Monday, 18 March 2024

నిజానికి ఆ గుబిలి వల్ల లాభమే తప్పా నష్టం ఏమీ లేదు.

 చాలామంది చెవిలో గుబిలి రావడం అనారోగ్య సూచకమని భావిస్తారు. అపరిశుభ్ర హేతువని అనుకుంటారు. నిజానికి ఆ గుబిలి వల్ల లాభమే తప్పా నష్టం ఏమీ లేదు.


బయట నుంచి వచ్చే సూక్ష్మమైన దుమ్ము,ధూళి కణాలను చెవి లోపలి భాగాల్లోకి పోకుండా ఈ గుబిలి అడ్డు పడుతుంది. అలా వెళ్ళినట్లయితే రకరకాల ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధం గా చెవి ని రక్షించే ఓ ఏర్పాటు అన్నమాట.


చెవిలోని గ్లాండ్స్ నుంచి ఈ గుబిలి అనేది వస్తుంది. 


గుబిలిని తీయాలంటే దాన్ని ముందు మెత్తబరచాలి. ఐ డ్రాప్స్ గాని,  బేబీ ఆయిల్ డ్రాప్స్ గాని లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ గాని వేయాలి.


ఒకటి రెండు రోజులకి మెత్తబడుతుంది. అప్పుడు రబ్బర్ బల్బ్ సిరంజీ తో గోరువెచ్చటి నీళ్ళని చెవి లోకి చిమ్మించడి. మొత్తం వచ్చింతర్వాత పొడిగా తుడవాలి. మీకు ఇబ్బంది ఉంటే చెవి స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్ళడం మంచింది. 

Sunday, 27 August 2023

"ద యోగి విచ్" ఈ మధ్య హార్పర్ కోలిన్స్ వాళ్ళు ముద్రించిన ఓ నవల


 "ద యోగి విచ్" ఈ మధ్య హార్పర్ కోలిన్స్ వాళ్ళు ముద్రించిన ఓ నవల ఇది. అసలు యోగి కి విచ్ కి సంబంధం ఏమిటి..? అనే అనుమానం తో ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెప్పించాను. చ్వాడికి  అదివాను. మొత్తం 339 పేజీలు. రాసిన వారు జోరియన్ క్రాస్ అని ఓ రచయిత.ఢిల్లీ సర్కిల్ లో థియటర్ ఆర్టిస్ట్ గా కూడా సుపరిచితులు. గమ్మత్తు నవల. వెస్ట్రన్ టైప్ విచ్ (మంత్రగత్తె) ,ఇండియన్ టైప్ యోగి వీళ్ళద్దరి కేరక్టర్ ని ఒక్క మనిషి లో ప్రవేశపెట్టి ఇదొక ప్రయోగాత్మక నవల గా రాశారు.

సినిమా గా, డ్రామా గా ఇలాంటి ఇతివృత్తాలు బాగుంటాయి తప్పా నిజం గా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అర్థం గాక తలగోక్కోవలసి వస్తుంది.మన తెలుగు వాతావరణానికైతే వాటికి కూడా డౌటే. కాని చదివించే గుణం ఉంది నవల లో.అంతర్లీనం గా LGBT హక్కులు అనే నేపథ్యం లో ఈ నవల సాగుతుంది. జై గిల్ ఒక గే లక్షణాలు ఉన్న యువకుడు.అతడు కొన్ని శక్తులు ఉన్న ఆడవాళ్ళ చే పెంచబడతాడు. వీళ్ళంతా ఢిల్లీ లో ఉంటారు. ఇక రజని సాబ్ కుటుంబం వీళ్ళది కేబల్ అనే సీక్రెట్ వ్యవస్థ.

ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే వాస్తవిక,అధివాస్తవిక సన్నివేశాల హారమే ఈ నవల. క్లైమాక్స్ లో నైతే ఏ సినిమా కి తగ్గని మాయామంత్రాలు ఉంటాయి. అశ్లీల సన్నివేశాలూ ఉంటాయి.జుగుప్సాకరమైన మంత్ర ప్రయోగాలూ ఉంటాయి.యోగా నేపథ్యం లో ఇలాంటి ఓ నవల కూడా రాయచ్చా అనే అనుమానమూ వస్తుంది. ఒక నూతన అనుభవం కోసం చదవవచ్చు. అమెజాన్ లో ఉంది. వెల రూ.399.   

Monday, 17 July 2023

ఈ బడాదీదీ అందరికీ ఆదర్శం

 జీవితం లోని అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేది విద్య,ఎంత చదివితే అంత తెలుస్తుంది.ఎంత తెలిస్తే అంత నేర్చుకుంటావు,అన్ని ప్రదేశాల్ని చూస్తావు అని చెప్పాడు డాక్టర్ సియోస్. బడా దీదీ అనే సంస్థ దీన్ని ఆదర్శంగా తీసుకుంది.2019 వ సంవత్సరం లో 20 మంది ఆదివాసీ మహిళలు మల్కాన్ గిరి జిల్లాలో ఈ సంస్థ ని స్థాపించారు. అక్కడి పిల్లల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఎడిక్షన్ ని మానిపించి పుస్తకాల వైపు వారి దృష్టిని మళ్ళించడానికి దీన్ని నెలకొల్పారు.

అక్కడి పల్లెల్లో ఆరుబయట చదువుకునే లైబ్రరీల్ని స్థాపించారు.దాంట్లో కథల పుస్తకాలు,కార్టూన్ ఇంకా అనేక పుస్తకాలు ఉంటాయి.రకరకాల మేగజైన్ లు కూడా ఉంటాయి.పెద్దలు,పిన్నలు కూడా ఇక్కడికి వచ్చి చదువుతుంటారు.దీపావళి పర్వ దినాన 80 పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని పెట్టారు.ఇంగ్లీష్,ఒడియా,హిందీ,బెంగాలీ పుస్తకాలు కూడా ఉన్నాయి.అవే కాక జి,కె.పుస్తకాలు,పోటీ పరీపరీక్షలకి పనికొచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.


 రోజు పది నుంచి పదిహేను మంది దాకా పిల్లలు ఈ లైబ్రరీ కి వస్తుంటారు.పొద్దున్న,సాయంత్రం వారి వీలునుబట్టి వస్తుంటారు.ప్రతి పంచాయాత్ లోనూ ఈ తరహా కేంద్రాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.పిల్లలే గాక పెద్దల్ని కూడా ఇవి ఆకర్షిస్తున్నాయి. అనేకమంది దాతలు కూడా ముందుకు వచ్చి పుస్తకాలు స్పాన్సర్ చేస్తున్నారు.ఇతర రాష్ట్రాలకి చెందిన పుస్తకప్రియులు సైతం ఈ బడదీదీ సంస్థ కి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  

  ఈ బడదీదీ కి మొత్తం 40 మంది వాలంటీర్లు ఉన్నారు.వీరు అంతా ఆదివాసీ పల్లెలలోనే పనిచేస్తూన్నారు. దీన్ని ప్రారంభించినవారు జయంతి అనే మహిళ.ఈమె కోయ తెగకి చెంది, ఒక పేరెన్నిక గన్న మీడియా హౌస్ లో పనిచేస్తున్నారు.ఈ లైబ్రరీలతో బాటు చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పే కార్యక్రమం కూడా కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ప్రయత్నిస్తున్నారు.చిత్రకొండ ఏరియా లోని బోండా తెగ ప్రజల కోసం కూడా కృషి చేస్తున్నారు.

      

Thursday, 27 April 2023

అనగూడదు గాని తెలుగువాళ్ళ లో ఉండే ఇంత హిపోక్రసీ...

 కొంతమంది ఆదర్శాలు వల్లిస్తుంటారు.ఎలా అంటే అసలు నిజంగానే వీళ్ళు తమ జీవితాల్లో వాటిని పాటిస్తున్నారా అనిపిస్తుంది.చాలా గౌరవం కూడా కలుగుతుంది. అంత నమ్మశక్యంగా ఉంటాయి వాళ్ళ మాటలు.తీరా వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు మాత్రం చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంటాయి వ్యవహారాలన్నీ. ఇంగ్లీష్ భాష వల్ల ఎంత తెలుగు దెబ్బతింటున్నదీ ,సంస్కృతి మంట కలుస్తున్నదీ వివరిస్తూ ఓ పెద్దమనిషి వాట్సాప్ ల్లో తెగ మెసెజ్ లు పెడుతుండేవాడు. నిజం చెప్పొద్దు చాలా గంభీరంగా ఆకర్షణీయంగా కూడా వివరిస్తూండేవాడు. 

ఓసారి ఏదో శుభకార్యం నిమిత్తం ఆ పెద్దమనిషి ఇంటికెళ్ళా. అవీ ఇవీ మాట్లాడినతర్వాత ఆయన గారి మనవళ్ళతో మాట్లాడితే తెలిసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం లో చదవడం లేదు అని. మతి పోయింది,ఏమిటి ఎంత ఆవేదన తో తెలుగు గురించి మధనపడుతుంటాడు ఆ పెద్ద మనిషి.ఇంగ్లీష్ వచ్చి సంస్కృతిని నాశనం చేస్తోందని తెగ బాధపడే ఆయన తన మనవళ్ళలో ఒక్కడిని కూడా తెలుగు మీడియం లో చేర్చలేకపోయాడు.

అనగూడదు గాని తెలుగువాళ్ళ లో ఉండే ఇంత హిపోక్రసీ మరెవ్వరి లో ఉండదేమో.అడిగినా ఏదో డొంకతిరుగుడు సమాధానం రెడీమేడ్ గా పెట్టుకుని ఉంటారు ఇలాంటివాళ్ళు.కొన్నంతే,విని ఊరుకొవడానికే పనికొస్తాయి.    

