నా పేరు శివ (నవల),Post no:44
"అవును..అన్నట్టు ఆ పోలీస్ అధికారి ని కలిశావా..అప్పుడు నేను చెప్పేనే"అడిగాడు రాం.
"ఓ..షిట్..మర్చేపోయాను,తన పేరేమిటి " ప్రశ్నించాను రాం ని.
" బహుశా విక్రం అనుకుంటా"
"సర్లే..నీ రూం లో ఆ బ్యాగ్ అది తీసుకొని ..ఐస్ క్రీం తిని..అలాగే ఆ పోలీస్ అధికారి ని కూడా కలిసి ఇటు నుంచే చెన్నై రైలు ఎక్కేస్తాను"
" కంగారేం వచ్చింది..ఒకటి రెండు రోజులు ఉండచ్చుగా " అన్నాడు రాం.
"ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నదగ్గర్నుంచి యామిని ని కలవాలనిపిస్తుంది.అది వీలయ్యేది కాదు,దీనికంటే శుభ్రంగా చెన్నై వెళ్ళి నా తల్లిదండ్రుల దగ్గర గడపడం మంచిది" అన్నాను.
"మంచిది" ఇద్దరూ అంగీకరించారు.
రాం గది కి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకున్నాను.ముగ్గురం నడుచుకుంటూ కేంపస్ గేట్ దాకా వెళుతున్నాము.
"నువు డేటింగ్ టిప్స్ పురుషుల కే ఎందుకు పెట్టడం..ఆ శిక్షణా అది లేడీస్ కి కూడా పెట్టచ్చుగదా " అజయ్ అడిగాడు రాం ని.
"అంత అవసరం లేడీస్ కి లేదు.అందం గా లేని ఆడవాళ్ళ కి సైతం ఎంతో మంది మగ ఫాన్స్ ఉన్నారు.ఆ మైండ్ గేంస్ అవీ ఆల్రెడి ఆడవాళ్ళకి తెలుసు.నా టిప్స్ వాళ్ళకి అక్కరలేదు బ్రో" రాం సమాధానం అది.
" అట్లనకు..ఎంతో మంది అపూర్వమైన అందగత్తెలకి సైతం తాము కోరుకున్న వాళ్ళు దొరకడం లేదు.అలాంటి వాళ్ళకైనా నువు హెల్ప్ చేయచ్చుగా" అడిగాడు అజయ్.
" ఆడవాళ్ళ హేపీనెస్ నాకు తర్వాత విషయం.ముందు దేశం లోని మన సోదరులకి సాయం చేయాలి.నా ఆలోచన అది" చెప్పాడు రాం.
" అది అన్యాయం బ్రో. ఆడాళ్ళందరూ నువు అనుకుంటున్నంత బ్యాడ్ గా లేరు.నువు అపార్ధం చేసుకుంటున్నావు.వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి" అజయ్ అభిప్రాయం అది.
"నేనూ అలా అనట్లేదు బ్రో.ఇప్పటికే వాళ్ళది పై చేయి గా ఉంది " అన్నాడు రాం.
వాళ్ళిద్దరూ చిన్న విషయాల మీద అలా వాదించుకోసాగారు.నాకు మాత్రం యామిని నన్ను కనీస మర్యాద కైనా కలవకపోవడం జీర్ణించుకోలేని విషయం గా అనిపించసాగింది.ఇవన్నీ నా ఫ్రెండ్స్ తో చర్చించ దలుచుకోలేదు.
బహుశా నేను ఒక విపరీత సున్నితత్వం కలిగినమనిషి నే కావచ్చు.ఓటమి ని తట్టుకునే ధైర్యం లేనివాడినే కావచ్చేమో.యామి ని తప్ప ఇంకో వ్యక్తి లేరు అని నిశ్చయించుకున్న పనికిమాలిన వాడినే కావచ్చు.బహుశా సూసైడ్ అనేది పిరికి వాడే చేసుకునేదేమో.నిజమేనేమో.ఫ్రెండ్స్ తో కలిసి ఐస్ క్రీం తిన్నాను.వాళ్ళకి గుడ్ బై చెప్పి పోలీస్ స్టేషన్ వైపు దారి తీశాను.యామిని భాష లో చెప్పాలంటే వారికి వీడ్కోలు పలికాను.నా సూసైడ్ ని ఫ్రెండ్స్ ని కలిసేంతవరకు వాయిదా వేసుకోవడం మంచిదే అయింది.
