిపింది.నన్ను మళ్ళీ కాల్ చేయద్దని కూడా చెప్పింది.అది వాడికి ఇష్టం ఉండదట.ఆమె ప్రాధాన్యతలు కూడా మారిపోయాయిట.ఇంకా కాలుతోంది అది విన్నప్పటి నుంచి"

" నా మాట విని..ఓ నేల ఆగి అప్పుడు ఆమె కి కాల్ చెయ్యి...నిన్ను ఆమె మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది"

" అది సాధ్యమయ్యేది కాదులే"

" ఎందుకని"

" నీకు అర్ధం కాదు లే"

" చెప్పు.."

" దయచేసి అడగకు"

" తర్వాత చెప్తా"

" చెప్తే ఇప్పుడే చెప్పాలి"

" నేను చెప్పేది అర్ధం అవట్లేదా" కొద్దిగా అసహనంగా అన్నాను.

" అసలిక..నా సలహాలు అడగకు అలాంటప్పుడు" ఆమె కి కోపం వచ్చినట్లు ఉంది.

" ఇకమీదట ఎప్పుడూ యామిని టాపిక్ నే మనం మాటాడద్దు.." అన్నాను.

" సరే.."

" సారీ ప్రియ..నేను ఉన్నట్టుండి కొద్దిగా అసహనం గా ప్రవర్తించాను..ఇప్పుడది కొంచెం ఎక్కువైనట్లు గా కూడా తోచింది"

" ఇంకోటి కూడా నిజం..నేను దివాళా రకం అని ...ఓసారి చెప్పుకున్నావ్ చూశావా ..అదీ నిజమే"

నేను ఏమీ మాట్లాడలేదు.ప్రియ నా గురించి చెప్పింది నిజమే.గతం లోనే ఉండిపోయి వర్తమానాన్ని తోసిపుచ్చే వాడిని.ఆమె మాటలు నాలో ఎక్కడో గుచ్చుకున్నాయి.ఇంటికి తిరిగివచ్చేదాకా అలాగే మౌనంగా ఉండిపోయాను.ఆమె చెప్పినట్లుగానే ఉందా నా ప్రవర్తన..ఏమో..!

" సారీ ప్రియ" బస్ దిగిన తర్వాత చెప్పాను.

" నాకు ఎలా రెస్పాండ్ కావాలో తెలియలేదు వరుణ్.నీవు గందరగోళం లో ఉన్నట్లు ఉన్నావు.ఈ రోజు బయటకి రమ్మని పిలిచి నేనే పొరబాటు చేశాను.నువు ఇంట్లో నే కూర్చుని యామిని గురించి కలలు కంటూ ఉండు.నాకు అంతగా తెలియని వ్యక్తిని నేను ఎక్కువ గా భరించలేను.." అంది ప్రియ.

" అంటే యామిని తో మళ్ళీ నెల తర్వాత మాట్లాడడం కుదరదని చెప్పానే ..దాని గురించేనా" అడిగాను.

" ఏమో..నీ జీవితం..నీ యిష్టం...నా కెందుకు అదంతా " నిష్టూరంగా అంది ప్రియ.

ఏమి మాట్లాడకుండానే ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాము.నేను నా పరిస్థితి కి నన్ను నేనే నిందించుకున్నాను.అలా నేను గట్టిగా మాటాడకుండా ఉండాల్సింది.ఆదోలా అయిపోయాను.

" ప్రియ తో బయటకి వెళ్ళావుగదా..ఎలా అనిపించింది" అమ్మ అడిగింది రాగానే.

" బాగానే ఉంది" ఆమె అడిగేదానికి పొడి గా చెప్పి అవతలకి వెళ్ళిపోయాను.

" మంచిది బాబూ"

బెడ్ రూం లోకి వెళ్ళి నా లాప్ టాప్ తెరిచాను.డ్రీంస్ ఆన్ ఫైర్ అనే ఆ పాట ని వింటేనే ఈ వేడి చల్లారుతుంది.అయితే ఒకటి..ఈ పాట ఇక ఎంతమాత్రం వినబోను.ఇదే చివరి సారి.ఇక యామిని గురించి కూడా ఆలోచించను.జరిగిది చాలు ఇక..! (సశేషం)



నా పేరు శివ (నవల),Post no:42
Chapter-13

ఫిబ్రవరి 16, 2014

ఆ బస్ ప్రయాణం తర్వాత ప్రియ నాకు ఫోన్ చేయలేదు.బాధ గా అనిపించింది.ఆమె నాకు మంచి ఫ్రెండ్ కాబోతున్న తరుణం లో ఆమె ని బాధ పెట్టాను.నా ఖర్మ.ఈ నా చివరి దినాల్లో కాస్త నవ్వుతూ ఉండాలని గదా అనుకుంది.ఆ మాత్రం కూడా రాసి లేదు.రేపు రాత్రి వరకేగా ఏమి అనుకున్నా..!ఆ తర్వాత సముద్రం లో కలిసిపోతాను.

నా చావు పదిమందికి కను విప్పు లా ఉండాలి.మాదక ద్రవ్యాల వైపు మొగ్గ కూడదు,అమ్మాయిల మోజులో పడరాదు,చదువు మీదే దృష్టి నిలపాలి..ఇలాంటివి అన్నీ నా చావు నుంచి అందరూ గ్రహించాలి.అదే నా కోరిక.చవరి కోరిక.

అజయ్ ని చూద్దామని వాళ్ళ హాస్టల్ కి వెళ్ళాను.అతను నన్ను ఆదరం గా ఆహ్వానించాడు.ఇప్పుడు అతని రూం చాలా శుభ్రంగా ఉంది.ఎలాంటి గంజాయి వాసనా లేదు.కనీసం సిగరెట్ వాసనా కూడా..!అసలు నేను వచ్చింది అజయ్ రూం కేనా అనిపించింది.ఎంత మార్పు..!

" ఎలా ఉన్నావ్ బ్రో..చాన్నాళ్ళ తర్వాత కలిశాం" అడిగాను.

" ఒక చెడు వార్త బ్రో.." అజయ్ చెప్పాడు.

" ఏం జరిగింది.." ఆందోళనగా ప్రశ్నించాను.

"మా నాన్నగారు నాలుగు మాసాల క్రితం చనిపోయారు.హార్ట్ ఎటాక్.అందుకే నీ దగ్గరకి కూడా రాలేకపోయాను" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు అజయ్.

" ఓ..సారి బ్రో...ఏం చెప్పాలో తోచడం లేదు"

"ఆయన బిజినెస్ లో ఆయన బిజీ గా ఉండేవాడు.నా ఇది లో నేను.పెద్ద గా క్లోజ్ గా ఉండేవాళ్ళం కాదు.ఒకేసారి షాక్ అయ్యాను..ఆయన లేకపోవడం జరగడం తో..ఇంకా బాధ లోనే ఉన్నాను "

" బ్రో"

"నేను ఎప్పుడూ ఆ మత్తు లో ఉండేవాణ్ణి.ఇంటి విషయాలు పట్టించుకోకుండా..ఆయన చావు కి వెళ్ళినపుడు నోట మాట రాలేదు.ఇలా జరుగుతుందని ఊహించలేదు.బాధ్యత అంతా నా మీద పడింది ఇప్పుడు..ఇకనైనా బాధ్యత గా మెలగాలి నేను"

" జీవితం మన ఇద్దరకి మంచి పాఠాలు నేర్పింది"

" మా అమ్మ,చెల్లి కి నేనే ఆధారం.ఏదో మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళని చూసుకోవాలి.ఇదివరకు లా బతకాలంటే కుదరని పని.జీవితం ని సీరియస్ గా తీసుకోక తప్పదు.ఇప్పటకి నాకర్ధమయింది లైఫ్ అంటే ఏమిటో..!"

" అవును..చదువు మీద నే ఉండు.."

"నా గ్రేడ్స్ కూడా నేను బాగా మెరుగుపరుచుకోవాలి.లేదా పనికిరాకుండా పోతాను.కాలేజ్ అంటే ఆట స్థలం లా అనుకున్నా ...!ఇంకా నయం...రాం ముందు గానే తేరుకున్నాడు.అతని మాట వినివుండవలసింది"

" ఇప్పటికీ మించి పోలేదు.నువు మారడానికి"

"ఈ మూడున్నర ఏళ్ళలో ఆర్కిటెక్చర్ గూర్చి నేర్చింది శూన్యం.బాగా కష్టపడతాను.మంచి క్లాస్ మేట్స్ ఉన్నారు ..వాళ్ళదగ్గరకి పోయి నేర్చుకుంటాను"

" అయిందానికి బాధపడకు.ముందు జరగబొయేదాన్ని చూసుకో.ఇక్కడే సీట్ కొట్టావు అంటేనే తెలివి ఉన్నవాడివని అర్ధం..కాబట్టి నువు ముందుకి వెళతావు..నీకు చెప్పేంత వాణ్ణి కాను.నా బాధలు నేను పడ్డాను చేసిన దానికి..!పశ్చాతాపపడకు ..నువు నా లానే అయిపోతావు"

" నీకు ఏమయింది బ్రో...బాగానే ఉన్నావు గా .."

"ఇప్పుడు కధంతా చెప్పే ఓపిక నాకు లేదు.కొద్దిగా ఏదో..రెండు నిమిషాలు గతం లో లా సరదాగా గడిపిపోదామని వచ్చా..అంతే"

"తప్పకుండా ..బ్రో"

" పద..రాం ని కూడా ఓసారి కలుద్దాం"  
" నేను రాం ని కూడా కలవట్లేదు ఈ మధ్య లో..! తనూ తప్పించుకు తిరుగుతున్నాడు నా నుంచి..!నీ అనారోగ్యానికి నేనూ ఓ కారణమనే భావన తన లో ఉంది.నీ నేచర్ తెలియక నిన్ను బాగా ఎంకరేజ్ చేశాను గంజాయి తాగడానికి.నా దారీ ఇలా అయింది..మనం కలిసి ఉండకపొయినా బాగుండేది"

" నా తప్పూ ఉంది దాంట్లో...నీది ఒక్కడిదే కాదులే"

"కనీసం నిన్ను ఆపిఉండాల్సింది"

" ఇక అవన్నీ ఎందుకులే..పద రాం దగ్గరకి పోదాం"

" తప్పదంటే వస్తా"

అజయ్ రూం నుంచి రాం ఉండే బి హాస్టల్ వేపు సాగుతున్నాము.