 

Thursday, 20 April 2023

జావా ఆఫ్ ఇండియా అని ఈ పట్టణాన్ని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 Java of India అని మన దేశం లో ఏ పట్టణాన్ని పిలుస్తారో తెలుసా..? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న గోరఖ్ పూర్ ని ఆ విధం గా పిలుస్తారు. అంతే కాదు, ఆ పట్టణం ఆధ్యాత్మిక,సిద్ధ పురుషులకి పెట్టింది పేరు. ప్రసిద్ధ నాథ్ సంప్రదాయానికి పట్టుగొమ్మ ఈ స్థలం. మత్స్యేంద్రనాథ్ మహాశయులు స్థాపించిన ఆలయం ఇప్పటినుంచి కాదు ఎన్నో తరాల నుంచి పేరెన్నిక గన్నది.గోర్ఖ్ పూర్ పట్టణం అత్యంత పురాతన పట్టణం.గీతా ప్రెస్ అంటే తెలియంది ఎవరికి.ఆ ప్రెస్ ఇక్కడ నుంచే నడిచేది.


రాప్తీ నదీ తీరాన,లక్నో కి తూర్పున 272 కి.మీ. దూరం లో ఉంటుంది.నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కి ప్రధాన కేంద్రం కూడా.ఒకానొకప్పుడు బస్తీ,దియోరియొ,అజం ఘడ్,నేపాల్ లోని తరాయ్ వీటన్నిటిని కలిపి ప్రసిద్ధ ఆర్యవర్తం లోని క్షేత్రాలుగా పిలిచేవారు.ఇక్కడకి వచ్చిన వారు కపిలవస్తు,లుంబిని,కుషీనగర్,గోరఖ్ నాథ్ ఆలయం  ఇలాంటివి చూడాలి. చౌరిచౌరా ఘటన లో అమరులైనవారికి స్మారక స్థూపం నిర్మించారు.ఇదీ చూడవలసిందే.

ఇక్కడ హిందీ,ఉర్దూ మాట్లాడుతారు.అలాగే భోజ్ పూరి కూడా. ప్రతిరోజు ఇక్కడినుంచి ఢిల్లీకి 13 రైళ్ళు నడుస్తాయి.బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని హిల్ స్టేషన్ గా పరిగణించారు.నేపాల్ కి బోర్డర్ లో ఉండే పట్టణాల్లో ఇది ఒకటి.అన్నట్టు ఈ ప్రాంతాన్ని జావా ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో తెలుసా ..? ఇక్కడ ఎక్కువగా చెరుకు మిల్లులు ఉంటాయి.దానివల్లనే ఆ పేరు వచ్చింది. 

Saturday, 8 October 2022

Akasinthinte Niram- ఓ చక్కని మళయాళ సినిమా

 


ఫేస్ బుక్ కొద్దిగా తగ్గించిన తర్వాత అనుకోకుండా కొన్ని మంచి సినిమాలు చూడగలుగుతున్నాను. ఈ మధ్యనే ఓ మళయాళ చూశాను. దాని పేరు "ఆకాశింథింటే నిరం" (Akasinthinte Niram). చూసిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతం గా,హాయిగా, జీవితం గురించి చక్కటి ఆలోచనల తో నిండిపోయింది. మంచి సినిమా చూడాలనుకునే వారు అందరూ తప్పక జీవితం లో చూసి తీరాలి.

గోల్డెన్ గోబ్లెట్ అవార్డ్ కి ఇంకా అనేక దేశ విదేశ సినిమా పోటీలకి ఈ చిత్రాన్ని అధికారికం గా ఎంపిక చేశారు. దానికి అన్ని విధాలా అర్హత కలిగినది ఈ చిత్రం.సినిమా అంతా ఒక దీవి లో జరుగుతూంటుంది.అండమాన్ దీవుల్లో ఉన్న నీల్ అనే 40 చ.కి.మీ. ఉండే దీవి లో సినిమా సాగుతుంది.ఏ పాత్రకి పేరు ఉండదు. కాని ఆ విషయం మనకి సినిమా చివరిదాకా ఎక్కడా తట్టదు.

ఒక చిన్న దీవిలో 60 ఏళ్ళ వృద్ధుడు. తను రకరకాల కళాకృతులు తయారు చేసి దగ్గర లో ఉన్న పట్టణానికి మోటారు బోట్ లో వెళ్ళి అమ్మి మళ్ళీ తిరిగివెళ్ళిపోతుంటాడు.దీన్ని కనిపెట్టిన ఓ దొంగ ఆ బోట్ కదిలేసమయానికి దాంట్లోకి ఎక్కి చాకు చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తాడు. ఆ ముసలివాడు చిన్నగా నవ్వుతూ నీకు ఈత వచ్చా అని అంటూనే ఆ బోట్ ని సముద్రం లోకి పోనిస్తాడు.

ఈ దొంగ కి ఈత రాదు బోట్ నడపడం రాదు.తత్తరపడేలోగా సముద్రం లోకి దూరం గా వెళ్ళిపోతారు.కాసేపు ప్రయాణించి ఓ చిన్న దీవి కి చేరుకుంటారు.అక్కడ ఓ చిన్న కాటేజ్ ఉంటుంది,దాంట్లో ఓ చిన్న పిల్లాడు,ఓ యువకుడు ,ఓ యువతి ఉంటారు.ఎవరిపని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.ఈ దొంగ పారిపోవాలని ప్రయత్నించినా వీలుపడదు.ఆ దీవి లో వారి జీవనం విచిత్రం గా అనిపిస్తుంది.

  జీవితాన్ని ఇంత అర్ధవంతం గా జీవించవచ్చా అనిపిస్తుంది.ప్రకృతి ని పాడుచేఅకుండానే దానితో కలిసి జీవించడం కనబడుతుంది.అన్నట్టు ఆ ముసలాయనకి మంచి లైబ్రరీ ఉంటుంది.తోట ఉంటుంది.ఇంట్లో నుంచి చూస్తే సముద్రం ఉంటుంది.అంతే కాదు కొన్నిసార్లు మోటార్ బైక్ వేసుకుని ఎక్కడికో వెళుతుంటాదు ముసలాయన.ఈ దొంగ కి ఆసక్తి పెరుగుతుంది.కాని ఆ పెద్దాయన ఒక సమయం వచ్చినప్పుడు ఆ దొంగ ని ఆ చోటకి తీసుకువెళతాడు. అతను నిర్ఘాంతపోతాడు. అక్కడ ఏమి ఉన్నదీ తెలియాలంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.

సముద్రం పక్కనే వేసిన చిన్న కాటేజ్ లు లాంటివి తప్పా పెద్ద ఖర్చు ఏమీ లేదు. కాని ఎప్పుడూ సముద్రం పక్కనే ఆ అందమైన లోకేషన్ లలో జరిగే సన్నివేశాలు మనసు ని ఎక్కడికో తీసుకుపోతాయి. డైలాగ్స్ చాలా తక్కువ.కాని ప్రతి సీను మనసు లో ముద్ర పడిపోతుంది.సినిమా ని ఆస్వాదించే కళాత్మక హృదయులు తప్పక చూడాలి.డా.బిజూ దర్శకత్వం బావుంది.నెడుముడి వేణు,ఇంద్రజిత్,అమలా పాల్ లాంటి వారు ఉన్నారు.ఈ సినిమా ప్రైం వీడియో లో ఉంది.ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.వీలయితే చూడవచ్చును. 



   

Thursday, 18 August 2022

ఇన్నాళ్ళకి ఓ కలని మాటల్లో బంధించగలిగాను

 తెల్లవారుఝామున అనగా బహుశా, నాలుగున్నర అయిదు మధ్యలో అనుకుంటా ఒక కల వచ్చింది.అసలు ఏవైనా కలలు వచ్చినా తెల్లారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం అనుకుంటే ఎందుకో నాకు అసలు గుర్తుకు రావు.మరుపు కమ్మేస్తుంది.కల వెలిసిపోయిన తరవాత...ఆ ...ఇదేగా గుర్తుండదా అనిపిస్తుంది...తీరా జ్ఞాపకం తెచ్చుకోబోతే షరా మామూలే. అది కాస్తా మసకబారి మస్తిష్కం నుంచి తుర్రుమంటుంది.ఇది చాలు ...మన మనసు మన ఆధీనం లో ఎప్పుడూ అలా ఉండదు అనడానికి.

అయితే ఈసారి మాత్రం అలాకాదు. సాలిడ్ గా గుర్తుంది.కనుక ఓ బ్లాగ్ పోస్ట్ రాయాలనిపించింది.కల కి మొదలు చాలా స్పీడ్ గా ఉంటుంది.పరిచయాలు అవీ ఏవీ ఉండవల్లే ఉంది. మరి అది ...ఒక రోడ్డు...ఎర్రటి తారు రోడ్డు.అలాగని మరీ రక్తపు రంగు లో లేదు.ఒక సాధారణ రోడ్డు...ఆ రోడ్డు ని అక్కడక్కడ ఎవరో చెక్కేశారు. కనక దాని కింద నల్లని రోడ్డు కనబడుతోంది.అదేంటబ్బా ...విచిత్రం గా ఉంది రోడ్డు అనుకుంటున్నాను.

దారికి రెండు వైపులా పెద్ద చెట్లు.చల్లటి గాలి.చల్లటి నీడ.నిశ్శబ్దం గా ఉంది.పడుకున్న శరీరం సైతం చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నది.అలా చూస్తుండగా నేను ఎక్కిన ఏదో వాహనం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.అరే అనిపించి... నడుచుకుంటూ వస్తున్నాను. ఏదో వేరే రాష్ట్రం లో అడుగుపెట్టినట్లు అనిపించింది.ఒక గ్రామం లా ఉంది.ఎటు చూసినా పచ్చని చెట్లు.కొబ్బరి చెట్లు ఇంకా ఇతర చెట్లు ఎత్తుగా కనిపిస్తున్నాయి.వాటి సందుల్లోంచి చూస్తే ఒక పొడవాటి,ఎత్తైన తెల్లని భవనం అగుపిస్తోంది.అరే ఇక్కడ ...ఇలాంటి భవనమా..అనుకుంటూండగా మరో దృశ్యం కనిపించింది.

