నేను శివ ని (నవల)Post no:24
పార్ట్-3, యామిని వైపు నుంచి
చాప్టర్ 7
ఆగస్ట్ 19,2013
మళ్ళీ మేము ఇద్దరం గోవా కి వచ్చాము.మధుర క్షణాలు ప్రోది చేసుకోవడానికి.ఇది నేను వరుణ్ కోసం బాకీ ఉన్నదే.వరుణ్ తో ఇక నా రోజులు ముగిసినట్లే అనుకున్నాను.భగ్న హృదయిని గా మిగలాలని ఉన్నదేమో అనుకున్నాను.వరుణ్ తో నా జీవితం ఎలా ఉండాలి అనేది ఈ సారి అనుభవం తో తేలిపోతుంది.ఇంకా ఎక్కువ పొరబాట్లని భరించే ఇది నాకు లేదు.తిరుచ్చి నుంచి గోవా వచ్చే ఫ్లైట్ లో అతను చాలా ఉద్వేగంగా ఫీలయినట్లు అనిపించింది.తాను శివుని అవతారంగా చెప్పుకుంటూ నన్ను పార్వతి గా పిలుస్తున్నాడు.
నేను దానికి అడ్డు చెప్పడం లేదు.ఆ సలహా రాం ఇచ్చినదే.వరుణ్ గంజాయి కి దూరం అయితే తను పాత వ్యక్తి అయినట్లే.ఒక లక్ష్యంతో,ప్రేమ తో చదువు పట్ల అనురక్తి తో తిరిగి పాత వ్యక్తి కావడానికి నా పాత్ర నేను పోషిస్తున్నాను.మేము హసియేండా అనే హోటల్ లో దిగాము.ఈ సారి పబ్ లకి కాకుండా బీచ్ లకి తిరగాలని చెప్పాను.ఆ విధంగా ప్లాన్ చేశాము.
" ఏ బీచ్ తిరగాలని నీ కోరిక" వరుణ్ నన్ను అడిగాడు,ఒక సిగరెట్ ఇస్తూ.
" కలంగూట్ అయితే ఎలా ఉంటుంది..?"
" తప్పక అక్కడకే పోదాము"
" లెట్స్ గో బేబీ " అన్నాను అతని బుగ్గని ముద్దిడుతూ.
ఆ బీచ్ కేసి సాగిపోతున్నాము.నేను చేతులు పైకెత్తి ఆనందిస్తున్నాను.సరైన సమయం లో,సరైన చోట సరైన వ్యక్తి తో ఉన్నాను.వరుణ్ కూడా అలా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా.అయితే అతను తన లోకం లో నే విహరిస్తున్నట్లు అనిపించింది.తనలో తనే ఏదో గొణుగుకుంటున్నాడు.అది అర్ధం కావట్లేదు.బీచ్ కి పది నిమిషాల్లో వచ్చాము.
" నువు నన్ను నమ్ముతున్నావా" ఉనట్టుండు నన్ను అడిగాడు.బండి పార్క్ చేస్తూ.
" ఏమిటది"
" నేను అడిగింది..నువ్వు నమ్ముతున్నావా" నా చేతిని పట్టుకుని ,సముద్రం వేపు నడుస్తూ అడిగాడు.
" అంటే నీలో నాకు నమ్మకముందా..లేదా అనా" అడిగాను.
వరుణ్ ఉన్నట్టుండి నవ్వసాగాడు.నాకు చికాకు గా అనిపించింది.
" పార్వతి..నువ్వు దైవ స్వభావి లా కనిపించడం లేదు.ఒక సాధారణ మనిషి లా నే బిహేవ్ చేస్తున్నావ్.నేను గాడ్ ని అని చెప్పినపుడు నువు నమ్మావా లేదా ..? నీ నోరు ఒకటి చెప్పుతోంది నీ ముఖం ఇంకొకటి చెప్పుతోంది."
" వరుణ్ ..నువు దేవుడివే..నమ్ముతున్నా పూర్తిగా ..నువు నన్ను నమ్మాలి "
" నా వెనుక ఇంకోలా చెప్పడం లేదుగా ...నాకు మతి పోయిందని..ఇంకేదో అయిందని"
" ఎంతమాత్రం లేదు స్వీటీ "
" సరే..చిన్న మైండ్ రీడింగ్ గేం ఆడదాం...అలా నా నిజ స్వరూపం నీకు తెలుస్తుంది.ఒకటి నుంచి అయిదు లోపు ఓ సంఖ్య అనుకో లోపల...ఆ సంఖ్య ని నేను చెపుతా... రెడీనా..? "
" ఇప్పుడంత అవసరం ఉందా "
" ముందు చెపుతావా...లేదా...లేకపోతే ..మామూలుగా తగలవ్..." గట్టిగా అరుస్తూ చెయ్యి ఎత్తాడు.నాకు భయమేసింది.వరుణ్ ఆ విధంగా బిహేవ్ చేయగా నేను ఎప్పుడూ చూడలేదు.
