రిటైర్ అయిన వారి కోసం,సీనియర్ సిటిజన్స్ కోసం నడుపబడుతున్న మాసపత్రిక "సీనియర్ సిటిజన్ వాణి ".ఇది మచిలీపట్నం నుంచి వస్తున్నది.కధలు,కవితలు,వివిధ వార్తలు దీనిలో ప్రచురిస్తూ ఉంటారు.పత్రిక సైజు లో బాగానే ఉన్నది.అయితే పేజీలు 20 దాకా ఉంటాయి.అట్ట కాకుండా.సీనియర్లు రాసే వ్యాసాలు ఇంకా ఇతర ప్రక్రియలు ప్రచురిస్తూ ఉంటారు.ఒక ఉద్దేశ్యం తో నడుపబడే పత్రికలు క్రమేపి ఆయా వర్గాలకి చేరువ అవుతుంటాయి.పునుకొల్లు సత్యనారాయణ గారు దీని సంపాదకులు.ఆయన సెల్ నెంబర్.9949308664 .మీకు కావలిస్తే సంప్రదించవచ్చు.Click here
No comments:
Post a Comment