పాతకాలపు గురుకులం లా ఉన్న ఓ కుటీరం ...దాంట్లోని బెంచీలన్నీ కొత్తగా నిగనిగలాడుతున్నాయి.అన్నీ చెక్కవే.దగ్గరకి వెళ్ళి చూస్తున్నాను.అంతలోనే  ఇస్కాన్ వారి తరహా లో ధోతీ లో ఉన్న ఓ పెద్ద మనిషి రాగా,నా గురించి చెబుతుండగా ...సరేసరే మీ ఇష్టం చూడండి అన్నాడాయన.అంతలోనే కొంతమంది స్త్రీలు ఆరేడుగురు బిలబిలమని వచ్చారు.పైనున్న మెట్ల మీదినుంచి.ఏదో మాటాడుతున్నారు గాని అర్థం కావడం లేదు.వాళ్ళ చీరె కట్టు సౌరాష్ట్ర ప్రాంతం లా అనిపించింది.ఆ తర్వాత ఆ మనుషులంతా కనబడలేదు.

ఎటూ చూసినా పచ్చని ప్రకృతి.మనసుకి హాయిగా అనిపించసాగింది.అలా అలా ... తెలివి వచ్చింది. ఈసారి ఎలాగైనా ఈ కల గుర్తుపెట్టుకోవాలని కొన్ని సంకేతపదాలు పెట్టుకున్నాను.విచిత్రం గా ఈసారి కలమాత్రం మరుపు రాలేదు. రోజంతా హాయిగా అనిపించింది.ఆ గ్రామం పదే పదే కళ్ళముందే కనిపిస్తోంది.అది ఎక్కడుందో ...తెలిస్తే బాగుండును.వెళ్ళాలని మనసు లో ఓ కుతూహలం.కొన్ని కలలు అంతే...!ఎన్ని మాయాజాలాలో ఈ దేహం లో...నిజం కంటే నిజం అనిపిస్తుంది ఒక్కో కల.

Friday, 28 January 2022

చిత్రకొండ గంగాధర్ నవల "మృతనగరం లో" ...


 "మృతనగరం లో" ఇది ఒక తెలుగు నవల.రాసిన వారు చిత్రకొండ గంగాధర్. ఈ పేరు ఎక్కడో ఎప్పుడో విని ఉంటారు.నేనూ అంతే.అయితే ఈ పుస్తకం ఈ నెల 25 వ తారీఖున నా చేతికి వచ్చింది,ఓ సాహితీ మిత్రుని ద్వారా.విచిత్రం గా జనవరి 25 నే రచయిత పుట్టినరోజు కూడా.ముందు మాటల వల్ల అది తెలిసింది.

37 ఏళ్ళ ప్రాయం లోనే తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో నగరాల్లో చిన్నా చితకా శ్రామిక వృత్తుల్ని స్వీకరించి,ఓ వేపు పనిచేసుకుంటూనే మరో వేపు ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్నాడు.కవితలు రాసుకున్నాడు.ఓ నవల కూడా.ఈ పుస్తకం అదే.తను పుట్టింది శ్రీకాకుళం జిల్లా లోని బొడ్డపాడు అనే గ్రామం లో.జీవితాన్ని ఎంతో కొంత సాఫీ గానే లాగించగల పొలం పుట్రా ఉన్నప్పటికీ ఎందుకనో ఒకలాంటి జిప్సీ జీవితాన్ని ఎంచుకున్నాడు.

అసామాన్య మేధోకృషి చేస్తూ ఓ సామాన్యుడి గా జీవించాడు.ఒక్కొక్కరి జీవితం విచిత్రమైన మలుపు ఎందుకు తీసుకుంటుందో దానికి గల కారణాలు ఏమిటో మనం ఊహించడం కష్టం.ఈ నవల చదివాను.చదివిన తర్వాత రెండు మాటలు రాయాలనిపించింది.Eccentric,enigmatic and apocalyptic రచన గా అనిపించింది.చదువరి కి వెంటనే అర్ధం కాదు,తాను ఎక్కడైనా దారి తప్పానా అన్న యోచన కలిగి..ఇంకొంత ముందుకు పోగానే ఏదో దారి దొరికింది లే అనిపిస్తుంది.ఇకారస్ అనేవాడు ప్రధాన పాత్ర.గ్రీకు పురాణాల్లో ఈ పాత్ర తగులుతుంది. తండ్రి చెప్పిన మాట వినకుండా సూర్యుడికి చేరువ వెళ్ళి రెక్కలు కరిగిపోయి కిందపడి చనిపోతాడు. 

ఇంకో పాత్ర ఎడ్వర్డ్ ...వీళ్ళిద్దరూ మనుషులంతా అంతమై పోయిన ఓ నగరం లో జీవిస్తుంటారు.అదీ దారు శిల్పాల్లో.మధ్య లో స్టోకర్ అనే పాత్ర వస్తుంది.పికాసో బొమ్మ లాగా సాగుతుంది కథ.రచయిత తనలోని ఎన్నో కలగాపులగమైన భావాల్ని ఓ చోట కుప్ప పోసినట్లుగా అనిపించింది.రచయిత చనిపోయిన తర్వాత ఇది ప్రచురించారు కనుక మనం తనని లీల మాత్రం గా నైనా అడగలేము.ఎవరికి వారు చదువుకుంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధం కావచ్చునేమో.

గంగాధర్ ఇంటిపేరు చిత్రకొండ.ఇదేమిటబ్బా ఒరిస్సా లో మల్కాన్ గిరి జిల్లా లో ఇదే పేరు తో ఓ  ఊరు ఉంది గదా అనిపించింది. ఈ రచయిత ఆ ఊరి లో కూడా కొంత కాలం ఉన్నట్లు దాని మీద ప్రేమ తో ఆ పేరు పెట్టుకున్నట్లు తర్వాత తెలిసింది. ఆ విధం గా ఆ ఊరికి ఓ ప్రత్యేకత సమకూరింది.మనిషి మనసు అన్నిటికంటే విచిత్రమైనది.అది ఎప్పుడు ఎందుకు ఏ కారణాల చేత ఎలా ప్రతిస్పందిస్తుందో ఎవరమూ ఊహించలేము.చిత్రకొండ గంగాధర్ గారి నవల చదివి అతని భావప్రంచం లో మీరూ పాలుపంచుకోవాలంటే చిరునామా ఇది..! పల్లవి పబ్లికేషన్స్,ఫోన్ :98661 15655, 89856 08936 

-----  మూర్తి కెవివిఎస్           

Thursday, 21 May 2020

అసలు మన మనసు మనదేనా..?


సరిగ్గా అలాగే అనిపిస్తుంది ఒక్కోసారి.చాలా చిన్న విషయం.ఈ రోజు నుంచి వాట్సప్ వాడకం చాలా మటుకు తగ్గించాలి అని వారం రోజుల నుంచి అనుకోవడం,ఏ రోజు కి ఆ రోజు నిగ్రహించుకోలేక పోవడం.ఉదయం కొన్ని నిమిషాలు సాయంత్రం కొన్ని నిమిషాలు అనుకుంటాను.తీరా దానిలోకి వెళ్ళానా ఎలా గడిచిపోతుందో ఏమో తెలీదు.గంట లు కూడా గడిచిపోతుంటాయి.వచ్చిన వాటిల్లో కొన్ని మహా irresistible గా ఉంటాయి.చదవడం మొదలెడితే అలా వెళ్ళి పోతూనే ఉన్నది సమయం.కొన్ని వాటికి సమాధానాలు ఇవ్వడం.మళ్ళీ అది ఒకటి.ఊరుకోలేక ఫేస్ బుక్ లోకి వెళ్ళడం.అక్కడ కొంత సమయం వృధా.

అనుకున్న సమయాన్ని మించి అక్కడ గడిపేయడం జరుగుతోంది.చదవాలని అనుకున్న పుస్తకాలు చదవలేకపోవడం,ఎలా ఈ మనసు ని కంట్రోల్ చేయాలి..?మన మనసు మనదే.మనం చెప్పినట్లు నడవ వలసిందే.కాని ఎందుకో మనకి తెలియకుండానే బురుడీ కొట్టిస్తుంది మనల్ని.జరిగిన తర్వాత తెలుస్తుంది.చ..రేపట్నుంచి strict గా ఉండాలి అనుకుంటాం.తెల్లారి మామూలే.చూడాలి ఈ రాత్రి మళ్ళీ నిర్ణయించుకున్నాను,ఆ కోరికల్ని నియంత్రించుకోవాలని.

Saturday, 25 April 2020

కొన్ని అనువాద రచనలు ఎందుకని అలా..?

పేర్లు ఎందుకు లే గాని,మన వాళ్ళు అనువాదాలు చేసేప్పుడు మూల విధేయం గా ఉందా లేదా అన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ని ఇస్తుంటారు.అవును అది అవసరమే.అయితే  పదం నుంచి పదానికి మక్కీకి మక్కి అనువాదం చేయడం వల్ల తెలుగు పాఠకుని యొక్క ఓర్పు ని పరీక్ష చేసే విధంగా  గా ఉండకూడదు.నాలుగు పేజీలు చదవగానే ఆ డబ్బింగ్ భాష కి వెగటు కలిగి పుస్తకం మూసేయాలి అనిపించకూడదు.అప్పుడు అనువాదం యొక్క అసలు లక్ష్యమే దెబ్బ తింటుంది. ఆంగ్ల భాషకే సొంతమైన కొన్ని ప్రయోగాలు దానికున్నాయి.అలాగే మన కి కూడాను. దానిని బేలన్స్ చేస్తూ రీడబిలిటి కి పెద్ద పీట వేస్తూ అనువాదం సాగినపుడు అందగిస్తూంది.

