Showing posts with label ఇద్దరు తాగినవాళ్ళ ప్రపంచాలు చాలా పైకి ఉంటాయి... Show all posts
Showing posts with label ఇద్దరు తాగినవాళ్ళ ప్రపంచాలు చాలా పైకి ఉంటాయి... Show all posts

Sunday 6 December 2015

ఇద్దరు తాగినవాళ్ళ ప్రపంచాలు చాలా పైకి ఉంటాయి..

ఈ విషయం ని ఎలా మొదలెట్టాలి..సరే ప్రతి దానికి ఒక మొదలు ఉండవలసిందే...! అప్పుడప్పుడు ఒక ప్రశ్న నా ముందు కి వస్తూ ఉంటుంది.తాగడం మంచిదా ..చెడ్డదా ..?మంచి బాలుని లా చెప్పాలంటే ..అనిపించుకోవలంటే ..చెడ్డదనే చెప్పాలి.పనికి మాలినిదనే చెప్పాలి.తాగువారంతా పరమ నీచులనే చెప్పాలి.కాని ఉన్నదున్నట్టు చెప్పాలంటే అది కొన్ని కిటికీలు తెరుస్తుంది.కొత్త కిటికీలు జీవితానికి సంబందించి.అవగాహన కి సంబందించి. అసలు అడిగితే తాగడం అనేది మంచి కాదు చెడుది కాదు.దాన్ని ఉపయోగించుకునేదాన్ని బట్టి ఉంటుంది.ఏ ఇదీ లేకుండా కిందపడి దొర్లేవాళ్ళని గురుంచి నే చెప్పడం లేదు.అదొక తిక్క క్లాస్ ..వాళ్ళ ని వదిలేయండి.
మనిషి ఈ మత్తు ని ఈ రోజు కొత్త గా కనిపెట్టలేదు.కొన్ని వందల ఏళ్ళ నుంచి దాని ఉనికి ఉంది.వాల్మికి రామాయణం లో కూడా సీతా రాములు ఈ పానీయం సేవించి క్రీడించినట్లు తెలుస్తుంది. మరి ఎందుకని ఒక టేబూ గా అయింది ఈ రోజున.బయటకి ప్రతి వారు విలన్ మాదిరి గా చూసే వారే..చీకటి కాగానే షరా మామూలే.గొప్ప హిపోక్రసీ గదా.మనిషి అంతరంగిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలంటే మందు కి మించింది లేదు.అక్కడ నిజాయితీ తో కూడిన ఒప్పుదలలు ఉంటాయి.ఇద్దరు తాగినవాళ్ళ ప్రపంచాలు చాలా పైకి ఉంటాయి..నిజాన్ని అంగీకరించే విషయం లో.అయితే Westerners వారి మాదిరి గా కొన్ని ధైర్యంగా అంగీకరించే స్థితి మనకి ఉండదు.అసలు తాగడానికి ..కూడా కొంత దమ్ము ధైర్యం అవసరము.ఎవరి ప్రపంచం దానిలో మిన్నగా ఉంటుందో వాడి అవగాహన పైఅన ఉంటుంది.ఏమార్చడం అనండి..అది ఏదైనా గాని..లోపలికి దిగితేనే తెలుస్తుంది....మన స్వాతంత్ర్య  సమరం లో కూడా బ్రిటిష్ వారు మన జమీందారులని,మహారాజులని చాలా తెలివిగా కొట్టింది ఈ మందు తోనే....తెల్ల తోలు మగువలు అనేక రూపాల్లో ..మన దొరల్ని ఆకట్టుకొని సమాచారం సేకరించేవారు...భార్యలుగా ఉంపుడు గత్తెలుగా ..వగైరా..అక్కడ..అది ఒక డీల్ మాత్రమే..మనం అనుకునే సెంట్ మెంట్ లు ఉండవు.అది అర్ధం చేసుకునే స్థాయిలో కూడా మనలో చాలా మందిమి లేము.అర్ధం చేసుకున్నవారు ఎవరి రక్షణ వారు చూసుకోవడం అనేది ఉన్నదే.ఏతా వాతా చెప్ప వచ్చేదేమంటే ఆడ,మగ ఎవరైనా గాని మందు ప్రపంచం లో అసలు లోకానికి కొన్ని విషయాల్లో ముందు ఉంటారు.కొన్ని నిజాయితీ తో కూడిన నిర్ణయాలు ఉంటాయి.కొన్ని సాహస కార్యాలు కూడా మందు లోనే సాధ్యమేమో..ఏ ఆధునిక సౌకర్యాలు లేని వాస్కోడ గామా రోజుల్లో  ..దారి తెన్ను కానిపించని సముద్రాల మీద కొన్ని నెల్లకి సరిపడా దినుసులు వేసుకొని భయం వేసినప్పుడల్లా పీపాల కొద్దీ సారాయి తాగుతూ పయనించేవాళ్ళు.ఏదైనా గమ్యం మరిచి వ్యవహరించే వారి తోనే ఇబ్బంది.