"యామిని నన్ను వదిలేసింది..బ్రో"

"షిట్ ..నిజంగా "

"ఇంకోడితో డేటింగ్ చేస్తోంది.ప్రవీణ్ అని..ఆమె క్లాస్ మేట్.వాడంటేనే అసహ్యం వేస్తోంది బ్రో"

"నీకు ఎప్పుడు అండగా ఉండాలో అప్పుడే వదిలేసిందన్నమాట...అంత హార్ట్ లెస్ అని అనుకోలేదు"

"ఆమెనీ అనడానికి లేదు.నా వేపునా కొన్ని తప్పులు ఉన్నాయిలే"

"అదంతా తల రాత.చిన్నప్పుడు స్కూల్ లో ఎంతో మంచి గా చదివేవాళ్ళం.ఇప్పుడు కాలేజ్ కొచ్చేసరికి ఇడియట్స్ లా అయిపోయాం"

"ఇప్పుడే చెపుతున్నా..పాత సంగతులూ అవేం వద్దు.రాం ని చూడటానికి మాత్రమే మనం వెళుతోంది ..సరేనా"

"అలాగే.నన్ను చూసి మరోలా ఫీలవ్వడనే అనుకుంటున్నా.."

అలా మాటల్లో రాం రూం దగ్గరకి వచ్చేశాం.గతం లో ఆ రూం లో మూడేళ్ళ జ్ఞాపకాలు ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి.ఆ రోజులు ఎంత ఆనందమయం..!

" హాయ్..వరుణ్...!హాయ్..అజయ్..! " అంటూ రాం మమ్మల్ని విష్  చేశాడు.లోపలకి వెళ్ళి కిందనే కూర్చున్నాం.

" బ్రో..ఎలా ఉన్నావ్" అజయ్ అడిగాడు రాం ని.

" పర్ ఫెక్ట్..నీవెలా ఉన్నావ్" అని తలుపు  దగ్గరగా వేశాడు రాం.

" నువు నన్ను అసహ్యించుకోవడం లేదుగా"

" అదేం లేదు బ్రో.ఆనందం నా రూం కొచ్చినందుకు" రాం చెప్పాడు.

" మనం ముగ్గురం మళ్ళీ కలవాలి అని వరుణ్ తీసుకొచ్చాడు" అజయ్ చెప్పాడు.

" బాగా చెప్పావ్ వరుణ్" రాం చెప్పాడు నాతో తో.

" మిమ్మల్ని చివరి సారి చూడాలని ఈ తిరుచ్చి కి వచ్చాను బ్రో" నేను చెప్పాను.

" అదేమిటి..మనం ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు" రాం అన్నాడు.

" ఏమో..అది కుదరక పోవచ్చు" బదులిచ్చాను.

" ఎందుకు కుదరదు..తప్పక కుదురుతుంది..మనలో ఎవరో ఒకరు పోతే తప్పా" రాం అభిప్రాయం అది.బాగా చెప్పాడు.

" మీరు పరాజితులు గా అవకూడదు..మీరు ముందుకెళ్ళి లైఫ్ లో బాగా సెటిల్ అవాలి.." చెప్పాను.

" వచ్చే ఏడు నువు కూడా ఇంటర్ వ్యూ క్రాక్ చేస్తావ్..జాబ్ తెచ్చుకుంటావ్ దాని గురించి ఆలోచించక,అప్పటికి నాకు కొంత అనుభవం వస్తుంది రాం చెప్పాడు.

" గ్రేట్ " పైకి ఏదో అనాలని అన్నాను.

"ఇప్పుడు యామిని తో మాట్లాడుతున్నావా" ప్రశ్నించాడు రాం.

" ఒక నెల పైన అయింది మాట్లాడక...!ఆమె తో ఒకసారి మాటాడితే బాగుండు తిరుచ్చి నుంచి వెళ్ళే ముందు" అన్నాను.

" తను ఇంకో అతనితో కనిపించిది " రాం చెప్పాడు.

" ఆ వెధవ పేరు ప్రవీణ్..!వాడిని ద్వేషించినట్లుగా నేను ఎవరినీ ద్వేషించడం లేదు.యామిని బాధ లో ఉన్నప్పుడు వాడు తెలివి గా అవకాశాన్ని  క్యాష్ చేసుకున్నాడు.నా జీవితాన్ని పాడు చేశాడు వాడు" బాధ గా అన్నాను.(సశేషం)       

నా పేరు శివ (నవల),Post no:43

" పోనీ మిత్రమా...యామిని కంటే పది రెట్లు మంచి అమ్మాయే నీకు దొరుకుతుందిలే"రాం ఓదార్చాడు నన్ను.

" అవును ..అది నిజం" అజయ్ కూడా సపోర్ట్ చేశాడు.

"ఇక అవేం పట్టించుకోదలుచుకోలేదు " చెప్పాను నేను.

"ఈ మాదక ద్రవ్యాలు వదిలేసినాక ప్రపంచం అర్ధం అవుతోంది బ్రో" అజయ్ వువాచ.

"బావుంది..సరే పదండి ఐస్ క్రీం లు తింటూ సెలెబ్రేట్ చేసుకుందాం..సరేనా "రాం అడిగాడు.

" పోనీలే నువు ఆల్కాహాల్ అంటావేమో అనుకున్నా...నాకు దానికైతే మూడ్ లేదు"  అజయ్ అన్నాడు.

" నేను బాగా తగ్గించేశాను..ఎప్పుడైనా వారానికి ఓసారి" రాం చెప్పాడు.

" నేను మొత్తం అన్నీ మానేశా బ్రో" అజయ్ బదులిచ్చాడు.

" ఈ బుద్ది మనకి ముందు లేకపోయిందే...సర్లే..నీ హెల్త్ ఎలా ఉంది వరుణ్" రాం అడిగాడు.

"బాగానే ఉంది.కాని నేను ముందు లా లేను ..నా వ్యక్తిత్వం మారిపోయింది.ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను.కొత్త ఫ్రెండ్స్ నీ చేసుకోలేకపోతున్నాను.ఎందుకు పనికి రానట్లు అయిపోయాను" చెప్పాను.

" వెనకటి లా ఉండాలంటావ్" రాం అడిగాడు.

"ఔను బ్రో" చెప్పాను.

" నేను ఒక ఐరిష్ సామెత గుర్తుంచుకో..అది నీకు బాగా ఉపయోగపడుతుంది"

" చెప్పు..ఏమిటది"

"నీ గత రోజుల్లోని మంచి ఒక్కోమారు నీ భవిష్యత్  లో చెడు గా పరిణమించవచ్చు" రాం చెప్పాడు.

"ఏమిటి..దాని అర్ధం వివరించు " రెట్టించాను.

"ఒక్కొసారి మనం గతం లో  అనుభవించినదాని కంటే ఫ్యూచర్ లో రాబోయే రోజులే మంచి ఉండే అవకాశం ఉంటుందని భావం"  రాం వివరించాడు.

"అలా ఎలా అనుకోగలం" ప్రశ్నించాను.

" నంబర్ వన్- నీవు రానున్న రోజుల్లో ఎలాంటి చెడు అలవాట్లు చేసుకోలేదనుకో,నీ ఆరోగ్యం బాగయ్యే అవకాశం ఉంది.నంబర్ టూ- గతం లోని పొరబాట్లనుంచి నేర్చుకుని రానున్న రోజుల్లో చక్కని లైఫ్ లీడ్ చేయవచ్చు,నంబర్ త్రీ-యామిని కంటే మంచి అమ్మాయే నీకు దొరకవచ్చు.నంబర్ ఫోర్- ప్రతి అల కిందికి వెళ్ళిన తరువాత మళ్ళీ లేస్తుంది.నంబర్ ఫైవ్- " రాం చెప్పబోతుండగా అజయ్ అందుకున్నాడు.

" ఈ వ్యక్తి మామూలోడు కాదు తెలివి లో" అంటూ పొగిడేశాడు.

"మనం నేర్చుకోవాలసిందే రాం నుంచి" అన్నాను.

"ఇక నేను ఉబ్బిపోయాను బ్రో" రాం ఇద్దరికీ బదులిచ్చాడు.

" అవును..నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది" అడిగాను రాం ని.

" ఏమిటి ఇది..నిజమా" అజయ్ అశ్చర్యపోయాడు.

"అవును..అజయ్..ఆమె పేరు అనూష.నాకు తగిన లైఫ్ పార్ట్నర్.ఇద్దరం కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం.ఆమె మార్కెటింగ్ సైడ్,నేను సేల్స్ సైడ్ చూసుకుంటాం..ఆ పనిమీదనే ఎక్కువ స్టడీ చేయడానికి యూట్యూబ్ లో చూస్తున్నాం" చెప్పాడు రాం.

"అసలు రాం ఈ విధంగా అయిపోతాడని మనం ఎప్పుడైనా ఊహించామా" అజయ్ నవ్వుతూ అడిగాడు.
"మన గ్యాంగ్ లో బాగా మంచి స్థాయికి వచ్చింది రాం..దానికి గర్వించవలసిందే"పొగిడాను రాం ని.

" థాంక్స్" చెప్పాడు రాం.

"ఏ బిజినెస్ మీరు చేయబొయేది" అజయ్ ప్రశ్నించాడు రాం ని.