ఉదాహరణకి He stopped for a while and assumed walking అని ఉన్నచోట దానికి ఒక అనువాదం ఇలా సాగింది.'అతను ఆగాడు కాసేపు మరియు నడవడం మొదలెట్టాడు '  అని అనువదించడం జరిగింది.ఆ ఇంగ్లిష్ వాక్యాన్ని పక్కనే పెట్టుకుని దీన్ని చూసి ఎస్ బాగా వచ్చింది తెలుగు అనువాదం అంటాడు ఒక అతి తెలివి గల వ్యక్తి.నిజమే బాగానే వచ్చింది.పదానికి పదానికి పక్క నే పెట్టి చూస్తే.కాని అక్కడ ధ్వంసం అయింది ఏమిటీ అంటే చదివించే గుణం.పాఠకుడు కొన్ని పేజీలు ఓపిక చేసుకుని చదివి బుర్ర తిక మక అయ్యి ఆ అనువాద పుస్తకాన్ని పక్కనే పారేస్తాడుఅనువాదం చేసేప్పుడు ఎంతో కొంత కృతక భాష దొర్లడం తప్పదులే గాని కేవలం ఆ కారణం వల్లనే ఓ అనువాద రచన పాఠకుని కి దూరం కారాదు.అది చాలా అపరాధం అనిపిస్తుంది. ఇంగ్లీష్ లో గొప్ప రచనలు గా పేరెన్నిక గని తీరా అవి తెలుగు లో కి అనువాదం అయినపుడు చదువుదాం అనుకుని కూర్చుని ఆ సార రహిత శైలి ని ఓర్చుకోలేక చాలా మంది పక్కన పడేస్తుంటారు.

 ఏమిటి ఇవి ఆ భాష లో అంత గొప్ప వి ఎలా అయ్యాయబ్బా అని అనుమానమూ వస్తుంది. దానికి కారణాలు ఇవే.అనువాదకుడు మూల భాష కి సంబందించిన సంస్కృతీ విశేషాలు సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకుని ఉండాలి,అది చాలా మంచి చేస్తుంది.ఉదాహరణ కి He sold his soul to jezebel ఇలాంటివి తరచు ఇంగ్లీష్ రచనల్లో చూస్తుంటాము.ఇలాంటివి అన్నీ కూడా Biblical concepts, అంటే మన సాహిత్యం లో రామాయణ,మహా భారతాది గ్రంథాల నుండి ఎలా Inspire అయి రాస్తుంటామో అలాగే వాళ్ళూ బైబిల్ ఇంకా గ్రీక్,రోమన్ లకి చెందిన సాహిత్యాలనుంచి Inspire అవుతుంటారు.కాబట్టి వాటి వెనుక గల నేపధ్యం ని అర్ధం చెసుకున్నప్పుడు మక్కీ కి మక్కి అనువాదం చేయకుండా అదే అర్ధాన్ని ఎలా స్ఫురింపజేయాలో తెలుస్తుంది.ఒక వేళ అవసరం అయితే ఫుట్ నోట్స్ లో వివరించవచ్చు.అలాగే మన పాఠకులు కూడా అనువాద రచనలు చదివేటప్పుడు ఆ ఇంగ్లీష్ వాక్యాన్ని,ఈ తెలుగు వాక్యాన్ని పక్క పక్కనే పెట్టుకుని ఇదేమిటి ఇలా ఈ పదం వెనక్కి వచ్చింది,ముందుకి వచ్చింది అంటూ దబాయించకూడదు.అనువాదం లో గల వ్యూహం ఏ మేరకు చదివించేలా  చేసింది అనేది చూడాలి,అదీ భావాన్ని పోనివ్వకుండా..!

మూల రచన లోని పాత్రల పేర్లు ఎలా పలుకుతారో తెలియనప్పుడు వాటిని ఆ ఇంగ్లీష్ లోనే ఉంచేస్తే మరీ మంచిది.పాఠకులు వారి స్థాయి ని అనుసరించి చదువుకుంటారు. ఉదాహరణ కి కేథరిన్ అనే ఆవిడ పేరు ని వాళ్ళు కేథీ అని ముద్దు గా పిలుస్తారు.అయితే స్పెల్లింగ్ ని అనుసరించి అనువాదకుడు కాఠీ అని అనువాదం చేశాడు ఒక చోట.అలాంటివి ఎందుకు దొర్లుతాయి అంటే ఆ సంస్కృతీ విశేషాల్ని తెలుసుకోకపోవడం వల్ల అనుకుంటాను.ఇంకా ఇలా ఉన్నాయి...మళ్ళీ ఎప్పుడైనా ఇంకొన్ని.

      .



Thursday, 24 May 2018

నా పేరు శివ (నవల),Post no:62

నా పేరు శివ (నవల),Post no:62

"ఓ..తప్పకుండా"అన్నాను.

"ఏం మాటాడుకుంటున్నారు మీరంతా" ప్రియ అడిగింది.

"మేము కర్మ గురించి మాటాడుకుంటున్నాము.రాం అంటున్నాడూ తను గత జన్మ లో బాగా మంచి పనులు చేశాడట.నేను నా సంగతి చెప్పబోతున్నాను" నేను చెప్పాను.

"ఇంటరెస్టింగ్ గా ఉన్నదే"

"రా నువు ఇక్కడ కూర్చో" నా పక్కన చోటిచ్చాను.ఆమె పై చేతులు వేసి మాటాడసాగాను.

" గత జన్మ విషయానికి వస్తే తప్పకుండా నేను చెడు నే ఎక్కువ చేసి ఉంటాను.ఎందుకంటే ఈ జన్మ లో ఎన్ని బాధలు పడ్డాను.నాకు ఉన్న చానా వాటిని పోగొట్టుకున్నాను.చివరకి సూసైడ్ చేసుకునే స్థితి కి చేరుకున్నాను.అయితే వీటిని కవర్ చేసే విధంగా చాలా మంచి కూడా చేసి ఉంటాను.ఈ దీన స్థితి కి రాకపోతే ప్రియ లాంటి అద్భుతమైన అమ్మాయిని నేను కలుసుకోగలిగేవాడినా..?ఆ విధంగా నేను చాలా అదృష్టవంతుడిని.ఇప్పటి ఈ జీవితాన్ని ఆనందిస్తున్నాను.కధ సుఖాంతమయింది" చెప్పాను !

అజయ్,రాం చప్పట్లు కొట్టారు.

"ఒక చివరి మాట" అన్నాను.

"ఏమిటి?" వాళ్ళిద్దరూ అడిగారు.

"ఆ రోజుల్లో జీవితం పట్ల ఉన్న అసంతృప్తి కి విరుగుడు గంజాయి మాత్రమే అనుకున్నాం గదా?"

"అవును" రాం అన్నాడు.

"ఆ ఎమోషన్స్ ఇప్పుడు పోయాయి.ఇపుడు నాకు జీవితం ఒక బర్డెన్ కాదు.ఒక విలువైన బహుమతి అని తెలుసుకున్నాను.దీని మనం పూర్తి గా సద్వినియోగం చేసుకోవాలి.థాంక్స్ ప్రియ కి..నో థాంక్స్ గంజాయి కి..!నాలో ఈ మార్పు కి కారణమైన  ప్రియ...ఐ లవ్ యూ" చెప్పాను.

"ఐ లవ్ యూ టూ " ప్రియ అంది.

"ఒక సామెత తో ఈ చర్చ ని ముగిస్తాను" అన్నాను.

"ఏమిటది" అజయ్ ఆసక్తి గా అడిగాడు.

" గతం లోని మంచి రోజులు భవిష్యత్ లో చెడు రోజులు అవుతాయి"

*  *   *   *   *
మిత్రులతో కాలక్షేపం అయిపోయిన తరువాత,ప్రియ ని వాళ్ళ ఇంటిలో దింపి రావడానికి వెళ్ళాను.వాళ్ళ అమ్మ నన్ను సాదరంగా ఆహ్వానించింది.అలాగే ఆమె చేసిన ఆపిల్ జ్యూస్ కూడా ఇచ్చింది.

"ఎలా ఉంది జ్యూస్"  అడిగింది ఆమె.

"ఆంటీ ..చాలా బాగుంది" నిజమే చెప్పాను.

"మా అమ్మ దానిమ్మ జ్యూస్ చేయడం లో స్పెషలిస్ట్.అంతదాకా నువు వెయిట్ చేయాలి" అంది ప్రియ.

"సరే..దానికోసం ఎదురు చూస్తాను" చెప్పాను.

"వరుణ్..నేను స్నానం చేసి వస్తా ...అలసట గా ఉంది" చెప్పింది ప్రియ.

"తప్పకుండా" కానివ్వమన్నాను.

"అమ్మా..వరుణ్ తో మాటాడుతూ ఉండు.." ప్రియ చెప్పింది వాళ్ళ అమ్మ తో.

"తప్పకుండానమ్మా..!.." అన్నది ఆంటి.ప్రియ టవల్ ఇంకా మిగతా డ్రెస్ పట్టుకుని వెళ్ళిపోయింది.

"ఏమిటి..నీ ఫ్రెండ్స్ తో బాగా గడిచిందా?" అడిగింది నన్ను ఆంటి.

" "అవును ఆంటి.ఎంగేజ్ మెంట్ తర్వాత వాళ్ళతో ఎక్కువ సమయం గడపలేకపోయాను.ఈ రోజు ఆ లోటు తీరింది" చెప్పాను.

"ఏమి మాట్లాడారేం?" అడిగిందామె.

"ప్రియ దక్కడం నా అదృష్టం అని చెప్పాను"

"ఆ విషయం లో నేను గర్వం గా ఫీలవ్వుతాను..ఆ తీరు లో పెంచినందుకు"

"మీకు ఆ హక్కు పూర్తిగా  ఉంది.మీ కర్తవ్యం మీరు బాగా నిర్వహించారు"

"థాంక్స్.తినడానికి ఏమైనా కావాలా?"

"ఇందాకే ప్రియ గోబీ మంచూరియా చేసింది మా యింటి లో.!చవులూరించే విధంగా ఉన్నది.మంచి గా నేర్పించారు వంట.అందుకు మీకు థాంక్స్ చెప్పాలి" మనసు లో విషయం చెప్పాను.

"పొగడటం లో మీరంతా మంచి ప్రవీణులు" అన్నది ఆంటి.

"మై ప్లెజర్"

"సరే గాని..ఓ సీరియస్ విషయం అడుగుతాను...ఫర్లేదుగా?" అన్నది ఆంటి.

"చెప్పండి ఆంటీ"

"ఆ రాత్రి ఇంకా నాకు గుర్తుంది.నువు వేరే అమ్మాయిని ప్రేమించాను అని ప్రియ తో చెప్పినపుడు ఎంత రచ్చ రచ్చ చేసిందో ..అంత బాధ పడటం నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు.నీ భాగస్వామి గా ఉండటానికి ప్రియ కి అర్హత లేదా?"