అసలు పోలీస్ అధికారి నన్ను ఎందుకు కలవాలని అనుకున్నాడు.కారణం ఏమై ఉంటుంది..?నేను క్రిమినల్ ని కాదు.హీరోనీ కాదు.ఇవి అన్నీ తెలుసుకునే ఆ తర్వాత చావాలి.అనుమానం తో ఎందుకు మరణించడం..?మొత్తానికి స్టేషన్ కి చేరుకున్నాను.విక్రం అనే పోలీస్ అధికారిని కలిశాను.తను సబ్ ఇన్స్పెక్టర్.ఏవో రికార్డ్ లు చూస్తున్నాడు వెళ్ళేసరికి.
" విక్రం గారంటే మీరేనా ..?" అడిగాను.
" ఔను..ఏం కావాలి.." అన్నాడతను.
" నా పేరు వరుణ్.MIIT లో స్టూడెంట్ ని.మీరు నన్ను రమ్మన్నారని నా ఫ్రెండ్ రాం చెపితేనూ ఇలా వచ్చాను..." చెప్పాను.
"ఓ...నువ్వేనా వరుణ్..!దా ఇలా కుర్చో అబ్బాయ్ " నాతో చాలా మర్యాద గా చెప్పాడు ఆ పోలీస్ అధికారి.అది నన్ను ఆశ్చర్యపరిచింది.
"సారీ సర్...నా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రి లో ఉన్నాను కొంతకాలం..!మిమ్మల్ని వెంటనే కలవలేకపోయాను" ఎదురు గా ఉన్న కుర్చీ లో కూర్చొని చెప్పాను.
" నీ ఫ్రెండ్ చెప్పాడులే...ఇప్పుడు ఎలా ఉంది..?" అడిగాడు ఆ పోలీస్ అధికారి.సీరియస్ గా కాకుండా మామూలు గానే అన్నాడు తను.
"పూర్తి గా నయం కాలేదు గాని ఒక మాదిరి గా ఉంది" చెప్పాను.
"ఏమిటి ..ఏమయ్యింది నీకు"
" వాడిన మందుల పవర్ వల్ల అనుకుంటా ..నార్మల్ మనిషి లా ఉండలేకపోతున్నాను"
" సరే..నయం అవుతుందిలే"
" నేనూ అలానే ఆశిస్తున్నాను"
" నిన్ను ఎందుకు పిలిచానో నీకు ఏమైనా అవగాహన ఉందా" కొంచెం ముందుకు వంగి మెల్లగా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ విక్రం.
" తెలియదు సర్.అయోమయం గా ఉంది.నాకు తెలిసి నేనేం తప్పు కూడా చేయలేదు మరి" చెప్పాను.
"నువు మామూలు గా అంటే ఆరోగ్యం చెడకముందు చేసినవి ఏమీ గుర్తు లేదా..?" నా కళ్ళ లోకి చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్.
"నేనేం చేసినట్లు గా అయితే జ్ఞప్తి లేదు.నా మందుల వాడకం వల్ల కూడా జ్ఞాపక శక్తి నశించి ఉండవచ్చు" కొంత టెన్షన్ ఫీలయ్యాను.
" సూర్య అనే పేరు చెపితే నీకు ఏమి జ్ఞాపకం వచ్చినట్లు లేదా .." ఇన్స్పెక్టర్ అడిగాడు.
" లేదు" చెప్పాను.
" అలా అయితే నేను ఓ కధ చెపుతాను.విను.వినగలవా..ఆ కధ లో నీ ప్రమేయం ఏమైనా ఉంటే గుర్తుకొస్తుందేమో చూడు.."
" సరే..సర్"
" కాఫీ తాగుతావా "
" వద్దులెండి.వినగలను.థాంక్స్ మీ ఆఫర్ కి"
"సూర్య అనే ఒక పెద్ద రౌడి ఉండేవాడు.ఒక్క మాటలో చెప్పాలంటే వాడు సాతాన్ కి ప్రతిరూపం"
" ఓహ్.."
"వాడికి ఎలాంటి ఉచ్చం,నీచం లేదు.ఇతరుల జీవితాలకి ఏమైనా వాడికి లెక్క లేదు.వాడికి కావాల్సింది డబ్బు.యువకుల మొబైల్స్ లో ఉండే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఫోటోల ని తస్కరించి పోర్న్ సైట్ లకి అమ్ముకునేవాడు.మీ లాంటి విధ్యార్థుల మొబైల్స్ లో అమ్మాయిల ఫోటోలు ఉంటాయి గదా .."
" ఔను.."
"దురదృష్టవశాత్తు నా కుమార్తె నందిని ఫోటోల్ని కూడా వాడు తస్కరించాడు.వాటిని తిరిగి ఇవ్వడానికి నాకే 5 లక్షలు బేరం పెట్టాడు.అలాంటి చీప్ వెబ్సైట్ లో ఆ ఫోటోల్ని ఊహించ లేకపోయాను."
