నేను శివ ని (నవల) Post no:14
బాగా బీచ్ లో ఉన్న రెస్టారెంట్ లోకి యామిని ని తీసుకువెళ్ళాను.నేను కాస్త నెమ్మదించాను.అయితే ఆ షాక్ నుంచి పూర్తి గా కవర్ అయ్యానని చెప్పలేను.యామిని తో మరొకరు పడక పంచుకున్నారనే నిజమే నాకు జీర్ణించుకుండానికి అదోలా ఉంది.ఓ రకంగా చెప్పాలంటే ప్యూర్ కాదు.
" సారీ బేబీ" అన్నాను నేను. నాకే లోపల కాస్త ఓవర్ యాక్టింగ్ లా అనిపించింది.
" నువ్వూ ..బయట అందరి లాంటి వాడివే" కోపంగా అంది ఆమె.
" అంటే.."
" అంటే ఏముంది..ఆలోచించకుండా వాగే చెత్త గాళ్ళ లానే నువు మాట్లాడావు,ఆ తర్వాత మళ్ళీ సారీలు చెప్పడం .."
" నేను జెన్యూన్ గా చెపుతున్నా..నాది పొరబాటే"
"పొరబాటే కాదు..ఇంకా అంతకు మించినది.నీ నిజరూపం తెలిసింది ఈ సంఘటన వల్ల "
" కొన్ని పొరబాటు మాటలు వాడింది నిజం.అయితే నా అర్ధం అది కాదు.కాస్త తొందరేపడ్డాను"
" చాలా నీచమైన మాటలు మాట్లాడావు.అసలు దాన్ని ఓ పెద్ద ఇష్యూ గా ఎందుకు తీసుకున్నావో నాకు అర్ధం కాలేదు"
" నా బ్యాక్ గ్రౌండ్ ని నువు కొద్ది గా అర్ధం చేసుకోవాలి ఇక్కడ.నేను చెన్నయ్ కి చెందిన ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడిని.ఇంటర్మీడియట్ దాకా బాయిస్ ఉన్న స్కూళ్ళ లోనే చదివాను.ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి అనే భావ జాలం లో పెరిగినవాడిని.నా యాంగిల్ లో నుంచి చూడు ఓ సారి"
" ఆడపిల్లలు అలా చేసి ఉండకూడదు అని నువు భావించే వాడివే అయితే మరి నువు నాతో ఎందుకు సెక్స్ చేశావు..అంటే నీతో అయితే ఫరవా లేదు..వేరొకరి తో కూడదు ..అంతేగా నీ అర్ధం ..దీన్నే హిపోక్రసీ అని అనేది"
" మన మధ్య ది వేరు.."
" ఎలా వేరు..అది చెప్పు.." ఆమె మాట లకి అడకత్తెరలో పోకచెక్క లా అయింది నా పరిస్థితి.
"యామిని..నువు సీరియస్ అవకు..నన్ను ప్రత్యేక వ్యక్తి గా చూడలేవా "
" వాళ్ళ తో నేను ఉన్నప్పుడు అప్పుడు నాకు స్పెషలే గా.వాళ్ళు నన్ను చికాకు చేసి వెళ్ళిపోయేంత వరకు..!ప్రపంచం లో ఎవరూ ఎవరకి స్పెషల్ కాదు.అందరం మనుషులమే..ఎవరూ పరిపూర్ణూలము కాము"
" అవును..వాళ్ళు అంటున్నావు...ఎంతమంది తో నీకు గతం లో ఆ పరిచయాలు ఉన్నాయి,చాలా మంది తోనా "
" కేవలం ఇద్దరి తో
మాత్రమే..టెంత్ లో ఒకరు..ఇంటర్ లో ఒకరు "
"నాకు ముందు ఇద్దరతో..అంతేగా"
" నా గతం నే పట్టుకుని నువు వేలాడితే...నాకు పిచ్చి లేస్తుంది...అప్పుడు ఏమైనా జరగవచ్చు.నీతో నాకు తెగిపోవచ్చు కూడా "
" ఏమి అనుకోకు యామిని.నీ పై నాకు గల ప్రేమ వల్లనే అలా హర్ట్ అయ్యాను అది అర్ధం చేసుకో .."
