నా పేరు శివ (నవల),Post no:32
" నీ ప్రేమ నేను అంగీకరించడానికి తొంభై తొమ్మిది పాళ్ళు చాన్స్ ఉంది.ఆందోళన చెందకు.రిలాక్స్ గా ఇలాగే నాతో ఉంటూ ఉండు" అంది యామిని.
" నేను నిరాశావాదిని యామిని.నువు చెప్పింది విని నేనిప్పుడు కొండ ఎక్కినంత గా ఆనందపడాలి,కాని పడను.ఆ ఒక్క పర్సెంట్ మేరకు భయమే...నన్ను నిరాకరిస్తావేమోనని"
" అంత ఇదిగా నన్ను ప్రేమిస్తున్నావా"
" మనం సరైన జంట.ఒకేలాంటి జాబ్ ల్లోకి వెళతాం.మనం...చూస్తూనే ఉన్నావు గా...ఇప్పటిదాకా ఎప్పుడైనా పోట్లాడుకున్నామా ...అది చాలదా ...మనం భవిష్యత్ లో సైతం చక్కగా ఉంటామని..!
" నువు చెప్పింది నిజమే.కాని ఒక సాఫ్ట్ వేర్ జీక్ గా మిగిలిపోవాలని లేదు నాకు .నేను ఒక రచయిత్రి గా కూడా కావాలని ఆశిస్తున్నా"
" ఏదీ నువ్వింత దాకా ఒక్క స్టోరీ కూడా రాసినట్లు లేదే..!అసలు దాన్ని నువ్వింత సీరియస్ గా తీసుకుంటావని అనుకోలేదు"
" ఇప్పుడు చెప్పాను గా..సరేనా...అది ఏలియన్స్ ల లవ్ స్టోరీ"
" కనీసం దానిలోనైనా మన ఇద్దరి పేర్లు పెట్టు పాత్రలకి" నవ్వుతూ అన్నాడు ప్రవీణ్ .
" వాటికి మన ఆచారాలు అవీ ఉండవు..అవి ఏలియన్స్ ..అది గుర్తుంచుకో"
" అప్పుడు ఓ పని చెయ్...నన్ను ఎడిటర్ గా పెట్టుకో...హీరో హీరొయిన్ల మధ్య లవ్ సన్నివేశాలు లేని భాగాల్ని తీసేస్తా ..అసలు ఆ నవల అంతా శృంగారమే ఉండాలి.."
" అప్పుడు బోర్ తో పాఠకులు చచ్చి ఊరుకుంటారు"
"ఏమైనా అను..ప్రతి పదిమంది లో ఒకడు నాలాంటి వాడు ఉంటాడు.వాళ్ళకి కావాల్సింది లవ్ సన్నివేశాలే..సరే త్వరలోనే పెద్ద రైటర్ వి అయిపో.."
" నువ్వు పిచ్చివాడివి"
" మా బాగా చెప్పావు"
అక్టోబర్ 12,2013
అనుకున్నదానికంటే ముందు గానే నేను ప్రవీణ్ తో ప్రేమ లో పడ్డాను.ప్రతి రోజు గంటల కొద్దీ మాటలు సాగేవి.నేను చెప్పే ఆ తీపి వార్తకి ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి.ఆ క్షణాన్ని ఫోటో తీయాలి.మళ్ళీ మళ్ళీ చూసేందుకు.
వరుణ్ వాళ్ళ అమ్మతో ఈమధ్య మాటాడినదాని ప్రకారం అతని పరిస్థితి ఏమీ మెరుగు పడినట్లు లేదు.దినమంతా డ్రగ్స్ తోనూ,డ్రింక్స్ తోనూ వెళ్ళబుచ్చుతున్నాడు.ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో తెలియదు.ఎక్కువ కాలం ఉండకూడదనే కోరుకుంటున్నాను.
వరుణ్ కి ఇద్దామని ఒక వాచీ కొన్నాను..బాగుపడినాక ఇద్దామని.కానీ ఇప్పుడు అది ఆసుపత్రి బెడ్ మీద ఉండేప్పుడు ఇవ్వాల్సి వస్తోంది.ఏమైనా ఇక ..ఇదే చివరి సారి అతడిని చూడటం..నీకు బెస్ట్ ఆఫ్ లక్ వరుణ్..మన పాత రోజుల్ని తలుచుకుంటూ..ఇదే ఇక వీడ్కోలు.
ఉన్నట్టుండి నా ఫోన్ మోగింది.అవతల వరుణ్ వాళ్ళ అమ్మ.
" హలో ఆంటీ .." అన్నాను.
" యామిని..మనం ఎదురుచూసిన సమయం వచ్చింది.పది నిమిషాలక్రితమే వరుణ్ కిందపడిపోయాడు.స్పృహ లేదు.అంబులెన్స్ కాసేపటిలో వస్తుంది.ఆసుపత్రికి తీసుకుపోవడానికి"
" థాంక్ గాడ్..ఆంటీ..! నేను ఈ రాత్రికల్లా అక్కడకి వస్తా.."
" థాంక్స్ అమ్మా...తెలివి వచ్చిన తర్వాత వరుణ్ నిన్ను చూస్తే సంతోషిస్తాడు.."
" తప్పకుండా..ఆంటీ"
" బై"
"బై"
ఎన్నో ఏళ్ళ తర్వాత వరుణ్ ని చూడబోతున్నానా అన్నట్లుగా ఉద్వేగం నాలో..!చెన్నై నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా ప్రేమ ని ప్రవీణ్ కి తెలియబరుస్తా.ఇప్పుడు వరుణ్ దగ్గరకి వెళ్ళి ఈ వాచ్ ఇచ్చేసి వీడ్కోలు పలుకుతా..! ఇక నీకు నాకు చివరి పలుకులే వరుణ్ ..గుడ్ బై..!
(సశేషం)

No comments:
Post a Comment