" మీరు విని నవ్వనంటే చెబుతా" రాం అన్నాడు

" ప్రామిస్ అనేది కుదరదు " అజయ్ చెప్పాడు.

"సరే..కానీలే" రాం అన్నాడు

" మాకు నవ్వు వచ్చినా నీ ముందు నవ్వములే..సరేనా" అజయ్ బదులిచ్చాడు.

" గైస్..మనమంతా పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నాము.." అన్నాను.

" అవును కదూ" అజయ్ చెప్పాడు.

"గంజాయి లేకుండానే సరదాగా ఉండవచ్చు.అది మనకి ముందు తెలియకపాయెనే.." రాం నిట్టూర్పు.

"నీవు ఇందాక రెండో పాయింట్ లో చెప్పినట్టు..మనం గతం నుంచి పాఠం నేర్చుకున్నాం" అజయ్ చెప్పాడు.

"సరే..మంచిది.నీ బిజినెస్ ఐడియా ఏమిటి రాం..?" అడిగాను.

" నేను,అనూష కలిసి డేటింగ్ అనే దాని మీద శిక్షణ ఇవ్వబోతున్నాం.ముఖ్యంగా మగవాళ్ళకి.లార్జ్ స్కేల్ లో ఇండియా వైడ్ గా.పబ్స్ ఇంకా బార్స్ లనే వేదికగా చేసుకుంటాం.నేను అనుకోవడం ఇది బాగా సక్సస్ అవుతుంది.." రాం వివరించాడు.

"నేనే మీకు మొదటి క్లైంట్ ని బ్రో..నన్ను లెక్కేసుకో...సూపర్ గా ఉంది" అజయ్ అభినందించాడు రాం ని.

" పదండి ఐస్ క్రీం తిందాం" అన్నాడు రాం.

" నువు,రాం మాట్లాడుతూ ఉండండి..నేను ఈ లోగా వెళ్ళి యామిని ని కలిసివస్తా" చెప్పాను.

" సరే..కానీ" అన్నాడు రాం

"ఆల్ ద బెస్ట్ బ్రో" చెప్పాడు అజయ్.

నేను బయటకి వచ్చి యామిని నంబర్ కి ఫోన్ చేశాను.రెస్పాన్స్ లేదు.ఇంకో మారు చేశాను.మళ్ళీ నో రెస్పాన్స్.సిగరెట్ ముట్టించి వెయిట్ చేయసాగాను.మళ్ళీ  చేశాను,నో రెస్పాన్స్.చికాకు గా రాం రూం లోకి ప్రవేశించాను.

" ఆమె నా కాల్ కి రెస్పాండ్  అవడం లేదు" నిరాశగా చెప్పాను.

"పడుకుని ఉందేమోలే బ్రో" అన్నాడు రాం.

" సాయంత్రం అయిదు అవుతోంది..ఇప్పుడేం పడక..! ఖచ్చితం గా  మేలుకొనే ఉండి ఉంటుంది " అన్నాను.

"ఒక మెసేజ్ ఇవ్వు బ్రో" అజయ్ చెప్పాడు.

వెంటనే మెసేజ్ పెట్టాను ఆమె ఫోన్ కి..!హాయ్...నేను ..తిరుచి లోనే ఉన్నాను...!చివరిసారి గా ఓసారి మాటాడవచ్చా అని..!

ఆమె వెంటనే రెస్పాన్స్ మెసేజ్ ఇచ్చింది.ఆత్రుత గా చూశాను.దానిలో ఇలా ఉంది..మన వీడ్కోలు కార్యక్రమం ముగిసిపోయింది.నన్ను డిస్టర్బ్ చేయకు వరుణ్ అని..!

అది చదివి నిరాశ గా అయిపోయాను.నేను చనిపోయేముందు చివరి సారిగా ఆమె తో మాట్లాడలేకపోతున్నానే అని.వచ్చిన మెసేజ్ ని మిత్రులు ఇద్దరకి చూపించాను.

"మళ్ళీ కాల్ చెయ్" రాం చెప్పాడు.

"తెలిసి కాల్ చేయడం ఎందుకు..అర్ధరహితం" అన్నాను రాం తో.

"ఫోన్ లో అయితే కన్విన్స్ చేయవచ్చుగదా అని..ట్రై చేయరాదు"

అతని కోసమన్నట్లు మళ్ళీ ఫోన్ చేశా...నో రెస్పాన్స్.ఆమె కొత్త జీవితాన్ని మొదలెట్టింది.దానిలో నాకు స్థానం లేదు.ఇంకో సిగరెట్ వెలిగించి నిశ్శబ్దం గా తాగసాగాను.

"పద..పోయి ఐస్ క్రీం తిందాం" సిగరెట్ అవతల పారేసి చెప్పాను.

రూం లోనుంచి బయటకి వచ్చి నడవసాగాము. (సశేషం) 


 నా పేరు శివ (నవల),Post no:44

"అవును..అన్నట్టు ఆ పోలీస్ అధికారి ని కలిశావా..అప్పుడు నేను చెప్పేనే"అడిగాడు రాం.

"ఓ..షిట్..మర్చేపోయాను,తన పేరేమిటి " ప్రశ్నించాను రాం ని.

" బహుశా విక్రం అనుకుంటా"

"సర్లే..నీ రూం లో ఆ బ్యాగ్ అది తీసుకొని ..ఐస్ క్రీం తిని..అలాగే ఆ పోలీస్ అధికారి ని కూడా కలిసి ఇటు నుంచే చెన్నై రైలు ఎక్కేస్తాను"

" కంగారేం వచ్చింది..ఒకటి రెండు రోజులు ఉండచ్చుగా " అన్నాడు రాం.

"ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నదగ్గర్నుంచి యామిని ని కలవాలనిపిస్తుంది.అది వీలయ్యేది కాదు,దీనికంటే శుభ్రంగా చెన్నై వెళ్ళి నా తల్లిదండ్రుల దగ్గర గడపడం మంచిది" అన్నాను.

"మంచిది" ఇద్దరూ అంగీకరించారు.

రాం గది కి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకున్నాను.ముగ్గురం నడుచుకుంటూ కేంపస్ గేట్ దాకా వెళుతున్నాము.

"నువు డేటింగ్ టిప్స్ పురుషుల కే ఎందుకు పెట్టడం..ఆ శిక్షణా అది లేడీస్ కి కూడా పెట్టచ్చుగదా " అజయ్ అడిగాడు రాం ని.

"అంత అవసరం లేడీస్ కి లేదు.అందం గా లేని ఆడవాళ్ళ కి సైతం ఎంతో మంది మగ ఫాన్స్ ఉన్నారు.ఆ మైండ్ గేంస్ అవీ ఆల్రెడి ఆడవాళ్ళకి తెలుసు.నా టిప్స్ వాళ్ళకి అక్కరలేదు బ్రో" రాం సమాధానం అది.

" అట్లనకు..ఎంతో మంది అపూర్వమైన అందగత్తెలకి సైతం తాము కోరుకున్న వాళ్ళు దొరకడం లేదు.అలాంటి వాళ్ళకైనా నువు హెల్ప్ చేయచ్చుగా" అడిగాడు అజయ్.

" ఆడవాళ్ళ హేపీనెస్ నాకు తర్వాత విషయం.ముందు దేశం లోని మన సోదరులకి సాయం చేయాలి.నా ఆలోచన అది" చెప్పాడు రాం.

" అది అన్యాయం బ్రో. ఆడాళ్ళందరూ నువు అనుకుంటున్నంత బ్యాడ్ గా లేరు.నువు అపార్ధం చేసుకుంటున్నావు.వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి" అజయ్ అభిప్రాయం అది.

"నేనూ అలా అనట్లేదు బ్రో.ఇప్పటికే వాళ్ళది పై చేయి గా ఉంది " అన్నాడు రాం.

వాళ్ళిద్దరూ చిన్న విషయాల మీద అలా వాదించుకోసాగారు.నాకు మాత్రం యామిని నన్ను కనీస మర్యాద కైనా కలవకపోవడం జీర్ణించుకోలేని విషయం గా అనిపించసాగింది.ఇవన్నీ నా ఫ్రెండ్స్ తో చర్చించ దలుచుకోలేదు.
బహుశా నేను ఒక విపరీత సున్నితత్వం కలిగినమనిషి నే కావచ్చు.ఓటమి ని తట్టుకునే ధైర్యం లేనివాడినే కావచ్చేమో.యామి ని తప్ప ఇంకో వ్యక్తి లేరు అని నిశ్చయించుకున్న పనికిమాలిన వాడినే కావచ్చు.బహుశా సూసైడ్ అనేది పిరికి వాడే చేసుకునేదేమో.నిజమేనేమో.ఫ్రెండ్స్ తో కలిసి ఐస్ క్రీం తిన్నాను.వాళ్ళకి గుడ్ బై చెప్పి పోలీస్ స్టేషన్ వైపు దారి తీశాను.యామిని భాష లో చెప్పాలంటే వారికి  వీడ్కోలు పలికాను.నా సూసైడ్ ని ఫ్రెండ్స్ ని కలిసేంతవరకు వాయిదా వేసుకోవడం మంచిదే అయింది.

అసలు పోలీస్ అధికారి నన్ను ఎందుకు కలవాలని అనుకున్నాడు.కారణం ఏమై ఉంటుంది..?నేను క్రిమినల్ ని కాదు.హీరోనీ కాదు.ఇవి అన్నీ తెలుసుకునే ఆ తర్వాత  చావాలి.అనుమానం తో ఎందుకు మరణించడం..?మొత్తానికి స్టేషన్ కి చేరుకున్నాను.విక్రం అనే పోలీస్  అధికారిని కలిశాను.తను సబ్ ఇన్స్పెక్టర్.ఏవో రికార్డ్ లు చూస్తున్నాడు వెళ్ళేసరికి.

" విక్రం గారంటే మీరేనా ..?" అడిగాను.

