Sunday 27 July 2014

ఈ న్యూస్ లెటర్ ని చదివారా...



NBT News Letter అని చెప్పి భారత ప్రభుత్వం వారు నేషనల్ బుక్ ట్రస్ట్ తరపునుంచి ప్రచురిస్తుంటారు.బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించే పుస్తకాల గురించి విశేషాలు ..ఇంకా వారి కార్యకలాపాల గురించి కవరేజి ఉంటుంది.వివిధ భాషా రచయితలతో ఇంటర్వ్యూ లు అప్పుడప్పుడు వేస్తుంటారు.Book fair ల గురించి ఆ టైం టేబుల్ ని ప్రచురిస్తుంటారు.ఈ సారి సంచికలో గుజరాత్ లో బుక్ ప్రమోషన్ కార్యక్రమం గురించి,పపెట్ షో ల మీద రాసిన ఓ బుక్ మీద రివ్యూ ఇలాంటివి వచ్చాయి.అన్నట్లు పుస్తకాల ప్రచురణ రంగం లోకి వెళ్ళేవారికి ఓ ట్రైనింగ్ ఇచ్చే ప్రకటన కూడా ఉన్నది.కాకపోతే ధర కాస్త అధికమే.ఏడు వేల దాకా ఉన్నది.

మొత్తం ఎనిమిది పేజీల్లో.. మంచి గ్లాసీ పేపర్ మీద వచ్చే ఈ మాస పత్రిక చాలా తక్కువ ధర లోనే వస్తుందని చెప్పాలి.సంవత్సర చందా కేవలం అయిదు రూపాయలు మాత్రమే.అంటే ఒక ప్రతి యాభై పైసలకే ఇస్తారు మళ్ళి...!న్యూఢిల్లి నుంచి వెలువడే ఈ పత్రిక చిరునామా: NBT Book trust ,India,Nehru bhavan,5,instituitional area,vasant kunj,phase -2,New Delhi-110070 .    

No comments:

Post a Comment