Saturday 9 August 2014

సెంట్రల్ క్రానికల్ చదివారా..?



చాలా మంది చత్తిస్ ఘడ్ అంటే ఒక తీవ్రవాదుల కి అడ్డా అనుకుంటారు గాని చాలా జీవ వైవిధ్యం,సంస్కృతి వైవిధ్యం ఉన్నది అక్కడ.అప్పుడప్పుడు అక్కడ పేపర్ లో వచ్చే వార్తలు చదువుతుంటే వాళ్ళ జీవనం లో ఉండే సరిగమలు అర్ధం అవుతుంటాయి.ఆ స్టేట్ వార్తలు చదవడం కోసం సెంట్రల్ క్రానికల్ అనే ఇంగ్లీష్ డైలీ ని అప్పుడప్పుడు నెట్ లో చదువుతుంటాను.హింది లో నేను పూర్ కనుక ఇంగ్లీష్ పత్రికనే చదువుతాను.మొదట్లో ఆ స్టేట్ వార్తలు తెలుసుకోవడానికి నేను గూగుల్ వెదికితే చాలాదాకా హిందీ పత్రికలే దొరికాయి.చివరికి అనుకోకుండా ఇది కనిపించి ఫిక్స్ అయిపోయాను.ఇతర రాష్ట్రాల లోని పత్రికలు ఆ స్టేట్ వార్తలు ప్రచురించినా..అవి పూర్తిగా ప్రాధాన్యత నిచ్చివేయవు.

ఈ సెంట్రల్ క్రానికల్ కి మెయిన్ ఎడిషన్  తో పాటు బిలాస్ పూర్,భిలాయ్,రాయ్ పూర్,డాక్ ఎడిషన్ లు ఉన్నాయి.ఆ స్టేట్ లోని సంగతులు,సినిమా విశేషాలు,జాతీయ,అంతర్జాతీయ వార్తలు బాగానే ఉన్నాయి.పైన ఒక ఫోటో ఇస్తున్నాను.అది ఆ పేపర్ లోనుంచి తీసుకున్నదే.అలహాబాద్ లో వచ్చిన వరదలో ఓ సాధువు యొక్క నివాసాన్ని కవర్ చేశారు అందులో.ఆ పత్రిక లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Click here

No comments:

Post a Comment