"నేను అప్పుడు చెప్పింది అబద్ధం.ఆమె కు నా పట్ల ప్రేమ ఇంకా పెరగాలనే అలా అన్నాను.మీరు క్షమించారనే అనుకుంటున్నాను"

"క్షమించాను.కాని ప్రియ ని ఆ విధంగా నువు బాధించి ఉండగూడదు.నువు తన వద్దకి వచ్చేదాకా పెళ్ళి అనేదే చేసుకోనని భీష్మించుకు కూర్చుంది.అలా మా అమ్మాయిని చూడటం నాకు బాధ గా అనిపించింది.నేనూ నా వయసు లో ఉన్నప్పుడూ అలాగే ప్రవర్తించాను..విచక్షణా శక్తి అనేది ఉండదు..."

"నేను అదృష్టవంతుడిని ఆ విధంగా ప్రేమించే భార్య దొరకడం" అన్నాను.

"ఆ రాత్రి అంతా దేవుడిని ప్రార్దిస్తూనే కూర్చున్నా ..ఇంకా దేవుడిని ఏమి కోరుకున్నానంటే..?"

"చెప్పండి"

"నా బాధ అంతా ఆ శివుడి పాదాల చెంతనే పెట్టి వేడుకున్నాను.అయిదు  గంటల పాటు పచ్చి నీళ్ళు కూడా ముట్టకుండా ప్రార్దించాను నా కూతురు కోరుకున్న వ్యక్తి తో ఆమె పెళ్ళి జరగాలని..!నా మొరని ఆయన ఆలకించి ఇదిగో నిన్ను ఇలా పంపాడు"

"అది అంతా మీ మంచితనం ఆంటి"

" దేవుడు ఉన్నాడు.అవసరమైనప్పుడు మొరల్ని ఆలకించి మనుషుల రూపం లోనే ఆయన సమాధానమిస్తాడు.నా విషయం లో అది నువ్వే..!నా కూతురు జీవితాన్ని కాపాడావు.నువు మనిషి రూపం లో ఉన్న శివుడివి.నువు దేవుడివి"

ఆ మాట వినగానే నా కళ్ళు అలా మూసుకున్నాను.దైవిక సత్యం ఏదో నాలో మెరిసింది.ముందు ఆ గాయత్రి ,ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్,ఆ తర్వాత ఇప్పుడు ప్రియ వాళ్ళ అమ్మ,అంతకు ముందు అజయ్ ..వీళ్ళంతా నన్ను శివుడనే అన్నారు.ఒకటిన్నర ఏడాది లో ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులు పైగా..!గుణ మాటల్లో చెప్పాలంటే ఏదో ప్రోబబిలిటి థియరి కి దగ్గరగా ఉన్నట్లుందే..!

సరే గాయత్రి అన్నప్పుడు ఏదో అనుకోని విధంగా జరిగింది అనుకోవచ్చు.పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు.అజయ్ నన్ను శివా అన్నప్పుడు నా హెల్త్ బాగానే ఉందే..!మళ్ళీ ఇపుడు ఆంటీ కూడా అదే మాట..!నా కళ్ళు తెరుచుకున్నట్లయింది.

నేను శివుని  గా అందరి చేత సంభావింపబడకమునుపే నేను అనుకున్నది రైటే.నేను షిజోఫ్రెనిక్ కాదు.అసలు మనుషుల్లో ఆ షిజోఫ్రెనిక్ గుణాన్ని పెంపొందించేది నేనే.నాకు జరిగిన డయాగ్నసిస్ సరిగా జరగలేదు.నాకు మతి పోయిందని ఇంట్లో వాళ్ళు,మిత్రులూ అనుకున్నదంతా అబద్ధమే..!నిజం వేరే గా ఉన్నది..!

అయితే నిజం ఏమిటి..?

నేను దేవుడినా?

నేను కళ్ళు తెరిచాను.గుణ నా ఎదురుగా ఉన్నాడు.ఆంటీ పక్కన నిలబడి..!నాకేసే చూస్తున్నాడు.

"నువ్వు ఎవరు?" అతను చిన్నగా అడిగాడు.

"నేను శివుడి ని" సమాధానమిచ్చాను.

(సమాప్తం)  

నా పేరు శివ(నవల),Post no:61

నా పేరు శివ(నవల),Post no:61

"నీ పట్ల నాకు ఉన్న ప్రేమ గురించి ఓ మాట చెప్పనా?" అడిగింది ప్రియ.

"చెప్పు"

"నీ కోసం నేను పదిమంది నైనా చంపుతా!ఒక రోజు నన్ను నువ్వు చంపినా నేను బాధపడను.నీ గతం ఎలాటిదైనా దానితో సంబంధం లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నా"

"వావ్"

" నీ ఇంకో వైపు ని కూడా చూపెట్టావు.నిన్ను ఎప్పుడు తక్కువ చేసి చూడను" బైక్ మీద వెనక ,నన్ను హత్తుకుంటూ అంది ప్రియ.

ఏ చీకటి కోణాన్ని చూసి నన్ను యామిని వదిలి పోయిందో అదే కోణాన్ని ప్రియ   ఆమోదించింది.
"నేను ప్రవీణ్ ని చంపడానికి వెళ్ళినపుడు ఏ జరిగిందో ఇపుడు చెపుతా విను" నేను మిగతాది వివరించదలుచుకున్నాను.

"ఆ ..చెప్పు" అంది ప్రియ.

"నా కంటే ముందే ప్రవీణ్ యామిని ని ప్రేమించాడు.అయితే చెప్పే ధైర్యం చేయలేకపోయాడు.నేను ఆమె తో ఉన్నన్ని రోజులు తను నరకం అనుభవించాడు.నేను మానసికంగా బాగో లేని సమయం లో నేను చేసిన దానికి యామిని ని ఓదార్చుతూ అలా ఆమె కి దగ్గరయ్యాడు.అట్లా డైమండ్ రింగ్ ని కూడా ప్రేమ కి గుర్తు గా తన జీవిత కాల పొదుపు లోనుంచి తీసి కొనిచ్చాడు.."

"ఓ రకంగా మరి మంచి వ్యక్తే అని చెప్పాలి"

" నాకూ అదే అనిపించింది.నా వైపు నుంచి చూస్తే తను విలన్ లా కనిపించాడు.నిన్న విషయాన్ని తన వైపు నుంచి చూస్తే నేనే విలన్ అనిపించింది.అతని వెర్షనే కరక్ట్.."

"మరి యామిని అతడిని ఎందుకు వదిలిపెట్టింది?"

"ప్రియ..ఆమె బుద్ధి లేని మనిషి.అంత గందరగోళం మనిషిని ఎక్కడా నేను చూడలేదు.నేను ఆమె తో పోట్లాడే వాడినట.తను ఆమె తో అలా చేయట్లేదట.అదీ ఆమె రీజన్,ఆ స్థితిని ఏమనాలి ..గందరగోళం అనక "

"పూర్తిగా నిజం"

"ఆలోచిస్తున్నకొద్దీ అనిపించింది ఏమంటే అసలు వాళ్ళిద్దరే తగిన జంట.ఆమె గురించి కాదు కాని ప్రవీణ్ గురించే నేను ఆలోచించేది.అతని ముఖం చూస్తే జాలి వేసింది.యామిని కి,ప్రవీణ్ కి ముడివేయడానికి ప్రయత్నించాను "

"అలా చేశావా నువ్వు"

"యామిని తో ఆరు గంటలు వాహ్యాళికి వెళ్ళి ప్రవీణ్ గురించి మొత్తం చెప్పాను.అతని వంటి వ్యక్తి లక్షల్లో ఒకడు కూడా ఉండడు,అని అనునయించి చెప్పాను.అప్పటికీ గందరగోళం లోనే ఉన్నట్లు తోచింది.ఒక వారం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొమ్మని ఆమె కి చెప్పి వచ్చేశాను"

"మంచి పని చేశావ్"
"సరే..ఇపుడు నీ గురించి చెప్తాను.నువు నా జీవితాన్ని రక్షించిన వ్యక్తి వి ..అన్ని విధాలా!నువ్వే గనక పరిచయం కాకపోతే ,ఆ ఫోన్ ఆ రోజున చేయకపోతే సముద్రం లో మునిగి చనిపోయేవాణ్ణి.నిన్ను ప్రేమించాను అని ఓ దశ లో అనుకోగానే యామిని తో మాట్లాడటం తగ్గించేశాను.మన మధ్య అనుబంధం బాగా పెరిగింది అనుకున్నప్పుడే నేను నా ప్రేమ ని నీకు చెప్పాను.ఇపుడు అన్నిటినీ దాటి మనం అనుకున్న గమ్యం వైపు సాగిపోతున్నాం..అవునా కాదా?"

"సత్యం.."

"నువు నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసినపుడు ..అప్పుడే యామిని తో చెప్పడం పూర్తి చేశాను.నువు చెప్పింది విని నాకు చాలా హేపీ అనిపించింది.నన్ను కొద్ది గా మిస్ అయినట్లు అనిపించాలని నీతో అలా అన్నాను.నన్ను నేను మానసికంగా కూడా సిద్ధం చేసుకోవాలి గదా ..నిన్న రాత్రి నిద్ర నా జీవితం లోనే మదురమైన నిద్ర"

"కాని నాకు మాత్రం నిన్న మహా నరకం గా తోచింది"

"సారీ బేబీ...నీ బాధని నేను ఇంకోదానితో పూడ్చి సరిచేస్తానుగా"

"అంటే..ఎలా"

" ఒక ప్లాన్ ఉంది దానికి"

"ఏమిటి?"

"మనం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాము"

*   *   *   *    *
ఆగస్ట్16,2015

గత ఆదివారం నాకు ,ప్రియ కి ఎంగేజ్మెంట్ జరిగింది.గుర్తుంచుకోదగిన రోజు.ఆమె కొలీగ్స్ కి అందరకీ నన్ను పరిచయం చేసింది.వారి అందరకీ మా ప్రేమ కధ చెప్పింది.సినిమా తీయవలసిన కధ అని చెప్పి వాళ్ళన్నారు.అసలు ప్రియ ని కలవకముందు ఏమి జరిగిందో  నా కధ చెపితే వీళ్ళంతా హడలి పోతారనుకుంటాను.

