నేను శివ ని (నవల) Post no: 4
జనవరి 13,2011.
రెండవ సెమిస్టర్ ప్రారంభమయింది.మొదట సెమిస్టర్ విషయానికి వస్తె 10 కి 8.6 CGPA సాధించాను.రాం కూడా ఫరవాలేదు.అతను 6.3 దాకా సాధించాడు.పాసవుతాడు.అంతే.తను ఎక్కువ గా ఇంటర్నెట్ లో సినిమాలు అవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.సరే,ఆ పని చేసినా చదువు పై ధ్యాస ఎక్కువగా పెట్టాను.రాం,నేను బి హాస్టల్ లో 409 వ నెంబర్ గల రూం లో ఉంటాము.మొత్తం మీద పది హాస్టల్స్ ఉంటాయి.మూడు గర్ల్స్ కి ఏడు మగ పిల్లలకి ..కంబైండ్ గా ఏమీ లేవు.
పొద్దున మొహం కడిగినతర్వాత సిగరెట్ వెలిగించాను.మధ్యానం పన్నెండున్నర కి మొదటి లెక్చర్ ప్రారంభం అవుతుంది .వాచీ చూసుకున్నాడు. ఇంకా ఇరవై నిమిషాలు ఉంది.రాం కూడా రూం లో లేడు.క్లాస్ కి వెళ్ళి ఉండవచ్చును.ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దాపు లోని టీ షాప్ లో ఉండే అవకాశమూ ఉంది.
జీన్స్,టీ షర్ట్ వేసుకుని రూం కి తాళం వేశాను. వేగంగా ఇన్స్టిట్యూట్ వేపు నడవ సాగాను.గతరోజు జరిగిన లెస్సన్స్ గుర్తుకు తెచ్చుకోసాగాను.అది ఈరోజు కి హెల్ప్ అవుతుంది.మా ప్రొఫెసర్ వద్ద మంచి రిమార్క్ కొట్టేయాలని కూడా నా కోరిక.చక్కగా క్లాస్ అటెండ్ అయితే దానికి కొన్ని మార్కులు ఉన్నాయి.
ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది.ఆ మ్యూజిక్ ట్రూప్ లో పాడిన నా డ్రీం గర్ల్ వెళుతూ కనిపించింది.ఆమేనా అని సందేహం గా చూశాను.పోనీటైల్ వేసుకొని ఉంది.గత మూడు నెలల నిరీక్షణ కి ఇప్పుడు ఫలితం దక్కింది.ఆమె ని ఫాలో చేయాలని అనిపించినా క్లాస్ పోతుందేమో అని సందేహం పీడించసాగింది.ఇప్పుడు ఈ చాన్స్ వదులుకున్నా అదో రకమైన నష్టం.ఆమె నడుస్తున్న నడక లో,తనను అందరూ చూస్తుంటారు అనే ఆధిపత్య ధోరణి వ్యక్తం అవుతున్నది.
ఆమె వాళ్ళ క్లాస్ రూం దగ్గర ఆగి ఫ్రెండ్స్ తో ఏదో మాట్లాడుతోంది.నవుతూ సంభాషిస్తున్నది.చాలా ఆకర్షణీయం గా ఉంది.రూం లోకి వెళ్ళి నేను ఒకరి కోసం వేచిచూస్తుండగా ఆమె హఠాత్తు గా నాకేసి చూసింది.నా చూపు వేరే వైపు మళ్ళించాను.రాం చెప్పిన సలహా కి ఇది పూర్తి వ్యతిరేకం.మళ్ళీ సర్దుకున్నాను.ఆమె వైపు చూస్తూ.అంతసేపూ నాకేసి చూసిందల్లా ఇంకో వైపు చూస్తున్నట్లు గా కటింగ్ ఇచ్చింది.మంచి ప్రోగ్రెస్ అనుకున్నా.
" ఒక నిమిషం ఆగుతావా ..మాట్లాడాలి.." అమాయక పక్షి లా అగుపించిన ఒకతన్ని ఉద్దేశించి అన్నాను.
" తప్పకుండా... చెప్పు ఏమిటది"
" అడుగుతున్నందుకు వింత గా ఉండొచ్చు.ఆ పింక్ టాప్ వేసుకున్న ఆ అమ్మాయి పేరు ఏమిటి..అదే ఆ ముందు వరస లో ..లేదూ ఆమె "
" అసలు నువ్వు ఎవరో నేను తెలుసుకోవచ్చా " తను తిరిగి నన్ను ప్రశ్నించాడు.ప్రమాదకరం గా ఏమీ అనిపించలేదు అతగాని వాలకం.నిజాయితీ గా ఉండాలనే నిర్ణయించుకున్నాను.
" ఆమె కి సీక్రెట్ అభిమానిని" చెప్పాను.
" ఆమె కి ఉన్న అనేకమంది సీక్రెట్ అభిమానుల్లో ఒకడిని అని అంటే సబబు గా ఉంటుంది" నవ్వుతూ అన్నాడతను.
" బావుంది..అలాగే అనుకో బో..ఆమె పేరు చెప్పి ఆదుకోగలవా "
" ఆమె పేరు యామిని.ఈ మన కాలేజ్ కంప్యూటర్ విభాగానికే గర్వకారణం"
" అలా అంటున్నావేం"
" క్లాస్ లో అందరూ ఆమెని అభిమానించేవారే.. ఆ అందానికి..తెలివి కి "
" అలా ఉన్నవాళ్ళకి శత్రువులే ఎక్కువ ఉంటారేమో..అంటే అసూయ వల్ల"
"కావచ్చు..ఆమె కి శత్రువుల కంటే ఫాన్సే ఎక్కువ "
"మంచిది.ఏ సంవత్సరం చదువుతోంది.." ఫైనల్ ఇయర్ మాత్రం కాకూడదని దేవుడిని కోరుకున్నా.
