Monday, 8 September 2014

ఎన్నార్ చందూర్ నడిపిన పత్రిక "జగతి" తీరే వేరు.



చెన్నయ్ నుంచి జగతి అనే మాస పత్రిక వచ్చేది.ఎర్రటి బ్యాక్ గ్రౌండ్ మీద తెల్లటి అక్షరాలు.రమారమి 53 సంవత్సరాలు నడిచి,ఇంచుమించు 620 ఇష్యులకి పైగా ప్రచురణ కావడం..అదీ వన్ మేన్ ఆర్మీ లాంటి ఎన్నార్ చందూర్ నేతృత్వంలో..!చాలా సింపుల్ గా వచ్చేది ఎలాంటి పటాటోపం లేకుండా.. చాలా దాకా ఆ సంపాదకులు ఏర్చికూర్చినవే.అయితే కొన్ని ఆణిముత్యాల వంటి రచనలు,సేకరణలు ఉండేవి.పాత సినిమా సమీక్షలు,డైరీ విశేషాలు,జోకులు,ఉత్తరాలు,పుస్తక సమీక్షలు,జఫర్సన్ రచన కి అనువాదం,ఇలా గమ్మత్తు కూర్పులతో వచ్చేది.

పత్రిక ..ముఖ్యంగా చిన్న పత్రిక నడపడానికి..ఆర్ధిక స్థోమత అటుంచి చాలా ఓర్పు ఉండాలి. చాలా మంది చిన్న పత్రికలు ఎంత తొందరగా తెస్తారో అంత తొందరగానూ మూసేస్తారు.ఓర్పుతో నడపాలే గాని కాలం తో పాటు దానికీ ఓ శక్తి పెరుగుతుంది.గౌరవం పెరుగుతుంది.ఇక లోధ్ర ,కేసరి ,అశోక పౌడర్ యాడ్ లు గుర్తుకొస్తాయి జగతి అనగానే.

పాపం చనిపోయేంతవరకు ..నాకు ప్రతి నెల ఓ కాపీ పంపుతుండేవారు చందూర్ గారు. పాత జగతి కాపీలు చూసినప్పుడల్లా కొన్నేళ్ళు వెనక్కు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది.కొన్ని ఏళ్ళ క్రితం The Books  అనే నాలుగు పేజీల ఇంగ్లీష్ పత్రిక నడిపినప్పుడు నేను టంచన్ గా ఆయనకి ఓ కాపీ పంపేవాడిని.ఆ గౌరవం తో అనుకుంటాను..బహుశా ఆయన చివర కాపీ వరకు జగతి ని నాకు పంపేవారు.ఈ రోజు ఆ జగతి పాత ప్రతి చూడగానే ఇది రాయాలనిపించింది.Click here 

No comments:

Post a Comment