ఒడియా భాషకి,సంస్కృతికి ఆత్మ వంటి ఆ గీతాల్ని అవహేళన చేసే హక్కు వారికి ఎక్కడిది ..కోక్ వంటి కార్పోరేట్ శక్తులకి తాన తందాన పాటలు పాడటానికి ఇవే దొరికాయా అంటూ దునుమాడుతున్నాడు సుభాష్ చంద్ర పట్నాయక్ .నేను క్రమం తప్పక వెబ్ సైట్ ల లో అది ఒకటి.ఎవరేమనుకున్నా తన అభిప్రాయాల్ని కుండబద్దలు గొట్టినట్లు చెప్పే ఆయన శైలి ,రీతి ఒక గమ్మత్తుగా ఉంటుంది.చాలా వాటిని మంచి పరిశోధన తో రాస్తారు.ఆంగ్ల భాష లో ఆయనకంటు ఒక దారి ఉంది.సాంస్కృతిక,సాహిత్య,సామాజిక ఇత్యాది విషయాలపై సాహసోపేతంగా రాస్తుంటారు.
అంతదాకా యెందుకు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల్ని సైతం దుమ్ము దులిపి ఆరేస్తుంటారు.ఆ మధ్య చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా భుబనేశ్వర్ వచ్చి మోడి ని పొగడగా అసలు రాజ్యాంగం ఎవరికి ఇవ్వని గౌరవ స్థానాన్ని మీకు ఇచ్చింది రాజకీయుల్ని ప్రసన్నం చేసుకొని రిటైర్మెంట్ తర్వాత కూడ ఏదో పదవుల్ని పొందటానికా..అంటూ తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు.
ఈమధ్యన సోనా మొహాపాత్ర బృందం ఒడియా జానపద ఆత్మ వంటి "రంగ బతి" అనే గీతాన్ని "వందే ఉత్కళ జనని " అనే గీతాన్ని కోక్ అడ్వర్టైజ్ మంట్ కోసం పాడగా దాన్ని ఖండిస్తూ మంచి వ్యాసం రాశారు ఇక్కడ.ఈ లింక్ నొక్కి చూడండి.http://orissamatters.com/2015/07/05/coke-studio-rangabati/తెలుగు లో మనవాళ్ళు దుమ్ము దులుపుతారులే గాని ఇలాంటి ఓ బ్లాగుని ఇంగ్లీష్ లో మన మేధావులెవరూ రాయరే అనిపిస్తుంది.నేను గతం లో కూడా చెప్పాను.నారాయణ,చైతన్య వంటి ఎన్ని కార్పోరేట్ కాలేజీలు ఉన్నా ఎందుకనో పట్టుమని పది వ్యాసాలు రాయాలన్నా ఓ కధ రాయాలన్నా ,గట్టిగా అనువాదం చేయాలన్నా చివరికి అనువాదం చేయాలన్నా ,ఆత్మ కధ రాసుకోవలన్నా ఎందుకో ఇంగ్లీష్ విషయం లో మనవాళ్ళకి ఆత్మ విశ్వాసం తక్కువే.ఏ మిశ్రా నో ,పాండే నో,బెనర్జీ నో ,ఫణిక్కర్ నో వెంట తగిలించుకోవలసిందే.దానికి కారణం ఏమిటి..నాకు తెలిసి జనరల్ ఫిక్షన్ ని హాయిగా చదివే అలవాటు ఓ సంస్కృతిగా లేకపోవడం.ఎంతసేపు ఓ అకడెమిక్ ఏంగిలే తప్ప ఇంకోటి ఉండదు.అందుకే మన వాళ్ళు రాస్తే పరమ కృతకంగా రాస్తారు.లేదా తెలుగు ప్రేమ ముసుగు లో దాక్కుంటారు.

No comments:
Post a Comment