" మేము ఫస్ట్ ఇయర్ బ్రో "
" నేను ఫస్ట్ ఇయర్ నే...కలుసుకున్నందుకు సంతోషం...నీ పేరేమిటి "
" నా పేరు వరుణ్ "
" చాలా గ్రేట్ నేం" అన్నాను.
"నీ పేరు"
" నా పేరూ వరుణ్ నే.అందుకే నీ పేరు గ్రేట్ అన్నది.." పరస్పరం అభినందించుకున్నాం.
" సరే బ్రొ..నాకు ఓ ఫేవర్ చేయగలవా...నేను ఇలా అడిగానని ఆమె కి మాత్రం చెప్పకు సుమా.."
" అలాంటిది ఏమీ ఉండదు..ఎక్కడిది అక్కడే వదిలిపెట్టే రకం నేను"
" బాగా చెప్పావు బై.."
" బై" తను వెళ్ళిపోయాడు.
యామినికేసి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతోంది.ఈ తమిళనాడు లోనే ..కాదు కాదు ఇండియా లోనే ఇలాంటి అందం లేదు అనిపించింది.నా ఈ రోజు ని కలర్ ఫుల్ గా మార్చేసింది.రూం కి తిరిగి వచ్చాను మాంచి జాలీ మూడ్ లో.నేను ఆమె ని గమనించానని ఆమె గమనించింది.రాం కి ఈ విశేషాలు చెప్పాలి అనుకున్నాను.
వెళ్ళేసరికల్లా రాం తీరిగ్గా నేల మీద కూర్చొని స్మొక్ చేస్తూ కనిపించాడు.
" హాయ్ రాం..మిత్రమా..సోదరా " అంటూ ఆనందం గా పిలిచాను.
" ఏమిటి బ్రో ..మంచి జాలీ గా ఉన్నావ్.." అడిగాడు రాం.తన కళ్ళు మత్తు లో జోగుతున్నట్లు ఉన్నాయి.
" TASMAC నుంచి వచ్చానని మాత్రం చెప్పక"
" అక్కడకి పోలేదు అరుణ్ .."
" మత్తు లో ఉండే వాడికి,మామూలు గా ఉండే వాడికీ తేడా తెలియదా ఆ మాత్రం"
" నేను మత్తు లో లేను అని నీకు చెప్పలేదు గా .."
" అక్కడకి పోకుండా ..ఎలా "
"నేను ఇప్పుడు తాగేది మారిజువానా "
"అదేమిటి"
"వీడ్..పాట్ అని కూడా అంటారు"
"అర్ధం కాలేదు"
" మరీ చిన్నపిలగానిలా చెబుతున్నావే...గంజాయి అనే పేరు వినలేదా ఎప్పుడూ "
" మరి అది డ్రగ్ గదా.." షాకయ్యాను నేను.రాం మొదటి జీవిత ధ్యేయం ఆనంద ఆస్వాదనే.కాని ఈ రేంజ్ దాకా వస్తాడని అనుకోలేదు.
" మరి ఎక్కువ ఇది గాకు డ్యూడ్,ఇది అదే "
" గంజాయి సేవించే అంత అవసరం ఏం వచ్చింది నీకు..విస్కీ సరిపోలేదా "
" ఇది దొరికేవరకూ అదే గొప్ప గా అనుకునేవాణ్ణి,దీన్ని పరిచయం చేసిన మిత్రుడు అజయ్..వాడికి థాంక్స్ చెప్పాలి "
"ఓ..ఇది అజయ్ యొక్క పనా....వాడి దగ్గరకి మళ్ళీ వెళ్ళక...అసలు నువు పాడయిపోయావు ..చదువు ధ్యాస లేకుండా,ఇలాంటి వాటిని అదుపు లో ఉంచుకో "
"మరీ ఎక్కువ చేయకు బ్రో...ఒకసారి నువ్వు పీల్చి చూడు..దీని మజా ఏమిటో తెలుస్తుంది.." తన చేతి లోది ఇవ్వబోయాడు.
" అలాంటి పని నేను ఎప్పుడూ చేయను.భవిష్యత్ మంచి గా ఉండాలంటే ఇలాంటి వాటికి ఎడిక్ట్ కాకు..ఒక మంచి న్యూస్ చెబుతామనుకున్నా...మూడ్ అంతా చెడగొట్టావ్ "అన్నాను.
" నువు తాగక పోతే పోయావు..నువు సలహా మాత్రం ఇవ్వకు నాకు..నువు మా డాడీ వి కావు"
" మంచిది..నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో "
" అది సరే...ఇంతకీ నీ న్యూస్ ఏమిటి..ఏదో అన్నావ్" సిగరెట్ ని నేలకు రాస్తూఅడిగాడు రాం.
" ఆమె పేరు తెలిసింది.యామిని అని" చెప్పాను నేను.(సశేషం)
ఆంగ్ల మూలం :రాఘవ్ వరదరాజన్
తెలుగు సేత: మూర్తి కెవివిఎస్

No comments:
Post a Comment