Showing posts with label నాకు నచ్చిన న్యూస్ పోర్టల్. Show all posts
Showing posts with label నాకు నచ్చిన న్యూస్ పోర్టల్. Show all posts

Saturday 26 July 2014

నాకు నచ్చిన న్యూస్ పోర్టల్ లో ఇది కూడా ఒకటి



నేను తరచుగా ఒడిశా విశేషాలు చూడటానికి ఒక న్యూస్ పోర్టల్ ని చూస్తుంటాను.ఇది ఇంగ్లీష్ లోనే ఉన్నా చాలా చక్కగా చదవాలనిపిస్తుంది.అనవసరమైన పదాడంబరాలు లేకుండా సింపుల్ భాషలో అందరకీ అర్ధం అయ్యేవిధంగా వార్తలు ఉంటాయి.ఇంచుమించు అన్ని జిల్లా ల్లోని వార్తల్ని చాలావరకు ఫోటోలతో సహా కవర్ చేస్తుంటారు.ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి.ఇది ఒడిశా లోని బరంపురం నుంచి నిర్వహించబడుతుంది.దీని సంపాదకుడు మనోజ్ దాస్ ..!

సాంస్కృతిక ,కళా రంగాలకి చెందిన వార్తలు ఇంకా ప్రతి రోజు జరిగే ఆసక్తిదాయక సంఘటనలు చక్కగా కవర్ చేస్తారు.వివిధ రంగాలలోని ఔత్సాహికులను,ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు.సినిమా వార్తల తో మరీ నింపివేయడం ఉండదు.ఆ కోణం బాగా నచ్చింది.మీరూ ఆ పోర్టల్ ని చూడాలనుకుంటున్నారా..?దాని పేరు "ఒడిశా బార్త.Please click here for the link