" ఓరి దేవుడా"
"ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చూసినా పరిణామాలు వేరేలా ఉంటాయని బెదిరించాడు.సరే..అని ఒక తండ్రి గా నా కష్టార్జితం ఇవ్వడానికి సరే అన్నాను"
" మరి పట్టుకున్నారా వాడిని "
"వాడు చాలా క్లెవర్ క్రిమినల్.నన్ను క్యాష్ పట్టుకుని ఓ చోటికి రమ్మన్నాడు.అయితే వాడిని ఊరికినే వదలకూడదు అనేది నాలో ఉంది,ఒక న్యాయం జరగాలి ఈ విషయం లో "
" అది జరిగే ఉంటుంది"
"వాడిని వేటాడానికి ఒక బృందాన్ని ఏర్పరిచాను.వాడు జీవితాంతం జైల్లో ఉండాలి...అనే ఆలోచన తో.వాడిది తెలుసుకొని పది లక్షలకి తన డిమాండ్ పెంచాడు.అది గనక అనేకమంది మొబైల్స్ కి అవి ఫార్ వార్డ్ చేస్తానని బెదిరించాడు..."
" ఆ తర్వాత ఏం జరిగింది"
" నా వద్ద అంత డబ్బు లేదు.అయితే నాకు దేవుడిలో పూర్తి నమ్మకముంది.ఈ గండం గడిచేలా చేయమని మొక్కుకున్నాను..అప్పుడేం జరిగిందో తెలుసా"
" ఏం చేశాడు ఆ దేవుడు"
" నీ రూపం లో ఆ దేవుడే వచ్చాడు.నా ప్రార్ధన ఫలించింది.నీకు వాడి మీద ఏం కోపం ఉందో నాకైతే తెలియదు.వాడిని నువు అంతమొందించావు.అసలు అంత రహస్య ప్రదేశం లో ఉన్నవాడిని నువు ఎలా పసిగట్టావు అనేది నాకు అర్ధం కాలేదు.వాడు చచ్చిన తరువాత ఎంక్వేరి చేశాను ఆ కిల్లర్ ఎవరై ఉంటారా..అని..?అంటే నిన్ను అరెస్ట్ చేయడానికి కాదు.నువు చేసిన దానికి థాంక్స్ చెప్పడానికి..!ఇంకోసారి థాంక్స్ చెబుతున్నా..నువు ఆ దేవుడివే..!"
" మీరు అనేది ఏమిటి నేను మర్డర్ చేశానా..?" నాకు మతి పోయింది.అసలు అంత దూరం పోయినట్లు నాకు తెలియనే తెలియదు.ఆ షిజోఫ్రెనియ ఇంకా ఉండి ఉంటే ఇంకా ఎంతమందిని చంపిఉండేవాడినో..!!
" బాబూ..నువు చేసింది మర్డర్ కాదు.ఒక దుష్ట శక్తి ని అంతం చేశావు.పోలీస్ లే కనిపెట్టలేనివాడిని నువు కనిపెట్టావంటే పెద్ద అద్భుతం..!." అన్నాడు ఇన్స్పెక్టర్.
" అది నేను కూడా చెప్పలేను ..ఎలా కనిపెట్టానో..!నా మీద చర్య తీసుకోనందుకు మాత్రం మీకు ధన్యవాదాలు" చేతులు జోడించి చెప్పాను.నా కాళ్ళు వణకసాగాయి.
" నువు ఏమీ భయపడకు..హాయిగా ఇంటికి పోయి రెస్ట్ తీసుకో...నీ తర్వాత కర్తవ్యం నెరవేర్చడానికి దేవుడు నిన్ను మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో నేను చెప్పలేను.." చెప్పాడాయన.
"నేను అనుకోవడం మళ్ళీ తను నన్ను పిలవడు.." అన్నాను.ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది నేను వాడిని చంపడం వెనుక.లేనట్లయితే అంత దూరం వెళ్ళను.నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను.
" దాని గురించి నువు ఆందోళన చెందకు.విధి ని ఎవరూ తప్పించలేరు.." ఇన్స్పెక్టర్ అన్నాడు.
"హ్మ్మ్" స్త్రీ జన మానరక్షకుని గా మారి వారిని కాపాడాను.లోపలే అనుకున్నాను.
" సరే...చివరి సారిగా థాంక్స్ చెపుతున్నా..వెళ్ళిరా " అన్నాడు ఇన్స్పెక్టర్. (సశేషం)

No comments:
Post a Comment