కొద్దిగా హాశ్చర్యమే కలిగింది చదవగానే..!
ఒక రచయిత చనిపొయిన తరువాత ఆయన పేరుమీదనే ఇంకొకళ్ళ చేత రాయించి బుక్స్ ప్రింట్ చేసి అమ్మడం అనేది మన తెలుగు లో ఎప్పుడైనా చేశారా ..జరిగిందా అలా.. నాకైతే పెద్దగా అవగాహన లేదు.కాని మేరియో ప్యూజో విషయం లో ఓసారి జరిగినట్టు గుర్తు.అతని భాషని,శైలిని ,కధ నడిపించే పాత్రల పేర్లు తీరుని కలలోనైనా గుర్తుపట్టవచ్చును.అంత ఒరిజినల్ సంతకం ప్యూజొది.
కొన్ని ఏళ్ళ క్రితం ఆయన పేరు పెద్ద అక్షరాలతో ఓ పుస్తకం మీద కనిపిస్తే కొన్నాను.దాని పేరు Family .ఆ నవల అంతా పోప్ వ్యవస్థ మీద రాయబడినది.ఒక వ్యక్తి పోప్ కావడానికి వెనుక ప్రపంచ స్థాయి రాజకీయాలు నడుస్తాయి.దాన్ని చాలా గొప్పగా రాశాడు.అదే ప్యూజొ యొక్క చివరి నవల అని కూడా చదివాను.ఎందుకనో ఇంచుమించు ఓ రెండువందల పేజీలు చదివిన తరువాత ఇది ఖచ్చితం గా మేరియో ప్యూజో శైలి కాదు అని అసంప్తృప్తి అనిపించింది.
అట్టమీద చూస్తే ఆయన పేరు పెద్ద అక్షరాలతో ఉంది.లోపల జాగ్రత్తగా చూడగా Carol Gino అనే ఆమె ప్యూజో అసంపూర్తిగా వదిలేసిన భాగాన్ని పూర్తి చేసినట్లుగా ఉంది.అమ్మా ..ఇక్కడ ఉంది కీలకం అనిపించింది.సరే ఏదోలా పూర్తి చేశాను. ఏదైనా ఆయన చివరి నవల అలా కొంత బాధని మిగిలించింది.జీవితం లోని చాలా హర్ట్ చేసే విషయాలని కన్విన్సింగ్ గా చెప్పాలంటే మాత్రం ఆయనే.
ప్యూజో ఇంచుమించు ప్రతి నవల ని తన ఇటాలియన్ నేపధ్యం లోనుంచే తీసుకున్నాడు.అసలు సంస్కృతి,కళలు,సైన్స్ ,తత్వ శాస్త్రం ఏదైనా గాని అతి ఉన్నత స్థానం చేరుకున్నది..దాన్ని పెంచి పోషించేది అప్పటికీ ఇప్పటికీ యూరపు ఖండం లోని దేశాలే.అవి ఎక్కడున్నా తప్పకుండా లోలోపలే అభినందిస్తారు.ముఖ్యంగా మన దేశం లోని ప్రాచీన ఆలయాలు కొన్ని చూసినప్పుడు అనిపించింది..ఈనాటికీ వెస్ట్ విలువనిస్తున్నది అంటే అన్ని వందల ,,వేల ఏళ్ళ క్రితం మన వారు చేసిన ఒరిజినల్ క్రియేషన్స్ చూసే తప్ప మన కంప్యూటర్ మేధావులను చూసి గాదు..ఫేషన్లను..ఇలాంటివి ఇంకోకటి కాదు. ఎందుకంటే అవి అన్నీ వారి అవసరార్ధం వదిలిన మాయాస్త్రాలు.

No comments:
Post a Comment