" నేను అనుకున్నట్లు నీ సమాధానం ఉంటే రివార్డ్ ఉంటుంది లేదా దానికి మూల్యం చెల్లించాలి.బఠాణి అంత ఉన్న నీ బ్రెయిన్ కిది ముందే తెలియాలి. నా భార్య తో ఇలా అనకూడదు.నాకు తెలుసు గాని నువు చిన్న పిల్ల లా వ్యవహరిస్తున్నావు " వరుణ్ బాధ నిండిన గొంతు తో అన్నాడు.నేను నా తలని భయం తో ఊపాను.నేను సెన్సిటివ్ అని నాతో అలా బిహేవ్ చేయకూడదని తనకి తెలియదా...!
" ఏమిటి ..ఏమి చేయాలి" నేను అడిగాను.
" ఒకటి నుంచి అయిదు లోపు ఓ అంకె చెప్పు"
"అదీ..అదీ"
" మూడు..అంతేనా"
" ఔను..అదే"
"నేను అనుకున్నదే..! సరే ఇప్పుడు ఒకటి నుంచి పది లోపు ఓ అంకె చెప్పు"
" సరే"
"ఏడు..అంతేనా"
" వావ్..ఈసారీ నువు బాగా ఊహించావ్"
" సరే..ఈసారి ఒకటి నుంచి ఇరవై లోపు ఓ అంకె ని ఊహించు"
"ఆ..ఊహించాను"
"పదమూడు..అంతేనా"
"ఔను" చెప్పాను.మూడు సార్లు తను బాగానే గెస్ చేశాడు.అదేలా..?
"నా పవర్స్ ని ఇపుడు నమ్ముతున్నావా"
" నమ్ముతున్నా" ఇకనైనా ఈ గేం కి తెర పడుతుందా అనుకోసాగాను.
"అంటే ఇంతకు ముందు నమ్మలేదనేగా...అబద్ధం చెబుతున్నావ్.."
" నేను.."
"చివరి గా విను.నువు నాతో ఏ చిన్న విషయం లో అయినా అబద్ధమాడావో దానికి బాధ పడతావు ..మామూలు గా కాదు.నువు మంచి అమ్మాయి లా ప్రవర్తించావో ఈ లోకాన్ని ఏలవచ్చు.నీ మట్టి బుర్రలోకి ఇది బాగా ఎక్కించుకో..." అసలు నా పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు ..తనకి నేనేం చేశాను..మిగతా అతని ఫ్రెండ్స్ తో ఇలా ఐయితే బిహేవ్ చేయడు.
" ఇంకోటి..అజయ్ ని నేను చాలా మిస్ అవుతున్నాను..అదే బ్రహ్మ ..! నన్ను అర్ధం చేసుకున్నది తను ఒక్కడే.స్నేహానికి నిజమైన అర్ధం ...నిన్ను తనకి పరిచయం చేయాలి...ఫెంటాస్టిక్ గయ్ అనుకో" మళ్ళీ అన్నాడు.
" గొప్పవాడే కావచ్చును"
" ఒకటి తెలుసా..అతని జీవిత లక్ష్యం ఏమిటో తెలుసా ..ఈ ప్రపంచం లో సాధ్యమైనంత ఎక్కువమంది తో గంజాయి తాగించడం...ఎంత స్వార్దరాహిత్యం.గొప్ప మనిషి..విష్ణు కూడా మంచివాడే..అయితే మానుంచి కొద్దిగా దూరమవుతున్నాడు.గుణ కి ఒక్కసారి తనని పరిచయం చేయాలి ..అప్పుడు గాని మారడు"
" ఓహ్.."
" గుణ గురించి నీకు చెప్పానా..?"
" లేదు.."
" అసలు ఏమిటి నీ ఇది..పొడి పొడి గా ఒక్కమాట లో జవాబు చెబుతున్నావ్" స్వరం పెంచి భయపెడుతున్నట్లు అన్నాడు వరుణ్.
" నా లోని ఓర్పు అంతా కరిగిపోసాగింది.నిశ్శబ్దం గా ఏడవసాగాను.నా మొహం ని చేతులతో మూసుకున్నాను.అసలు ఇతనేనా వరుణ్ ..లేదా ఇతనిలో ఏదైనా దెయ్యం పూనిందా..!
" పార్వతి.. చిన్న పిల్ల లా ఏడవకు.నువు బలం గా ఉండాలి.ఈ జన్మ లో నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి.ఇలా అయితే అవన్నీ ఎలా చేస్తావ్..నువు ఎలా వ్యవహరించాలో నేను చెప్పాల్సిన అవసరం ఉంది..చిన్న చిన్న జవాబులు చెప్పడం అంటే నన్ను అవమానించడమే,నా సమ ఉజ్జీ గా నువు ఉండాలి " నా భుజాల్ని తాటిస్తూ చెప్పాడు. (సశేషం)

No comments:
Post a Comment