పాలకులకి మిలిటరి శిక్షణ అనేది ఎందుకనో చాలా గౌరవనీయమైన అంశం,ఇంకా చెప్పాలంటే చాలా ఆవశ్యకమైన అంశం చాలా పాశ్చాత్య దేశాల్లోచూసినట్లయితే..! చాలా కీలకమైన ఇతర సివిల్ ఉద్యోగాల్లో కూడా మిలిటరి లో పని చేసి రిటైర్ అయిన వాళ్ళో,డెప్యుటేషన్ మీద పని చేసేవాళ్ళో కనిపిస్తారు.అది ఒక తిరుగు లేని అదనపు అర్హత.బ్రిటన్,నార్వే ఇలా ఏ యూరపు లోని రాచ కుటుంబీకులు చూసినా తప్పనిసరిగా కొంత కాలం సైన్యం లో పనిచేస్తారు.ఒక సైనికుడు చేసే పని దగ్గర్నుంచి మొదలుకుని అన్నిటిని ఎటువంటి భేషజాలు లేకుండా చేస్తారు.శరీరం ఫిట్ గా ఉంటేనే మనసు ఫిట్ గా ఉంటుంది.సైనిక శిక్షణ లో వచ్చే అనుభవం చాలా విలువైనది.త్యాగము,కష్టించి పని చేయడము,చురుకుదనము,దేశం పట్ల అనురక్తి అవన్నీ లోతు గా పాదుకుంటాయి.నాకు తెలిసి అమెరికా అధ్యక్షులు చాలా మంది ఏదో ఒక యుద్ధం లో స్వయం గా ఫాల్గొన్నవారే.అలాగే యూరపు లో కూడా ..సైనిక శిక్షణ గల వారికి ఉండే విలువే వేరు..వాళ్ళు ఏ రంగం లో ఉండనీ.కానీ ఎందుకనో గానీ మరి మన దేశం లో సైన్యం లో ఉండే వారి పైన తగు మర్యాద చూపించరు.అంతే కాకుండా చాలా చవకబారు జోకులు వేసి హేళన చేస్తుంటారు.అసలు ఈ ధోరణి ఎక్కడనుంచి మొదలయింది..అది కూడా ..అలాంటి ప్రచారం కూడా దేశాన్ని బలహీనపరిచే దానిలో ఒక కుట్రేనా అనిపిస్తుంది.
రెండవ ప్రపంచ యుద్ధం లో సిక్కులు తమ పోరాటపటిమ ద్వారా మన దేశానికే వన్నె తెచ్చారు.ఇంచుమించు ప్రతి ఒక్క కుటుంబం లో ఒక్కరైనా సైన్యం లో ఉండే పంజాబ్ రాష్ట్రం వ్యవసాయం,పరిశ్రమలు అన్నిటిలో గణనీయం గా నే ఉంటారు.అక్కడి లారీ లకి గాని ట్రక్కులకి గాని డ్రైవర్ లు గా ఉండే వారు వాటి యజమానులే.మీరు ఢిల్లీ మొత్తం మీద వెదికినా ఒక్క సిక్కు బిక్షగాడు కూడా కనిపించడు.ఏ రాజకీయ పదవి పొందాలన్నా సైన్యం లో లేని కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారు.కెనడా ,బ్రిటన్ ల లో ఎక్కువగా ఉండే భారతీయుల్లో సిక్కు లే ప్రధమ స్థానం లో ఉంటారు.
ఒక్క మాట లో చెప్పాలంటే మన దేశ రక్షణ లో సిక్కులు కీలకమైన పాత్ర మొదటి నుంచి పోషిస్తున్నారు.ఒక ఉధ్గ్రంధమే రాయవచ్చు ఆ డేటా తో..!బాంగ్లాదేశ్ అవతరణ సమయం లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో పెషావర్ వరకు చొచ్చుకు పోయి కొద్ది మందే ఉన్నప్పటికి అనేక ట్యాంక్ ల్ని విధ్వంసం చేసి చరిత్ర సృష్టించారు.సిక్కులు డి ఎన్ ఏ పరంగా హిందువులే అయినప్పటికీ ,వారు తమ గురువులు చెప్పినట్లుగా తాము సిం హాలమని నమ్మడం మూలానే ప్రపంచం లోని యుద్ధ జాతుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు.Click here