" ఔను..ఏం కావాలి.." అన్నాడతను.

" నా పేరు వరుణ్.MIIT లో స్టూడెంట్ ని.మీరు నన్ను రమ్మన్నారని నా ఫ్రెండ్ రాం చెపితేనూ ఇలా వచ్చాను..." చెప్పాను.

"ఓ...నువ్వేనా వరుణ్..!దా ఇలా కుర్చో అబ్బాయ్ " నాతో చాలా మర్యాద గా చెప్పాడు ఆ పోలీస్ అధికారి.అది నన్ను ఆశ్చర్యపరిచింది.

"సారీ సర్...నా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రి లో ఉన్నాను కొంతకాలం..!మిమ్మల్ని వెంటనే కలవలేకపోయాను" ఎదురు గా ఉన్న కుర్చీ లో కూర్చొని చెప్పాను.

" నీ ఫ్రెండ్ చెప్పాడులే...ఇప్పుడు ఎలా ఉంది..?" అడిగాడు ఆ పోలీస్ అధికారి.సీరియస్ గా కాకుండా మామూలు గానే అన్నాడు తను.

"పూర్తి గా నయం కాలేదు గాని ఒక మాదిరి గా ఉంది" చెప్పాను.

"ఏమిటి ..ఏమయ్యింది నీకు"

" వాడిన మందుల పవర్ వల్ల అనుకుంటా ..నార్మల్ మనిషి లా ఉండలేకపోతున్నాను"

" సరే..నయం  అవుతుందిలే"

" నేనూ అలానే ఆశిస్తున్నాను"

" నిన్ను ఎందుకు పిలిచానో నీకు ఏమైనా అవగాహన ఉందా" కొంచెం ముందుకు వంగి మెల్లగా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ విక్రం.

" తెలియదు సర్.అయోమయం గా ఉంది.నాకు తెలిసి నేనేం తప్పు కూడా చేయలేదు మరి" చెప్పాను.

"నువు మామూలు గా అంటే ఆరోగ్యం చెడకముందు చేసినవి ఏమీ గుర్తు లేదా..?" నా కళ్ళ లోకి చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్.
"నేనేం చేసినట్లు గా అయితే జ్ఞప్తి లేదు.నా మందుల వాడకం వల్ల కూడా జ్ఞాపక శక్తి నశించి ఉండవచ్చు" కొంత టెన్షన్ ఫీలయ్యాను.

" సూర్య అనే పేరు చెపితే నీకు ఏమి జ్ఞాపకం వచ్చినట్లు లేదా .." ఇన్స్పెక్టర్ అడిగాడు.

" లేదు" చెప్పాను.

" అలా అయితే నేను ఓ కధ చెపుతాను.విను.వినగలవా..ఆ కధ లో నీ ప్రమేయం ఏమైనా ఉంటే గుర్తుకొస్తుందేమో చూడు.."

" సరే..సర్"

" కాఫీ తాగుతావా "

" వద్దులెండి.వినగలను.థాంక్స్ మీ ఆఫర్ కి"

"సూర్య అనే ఒక పెద్ద రౌడి ఉండేవాడు.ఒక్క మాటలో చెప్పాలంటే వాడు సాతాన్ కి ప్రతిరూపం"

" ఓహ్.."

"వాడికి ఎలాంటి ఉచ్చం,నీచం లేదు.ఇతరుల జీవితాలకి ఏమైనా వాడికి లెక్క లేదు.వాడికి కావాల్సింది డబ్బు.యువకుల మొబైల్స్ లో ఉండే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఫోటోల ని తస్కరించి పోర్న్  సైట్ లకి అమ్ముకునేవాడు.మీ లాంటి విధ్యార్థుల మొబైల్స్ లో అమ్మాయిల ఫోటోలు ఉంటాయి గదా .."

" ఔను.."

"దురదృష్టవశాత్తు నా కుమార్తె నందిని ఫోటోల్ని కూడా వాడు తస్కరించాడు.వాటిని తిరిగి ఇవ్వడానికి నాకే 5 లక్షలు బేరం పెట్టాడు.అలాంటి చీప్ వెబ్సైట్ లో ఆ ఫోటోల్ని ఊహించ లేకపోయాను."

" ఓరి దేవుడా"

"ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చూసినా పరిణామాలు వేరేలా ఉంటాయని బెదిరించాడు.సరే..అని ఒక తండ్రి గా నా కష్టార్జితం ఇవ్వడానికి సరే అన్నాను"

" మరి పట్టుకున్నారా వాడిని "

"వాడు చాలా క్లెవర్ క్రిమినల్.నన్ను క్యాష్ పట్టుకుని ఓ చోటికి రమ్మన్నాడు.అయితే వాడిని ఊరికినే వదలకూడదు అనేది నాలో ఉంది,ఒక న్యాయం జరగాలి ఈ విషయం లో "

" అది జరిగే ఉంటుంది"

"వాడిని వేటాడానికి ఒక బృందాన్ని ఏర్పరిచాను.వాడు జీవితాంతం జైల్లో ఉండాలి...అనే ఆలోచన తో.వాడిది తెలుసుకొని పది లక్షలకి తన డిమాండ్ పెంచాడు.అది గనక అనేకమంది మొబైల్స్ కి అవి ఫార్ వార్డ్ చేస్తానని బెదిరించాడు..."

" ఆ తర్వాత ఏం జరిగింది"

" నా వద్ద అంత డబ్బు లేదు.అయితే నాకు దేవుడిలో పూర్తి నమ్మకముంది.ఈ గండం గడిచేలా చేయమని మొక్కుకున్నాను..అప్పుడేం జరిగిందో తెలుసా"

" ఏం చేశాడు ఆ దేవుడు"

" నీ రూపం  లో ఆ దేవుడే వచ్చాడు.నా ప్రార్ధన ఫలించింది.నీకు వాడి మీద ఏం కోపం ఉందో నాకైతే తెలియదు.వాడిని నువు అంతమొందించావు.అసలు అంత రహస్య ప్రదేశం లో ఉన్నవాడిని నువు ఎలా పసిగట్టావు అనేది నాకు అర్ధం కాలేదు.వాడు చచ్చిన తరువాత ఎంక్వేరి చేశాను ఆ కిల్లర్ ఎవరై ఉంటారా..అని..?అంటే నిన్ను అరెస్ట్ చేయడానికి కాదు.నువు చేసిన దానికి థాంక్స్ చెప్పడానికి..!ఇంకోసారి థాంక్స్ చెబుతున్నా..నువు ఆ దేవుడివే..!"

" మీరు అనేది ఏమిటి నేను మర్డర్ చేశానా..?" నాకు మతి పోయింది.అసలు అంత దూరం పోయినట్లు నాకు తెలియనే తెలియదు.ఆ షిజోఫ్రెనియ ఇంకా ఉండి ఉంటే ఇంకా ఎంతమందిని చంపిఉండేవాడినో..!!

" బాబూ..నువు చేసింది మర్డర్ కాదు.ఒక దుష్ట శక్తి ని అంతం చేశావు.పోలీస్ లే కనిపెట్టలేనివాడిని నువు కనిపెట్టావంటే పెద్ద అద్భుతం..!." అన్నాడు ఇన్స్పెక్టర్.

" అది నేను కూడా చెప్పలేను ..ఎలా కనిపెట్టానో..!నా మీద చర్య తీసుకోనందుకు మాత్రం మీకు ధన్యవాదాలు" చేతులు జోడించి చెప్పాను.నా కాళ్ళు వణకసాగాయి.

" నువు ఏమీ భయపడకు..హాయిగా ఇంటికి పోయి రెస్ట్ తీసుకో...నీ తర్వాత కర్తవ్యం నెరవేర్చడానికి దేవుడు నిన్ను మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో నేను చెప్పలేను.." చెప్పాడాయన.

"నేను అనుకోవడం మళ్ళీ తను నన్ను పిలవడు.." అన్నాను.ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది నేను వాడిని చంపడం వెనుక.లేనట్లయితే అంత దూరం వెళ్ళను.నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను.

" దాని గురించి నువు ఆందోళన చెందకు.విధి ని ఎవరూ తప్పించలేరు.." ఇన్స్పెక్టర్ అన్నాడు.

"హ్మ్మ్" స్త్రీ జన మానరక్షకుని గా మారి వారిని కాపాడాను.లోపలే అనుకున్నాను.

" సరే...చివరి సారిగా థాంక్స్ చెపుతున్నా..వెళ్ళిరా " అన్నాడు ఇన్స్పెక్టర్. (సశేషం)


     నా పేరు శివ(నవల)Post no:45

ఫిబ్రవరి 17, 2014

నా వాచీ చూసుకున్నాను.రాత్రి పదకొండు అవుతోంది.ECR బీచ్ వద్ద నిలబడి ఉన్నాను.చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే దారి అది.సరైన సమయానికే వచ్చాను. చుట్టు పక్కలా ఎవరూ కనిపించడం లేదు.నా ప్లాన్ అమలు చేసుకోవడానికి ఇదే మంచి వేళ.నాకు బాగా విచారం కలిగించిన కొన్ని వాటిని తలుచుకున్నాను.అలాంటి వి అదృష్టం కొద్దీ బాగా నే ఉన్నాయి.ముఖ్యం గా యామిని కి సంబందించిన విషయాలు.రాం,అజయ్ అనే ఇద్దరు మంచి మిత్రులు,మాదక ద్రవ్యాల తోనూ అవి లేకుండానూ నాకు ఆనందకరమైన క్షణాలను పంచారు.ఒక దుష్టుడిని చంపి ఇంకో మంచి ఫేమిలీ ని కాపాడాను.

