"ద యోగి విచ్" ఈ మధ్య హార్పర్ కోలిన్స్ వాళ్ళు ముద్రించిన ఓ నవల ఇది. అసలు యోగి కి విచ్ కి సంబంధం ఏమిటి..? అనే అనుమానం తో ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెప్పించాను. చ్వాడికి అదివాను. మొత్తం 339 పేజీలు. రాసిన వారు జోరియన్ క్రాస్ అని ఓ రచయిత.ఢిల్లీ సర్కిల్ లో థియటర్ ఆర్టిస్ట్ గా కూడా సుపరిచితులు. గమ్మత్తు నవల. వెస్ట్రన్ టైప్ విచ్ (మంత్రగత్తె) ,ఇండియన్ టైప్ యోగి వీళ్ళద్దరి కేరక్టర్ ని ఒక్క మనిషి లో ప్రవేశపెట్టి ఇదొక ప్రయోగాత్మక నవల గా రాశారు.
సినిమా గా, డ్రామా గా ఇలాంటి ఇతివృత్తాలు బాగుంటాయి తప్పా నిజం గా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అర్థం గాక తలగోక్కోవలసి వస్తుంది.మన తెలుగు వాతావరణానికైతే వాటికి కూడా డౌటే. కాని చదివించే గుణం ఉంది నవల లో.అంతర్లీనం గా LGBT హక్కులు అనే నేపథ్యం లో ఈ నవల సాగుతుంది. జై గిల్ ఒక గే లక్షణాలు ఉన్న యువకుడు.అతడు కొన్ని శక్తులు ఉన్న ఆడవాళ్ళ చే పెంచబడతాడు. వీళ్ళంతా ఢిల్లీ లో ఉంటారు. ఇక రజని సాబ్ కుటుంబం వీళ్ళది కేబల్ అనే సీక్రెట్ వ్యవస్థ.
ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే వాస్తవిక,అధివాస్తవిక సన్నివేశాల హారమే ఈ నవల. క్లైమాక్స్ లో నైతే ఏ సినిమా కి తగ్గని మాయామంత్రాలు ఉంటాయి. అశ్లీల సన్నివేశాలూ ఉంటాయి.జుగుప్సాకరమైన మంత్ర ప్రయోగాలూ ఉంటాయి.యోగా నేపథ్యం లో ఇలాంటి ఓ నవల కూడా రాయచ్చా అనే అనుమానమూ వస్తుంది. ఒక నూతన అనుభవం కోసం చదవవచ్చు. అమెజాన్ లో ఉంది. వెల రూ.399.
No comments:
Post a Comment