ప్రవీణ్ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చాడు.యామిని తో తన కధ సుఖాంతమైనట్లు ..ఆమె తన ప్రవర్తన కి సారీ కూడా చెప్పినట్లు వెల్లడించాడు.నాకు థాంక్స్ చెప్పాడు చేసిన సాయానికి..!మొత్తానికి అతను కోరుకున్నది అతనికి లభించింది.ఎవరికి అర్హమైనది వారికి దొరికింది.మా పేరేంట్స్ ఊరెళ్ళిన రోజు మిత్రులకి విందు కార్యక్రమం జరిగింది.

రాం,అజయ్ లు బీర్ లు తాగుతూ నా బెడ్ రూం లో కూర్చొని ఉన్నారు.నేను మామూలుగా పొగ తాగుతూ ఉన్నాను.ప్రియ కిచెన్ లో గోబీ మంచూరియ వండుతోంది.

"మీకు ఓ ప్రశ్న ఫ్రెండ్స్.." అజయ్ అన్నాడు.

" ఈ సారి నీ అనుమానం ఏమిటి..? అడిగాడు రాం.నేను కూర్చొని వింటూ మాటాడబోతున్నాను.ఇప్పుడు మొదటిసారిగా వీరు ఇద్దరి తో పరిచయం అయినట్లుగా..ఆ కాలేజ్ రోజుల్లోకి అలా వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తోంది.ఏ బాధలూ లేవు ఇపుడు.హాయి గా ఉన్నది.
"గత జన్మ లో ఏవో మంచి పనులు చేసే ఉండి ఉంటాం గదా మనం" అజయ్ అనుమానం అది.

"అలాంటి వి ఉంటాయని నమ్ముతున్నావా నువు?" రాం అడిగాడు.

"ఉన్నయే అనుకో"

"మనం అప్పుడు కొన్ని పాపాలు,కొన్ని పుణ్యాలు కూడా చేసి ఉంటాము ..అయితే పుణ్యాలే ఎక్కువ అనుకుంటాలే!.." రాం అన్నాడు.

"అలా ఎందుకు అనుకోవాలి"నేను ప్రశ్నించాను.

" నన్నే తీసుకో ఉదాహరణకి..!నా బాల్యం అంతా బాధామయమే.ఆత్మన్యూనత తో ఉండేవాడిని.ఎందుకు పనికిరానివాడివని ఇంట్లో బయటా స్కూల్లో అంతా అనేవారు.అలాంటి రోజుల్లో ఒక మేష్టారు నా లో సెల్ఫ్ పిటీ అనేది తప్పని నువు ఎవరికంటే తక్కువ కాదని ఎంత గానో ఎంకరేజ్ చేశారు.తెలివి చురుకుదనం అలా పెంపొందాయి.ఆ పాజిటివ్ చేంజ్ నాలో తెచ్చిన ఆ మేష్టారు కి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను.." రాం చెప్పాడు.

" ఆ తర్వాత కధ ఏమయింది" అజయ్ అడిగాడు.

" నేను ఏదైనా సాధించగలను అనే ధైర్యం పెరిగింది.క్రమేపి చదువు లో రాణించాను.ఎదుటి వాళ్ళు నా గురించి అనుకునే మాటల్ని నిర్లక్ష్యం చేయడం నేర్చుకున్నాను.ఇంకొకరి తో పోల్చుకోవడం మానేశాను.చివరకి అందరూ కలలు కనే MIIT లో చేరే దాకా ప్రయాణించాను."

"చాలా గొప్పగా ఉంది డ్యూడ్"

" నా గత జన్మ లోని కర్మలే నా బాల్యం లోని ఆ రోజులు అనుకుంటాను.తర్వాతది అంతా నేను చేసిన పుణ్యానికి ప్రతిఫలం.ఆ విధంగా నా పాపాల కంటే పుణ్యాలే ఎక్కువ అని చెప్పగలను.కాబట్టే గత ఎనిమిది ఏళ్ళ నుంచి చక్కటి హేపీ లైఫ్ గడుపుతున్నా" రాం అన్నాడు.

"నేను ఒప్పుకుంటున్నా.ఏమంటావు బ్రో" నన్ను అడిగాడు అజయ్.

ఈ లోపులో ప్రియ తను వండిన గోబీ మంచూరియా ని తీసుకొచ్చింది.ఎంత మంచి అమ్మాయి..!

"ఏమిటి..వినోదం తో హేపీ గా ఉన్నారా..?" అడుగుతు రాం కి,అజయ్ కి చెరో ప్లేట్ ఇచ్చింది ప్రియ.

"గతం లో  లాగే మేధోపరమైన అంశాలు చర్చిస్తున్నాం" చెప్పను నేను.

"మరి నాకు కూడా చెపుతారా?" అన్నది ప్రియ. (సశేషం)  

Wednesday, 23 May 2018

నా పేరు శివ (నవల),Post no:60

నా పేరు శివ (నవల),Post no:60

పార్ట్-6 , "వరుణ్" చెప్తున్నాడు.

చాప్టర్-19

నేను అనుకున్నట్టుగానే నన్ను చూసి ప్రియ ఆశ్చర్యపడింది.నేను ఫోన్ లో రాత్రి మాటాడిన విధానానికి ఆమె బాగా బాధ పడి ఉంటుంది.నాకు తెలుసు.ఒక మంచి కోసమే అలా చేసింది.నా చీకటి పార్శ్వాన్ని ఒక తీయని రూపు తో కప్పేయడానికే నేను అలా చేసింది.జరిగిన కధ అంతా ఇపుడు ఆమె కి పూర్తి గా చెప్పాలి.దానికంటే ముందు నా చేతి లోని బొకే ని ఆమె కి ఇవ్వాలి.

"ఇదిగో..ఇది నీకోసం" నా చేతి లోని బొకే ని ఆమె కి ఇవ్వబోయాను.

"ఇది నిజమా" అనుమానంగా అంది ప్రియ.

"నేను ఇపుడు షిజోఫ్రెనిక్ పేషెంట్ ని కాను.నేను చేస్తున్నది ఏదో నాకు తెలుస్తోంది,నువు తీసుకుంటావా?లేదా యామిని కి ఇవ్వమంటావా? " కన్ను గీటుతూ అడిగాను.

" లేదు,నేనే తీసుకుంటా"

"అది బాగుంది.నాతో బైక్ మీద వస్తున్నావు గా?" అడిగాను.

"నువు చెప్పేది నాకు అర్ధం కావటం లేదు.యామిని దగ్గర కి వెళ్ళానన్నావు.నీతో మాటాడవద్దని అన్నావు..!" ప్రశ్నించింది ఆమె.

"నాకు తెలుసు బేబీ..అది ఒక ట్రిక్ మాత్రమే..!నేను చెప్పినదంతా అబద్ధమే..!నీ లోని ప్రేమ ని ఇంకా ఎక్కువ చేయడానికే అలా చెప్పింది.ఈ రోజు సర్ ప్రైజ్ చేయడానికి ముందు అలా చేయాలని చేశా"

" ఏమిటా వెధవ పని..?"
"నన్ను క్షమించు.నా మాటలు నిన్ను బాధ పెడతాయని తెలుసు.కాని ఒక రాత్రి వరకే గా .."

"కాని రాత్రి మా యింట్లో ఎంత పెద్ద సీన్ అయిందో తెలుసా?"

"నేను ప్రేమించింది నిన్ను మాత్రమే.నిజం ఒప్పుకోడానికి చిన్న సరదా..ఆ రైట్ లేదంటావా నాకు ?"

"ఏమిటి నీ అర్ధం..?" ఆమె అడగడం లో కొద్దిగా సిగ్గు పడింది.

"నీకు ఆంగ్లం అర్ధం అవుతుంది గదా..? లేదా అమెరికన్ యాక్సెంట్ తో కూడిన ఆంగ్లమే అర్ధం అవుతుందా?" నేను నవ్వాను.

" ఏయ్ ఊరుకో" నా చేతి మీద సరదాగా కొడుతూ అన్నది ఆమె.

"హమ్మయ్యా అనుకొని హాయిగా నవ్వుకున్నాను..!

"నన్ను ప్రేమిస్తున్నావా..నిజమా?" అమాయకంగా అడిగింది ప్రియ.

"ఎస్..యూ ఆర్ మై డార్లింగ్..!" చిరునవ్వుతో చెప్పాను.

" వావ్"

"నిన్న నీతో మాటాడిన మాటలకి నేను ఎంతో రిస్క్ తీసుకున్నాననే చెప్పాలి.అదీ ఆ పెళ్ళి చూపుల వేళ లో..!అదీ ట్రిక్ లో ఓ భాగమే.అదీ గాక ప్రవీణ్ ని యామిని విడిచిపెట్టి రావడం ఏమిటబ్బా అని ఆ ఆలోచనల్లో మునిగిపోయాను"

"నేను అర్ధం చేసుకున్నా"

" ఆ పెళ్ళి కి నువు ఒప్పుకున్నట్లయితే నా పరిస్థితి భయానకం గా తయారయ్యేది.అయితే నా లోపల ఎక్కడో అనిపించింది ఆ విధంగా ఎంతమాత్రం జరగదని..!చివరకి హాయిగా నిట్టూర్చాను ఆ పెళ్ళి సంబంధం తప్పి పోవడం తో.."

"నేను ఇంకోకరిని పెళ్ళి చేసుకోవడం అనేది జరగని పని వరుణ్"

"బాగా చెప్పావ్"

"కాని యామిని సంగతి ఏమయింది?"

"అది తెలిసీ తెలియని మొదటి ప్రేమ లాటిది.ఒక తాత్కాలిక ఆకర్షణ.ఆమె అందమైన ఆమె ముఖారవిందాన్ని చూసి పడిన ప్రేమ అది.అంతకు మించి ఏమీ కాదు.నీ పట్ల నాకు ఉన్న ఆరాధన ని లేదా ఫీలింగ్స్ ని ఆమె దాని తో పోలిస్తే నథింగ్..నథింగ్..!"