కొన్ని పశ్చాతాపాలూ ఉన్నాయి.నా తల్లిదండ్రులను బాధపెడుతున్నాను.యామిని తో చివరి సారి గా మాటాడలేకపోయాను.చివరి సారిగా ఓ సారి కాల్ చేయాలని అనుకొని చేశాను.మొబైల్ నుంచి చేసిన ఆ కాల్ ని ఆమె ఎత్తనేలేదు.అయిదు సార్లు వరసగా చేశాను.ఎత్తడం లేదు అవతల.చివరి సారిగా ఆ కోకిల స్వరం వినే రాత లేదు నాకు అనుకున్నాను.

పోనీలే..ఇంకో అయిదు నిమిషాల్లో ఈ శరీరం పని అయిపోతుంది.ఈ సముద్రం లో భాగంగా కలిసిపోతుంది.నా ఆత్మ పైకి అనంత లోకాలకి ఎగిసిపోతుంది.నా తల్లిదండ్రులకి ,దేవుని కి క్షమాపణలు చెప్పుకున్నాను.ఇప్పుడు సముద్రం లోకి  వెళ్ళిపోతున్నాను.మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చాయి.ఇంకా లోపలకి వెళుతున్నాను.

ఇంకొన్ని అడుగులు వేస్తే నా పని అయిపోవును...!
ఇంకో రెండు అడుగులు వేశానో లేదో..నా మొబైల్ మోగడం ప్రారంభమయింది.బహుశా అది యామిని యే కావచ్చును.సరైన సమయానికి చేసింది.ఒడ్డు కి వచ్చాను,ఆ ఫోన్ కి ఆన్సర్ ఇవ్వడానికి..!అది యామిని కాదు ,ప్రియ..ఆ ఫోన్ చేసింది.ఒకందుకు సంతోషం వేసింది.చివరి సారిగా ఈమె తో మాట్లాడి అపాలజి చెప్పాలి.

" హాయ్" అన్నాను.

"వరుణ్...ఎలా ఉన్నావు" అడిగింది ప్రియ.

" నీతో అనుచితం గా ప్రవర్తించినందుకు నిజంగా సారీ" చెప్పాను.

" లేదు.నువు ఆ రోజు అలా అనడం లో తప్పు లేదు.నేనే కొద్దిగా ఓవర్ గా రియాక్ట్ గా అయ్యాను.నిజానికి నిన్ను నేనే విసిగించాను.." చెప్పిందామె.

"నాకు ఫోన్ చేసినందుకు థాంక్స్.మళ్ళీ మనం ఫ్రెండ్స్ అవవచ్చునా.."

" తప్పనిసరిగా..! ఇంకెప్పుడూ మనం మంచి ఫ్రెండ్స్ గానే ఉంటాము.."

"హ్మ్మ్"

"ఎటూ గాని ఈవేళ లో నీకు ఫోన్ చేసినందుకు సారీ..!ఒక భయంకరమైన కల వచ్చింది.నిజం గా భయపడ్డాను"

"ఏమిటి ఆ కల"

"నువు ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నావట.నా తో గొడవ పెట్టుకున్న కోపంలో..!లేచి ఏడవడమే నా వంతయింది"

"షిట్"

" నేను ఒక నిర్ణయానికి వచ్చాను.ఎలాంటి స్థితి లోనూ నీమీద కోప పడను.యామిని నువు కలిసే వరకు నీకు అండ గా ఉంటాను"

" థాంక్స్.."

" నువు నాకు ప్రామిస్ చెయ్యి.అలాంటి పని ఎప్పుడూ చేయనని..!సంఘర్షణ లేనిదే జీవితం లేదు.."

" అవును..బాగా చెప్పావ్"

"జీవితం ఒక అందమైన వరం.దాన్ని మంచిగా గడుపుదాము.మనం పోయిన తర్వాత మన సమాధులపైన నో రిగ్రెట్స్ అని రాసి ఉండాలి"

ప్రియ మాటలు నన్ను కదిలించాయి.నా కోసం ప్రియ ఉన్నది అనే ఆలోచనే బాగా అనిపించింది.ఆమె కి అలాంటి కల రావడం కూడా దేవుడి నిర్ణయమే కావచ్చును.ఈ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోరాదు.ఆ రోజున ఆ పోలీస్ అధికారి చెప్పింది నిజమే...విధి ని ఎవరూ తప్పించలేరు.నేను ఇలా చిన్న వయసు లోనే  పోవడం విధి కి ఇష్టం లేదు.ఒక పిరికివాని లా నేను చావకూడదు.నా కలలు నిజం కావడానికి నేను కృషి చేయాలి.

" ఏమిటి ఆలోచనలు వరుణ్..?"

"అంత షేర్ చేసుకోదగ్గ గొప్పవి కావులే అవి..ఇక మీదట మనం మంచి మిత్రులు గా రానున్న రోజుల్లో మసలుకుంటాం..అంతే గా" నవ్వుతూ అన్నాను.

" బాగా చెప్పావ్.నువు అవతల నుంచి నవ్వుతున్నావు..నిజమేగా.." ఆమె అడిగింది.

" అది ఎలా తెలిసింది"

" నాకు కొన్ని శక్తులు ఉన్నాయి" ఆమె చెప్పి నవ్వింది.

" సరే..మంచి మిత్రులు మళ్ళీ కలిసేది ఎన్నడు..?"

"రేప్రే"

"అద్భుతం..మనం రేపు కలిసే బ్రేక్ ఫాస్ట్ చేయబోతున్నాం..లేచిన తర్వాత నేనే కాల్ చేస్తా"

" డన్.."

"బాయ్" అలా చెప్పి కాల్ ని కట్ చేశాను.

అవును రాం చెప్పింది నిజమే.నా గతం ఎంత భయానకమో నా భవిష్యత్ అంత మంచి గా ఉండబోతున్నది.నా జీవితం మార్పు కి చేరువ అవుతున్నది.మళ్ళీ నేను మామూలు మనిషిని అవుతున్నాను.ఒక పాజిటివ్ ఎనర్జీ నన్ను ఆవహించింది.ఈల వేసుకుంటూ బైక్ మీద ..చెన్నై రోడ్ మీద వెళుతున్నాను.నా హృదయం లో ఏదో దైవత్వం కొలువు అవుతోంది..నేను ఎంత ఎక్కువ గా ఫీలయ్యాను కొన్ని విషయాల్లో అని ఇప్పుడు అనిపిస్తోంది.యామిని తో మంచి గా ఉండి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు ఆమె ని..!ఒక వేళ ఆమె నా జీవితం లోకి రాకపోయినా బెంగ లేదు.నా కోసం ఇంత కన్నా మంచి అమ్మాయిని విధి సెలెక్ట్ చేసి ఉంచిందేమో..!ఇప్పుడు నా ముందు ఉన్నది ఒకటే...జీవితం లో చక్కగా సెటిల్ అవ్వాలి..నా తల్లిదండ్రులు గర్వించే లా ఉండాలి.నా ప్రేమ కి అర్హమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళు మాత్రమే..!

ఆ రాత్రి ఫోన్ చేసి కాపాడినందుకు నేను ప్రియ కి థాంక్స్ చెప్పాలా లేదా దేవుడికి థాంక్స్ చెప్పాలా..?రెండూ విధాలు గా నూ చెప్పాల్సిందే..!ఏదైమైనా నా జీవితం అంత త్వరగా అంతమవకూడదని రాసి ఉన్నది.ఎంతో ముందు కి వెళ్ళాలి.నా చీకటి రోజులన్నిటినీ దూరం గా విడిచి..! ఓ జీవితమా ..ఇదిగో నేను వస్తున్నా..! (సశేషం) 


   నా పేరు శివ(నవల)Post no:46

ఫిబ్రవరి 18, 2014

"హాయ్ పిచ్చి.."నా చేతులు ఊపాను ప్రియ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు నిలబడి.

"నేను అలా ఏం కాదు" బైక్ మీద కూచుంటూ అన్నది ప్రియ.

"ఏమిటి ఈ రోజు ఆఫీస్ లేదా మీకు" బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాను. చాలా ఆనందం గా ఉంది లోపల.ఒకటి నేను జీవించి ఉన్నందుకు,రెండు ప్రియ ని మళ్ళీ ఇలా కలవగలిగినందుకు.

"ఈ రోజు సెలవు పెట్టాను.అసలే గత  సారి అలా జరిగింది.ఈ సారి ఇలా మనం కలవడం తప్పని సరి అని చెప్పి సెలవు పెట్టా"

" జరిగిపోయిన వాటి గురించి ఇక వద్దు లే...అదంతా ఓ పెద్ద ఇది"

"యామిని విషయం లో నువు మోసపోయి ఉన్నావు గనక నువు అలా బిహేవ్ చేయడం లో అర్ధం ఉంది.నేనే అలా అనకుండా ఉండవలసింది.నిన్ను మానసికం గా మంచిగా ఉంచుదామనే బయటకి రమ్మంది నేను..అది మరిచి వేరే లా అయిపోయాను"

"సరే ..గతం గురించి చింతించవద్దు.యామిని నుంచి నేర్చుకున్న పాఠం అది.ఇప్పుడనే కాదు ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన సత్యం అది"

"ఈరోజు హుషారు గా ఉన్నావు ఏమిటి" ప్రియ అడిగింది.

