Showing posts with label వృద్దుల కోసం ఒక మంచి న్యూస్ లెటర్ "వృద్ధ వాణి". Show all posts
Showing posts with label వృద్దుల కోసం ఒక మంచి న్యూస్ లెటర్ "వృద్ధ వాణి". Show all posts

Tuesday 11 October 2016

వృద్దుల కోసం ఒక మంచి న్యూస్ లెటర్ "వృద్ధ వాణి"


ఇవాటి యువకులే రేపటి వృద్దులు గదా..మనిషన్నా ప్రతి వారికి దేవుడు చల్లగా చూస్తే ఆ చివరి దశ తప్పదు..అప్పటి కొన్ని బాధలూ తప్పవు గదా..శరీరపు బిగి సడలిపొయినపుడు.మరి వారి హక్కుల్ని సైతం గుర్తించి గౌరవించే సున్నితత్వం నేటి యువతకి ఉండాలి,అలాగే వారి బాధలు,గాధలూ పంచుకునే వేదికా ఉండాలి గదా ..అదిగో ఆ దిశ లోనే తన వంతు కర్తవ్యంగా ఒక చిన్న పత్రికని మాధవీ సనారా గారు అనకాపల్లి నుంచి నడుపుతున్నారు.మొన్న రాయగడ సభ లో ఆయన వీటిని కొందరికి పంచగా ఫోటొలు తీశాను ఇక్కడ మిత్రులతో పంచుకోడానికి..!కొందరికైనా ఉపయోగపడవచ్చు గదా..!!