"అది చాలా నిజం.." నన్ను హత్తుకుంటూ అన్నది ప్రియ.
"యామిని,నేను అంత సరైన జోడి కాదు.అది ప్రేమ అని చెప్పడానికి కూడా లేదు.నిన్న జరిగిన మొత్తం సంగతులన్నీ నీకు చెపుతా..!ఒక మధ్యే వాది గా సత్యాన్ని నేను గుర్తించగలిగాను"

"అయితే ..చెప్పు"

"దానికి ముందు ఒకటి నువు చేయాలి.ఈ బొకే ని ఇంట్లో పెట్టి నాతో పాటు బైక్ మీద  రావాలి.నా జీవితం లోని కొన్ని వింత సంగతుల్ని నువు తెలుసుకోవాలి"

"సరే..నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను.నువు బైక్ తీసుకు రా" అలా చెప్పి ఆమె తన డ్రెస్ మార్చుకుండానికి వాళ్ళ అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది.మొత్తానికి బైక్ స్టార్ట్ చేసి ఇద్దరం రోడ్ మీద హాయి గా వెళుతున్నాము.

"నేను చెప్పబోయేది నీకు షాక్ లా ఉండవచ్చు.నిజం చెప్పాలంటే విన్నప్పుడు నాకు కూడా మొదటిసారి ఝల్లు మంది.నువు కాబోయే అర్ధాంగివి.సీక్రెట్స్ అనేవి మన మధ్య ఉండరాదు"

"సరే..అవి ఎలాంటివైనా,నేను రియాక్ట్ కాబోను"

"థాంక్స్..నేను సూర్య అనే ఓ వ్యక్తిని మర్డర్ చేశాను.యామిని ని సైతం చేయబోయాను మర్డర్..!ఈ రెండు నేను షిజోఫ్రెనియ లో ఉండగా జరిగినవి.."

ప్రియ చాలా నిశ్శబ్దమైపోయింది.ఆమె లోని టెన్షన్ నాకు తెలుస్తోంది.

"ఇది వినడానికి కష్టం గా ఉంటుంది.నాకు తెలుసు.సూర్య అనేవాడు ఒక దుర్మార్గుడు.అందుకే నేను అలా చేసి ఉంటాను.ఆ కేస్ డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ కూడా వాడు చచ్చినందుకు నాకు థాంక్స్ చెప్పాడు.ఇక యామిని విషయానికి వస్తే..ఆమె ఇంకెవరితోనో అఫైర్ పెట్టుకుందన్న అనుమానం తో ..అలా చేయాలనే ఆలోచన వచ్చింది.ఆమె నాది అనే పోసెసివ్ ఫీలింగ్ నుంచి ఆ భావన కలిగింది.."

" వరుణ్..నువు  చాలా భయపెడుతున్నావు...రేపు పొద్దుట నా మీద అనుమానం వచ్చినా అలానే చేయాలని ప్లాన్ చేస్తావా ఏమిటి?"

"నో ప్రియ..అలా ఎప్పటికీ జరగదు.నేను చేసిన పనులకి నేనేం గర్వించడం లేదు.ఆ గంజాయి కి అలవాటు కాకముందు నేను ఒక మంచి చదువుకునే బాలుడి వంటి వాడిని మాత్రమే.విధినే నిందించవలసింది.నా మీద నాకు కంట్రోల్ లేని రోజుల్లో చేసిన పనులు అవి"

ప్రియ సైలెంట్ గా ఉండిపోయింది.ఆమె ఆ షాక్ నుంచి తేరుకునేదాక నేనూ సైలెంట్ గా ఉండిపోయాను.నా గతం అంతా ఆమె కి తెలియాలి అనే ఉద్దేశ్యం తో ఇవన్నీ చెప్పాను.

"మళ్ళీ నువు ఆ గంజాయి జోలికి పోవు గదా?" ఆమె అడిగింది.

"నువు చూస్తున్నావు గా..నేను బాగయినప్పటినుంచి దాని జోలికే వెళ్ళడం లేదు.ఇది నీతో పంచుకోవడానికి ఓ కారణం ఉంది,నా పొరబాట్లని తెలుసుకున్న తర్వాత కూడా నువు నన్ను ప్రేమించాలి..అదే నా కోరిక "

"అది సరే..ఆ ఒక్కటి తప్ప ఏ మర్డర్ చేయలేదు గా"

"యామిని ప్రియుడు ప్రవీణ్ ని చంపాలని అనుకున్నా..అతడిని చంపాలని తన యింటికి వెళ్ళాను నిన్న"

"ఏమిటి..? మళ్ళీ చంపడానికి.."

"అతను యామిని ని నా నుంచి దొంగిలించాడు.కాబట్టి గుణపాఠం చెప్పాలని భావించా"

"నాకు మహా కంపరం గా ఉంది..వరుణ్..!వీటన్నిటినీ చాలా కూల్ గా ఎలా చెప్పగలుగుతున్నావ్?"

"ఎందుకంటే నిజాలు తెలియాలి అనేది నా కోరిక..ముఖ్యం గా నీకు"

"నీ  వైపు నుంచి ఆలోచిస్తే అంతా చాలా బాగానే ఉంది.సూర్య ని చంపినపుడు,యామిని ని చంపాలనుకున్నపుడు నీ మానసిక ఆరోగ్యం బాగాలేదనుకో...మరి ప్రవీణ్ ని ఎందుకు చంపాలనుకున్నావు..? నా భయం ఏమిటంటే నువు ఇలానే ఉంటావా..లేదా మంచిగా మారతావా?"

"ఈ విషయం నీతో షేర్ చేసుకుంటున్నాను అంటేనే నాలో మంచి మార్పు వచ్చిందనేగా అర్ధం!నువు భయపడటం లో ఒక అర్ధం ఉంది.అయితే నీనుంచి ఏమీ దాయకూడదనేదే నా కోరిక.నువు నన్ను వద్దనుకున్నా అది పూర్తి గా నీ యిష్టం.ఇంకో వ్యక్తిని పెళ్ళాడి హాయిగా ఉండు,అది పూర్తిగా నీ యిష్టం" (సశేషం)     

Tuesday, 22 May 2018

నా పేరు శివ (నవల),Post no:59

నా పేరు శివ (నవల),Post no:59

నా ఆశలన్నీ ఇలా అడియాశలవుతుంటే,ముక్కలవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.ఇక నేను తట్టుకోలేని స్థితి కి వచ్చేశాను.కన్నీళ్ళపర్యంతమయ్యాను.

"నువు ఏడుస్తున్నావా?" అడిగాడు వరుణ్.

"అవును.." అలా అని ఏడుస్తూనే ఉన్నాను.

"ఏమయింది..?నేను యామిని తో మళ్ళీ కలవడం నీకు ఇష్టం లేదా ?"

" ఐ లవ్ యూ వరుణ్...ఐ లవ్ యూ  సో మచ్,ఆ యామిని ని వదిలి పెట్టి నా దగ్గరకి రావడమే కావలసింది"

"ఏమిటి.."

" నన్ను నిరాకరించవద్దు.నీవు లేనిదే జీవించలేను" బ్రతిమిలాడాను.

"అదెలా సాధ్యం..?యామిని ని ఎలా విడిచి రాగలను?అదీ ఇన్నాళ్ళకి వచ్చిన అవకాశం.."


"నేను నిన్ను మంచిగా చూసుకుంటాను,ఆ యామిని లా కాకుండా..!అనేక మంది నీ వంటి పిల్లల్ని కని హాయి గా ఉందాము,వాళ్ళని చక్కగా పెంచుతూ"

"అది సాధ్యం కాని పని ప్రియ.నీ జీవితం నీవు జీవించు.అలా కాదంటే మనం మాటాడుకోవద్దు"

"దొబ్బేసెయ్ వరుణ్...!అసలు మాటాడుకోవద్దు.ఆ యామిని తోనే కలిసి ఊరేగు" ఆవేశం తో అన్నాను.

"సరే..అలాగే" తను ఫోన్ పెట్టేశాడు.ఆవేశంగా అన్న మాటకి సారీ చెపుదామనుకున్నా ,తర్వాత ఆ ఆలోచన ని విరమించుకున్నాను.

హాల్ లోకి వేగంగా వెళ్ళాను.అమ్మ తో మాటాడడానికి.ఆమె ఏదో సీరియల్ చూస్తోంది.నా వాలకం చూసి ఆమె టివి ని స్విచ్ ఆఫ్ చేసింది.

"ఏమి జరిగింది" ఆమె ఆందోళన గా ప్రశ్నించింది.  
"అతను నన్ను ప్రేమించట్లేదు అమ్మ.నాతో ఉండటం తనకి ఇష్టం లేదు.కనీసం నాతో మాట్లాడడం కూడా తనకి ఇష్టం లేదు" ఆమె భుజం మీద తల వాల్చి ఏడవసాగాను.

"నేను తనతో మాట్లాడనా?"

"దానివల్ల ఏం లాభం లేదు.ఇంకో అమ్మాయి ప్రేమ లో తను ఉన్నాడు.అతనికి కోపం పెరగడం తప్పా ఒరిగేది ఏమీ ఉండదు"

"పోనీ,ఆ కృష్ణ నే మేరేజ్ చేసుకుంటే బావుంటుందేమో..!లేకపోతే ఆ మేట్రిమోనియల్ వెబ్ సైట్ లో వేరే సంబంధాల్ని వెదుకుదాం.మరీ ఒకటని కాకుండా అలా చూస్తే ప్రయోజనం ఉంటుంది,ఏమంటావు?"

" చెప్పేది అర్ధం కావట్లేదా..?నేను పెళ్ళి చేసుకోను,వేరే ఇంకెవరినీ.." గట్టిగా అరిచాను.

వంట ఇంటి లోకి వెళ్ళి చేతికి దొరికిన గ్లాస్ ని గోడకి విసిరికొట్టాను.పెద్ద శబ్దం చేసుకుంటూ దొర్లిపోయిందది.ఇంకో గ్లాస్ ని తీసుకున్నా విసిరికొట్టడానికి.

