Thursday 5 February 2015

తెలుగు పేపర్లు చూసి చూసి ఏమైనా మార్పు ఉంటుందేమోనని తెలుగు వెబ్ న్యూస్ పోర్టల్స్ చూద్దామని ప్రయత్నిస్తామా అవీ అంతే.పెద్ద తేడా ఉండదు

తెలుగు పేపర్లు చూసి చూసి ఏమైనా మార్పు ఉంటుందేమోనని తెలుగు వెబ్ న్యూస్ పోర్టల్స్ చూద్దామని ప్రయత్నిస్తామా అవీ అంతే.పెద్ద తేడా ఉండదు.రాజకీయుల సొల్లు మాటలకి డప్పు వేయడం ..లేదా దుమ్ము ఎత్తి అవతల వాడి మీద పోయడం.ఇంకా ఎక్కడ లేని సినిమా మానియా.అవే బొమ్మలు.అవే గోల.తెలుగు వాడికి ఈ రెండు మసాళాలు తప్ప మరోటి లేకుండా చేసిపెట్టిన ఘనత మన ప్రముఖ దిన పత్రికలవే.మళ్ళీ ఇందులో కుల గజ్జి కూడా చాలా స్పుఠంగా కనిపిస్తుంది.

కొన్ని ఇతర భాషల వాళ్ళ న్యూస్ వెబ్సైట్స్ చూస్తుంటాను.గ్రామ స్థాయిలోను,పట్టణ స్థాయిలోను జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్ని కవర్ చేస్తుంటారు.అక్కడి ప్రత్యేకతల్ని వెలికి తీయడం..ఆటగాళ్ళతో,వివిధ రంగాల వారితో ఇంటర్వ్యూ లు చేసి వేయడం,ఇట్లా చాలా విభిన్నంగా మెయిన్ స్ట్రీం న్యూస్ పేపర్లలోని రాని వాటినన్నిటిని కవర్ చేస్తుంటారు. అదీ వారి భాషలో కాకుండా చక్కని సింపుల్ ఆంగ్ల భాషలో రాయడం వల్ల కింది నుంచి పై వారు..ఇతర భాషల వాళ్ళు కూడా చక్కగా అర్ధం చేసుకుంటారు.ఈ దిశగా ఉండేవి ఏమన్నా తెలియపరచగలరు..ఎవరైనా సరే..!!!

2 comments:

  1. కొంచెం దురాశపడుతున్నారేమో.

    ReplyDelete
  2. గిరిఈశం ఏమన్నాడూ! మనవాళ్ళొట్టి వెధవలొయ్ అని కాదూ. ఆ మాట గురజాడవారు వ్రాసి వందేళ్ళు అయిపోయింది కాని అది అబధ్ధం అని చెప్పలేని జాతికదూ మనది, అందుకనే సీసాలు కొత్తవి అవుతాయి అంతే వాటిల్లో పోసే కల్తీ సారా ఎప్పటికీ పాతదే.

    ReplyDelete