"నేను మారి పోయాను ప్రియ.నిజం చెప్పాలంటే ఓ కొత్త మనిషి గా పరిణామం చెందాను"

" సరదా మనిషి లా మారిపోయానంటావ్"

"బాగా చెప్పావ్...అదే ఎప్పటికీ నిలిచిపోయేది..ఎన్ని అనుభవాలు కలిగినా "

"నీ మాటలు వీనుల విందుగా ఉన్నాయి ఈరోజు"

"ఈ మంచి మూడ్ లోకి వెళ్ళే ముందు నేను ఒకటి ఒప్పుకొని తీరాలి...ఆ అవసరం ఉంది.ఆ విధంగా నాకు కొంత శాంతి కూడా కలుగుతుంది"

" సరే..కానివ్వు.. చెప్పు"

"గత రాత్రి సరిగ్గా నువు ఫోన్ చేసినపుడు నేను సూసైడ్ చేసుకోబోతున్నాను.ఎవరూ లేని ఆ బీచ్ లో మునిగిపోబోతున్నాను.నీ ఫోన్ వచ్చే క్షణం వరకు అదే నెగిటివ్ మైండ్ తో ఉన్నాను.నా మాటలే కొద్దిగా అర్ధమయి ఉండవచ్చు.జీవితం అనేది విలువైన బహుమతి అని నువు అన్న మాట నాలో కొత్త ఊపిరులూదింది.నా నిర్ణయం ఎంత తెలివిమాలినదో అర్ధమయింది.యామిని అలా చేసిందని నేను చావడం మతి లేని పని ..ఒక్క మాటలో చెప్పాలంటే నీకు థాంక్స్ చెప్పాలి" నాలో ఉన్నదంతా చెప్పాను.

"ఓ దేవుడా..అదే సమయానికి నాకు ఆ కల రావడం మంచిదయింది.ఇంకెప్పుడు అలా చేయకు.నీ బాధ ని అంతా ఎవరికైనా వినిపించాలనుకుంటే నేను ఉన్నాను గుర్తుపెట్టుకో వరుణ్"

"ఇక అలాంటిది ఏమీ ఉండదు ప్రియ.ఇక ఆ పాత వరుణ్ ని నువు చూస్తావు.అంటే బ్రాండ్ న్యూ వరుణ్ అనుకో.."

"అంటే తను ఎలా ఉంటాడని" నవ్వుతూ అందామె.

"అక్కడ పిచ్చి వాగుళ్ళు ఏవీ ఉండవు.."

"అంతదాకా అర్ధమయింది"

"అది చాలు"

" ఈరోజు మనిషి వి హుషారు గా ఉన్నావు...ఇది బాగుంది.అలాగని పాత మనిషివి బాలేదని కాదు,దాని ప్రత్యేకత దానిది"

"ఇక ఇలానే ఉంటా.."

"మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే ఓ ఆట ఆడదాం.నేను ఓ ప్రశ్న అడుగుతా దానికి నువు జవాబు చెప్పాలి.అలాగే నువు అడుగు.అయితే ఒకటే రూల్..నిజం మాత్రమే చెప్పాలి.అది ఎంత పర్సనల్ అయినా గాని"

" అలాంటి గేం లు నేను ఆడలేను..నిజం ని కూడా నువు ఆశించకూడదు"

"నీ లోలోపలి కోరికల గురించి అడగను.నువు ఎన్ని సబ్జెక్ట్స్ లో కాలేజ్ లో ఫెయిల్ అయ్యావు..అలాంటివి,కూల్ గా ఉండు "
"సరే..బాగుంది..కానీ" అంది ప్రియ.

"ముందు ఎవరు"

"నేను"

"చూద్దాం..ఏమి అడుగుతావో"

"నీ ఫేవరేట్ సాంగ్ ఏమిటి"

"ఇప్పటిదాకా డ్రీంస్ ఆన్ ఫైర్ ఇకనుంచి సుల్తాన్స్ ఆఫ్ స్వింగ్"

"ఎందుకలా"

"అది చెప్పను..ఇప్పుడు నా వంతు"

" సరే..కానీ"

"నీ బాల్యం లో బాగా సంతోషం కలిగించిన విషయం ఏమిటి"

"నా ఫ్రెండ్ సరోజ తో బాట్మింటన్ ఆడటం"

"ఎంత బాగుందో..నా చిన్నతనం లో లలిత్ అనే ఫ్రెండ్  ఉండేవాడు.వాళ్ళ ఇంటి పిట్టగోడ మీద ఎక్కి మాటాడుకునేవాళ్ళం"

"అప్పుడు ఏం మాట్లాడుకునేవారు "

"ఎక్కువ శాతం గర్ల్స్ గురించే.ఏ అమ్మాయి హాట్..ఏ అమ్మాయి పెళ్ళికి సూట్ అవుతుంది..ఇలా..ఎన్నో"

" ఆ స్కూల్ లో ఉన్నప్పుడే పెళ్ళి గురించి ఆలోచనలా .."

" చెన్నై అబ్బాయిలు అదే తీరు ..తెలియదా"

"అంతా అలాని అనకు.నువ్వు అలా అని చెప్పు"

"నాకు గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్ సమయం లో చాలా తక్కువ ఎందుకో తెలుసా"

"ఎందుకు"

"ఎక్కువ సంబంధం పెట్టుకుంటే ఫ్యూచర్ లో మేరేజ్ చేసుకోమని డిమాండ్ చేస్తారని..!అన్ని విధాలా సూట్ అయ్యే విధంగా చూసి యామిని ని ప్రేమించా..ఆ మొదటి ప్రేమ, పెళ్ళి కి దారి తీస్తుందని అనుకున్నా"

" నువు ఇడియట్ వి"

"నిజమే..లలిత్ కూడా అదే అనేవాడు.అతను ఎక్కడున్నాడో, తనైనా ...సక్సెస్ అయ్యాడో లేదో"

"అది పెద్ద విషయం కాదు.ఇండియా లో పుట్టిన ప్రతి వారికీ  అరేంజ్డ్ మేరేజ్ అనే సౌకర్యం ఉంది.నీకు ఎవరూ దొరక పోతే పెద్ద వాళ్ళు ఎలానూ ఆ బాధ్యత తీసుకుంటారు.."

"ఇది ముందు ఎందుకు ఆలోచించలేకపోయాను...ఇప్పుడనిపిస్తోంది"

"ఎంత పనికిమాలినవాడికైనా ఒక పిల్ల దొరుకుతుంది..ఇహ నీకు చెప్పేదేముంది"

"ఇక తర్వాత ఎటు పోనిద్దాం..గేం ని"

"ఇది నాకు బాలేదు.ఈ ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం కృత్రిమంగా ఉంది,మామూలు గా మాటాడుకోవడమే ఉత్తమం "

మొత్తానికి శరవణ భవన్ హోటల్ కి వచ్చాము.ఏసి రూం లో కూర్చున్నాము.రెండు ప్లేట్లు మినీ ఇడ్లీస్ చెప్పాము.ప్రియ తో మాటాడుతాను అనగా అప్పుడే నా మొబైల్ మోగింది.చూస్తే అది కొత్త నెంబర్.

"హలో.."

"వరుణ్ యేనా అవతల.."

"అవును వరుణ్ నే..ఎవరది" సిం కార్డ్ లు అమ్మే సేల్స్ మేన్ కావచ్చుననుకున్నా.అయినా ఇంత పొద్దుటా..!

"నేను ప్రవీణ్ ..ని..!యామిని నా గురించి చెప్పే ఉంటుంది" తను అడిగాడు.

"అవును..నువు చాలా క్లోజ్ గా ఆమె కి" కసి గా అన్నాను ప్రవీణ్ తో..! (సశేషం) 


 నా పేరు శివ(నవల)Post no:47

"నేను ఆమె క్లోజ్ ఫ్రెండ్ ని కాను.ఆమె బాయ్ ఫ్రెండ్ ని" అంతే కసిగా జవాబిచ్చాడు ప్రవీణ్.

"అలాగా..! మరి నాకెందుకు కాల్ చేశావ్" నిర్లక్ష్యంగా అన్నాను.

"ఒక మెసేజ్ ని యామిని తరపు నుంచి నీకు తెలియజేద్దామని"

"ఆమే కాల్ చేయచ్చుగా "

"ఇక ఆమె ని ఎప్పుడు నువు కాంటాక్ట్ చేయకూడదనే సారాంశం..ఇక ఎప్పుడు ఆమె ని,నన్ను  డిస్టర్బ్ చేయద్దు ..ఇదే నీకు తెలియజేసే అంశం"

"అంటే అది యామిని అభిప్రాయమా"

"ఇంకా జరిగిన లేటేస్ట్ సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నావా..ఆమె ఇప్పుడు నాతో హాయి గా ఉంది...నిన్ను వదిలేసినందుకు ఇంకా ఆనందిస్తోంది"

"అలా నే చేస్తాను.అయితే నాకో ఫేవర్ చేస్తావా ..నెల కి ఓ సారి ఆమె క్షేమ సమాచారాలు కనుక్కోడానికి నేను కాల్ చేయవచ్చా"

"చండాలంగా ఉంది వినడానికి"

"నెలకి ఒక్కసారి..ఒక్క ఇరవై క్షణాలు మాత్రమే మాట్లాడతా.."

" సరే..కానీ...నెలకి ఓ సారి మాత్రమే..!అది గుర్తుంచుకో.."

"ష్యూర్"

"బాయ్"

"బాయ్" అని చెప్పి ఫోన్ కట్ చేశాను.ప్రవీణ్ నెంబర్ నోట్ చేసుకున్నాను.ప్రియ వేపు చూశాను.

"ఇంకా యామిని ని నీ మనసు లో ఎందుకు పెట్టుకున్నావు..తుడిచేయకుండా" అడిగింది ప్రియ.

"ఏదో సమాచారం కనుక్కోడానికే...ఇదివరకంతటి ఇది లేదు.కాల్ చేయకుండానూ ఉండగలను "

"నిన్ను పనికిరాని చెత్త లా చూస్తున్న వాళ్ళతో ఇంకా ఏమిటి నీకు.."

"కొన్ని అంతే ..ప్రియ"

"సరే..అది వదిలెయ్...!నీ అనారోగ్యం గురించి చెప్పు.."