" ఏది పడితే అది అనడానికి..ప్రేమ అనే సాకు ని వాడకు వరుణ్ "
" నన్ను ప్రతి అణువణువు వేధించక..ప్లీజ్ ...అంటే మన మధ్య నున్నది ఏమిటి...ఎవరి లాభం వారు పొందే ఫ్రెండ్షిప్ లాంటిదా .."
" నా మాటలే నిన్ను ఇంత బాధిస్తే..రేపు పొద్దున్న నేను ఈ లోకం లో నుంచే పోతే.."
" ఏయ్ ..ఏమిటి మాట్లాడుతున్నావ్.."
" నా ఆయువు ఈ లోకం లో ముప్పై మూడు ఏళ్ళే.నా జాతకం చూసిన వాళ్ళు చెప్పారు." చెప్పింది యామిని. ఆమె అరచేతిని వరుణ్ పరిశీలనగా చూశాడు.ఆయుషు రేఖ చిన్నగా ఉంది.కన్నీళ్ళు వచ్చాయి.
" నీవు లేకుండా ఈ కౄర ప్రపంచం లో నేను ఎలా ఉండగలను..ఐ లవ్ యూ సో మచ్" వరుణ్ బాధపడ్డాడు.మళ్ళీ అన్నాడు.." నీతో రూడ్ గా అనాలని అనలేదు.నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.నేను ఇన్నాళ్ళు ప్రేమ అని అనుకునేది కేవలం హర్మోన్ ప్రభావం వల్ల జరిగే మార్పే తప్ప మరొకటి కాదు.అంతకు మించి ఇంకొకటి కాదు"
" నువు ఒకదాన్ని గూర్చి చెపుతున్నావు,నేను మరొకదాన్ని గూర్చి మాట్లాడుతున్నా, అదంతే పోనీ..మనం ఉన్నన్నాళ్ళు జాలీ గా ఉందాము. నాతో ఎలాంటి భవిష్యత్ ని ఊహించుకోకు..అంతా వర్క్ అవుట్ అయితే తరవాత సంగతి తర్వాత..కేవలం వర్తమానం లో జీవించుదాము.."
" నువు చెప్పింది నిజం..అంతా కాలానికి వదిలి హాయిగా గడుపుదాం" అన్నాను నేను.
ఆ క్షణం లో నోరు మూసుకోవడమే మంచిది,వాదిస్తే ఇంకా ప్రేమ అనేదే లేదు అని వాదించినా వాదిస్తుంది. ఆ ఘటన ఊహించుకోడానికే కష్టం..అందునా నేను ఎంతో ఇష్టపడే ఒక మనిషి నుంచి..!ఎటువంటి వాదనలు లేకుండా ట్రిప్ గడిచింది.కొన్ని వాటికి ఓర్పే సరైనది. అంజునా,అరంబోల్,కలంగూట్ లాంటి బీచ్ లు అన్నీ చుట్టేశాము.అక్కడక్కడ ఆగటము..బీర్లు లోపల పోసుకోవడం..రూం కి వచ్చి శృంగార లోకాల్లో మునిగిపోవడం ..అలా సాగిపోయాయి రోజులు.కేసినో లో ఓ పూట ఆడి రెండు వేలు పోగొట్టుకొని అంతటితో ఆపుజేశాము.వచ్చేప్పుడు కాంప్లిమెంట్ గా రెండు బీర్లు ఇచ్చారు వాళ్ళు.
రోజు రోజు కి మా మధ్య శారీరక,మానసిక బంధం మరీ బలపడసాగింది.ఆ జాతకం విషయం జ్ఞాపకం వచ్చి ..బాధ కలిగేది.మళ్ళీ అదంతా ట్రాష్ అనిపించేది.తమిళ్ నాడ్ బయటకి వెళ్ళడం ఇదే ప్రధమం నాకు.నా డల్ లైఫ్ లో ఒక ఉత్సాహం పెరిగింది.భవిష్యత్ ఎలా ఉన్నా ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి జీవితం లో..! (సశేషం)
--English Original : Raghav Varada Rajan, Telugu rendering: Murthy K V V S

No comments:
Post a Comment