నేను శివ ని (నవల), Post no:5
నా రెండవ సెమిస్టర్ అయిపొయింది.అనుకున్నంత స్కోర్ చేయలేకపోయాను.తరువాత ఇంకా శ్రద్ధ పెట్టి చదవాలి,దాన్ని పూడ్చుకోవాలి.చదువు పట్ల ఏకాగ్రత తగ్గింది.జీవితం అంటే ఏదో చెప్పలేని ఒక అననుకూలతా భావం ఏర్పడింది.ఎందుకని...అలా..!గత రెండేళ్ళుగా బాయ్స్ మాత్రమే ఉన్న స్కూల్ లో చదివినందుకా..లేకా యామిని తో మాట్లాడే చాన్స్ దొరకనందుకా...మెటాలికా వారి ఆ ప్రత్యేక విషాద గీతాన్ని పదే పదే గత ఆరు నెలలు గా వింటున్నందుకా..లేకా ఇవి అన్నీ కలిపా..?ఏదైతేనేం..మళ్ళీ ఇపుడు మా ఊరు చెన్నైకి వెళుతున్నా..సెలవులకి...ఇంకో మూడు నెలలదాకా నో కాలేజ్..!!
యూట్యూబ్ లోని గిటార్ పాఠాల్ని వింటూ ,చూస్తూ నేను గిటార్ సాధన చేస్తున్నా.క్రమేపి అభివృద్ది సాధిస్తున్నాను.సోలోస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను.నా ఉద్దేశ్యం లో ఖార్డ్స్ అనేవి కొత్త వాళ్ళకి, సోలోస్ అనేవి ప్రొఫెషనల్స్ కి.ఫేడ్ టు బ్లాక్ అనే మెటాలికా వారి సాంగ్ ని ప్లే చేయడం లో నిపుణత సాధిస్తున్నాను.అంటే ఆ మ్యూజిక్ వాళ్ళు ఆడిషన్స్ నిర్వహించినపుడు నాకిది ఉపయోగపడుతుంది.
అలా గిటారిస్ట్ గా ఆ ట్రూప్ లో చేరి యామిని కి చేరువ అవడం జరుగుతుందని నా ఆలోచన.సకల ఉద్వేగాల్ని దీని ద్వారా ప్రవహింప జేసే అవకాశం నాకిలా లభించింది.ఇక రాం ఆల్కాహాల్ శాతం తగ్గిస్తూ మారిజువానా మత్తు లో ఎక్కువ ఉంటున్నాడు.ప్రస్తుతానికి అతనితో ప్రాబ్లం ఏమీ లేదు గాని దానిలోనే ఎక్కువ కాలం ఉంటూన్నాడు.అయితే తాను పెద్ద ప్రపంచ స్థాయి మేధావి లా తనని తాను ఊహించుకుంటూ ఉంటాడు.అది ఆ గంజాయి ప్రభావమే అనుకుంటా.నన్ను కూడా తీసుకోమని అడిగే వాడు కాని నేను తిరస్కరించేవాడిని.చివరకి ఓ మత్తు బాబు లా మిగిలి పోవడం నాకిష్టం లేక.
" మగాడి గా పుట్టడం అంటేనే ఒక పెద్ద సమస్య బో" అన్నాడు రాం.
" డ్యూడ్...అలా ఎందుకు అనుకోవడం..చాలెంజ్ గా తీసుకోవాలి దేన్నైనా.." అన్నాను.
" సరే..నువ్వు అన్నట్లు గానే తీసు చాలెంజ్ గానే తీసుకుందాం" లాప్టాప్ తీసి బ్యాగ్ లో పెడుతూ అన్నాడు రాం.
" ఏదో ఫిలాసఫీ చెప్పబోతున్నట్లున్నావు ..నీ రూం మేట్ గా దాన్ని వినేతీరాలి గదా ..చెప్పు.."
" ఈ మద్య నేను ఒక డేటింగ్ సైట్ ని చూస్తున్నాను.."