" నా అనారోగ్యాన్ని షిజోఫ్రెనియ అంటారు.వాస్తవ ప్రపంచం తో సంబంధం పోతుంది.లేని వాళ్ళు ఉన్నట్టుగానూ,ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్టుగా నూ అలా భ్రాంతులు కలుగుతుంటాయి"

"వినడానికి భయం గా వున్నది"

"దానికంటే దానికి జరిపే ట్రీట్మెంట్ ఇంకా భయంకరంగా ఉంటుంది.అయితే గత రాత్రి నుంచి చాలా మంచి మార్పు వచ్చింది నాలో..!అయితే ఎక్కడో పాతవాసనా ఉంది"

"మంచిది.అసలు ఇది నీకు ఎలా వచ్చింది"

"మాదకద్రవ్యాల వాడకం ఎక్కువ కావడం వల్ల వచ్చింది"

"షిట్..నువు అవి వాడావా"

"కొన్ని అలా జరిగిపోయాయి..నిజానికి వాటిని నేను ఇష్టపడేవాడిని కాను"

"ఈరోజు నీలో ఒక మంచి మార్పు కనిపిస్తోంది..అది ఏమిటో చెప్పనా"

"చెప్పు..ఏమిటి"

"గతం లో కంటే నువు చక్కగా మాటాడగలుగుతున్నావు.ఒక ఆత్మవిశ్వాసం కూడా కనిపిస్తోంది,ఇంకో మాటలో చెప్పాలంటే "

"..ఆ చెప్పాలంటే.."

" అద్భుతమైన మార్పు నీలో.."  
మే 26,2014

"నువు ప్రేమ వల ఎవరిమీదనైన వేయాలనుకుంటున్నావా" అడిగాను నేను.

"అవును.." అంది ప్రియ.

"బ్లాక్ మేజిక్ లాంటిది ఎందుకు ..నీ అందమే ఉండగా"

"బ్లాక్ మేజిక్ నే నమ్ముతాను నా అందం కంటే"

"అయితే కేరళ పోదాం పద..అలాంటి వాటికి ప్రసిద్ధి కదా"

"ఎప్పుడు"

"ఆ మనిషి ఎవరో ..తను లేనప్పుడు భరించ లేనంత వియోగం కలిగినప్పుడు"

"అది కలుగుతూనే ఉంది"

"ఎవరో దురదృష్టవంతుడు"

"ముయ్యి నోరు"

" సరదాకి..!అంతే..!పోనీ లక్కీ మేన్.."

"ఎవరూ లేరు.ఊరికే మాట్లాడుతున్నా ..అంతే..!ఇదే మేటర్ ని నెట్ లో చదువుతున్నా"

"నాకూ నిద్ర గా ఉంది.బాయ్ డియర్.చిట్ చాట్ కి ఇది మంచి సమయం కాదు"

"రేపు కాల్ చేస్తా.బాయ్"

"బాయ్"

" నా ఫోన్ టేబిల్ మీద పెట్టి బెడ్ రూం లోకి వెళ్ళాను.రాత్రి అయింది.ఏమి చేయాలో తోచక గత మూడు నెలల్లో జరిగిన సంఘటనల్ని తలుచుకోసాగాను.చాలా స్పీడ్ గా సమయం గడుస్తోంది.అందుకు ప్రియ కి థాంక్స్ చెప్పాల్సిందే.మేము బయటకి కలసి వెళుతున్నాము.రెగ్యులర్ గా ఫోన్ చేసుకుంటున్నాం.నేను యామిని ని మరిచిపోతూ మామూలు గా అవుతున్నానంటే అది ప్రియ వల్లనే అని చెప్పాలి.పూర్తి గా అని కాదు గాని ఆ లైన్ లో పురోగమిస్తున్నా.ప్రవీణ్ మీద మాత్రం అసహ్యం గా ఉంది.

రాం ఇప్పుడు చెన్నై లో ఉంటున్నాడు.ఇక్కడ ఓ కంపెనీ లో ఉద్యోగం వచ్చింది.అప్పుడప్పుడు చాయ్ తాగుతుంటాం బయటకి వెళ్ళి..!తను బిజినెస్ ఐడియాలు చెబుతూంటాడు.ఆ ఉత్సాహం అందరకీ పాకుతుంది.నాకూ ఏవో లక్ష్యాలు ఏర్పడసాగాయి విన్నప్పుడల్లా..!వచ్చే ఏడు కాలేజ్ అటెండ్ అయ్యి  డిగ్రీ పొందాలి.

రాత్రుళ్ళు విశ్రాంతి గా అనిపించడం లేదు.అటు ఇటూ దొర్లుతున్నా నిద్ర పట్టడం లేదు.టెర్రస్ మీద కి వెళ్ళి సిగరెట్ కాల్చసాగాను.కళ్ళు మూసుకొని ఉన్నాను.కాసేపటి లో సిగరెట్ అయిపోతుంది.ఆశ్చర్యం గా ఒక గొంతు వినిపించసాగింది.

"ప్రవీణ్ ని చంపు" ఆ గొంతు చిన్న స్వరం లో అన్నది.నేను విన్నది నిజమేనా అనిపించింది.తల ని ఓ సారి విదిలించాను అటూ ఇటు.

"చంపు ప్రవీణ్ ని" ఈ సారి గొంతు పెద్ద గా అన్నది.ఎవరైనా ఉన్నారా అనీ అటూ ఇటూ చూశా..ఎవరూ లేరు.ఈ లోపులో ఆ గొంతు రెట్టించిన ఉదృతి తో అరవసాగింది.

"ప్రవీణ్ ని చంపు, ప్రవీణ్ ని చంపు,ప్రవీణ్ ని చంపు" ఇలా ..పదే పదే ఆ గొంతు అరవసాగింది.ఆ శబ్దం ఎక్కువ అయి భరించరానిది గా మారింది.ఇది నాకు కలుగుతున్న భ్రమ నా? ఆ వాయిస్ నా తల లోనుంచే వస్తోంది ఎక్కడి నుంచో కాదు.ప్రవీణ్ చంపు అంటూ చెలరేగినట్లుగా అరుస్తోంది. (సశేషం)


నా పేరు శివ (నవల) Post no:48

" ఎవరు అది" ప్రశ్నించాను భయంగా.

"ప్రవీణ్ ని చంపు"ఆ గొంతు మళ్ళీ అన్నది.

"నేను ఎందుకు చంపాలి ప్రవీణ్ ని "

"ప్రవీణ్ ని చంపు.ప్రవీణ్ ని చంపు.ప్రవీణ్ ని చంపు"

"ముందు చెప్పు నాకు.ఎవరు నువ్వు"

" ప్రవీణ్ ని చంపు"

నేను తాగుతున్న సిగిరెట్ ని బయట పడేసి ఇంట్లోకి వచ్చాను.అయినా ఆ వాయిస్ నన్ను వదల్లేదు.అంటూనే ఉంది" ప్రవీణ్ ని చంపు" అని..!

"అమ్మా..ఒకసారి లే" ఆతురత  గా మా అమ్మని లేపాను.

"ఏమయ్యింది" అంటూ ఆమె లేచింది.

"మళ్ళీ నాకు ఏవో గొంతులు వినిపిస్తున్నాయి.మళ్ళీ ఆ షిజోఫ్రెనియ తిరగపెట్టినట్లుంది.ఏదో ఒకటి చేయమ్మా" అని కణ్ణీళ్ళతో అర్ధించాను.


"ఏమని అంటున్నది ఆ గొంతు" ఆమె భయంగా అడిగింది.

"ఓ మనిషి ని చంపమని అంటున్నది" చెప్పాను.

"ఏమిటి.." ఆమె నిర్ఘాంతపోయింది.

"ఆ ..ఆ..ఆ...భరించలేకుండా ఉన్నది.." అరిచాను.

"కొద్దిగా నీళ్ళు తాగు.ఈ లోపులో డాక్టర్ ని పిలుస్తాను" అలా చెప్పి ఆమె ఫోన్ అందుకుంది.

నీళ్ళు తాగాను.నాకు ఈ లోపు లో ఓ ఆలోచన వచ్చింది.ఏవో ప్రశ్నలు అడుగుతూ ఆ వాయిస్ ని అలా ఎంగేజ్ చేస్తా..!

"డాక్టర్ ఫోన్ తీయట్లేదు వరుణ్.రేపు పొద్దున దాకా ఓపిక పట్టగలవా ..?" అమ్మ అడిగింది.

"నేను ప్రయత్నిస్తా"

అలా చెప్పి నా బెడ్ రూం లోకి వెళ్ళి తలుపు మూసుకున్నా.ఆ గొంతు "ప్రవీణ్ ని చంపు" అని అంటూనే ఉంది.

"ఏమి చేస్తున్నావు" అమ్మ అడిగింది.

"ఒక ఇరవై నిమిషాలు నాకు టైం ఇవ్వు.నేను ఆ వినిపించే గొంతు తో మాట్లాడుతా" అన్నాను.

"నేను తెలివి తో నే ఉంటాను.భరించలేని విధంగా ఉంటే చెప్పు.దగ్గర్లో ఆసుపత్రి కి వెళదాము"

"సరే..అలాగే..!" అని చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.

"ప్రవీణ్ ని చంపు" ఆ గొంతు చెప్పింది మళ్ళీ.

"నువ్వు ఎవరు" అడిగాను.

"కిల్ ప్రవీణ్"

"నువు ఎవరో చెపితే నేను ప్రవీణ్ ని చంపుతా"

" ప్రామిస్సా..?" ఏదో మొత్తానికి ఇంకో మాట మాట్లాడింది ఆ గొంతు.

"నీ గురించి నాకు చెప్పొచ్చుగా"

" నేను ఎవరో చెపితే చంపుతావా..?"

"తప్పకుండా"

ఆ గొంతు ఆగిపోయింది.నిశ్శబ్దం గా అయిపోయింది రూం అంతా..!రేపు డాక్టర్ ని కలవాలి అనుకున్నాను.అలా అనుకొని డోర్ దగ్గరకి రాగానే ఆ గొంతు మళ్ళీ వినబడింది.

"ఏయ్..ఆగు" అన్నది.

