Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.
Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.ఏమీ తోచనప్పుడల్లా అలా చదివిన వాటినే తిరగేస్తుంటా...దాని వల్ల రెండు లాభాలు.ఒకటి మనకి కాలం తో పెరిగిన తెలివిడి వల్ల కొత్త కోణం లో కొన్ని విషయాలు అగుపిస్తాయి.మరొకటి కాలక్షేపం..టివి ని పెద్దగా చూడను కాబట్టి ..!
ఆ విధంగా తిరగేస్తున్నప్పుడు ఆ నవల్లోని ఇద్దరు ప్రధాన పాత్రలు Noelle Page,Catherine Alexander లు మళ్ళీ చాలా ఆలోచనలు పుట్టించారు నాలో..!ఇదొక ముక్కోణ ప్రేమ కధ ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో జరిగే ఒక రివెంజ్ స్టోరీ కూడా..!ఆ ఇద్దరివి చాలా స్ట్రాంగ్ కేరక్టర్స్.Noelle Page ది ఇంకానూ ...ఫ్రాన్స్ లోని మర్సైల్స్ లో జన్మించిన ఆమె కి మోడల్ అయి ,బాగా సంపాదించి ప్రపంచం లో పేరు తెచ్చుకోవాలని ఉంటుంది.
దీనికి బీజం ఆమె తండ్రి నుంచి పడుతుంది.బాగా అందం గా ఉండి అందర్నీ ఆకర్షణ కి గురి చేసే ఆమె ని Auguste అనే ధనికుడైన వ్యాపారస్తునికి తార్చుతాడతను.ఆమె ఒక కుర్రవాణ్ణి ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న తండ్రి అంటాడు...నీ అందం తో నీకు గల ఆకర్షణలతో ఇంకా పైకి ఎదగాలి అని.అట్లా ఈ Auguste తో శయనిస్తుందామె.. అప్పుడామె తెలుసుకుంటుంది పురుషుడు ధనము,పశుబలం ద్వారా లోకాన్ని వశపరుచుకుంటే పురుషుని రంజింప జేయడం వల్ల స్త్రీ లోకాన్నే శాసించగలదు అని చెప్పి.ఇహ అప్పటినుంచి పురుషుని శరీరానికి ఎన్ని రకాలైన హాయిలని కలిగించవచ్చునో ప్రాక్టికల్ గా నేర్చుకుంటుంది.అలా ఆమె ఇంటి నుంచి కూడా పారి పోయి పారిస్ కి చేరుతుంది.చిన్న మోసాలకి గురయినా పెద్ద ఆపదలకి ఏమీ గురవదు గాని వాటిల్ నుంచి నేర్చుకుంటుంది.ఆమె కి సహాయపడగలరు అనుకున్న అయిదుగురు కి పడక సుఖం అందించి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.అలా టాప్ మోడల్ గా ,నటి గా రాణిస్తుంది.అవతల వాళ్ళకి గాని,ఇవతల వాళ్ళకి గాని ఇదంతా ఓ బిజినెస్ డీల్ లా జరుగుతుంది తప్ప ఒక పాప కార్యం లానో ఇంకో ఫీలింగ్ తోనో జరగపోవడం లోనే జీవితాన్ని చూసే విధానం లో ఒక్కో దేశానికి ఎంత తేడా ఉంది అనిపిస్తుంది.Israel Katz అని ఒక డాక్టర్ ఉంటాడు ..అతను ఫ్రాన్స్ లో ఉండే ఒక యూదు జాతీయుడు.Noelle కి ఒక పైలట్ ద్వారా గర్భం వచ్చినప్పుడు ఆమె కి చికిత్స పరంగా చాలా సహాయం చేస్తాడతను. ఉద్యోగం కూడా ఇప్పిస్తాడు.మళ్ళీ కొన్ని ఏళ్ళు పోయినాక ఆమె ని మంచి నటి గా కుదురుకున్న సందర్భం లో అతను కలుస్తాడు.అప్పటికే హిట్లర్ సైన్యాలు ఫ్రాన్స్ ని ఆక్రమించి ఉంటాయి.యూదులంటే మండిపడే నాజీ ల హయాం లో ఆ డాక్టర్ తన ఉనికిని కోల్పోయి ఒక కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు.అప్పుడు మనసు చివుక్కుమంటుంది.చాలా ఆలోచనలు ముసురుకున్నాయి.అసలు హిట్లర్ కి ఈ యూదులంటే ఎందుకంత ద్వేషం ..ఏదో బలమైన కారణాలే ఉండాలి...లేకుంటే ఎక్కడ అడుగుపెడితే అక్కడ పోలాండ్ ,ఆస్ట్రియా ,రష్యా,ఫ్రాన్స్ ఇంకా జర్మనీ లోను 60 లక్షల మంది యూదులను కుక్కల్ని చంపినట్లు చంపి పారేశాడు. ఇంకా ఈ లిస్ట్ చాలా పెద్ద గా ఉంది..ఆ జోలికి పోవడం లేదు.అలనాటి జీసస్,మోసెస్ ల దగ్గర్నుంచి ఈనాటి అల్బ్బర్ట్ ఐన్స్టీన్,సిగ్మండ్ ఫ్రాయిడ్ ,లెనిన్,మార్క్స్,ఇసాక్ అసిమోవ్,స్పీల్ బెర్గ్ ,మర్డోచ్ దాకా ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసిన ఆ జాతి పై అతనికి ఎందుకు అంత ద్వేషం అని చాలాసేపు యోచించా..!గూగూల్ లో కి కూడా వెళ్ళి సెర్చ్ చేశా....ఏవేవో డొంక తిరుకుడు సమాచారం బోల్డంత ఉంది గాని నాకైతే సంథృప్తి కలగలేదు. సరే ఇంకో కేరక్టర్ గురించి మరోసారి చెప్పుకుందాము.Click here
No comments:
Post a Comment