Friday 11 May 2018

నా పేరు శివ (నవల),Post no: 51

నా పేరు శివ (నవల),Post no: 51

ఫిబ్రవరి 23,2015

ఇపుడు నేను టేలర్ నోర్టన్ అనే ఐటి కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూ లో ఫాల్గొనబోతున్నాను.యు.కె బేస్డ్ కంపెనీ అది.ఆప్టీట్యూడ్ టెస్ట్ ని పాస్ అయ్యాను.అది సులభంగా నే తోచింది.గ్రూఫ్ డిష్కషన్ కూడా దాటాను.దాంట్లో టాపిక్ ఏమిటంటే ఒక స్కిల్ నేర్చుకోవడానికి  విద్య ముఖ్యమా లేదా మోటివేషన్ ముఖ్యమా అనేది.విద్య కన్నా మోటివేషనే ముఖ్యమని నేను చెప్పాను.నా సొంత అనుభవం గదా.మోటివేషన్ సరిగా లేకనే గదా నేను చదువు లో వెనకబడి వ్యసనాల పాలయింది.నా చివరి సంవత్సరం లో మోటివేషన్ ఉండబట్టే చక్కని స్కోర్ చేయగలిగాను.అదృష్ట వశాట్టు హెచ్.ఆర్.నాతో ఏకీభవించాడు.చివరకి ఇలా ఇంటర్వ్యూ దాకా వచ్చాను.

" వరుణ్" లిస్ట్ లో నుంచి నా పేరు ని పిలిచారు.నేను నా సీట్ లో నుంచి లేచాను.

"ఆల్ ద బెస్ట్" చెప్పారు కో-ఆర్డినేటర్.

కాన్ ఫరెన్స్ రూం లోకి వెళ్ళాను.ఈ సారి ఈ రౌండ్ లో కూడా సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది.జీవితం లో ఎన్నో లోతులు చూసేసిన నాకు ఇది పెద్ద గా అనిపించలేదు.

" కూర్చో వరుణ్" ఇంటర్వ్యూ చేసే అధికారి ఆహ్వానించాడు.

"థాంక్ యూ సర్" చిరునవ్వుతో అంటూ కూర్చున్నాను.

"ఎలా ఉంది..?నెర్వస్ గా ఉన్నావా..కాన్ ఫిడెంట్ గా ఉన్నావా..?" అడిగాడతను.

"ఆట్మవిశ్వాసం తో ఉన్నాను సర్" బదులిచ్చాను.

" అంటే గతం లో ఏమైనా ఇంటర్వ్యూ ల్లో ఫాల్గొన్నావా"

"లేదు.ఇదే మొదటిసారి"

" ఆ లెక్కన నువు సహజంగానే కాన్ ఫిడెంట్ అన్నమాట"

"అవేర్నెస్ వల్ల కాంఫి డెన్స్ వస్తుంది.నేను చేసేది ఏమిటో నాకు బాగా తెలిసినపుడు ఆత్మ విశ్వాసం అదే వస్తుంది.అలా అని అన్నిట్లోనూ నేను కాన్ ఫిడెంట్ కాదు.నాకు అంతుపట్టని సంగతులు కొన్ని ఉన్నాయి.అవి నన్ను ఖిన్నుడిని చేస్తాయి.ఇక ఈ జాబ్ వరకు చెప్పాలంటే పూర్తి సమర్థత తో పనిచేసి కంపెనీ గర్వించే స్థాయి లో నేను నిలవగలను. అట్లా నాకు కాన్ ఫిడెన్స్ ఉన్నది.."

"అంటే నీకు ఏ అంశాలు మిస్టరీ గా అనిపిస్తాయి..?"

"అది పూర్తి గా వ్యక్తిగతమైనది సర్"

"నీకు అభ్యంతరం లేకపోతే చెప్పగలవా ?"
"సమస్య ఏం లేదు సర్.చెపుతా..!అసలు స్త్రీలు మగవాడినుంచి ఏమి కోరుతారో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు.ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వారిని ఎలా హేపీ గా ఉంచాలో నాకు తెలియదు.రూడ్ గా ఉన్నా వారికి నచ్చదు.మంచి గా ఉన్నా నచ్చదు.చాలా గందరగోళం గా ఉంటుంది స్త్రీల విషయం లో..!ఆ విషయాల్లో మాత్రం నేను కాన్ ఫిడెంట్ కాను.."

" నాకు తెలిసింది నేను చెపుతాను,విను.ఇరవై రెండు ఏళ్ళు గా వైవాహితుని గా ఉన్న నాకు ఆ అర్హత ఉన్నదనే భావిస్తున్నా.."