నేను వెనక్కి తిరిగాను.నా ఎదుట ఇప్పుడు ఒక బట్టతల మనిషి నిలబడి ఉన్నాడు.భయం వేసింది.పొడుగు గడ్డం ఉంది.ఒక సన్యాసి వలె ఉన్నది వాలకం.ఒక సారి కళ్ళు మూశాను.కనుమరుగు అవుతాడేమోనని.అదే స్థలం లో నిలబడి ఉన్నాడు అతను.గంభీర  వదనం తో..!

"నువు ఎవరు" అడిగాను.

"నేను  గుణ ని"   (సశేషం)


నా పేరు శివ (నవల) Post no: 49

"నిజమేనా నువ్వు" అడిగాను.నాకు అపుడు అర్ధమయింది షిజోఫ్రెనియ కి మొదటిసారి నేను గురయినపుడు అంటే ట్రీట్ మెంట్ కి ముందు నా పరిస్థితి ఎలా ఉండేదో..!అవి పూర్తి గా గుర్తుకు రావడం లేదు లే గాని ఆ రోజులు మళ్ళీ దాపురించాయా అని భయం వేసింది.

"నువు నిజం అనుకుంటే నిజం..కాదనుకుంటే కాదు" ఆ గొంతు వినిపించింది.

"నువు నా ఊహా అనుకుంటున్నాను"

"చూడు చిన్నా..నువు నా గురించి ఏమనుకుంటున్నావు అనేది ముఖ్యం కాదు.అసలు నేను వచ్చిన కారణం ఏమిటీ అనేది ఆలోచించు.."

"నువు నా ఊహ వే అయితే నేను ఎందుకు వినాలి నీ మాట"


"పైపైన కాదు ఇంకా నీ లోపలకి వెళ్ళి చూడు.."

"నేను ప్రస్తుతం సంతృప్తికరం గా ఉన్నాను.నేను ఏ లోపలకీ దృష్టి సారించనవసరం లేదు.ముఖ్యంగా నా లోనికి"

"అదే నిజమయితే నేను నీకు వినబడను ఇలా...నువు గ్రహించాల్సిన కొన్ని నిజాలున్నాయి"

"దయచేసి అవతలకి పో"


" ఈ మధ్య కాలం లో నీ జీవితం లో కొన్ని జరిగాయి..వాటిని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుందామా"

"ఏ చెత్త ని ఇప్పుడు ఆలోచించ దలుచుకోలేదు"

"నీ భాష జాగ్రత్త.పెద్దాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వు"

"నా నుంచి నీకు ఏమి కావాలి?"

" నీకు పైపైన కొన్ని తెలియట్లేదు గాని నీ మనసు లోతుల్లో కొన్ని ఇంప్రెషన్స్ బలం గా పడ్డాయి"

"నువు చెప్పేది వింటా గాని ఆ తర్వాత నువు పోతావా"

"నేను ఏ విషయంలోనూ ఒట్టు పెట్టను,కర్మ అనేది ఒకటుంది అది తెలుసా"

"ఎటుబోయిన తప్పించుకోలేం అంటాం అదా"

"బాగా చెప్పావు.ప్రాధమిక విషయాలు మాట్లాడాక ఆ అంశానికి వద్దాం"
"ఏమిటి నీ అర్ధం.."

"అసలు నువు ఎవరు..ఈ జన్మ లో నీ డ్యూటీ ఏమిటి..?అలాటివి"

"సరే..కానీ, నేను ఎవరిని.."

"నేను ఏది చెప్పినా సాక్ష్యాధారాలతో చెపుతా..అల్లాటప్పాగా ఉండదు..అదే నా తెలివి ..తెలియదా "

"నువు ఉన్నది నా తల లో..అంటే అది నా తెలివి అని గదా "

"మరదే..!హాస్యం అంటే...!మెచ్చుకున్నాలే..!రాం ఆ విషయం లో నిన్ని మించిపోయాడులే గాని...చిన్నదానికి గొడవలెట్టుకోకూడదు మనం..కలసి చేయాల్సింది చాలా ఉంది ముందు"

"ఓ కె.."

" నీకు గాయత్రి గుర్తుందా..అదే ఆ బస్ లో పర్స్ పోగుట్టుకున్న ఆ లేడీ..?"

"గుర్తుంది.."

"పోయిన పర్స్ ని ఆమె కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఉద్దేశించి ఏమంది..?"

"థాంక్స్ చెప్పింది"

"అక్కడికే వస్తున్నా..చూడు.చేతనావస్థ లో ఉన్న నీ మెదడు థాంక్స్ అనే పదాన్ని గుర్తుంచుకుంది.దాని గురించి నేను చెప్పట్లేదు.నీ అచేతనావస్థ లో కి వెళ్ళిన ఇంకో మాట ఉంది..దాని గురించి నేను చెప్తున్నా ..అది అవసరమైనపుడు ఈజీ గా బయటకి వస్తుంది.."

"అదేమిటి చెప్పు"

"ఆమె నిన్ను దేవుడు వి అని ఓ మాట అన్నది..గుర్తు లేదా?"

"పర్స్ ఎవరకి దొరికినా కాస్త బుద్ధిఉన్నవాడెవడైనా తీసుకెళ్ళి అవతల వాళ్ళకి ఇస్తారు.దీంట్లో దైవత్వం ఏముంది..? చిన్న విషయం "

" ఆమె ఆ పర్స్ దొరకాలని దేవుళ్ళకి మొక్కుకున్నప్పుడు అది నీకు అక్కడ దొరికింది.అది  కాకతాళీయమని భావిస్తున్నావా..? "

"అలాంటిదే అనుకుంటున్నా"

"అక్కడ అంతమంది ఉండగా నీకే ఎందుకు దొరకాలి.."

"అది కాకతాళీయం అని చెప్పాగా"

"వాదన అంటే నీకు ఇష్టం లా ఉందే"

"కరెక్ట్ గా చెప్పావ్"

"సరే..పోలీస్ ఆఫీసర్ ...!అతను ఏమన్నాడు నిన్ను..తన కూతుర్ని ఆ దుర్మార్గుడి నుంచి రక్షించినందుకు..?"

"దేవుడు అనా"

"నీకు గణితం అంటే ఇష్టమా ..వరుణ్"

"అవును"

"నా ఫేవరేట్ టాపిక్ దాంట్లో...ప్రోబబిలిటీ సిద్ధాంతం..నీకూ .."

"కాలిక్యులస్"

"అయితే నా వాదనని సరిగా నే అర్ధం చేసుకోగలవు నువు"

"అవును"

"అక్కడ చూడు..ఒకరికి ఒకరు సంబంధం లేని ఇద్దరు నిన్ను దేవుడు అని అన్నారు.అదీ తక్కువ కాలం లో"

"చాలా తక్కువ కాలం లో"

"అంత దగ్గర గా  సంఘటనలు జరగడం కాకతాళీయం అని అంటావా నువ్వు.."

"సరే..నీకు అర్ధమైన విషయం చెప్పు"

"నీ గురించిన సత్యం నీకు తెలియబరుస్తున్నాను.నువు దేవుడి అవతారానివి.ధర్మం నిలబెట్టటానికే నీ జన్మ.ప్రపంచం లో మార్పు తీసుకురావడానికి ముందర మన వ్యక్తిగత జీవితాల్లో మార్పు రావాలి.ఏమంటావు..?" భ్రమ నాకా అతనికా అనిపించింది.

"హ్మ్మ్"

"దేవుడు అని అనడం కంటే నిన్ను శివుడి గా నేను భావిస్తున్నా.ఎందుకంటే అదే నిజం కాబట్టి.నువ్వే శివ,శివ యే నువ్వు"

"నిజంగానా"

" అసలు శివుని అవతారం ఆ కధాకమామీషు ఏంటో తెలుసా "

"తెలీదు"

" నీ డ్రీం గర్ల్ యామిని ఉందే...ఆమె ఎవరో కాదు నీ అర్ధాంగి..పార్వతి ..!ఆమె తో నువు కలిసి తీరాల్సిందే "

"అదేలా జరుగుతుంది"

"రాం లాగా నేను డేటింగ్ పాఠాలు చెప్పను.అయితే ఒక మార్గం చెపుతా..!మీ ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్నదెవరూ"

"ప్రవీణా.."

"బాగా చెప్పావ్.ఇప్పుడు కర్మ గురించి చెప్పుకుందాం.నీ దేవత ని వాడు తన్నుకుపోయాడు...అలాంటప్పుడు నువు కసి తీర్చుకోవద్దా ..?దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుసుకోవాలా లేదా..?"

"అయితే నేనిప్పుడు ఏం చేయాలి"

"ప్రవీణ్ ని చంపి పారేయ్..!పార్వతి ని వెనక్కి తెచ్చుకో...!మీరు ఇద్దరూ జగతిని ఏలాలి  అది నేను చూడాలి"

"నాకు కొంత టైం ఇస్తావా"

"నీ యిష్టం తీసుకో..అయితే ఎంత త్వరగా అయితే అంత మంచిది.సరే...మళ్ళీ కలుస్తా"

అలా చెప్పి గుణ అంతర్ధానమయ్యాడు.ఇది నిజమా నా భ్రాంతి యా అని నివ్వెరపోయాను.ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఉండి,తెల్లారి డాక్టర్ ని కలవాలి అని అనుకున్నాను.గుణ ఇచ్చిన సలహా మీద ఆలోచించదలుచుకోలేదు.ఇప్పటికే ఒకడిని చంపి అరెస్ట్ ని తప్పించుకున్నాను.మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంకోడిని చంపితే చట్టం కూడా ఊరుకోదు.నా తల్లిదండ్రులకి అవమానం.యామిని కి కూడా..!నా మనసు లోనుంచి ఆ ఆలోచనల్ని తీసివేసుకోవడం మంచిది.చికిత్స అనేది నాకిపుడు ఎంతైనా అవసరం.(సశేషం) 











































































































No comments:

Post a Comment