Showing posts with label Oriissa Matters. Show all posts
Showing posts with label Oriissa Matters. Show all posts

Tuesday, 19 August 2014

ఇలాంటి ఒక బ్లాగు ఇంగ్లీష్ లో మన తెలుగు జర్నలిష్టులలో ఎవరైనా రాస్తే బాగుండును..!



కటక్ దగ్గర తిగిరియా కి చెందిన సుభాష్ చంద్ర పట్నాయక్ అనే ఆయన ఒడిశా చరిత్ర,సమకాలీన రాజకీయాలు,వార్త వ్యాఖ్యానాలు సమాహారంగా రాసే ఒక బ్లాగు ని తప్పకుండా చదువుతాను.చాలా బాగుంటుంది.చెప్పే విధానం గాని.. ఎంచుకునే అంశం గాని..టూకీగా ఆ రాష్ట్రం గురించి ..అక్కడి సంఘటన ల గురించి చక్కటి అవగాహన కలుగుతుంది.ఏదో మూడ్ వచ్చి ఒకటి రెండు ఏళ్ళు అని గాకుండా చాలా కాలం నుంచి అసిధారవ్రతంగా రాస్తూ ఉంటాడాయన.జాతీయ సంఘటనల గూర్చి కూడా ఉంటాయి.  

పూరి లోని జగన్నాధుడు వాస్తవానికి బుద్ధుడని..ఆ తరువాత దాని అలా మార్చడం జరిగిందని చాల ఆధారాలు చూపుతూ కొన్ని వ్యాసాలు రాశారు పట్నాయక్.ఆయన ఇంగ్లీష్ శైలి చాలా హృద్యంగా ఉంటుంది.సాధికారత తో చెప్పినట్లు ఉంటుంది.ఇలాంటి ఒక ఇంగ్లీష్ బ్లాగు మన తెలుగు జర్నలిస్టులు ఎవరైనా రాస్తుంటే తెలుపగలరు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మన లాంటి పెద్ద కార్పోరేట్ కాలేజీలు ఒడిశా లో లేకపోయినా ఎందుకనో క్రియేటివ్ ఇంగ్లీష్ రైటింగ్ అనేది ఒక సాంప్రదాయం లా వస్తున్నది.
సరే..ఆ బ్లాగు సైట్ కావాలా ..అయితే ఇక్కడ నొక్కండి.www.orissamatters.com