"దయచేసి చెప్పండి సర్"

" నువు ఎలా ఉంటావో అలానే ఉండు వరుణ్.ఆమె ని ప్లీజ్ చేయాలని విపరీతం గా కూడా ప్రయత్నించకు.నీ మాటలు,చేతలు ఒకేలా ఉంటే చాలు.అపుడు నిన్ను ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించదో చూడు.ఎల్లకాలమూ మాస్క్ ధరించి ఉండలేవు..ఎప్పుడో ఒకప్పుడు అది బయట పడుతుంది.నీవు నీలా ఉన్నందుకు చింతించకు..ఆ పిమ్మట ఆమె ఎలా నిన్ను అంగీకరిస్తూ చూడు"

"చాలా గొప్ప మాట చెప్పారు.ఇది ఎప్పుడూ మనసు లో ఉంచుకుంటా .."

"సరే..అసలు విషయానికి వద్దాము.అయితే ఈ ఉద్యోగం విషయం లో ఎలాంటి కష్టం లేదు గా"

" నా పర్సనల్ గ్యారంటీ ఇవ్వగలను సర్..నో ప్రోబ్లం"

"సరే..నీ పని ద్వారా దాన్ని నిరూపించు"

"నేర్చుకోవడం అనేది నాకు బాగా ఇష్టం.నా గ్రూప్ డిస్కషన్ లో కూడా ఈ అంశాన్ని విషదీకరించాను.నిజాయితీ గా చెప్పాలంటే నా జీవితం లోనూ మోటివేషన్ అనే దాన్ని దెబ్బతీసిన ఒక కోణం ఉంది.విద్యని జీవితాన్ని నిర్లక్ష్యం చేశాను.అయితే అదృష్టవశాత్తు ఆ దశని దాటేసి మళ్ళీ జ్యోతి ని వెలిగించుకున్నాను.నా అభ్యసనం అనే గుణం ని ఎప్పటికీ కొనసాగిస్తా,కనుకనే ధైర్యం గా చెపుతున్నా,నేను ఈ జాబ్ ని సమర్థవంతం గా చేయగలను అని.."

"గ్రేట్...బాగా చెప్పావ్...నువు నేర్చుకున్న గుణపాఠాలు ఏమిటో చెప్పగలవా"

"అంటే జీవితపాఠాలా ..?"

"అవును"

"నంబర్ వన్..గతం లోనే ఉండిపోకూడదు.నంబర్ టూ.. నీ తల్లి దండ్రులు గర్వించేలా జీవించు.ఈ రెండూ నేను నేర్చుకున్న జీవిత పాఠాలు.ఆ ఇంకోటి..నువు నీలానే ఉండు..మీరు చెప్పినది ..అది మూడో పాఠం"

"వరుణ్..నీ ఇంటర్ వ్యూ అయిపోయింది.బయటకి వెళ్ళి వెయిట్ చెయ్యి" నవ్వుతూ చెప్పాడాయన.

"మీతో మాట్లాడినందుకు ఆనందం గా ఉంది.థాంక్స్ సార్" షేక్ హేండ్ ఇచ్చి బయటకి ఇచ్చి బయటకి వచ్చేశాను.

బయటకి కొద్ది దూరం దాకా వచ్చి సిగరెట్ వెలిగించుకుని ఆలోచించసాగాను.నా ఇంటర్యూ ఎలా చేశానా అని..!చాలా నిజాయితీ గా ,తృప్తి గా జవాబులిచ్చాను.ప్రియ కి ఫోన్ చేసి చెప్పాను ఇంటర్ వ్యూ విశేషాలని.నీకు వస్తుంది జాబ్ అంటూ ఆనందంగా  మాటాడింది.అలా అరగంట మాటాడి కార్యాలయం దగ్గరకి వచ్చాను.ఎందుకంటే చివరి ఫలితాలు ఇప్పుడే చెపుతారు.నోటీస్ బోర్డ్ మీద పేర్లని ఆబ గా ఎగబడుతూ చూసుకుంటున్నారు మిగతా అభ్యర్దులు.నాలో నూ ఉద్వేగంగా ఉంది ఫలితం ఎలా వచ్చిందో అని..అయితే నాలో ఆత్మవిశ్వాసం కూడా ఉన్నది.తప్పకుండా సెలెక్ట్ అవుతానని.

లిస్ట్ లో చూశాను ఎట్టకేలకు..!ఎస్..ఉన్నది..!టేలర్ నోర్టన్ కంపెనీ లో సిస్టంస్ ఇంజనీర్ గా నేను సెలెక్ట్ అయ్యాను..!ఆనందం తో చేతులెత్తి ఊపాను.జీవితం లో అతి ముఖ్యమైన మిషన్ ని పరిపూర్తి చేశాను.గర్వంగానూ ,ఆనందం గానూ ఉన్నది.

నా తల్లిదండ్రులకి వెంటనే ఈ వార్త అందించాలి..!అలాగే ప్రియకి,అజయ్ కి చెప్పాలి..!

ఇవి నిజంగా ఆనందించవలసిన ఘడియలు..!!! (సశేషం)  

No comments:

Post a Comment