" రైట్ ..అయితే.."
" నా ప్రొఫైల్ తయారు చేసుకొని ఓ నలభై మంది అమ్మాయిల కి పంపించా ...ఒక్కరూ రిప్లై ఇవ్వలేదు బ్రో"
" ఇదొక జీవిత గాధ..ఊఫ్.."
" ఒక ప్రయోగం చేద్దామని అమ్మాయి మాదిరి గా ఒక ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి పంపించా ..ఏం జరిగిందో తెలుసా"
" పోలీస్ లు పట్టుకుని ఉంటారే.."
" షటప్ మేన్.....మెసేజ్ ల వరద పారింది..ప్రతి రెండు నిమిషాలకి ఒక మెసేజ్ వస్తోంది..అప్పటికి నేను దాంట్లో ఫోటో కూడా అప్ లోడ్ చేయలేదు"
"దీన్నిబట్టి అర్ధమైంది ఏమిటంటే స్త్రీ గా పుట్టడమే చాలెంజ్ అని "
" ఏమిటి నీ అర్ధం"
" స్త్రీల ప్రపంచం ని చూడు...ఒక ప్రొఫైల్ కే ఎంతమంది పురుషులు స్పందించారో...నీలాంటి వాళ్ళు ...! పైగా దాంట్లో 99 శాతం మంది ఎందుకూ కొరగాకుండా పోతారు.అర్ధమయిందా నేనన్నది.."
" కాలేదు"
" ఒక స్త్రీ గా పురుషుల్ని ఆకర్షించడమే ఈజీ...అదే పురుషుని గా ఉంటే ఇతర పురుషులు నుంచి కాపిటేషన్ ఎక్కువ.."
" ఒక్క అయిదు నిమిషాల్లో రైల్ స్టేషన్ లో ఉండాలి మనం.లేనట్లయితే నేను చెప్పేది అబద్ధమని సంపూర్తి గా ప్రూవ్ చేయవలసి ఉంటుంది నువు"
" సరే ..మిగతాది రైల్ లో మాట్లాడదాము..నిన్ను వాదన లో ఓడించడమే నాకు ఓ వినోదం "
" సేం హియర్ మ్యాన్..!ఈ మధ్య ఓ చిత్రం జరిగింది"
" ఆ డేటింగ్ సైట్ ద్వారానే చెన్నై కి చెందిన ఒక బై సెక్సువల్ పరిచయం అయింది.గత కొన్ని రోజులు గా ఒకటే డర్టీ టాక్స్ బ్రో..నువే గనక పురుషుని వి అయితే నేను మ్యారేజ్ చేసుకునే దాన్ని అన్నది ..నమ్మగలవా.."
" నీకంతా బాగానే జరుగుతోంది బ్రో" షేక్ హేండ్ ఇచ్చాను.నా పరిస్థితి ఏమిటో అనుకున్నాను.
మా లగేజి సర్దుకొని ,రూం కి తాళం వేసి రైల్ స్టేషన్ కి బయలు దేరాం.మా స్వంత ఊరు చెన్నై కి వెళ్ళడానికి.
ఆగస్టు 9,2011.
--------------
ఈ రోజు నాలో ఎన్నో భావోద్వేగాలు.ఆత్రుత,భయం,ఆసక్తి ...ఇలా కలగా పులగంగా ముసురుకున్నాయి.ఎన్నాళగానో ఎదురుచూసిన రోజు ఇది.ఈ రోజే మ్యూజిక్ ట్రూప్ లో చేరడానికి ఆడిషన్స్ జరిగే రోజు.రాం నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు.గిటార్ పుచ్చుకొని బయలుదేరాను.ఇన్నాళ్ళ నా శ్రమ ఫలిస్తుందా...నేను యామినికి మిత్రుడిని కాగలనా...ఆడిషన్స్ లో నెగ్గగలనా ..? (సశేషం)
--English Original: Raghav Varada Rajan
--Telugu Translation: Murthy Kvvs

No comments:
Post a Comment