Monday, 1 June 2015

అది ఊహించిన యాత్రా కధనమే....

యూరపు ఖండం లోని ఓ పది దేశాల్ని తిరిగి దాని మీద ఓ పుస్తకాన్ని వెలయించారు పరవస్తు లోకేశ్వర్ గారు.కాని ఎందుకనో నన్ను అది నిరాశ పరిచింది.గతం లో ఆయన ట్రావెలోగ్ లు కొన్ని చదివి ఆయన ని అభినందించిన మాట వాస్తవం.అయితే ఇది నచ్చనంత మాత్రాన ఆయన్ని తృణీకరించడం లేదు. ఇది నేను ఊహించిందే.ఎందుకంటే గతం లోనివి దేశం లోపలివి..ఎక్కడికెళ్ళికెళ్ళిన ఆ ఊరి లోని మనుషుల్ని పలకరించడం..స్థానిక విషయాల్ని ప్రస్థావించాడం ..ఆ విధంగా ఒక రంగుల వలయంగా ఉండేది.సిల్క్ రూట్ తో కలుపుకుని చెపుతున్నా.. ఇది..ఆసియా లో నే ఉన్న ఆ దేశాలు ఇంచు మించు మన వంటివే..చాలా విధాలుగా..!

అయితే యూరపు భిన్నమైనది.రహస్యాల్ని దాచి ఉంచడం లోనే చాలా విజయాలు దాగి ఉంటాయని నమ్మే ఒక ప్రాచీన నాగరిత కి సంబందించినది.మీరు రోం,గ్రీస్ నాగరికతలు మొదటి నుంచి అధ్యయనం చేసినట్లయితే..చేయడం ఒకటే కాదు దాన్ని ఓ క్రమ పద్ధతి లో అర్ధం చేసుకున్నట్లయితే యూరోపియన్ల స్వభావం అర్ధం అవుతుంది. లేదంటే జన్మ అంతా పోయినా అర్ధం కాదు.అక్కడే అపురూపమైన కళలు వర్ధిల్లినవి.ప్రపంచాన్ని కుదిపిన సిద్ధాంతాలు వర్దిల్లాయి.అయినా యూరోపు లో కెళ్ళి మనం వాళ్ళని మన దేశీయుల మాదిరిగా మాటల్లో పెట్టో,మభ్య పెట్టో వారి స్థితి గతుల్ని తెలుసుకోవాలనుకుంటే జరగని పని.అది నాకు ఈ ట్రావెలోగ్ వల్ల మళ్ళీ ప్రూవ్ అయింది. 

సరే..పేకిజ్ టూర్ లో వెళ్ళినా కొన్ని చేయవచ్చు.స్థానిక యూరోపియన్ లను మన దేశం లో మాదిరి గా పరిచయం చేసుకుని మాట్లాడటం జరగని పని. ఎక్కడా కూడా ఆ ప్రయత్నం గాని ..అదీ గాని కనబడదు.ఆ తరవాత ఓ పది రోజులు విడి గా కూడా టూర్ చేశారు.అలాంటిది లేదు.బహుశా సాధ్య పడి ఉండదు.అది ఆయన లోపం కూడా అయి ఉండదు.మన ఆసియన్ దేశీయుల మాదిరి గా బయటి వాళ్ళు అడగ్గానే అన్నీ గల గలా మని చెప్పే పరిస్థితి యూరపు లో ఉండదు.కంటికి కనబడని నిఘా  ఎల్లవేళలా ఉంటుంది.అది ఏ పేపర్ లో ఎక్కడా ఎవరూ రాయరు.అది భూమి మీద ఇప్పటి దాకా వెలిసిన అల్టిమేట్ జ్ఞాన భూమి ఇంకా కర్మ భూమి కూడా.

మన వాళ్ళు ఎంత కాలం ఉండని....ఎప్పటికి కూడా యూరోపియన్ ల ఇన్నర్ సర్కిల్ లో భాగం అవరు.కాలేరు.కానివ్వరు.

1 comment:

  1. నిజమే,దాపరికం వాళ్ళ సంస్కృతీ లక్షణమా!
    కారణం,కడుపు చించుకోవడ మెందుకనేమో?

    ReplyDelete