"శాంతించు ప్రియ"

"నీకు ఆ మాత్రం కావట్లేదా అమ్మా.నా ఈ కధ అంతా విని మళ్ళీ సంబంధాలు చూడాలి అంటున్నావ్"

"జరిగేదేదో అది చూడాలి.అతను వేరే అమ్మాయి తో ప్రేమ లో ఉన్నప్పుడు..ఇక చేసేదేముంది..మరిచిపోవడం తప్పా"

"అది నా వల్ల కాదు.సరేనా?ఆ యామిని జిత్తులమారి నక్క..తప్పకుండా ఏదోరోజు అతడిని ముంచి పోతుంది.తప్పకుండా తను నా వద్దకే వస్తాడు,కొంత కాలం వెయిట్ చేస్తా "

" ఏమయింది నీకు?మీ నాన్న కి తెలిస్తే చికాకు అవుతారు"

"అయితే నేను ఏం ఫీల్ అవుతున్నానో నీకు అక్కర్లేదా ..?అసలు నువు తల్లివేనా?"

" ఆ ఫోన్ ఇవ్వు.ఆ కుర్రాడి తో నేను మాటాడుతా"

"ఆ అవసరం ఏం లేదు.నేను వెయిట్ చేస్తాను ఆమె తో బ్రేక్ అప్ అయ్యేంత వరకు..!ఇక నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకు"

"సరేలే..భోజనం చెయ్యి ముందు...మనసు కుదుటబడుతుంది"

"నాకేం అవసరం లేదు.నా మనసు బాగనే ఉంది.సింగిల్ గా ఉండటానికే నిర్ణయించుకున్నా.నువు వెళ్ళి తిను కావలిస్తే" గట్టిగా అరుస్తూ చెప్పాను.

"ఏం జరుగుతోంది ఇక్కడ?" ఈ గొడవ విని ఆయన అడిగాడు.
మార్చ్2,2015

గత రాత్రి మా యిల్లు గందరగోళం గా అయిపోయింది.అరిచి గీపెట్టి ఒక సీన్ క్రియేట్ చేశాను.మా అమ్మ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది.మా నాన్న షాక్ లో ఉండిపోయాడు.ఆయన ముందుకి వెళ్ళడానికి నేను సాహసించలేదు.నా సోయి లో నేను లేను.ఇంత భీభత్సంగా నేను గతం లో ఎప్పుడూ ప్రవర్తించలేదు.హృదయరోదన అంటే ఏమిటో గత రాత్రి అర్ధమయింది.

మా ఇంట్లో ముగ్గురికీ నిద్ర లేని రాత్రి అయింది.వరుణ్ యామిని వైపు వెళ్ళినందుకు నాకు ,నన్ను ఎప్పుడు అంత బాధ లో చూసి ఎరుగని కారణంగా అమ్మకి,నా ప్రేమ విషయం జీర్ణించుకోలేక నాన్న కి నిద్ర పట్టలేదు.ముప్ఫై మూడు గంటలయింది నిద్ర లేక.ఆఫీస్ కి ఎగవేయడమే ఈ రోజు,రెస్ట్ ఇప్పుడు చాలా అవసరం నాకు.జీవితం మీద విరక్తి భావం కలగసాగింది.అక్కడ వరుణ్,యామిని లు హాయిగా ఉన్నారన్న ఆలోచనే నాలో అలజడి రేపుతోంది.ఎంత అసూయ నాలో ఆమె పట్ల..దేవుడా..!

ఉన్నట్లుండి నా ఫోన్ రింగ్ కావడం మొదలెట్టింది.అనాసక్తి గా ఫోన్ తీశాను,మా కొలీగ్ కావచ్చుననుకొని..! ఆ ఫోన్ వచ్చింది వరుణ్ దగ్గర్నుంచి..నమ్మలేకపోయాను..!అంటే తను సారీ చెప్పడానికి చేశాడా..?

"హలో" మామూలు గా అన్నాను.

"ప్రియా" అవతల వరుణ్.

"ఆ..ఏమిటి"

"నువు నాకు ఒక ఫేవర్ చేయగలవా?"

"ఏమిటది?"

"చేస్తావా లేదా?"

"ఏమిటో చెప్పు వరుణ్..ఇపుడు ఊహించుకునేంత మూడ్ లేదు"

"అది గనక నీకు తెలిస్తే...నీ బాధ అంతా సంతోషం అయిపోతుంది"

"ఎందుకు"

"ఒకసారి మీ ఇంటినుంచి బయటకి వస్తావా?"

"అంటే నువు ఇక్కడ బయటే ఉన్నావా?" ఆసక్తి గా అడిగాను.

"త్వరగా రావాలి. ఇక వెయిట్ చేయలేను" అతను చెప్పాడు.

"నేను ఇప్పుడు నైట్ డ్రెస్ లో ఉన్నాను..ఓ కె నా?"

"ఏం ఫర్వాలేదు.నిన్నెప్పుడూ అలా చూసింది లేదు"

"ఒక్క నిమిషం.." ఫోన్ పెట్టేశాను.ఇపుడు వరుణ్ నా కోసం బయట వెయిట్ చేస్తూ కనిపించాడు.యామిని లేదు.థాంక్ గాడ్.నేను బయటకి వచ్చాను.వరుణ్ నవ్వుతూ కనిపించాడు ..అతని చేతి లో ఒక బొకే కూడా ఉన్నది.అది నా కోసమేనా..?

"ఒక సర్ ప్రైజ్" అతను చెప్పాడు.తన వేపే నేను చూస్తున్నాను. నా ప్రేమ కధ కి శుభం కార్డ్ పడుతుందని..!(సశేషం)   

Monday, 21 May 2018

నా పేరు శివ (నవల),post no:58

నా పేరు శివ (నవల),post no:58

చాప్టర్-8

వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు.ఇపుడు సాయంత్రం పావుతక్కువ ఎనిమిది అవుతోంది.ఇక నేను నా కార్యక్రమాన్ని ప్రారంభించాలి.అయితే మొదట మా నాన్న తో మాటాడడం అంటే కొద్దిగా బెరుకు గా ఉంది.ఆయన ప్రిన్స్ పుల్స్ ఆయనవి.స్ట్రిక్ట్ మనిషి.మగ వాళ్ళని నమ్మకూడదు.వాళ్ళు మోసకారులు.ఇవి ఆయన ప్రిన్స్ పుల్స్ లో కొన్ని.ముందుగా మా అమ్మతో మాట్లాడాలి.ఆమెని ఒప్పించడం సులువు.ఏ చిన్న విషయమైన మా అమ్మ తో చెప్పడం ముందునుంచి నాకు అలవాటు.ఒక్క వరుణ్ విషయం తప్ప నా గురించి అన్ని విషయాలూ ఆమె కి తెలుసు.

అమ్మ నా బెడ్ రూం లోకి వచ్చి మాటాడసాగింది.

"ఎంత మంచి కుటుంబమో...కదా" నా పక్కనే కూర్చుని అన్నది అమ్మ.

"అవును" అని,నా అసలు విషయం చెప్పడానికి తయారవసాగాను.విని ఆశ్చర్యం కూడా ఆమె కి కలగవచ్చును.

"కృష్ణ తో ఏం మాట్లాడావు?" అడిగింది అమ్మ.

" పెద్దగా ఏం లేదు.నా జాబ్ గురించి ..అంతే"

"తనకి నువు నచ్చి ఉంటావు,ఆ పెళ్ళి కూడా అయిపోతే మీ అక్క లానే నువు చక్కగా సెటిల్ అయిపోవచ్చు"

"వెళ్ళే ముందు నీతో ఏం చెప్పాడు?"

"నీతో మాట్లాడటం బాగుందని చెప్పాడు.వాళ్ళు వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడమని చెప్పాడు"

"వాళ్ళ నిర్ణయం ఏమిటి"

"ఓ రెండు రోజులు ఆగి చెప్తామన్నారు"

"ఓ కె"

"అది సరే..వాళ్ళు వెళ్ళిపోయినతర్వాత నీతో మాటాడమన్నాడు.ఇంతకీ ఏమిటది?ఏమి చెప్పావు అతనితో..?అతను నచ్చలేదు అని మాత్రం చెప్పకు"
"అదేం లేదు,తను మంచి మనిషే"

"నాకు కూడా మంచి కుర్రాడిలా అనిపించాడు.ఆ కుటుంబం కూడా మన లాగానే మంచి ఫ్రెండ్లీ గా ఉండే తరహా అనిపించింది.మీ బావ గారు అక్కని చూసుకోవడానికి వచ్చినపుడు ఎలా అనిపించిందో ఇపుడూ అలా అనిపించింది.నీకు ,కృష్ణ కి జోడీ మంచిగా ఉంటుంది.నువ్వు ఏమంటావు?"

ఇక ఉన్నదంతా చెప్పాల్సిన తరుణం వచ్చేసింది..!

"అమ్మా..నువు అడిగావు గా...ఇందాకా!కృష్ణ నీతో ఏదో మాటాడమని అన్నట్లు..."

"ఆ..అవును" ఆసక్తి గా అన్నది అమ్మ.

"అది నేను చెప్పినదే..!నీతో నూ నాన్న తోనూ చెప్పడానికి భయపడిన సంగతి అది"

"చెప్పు..ఏమిటది"

"నేను ఇంకో వ్యక్తి ని ప్రేమించాను" ఎలాగో చెప్పేశాను.ఆమె రియాక్షన్ కోసం చూశాను.

"ఏమిటి"

"నాకు తెలుసు ఇది నీకు షాకింగ్ గా ఉంటుంది.మీకు బాధ గా కూడా ఉంటుంది.మన కుటుంబ పద్ధతులకి వ్యతిరేకమని..కూడా తెలుసు!అయితే అది నా చేతుల్లో లేదు.అది అలా జరిగిపోయింది.అతని గురించి ఆలోచించకుండా నేను ఉండలేను, సారీ అమ్మ"

"ఏమి చెప్పమంటావు నన్ను" అమ్మ తల పట్టుకుంది.

"నిన్ను చెప్పమని అడగడం లేదు,దయచేసి నేను చెప్పేది అంతా విను..నా వేదన కొంత తగ్గుతుంది"

"మీ నాన్న అగ్గి మీద గుగ్గిలం అవుతాడు ఇది వింటే,నీకు తెలీదా "

" అందుకే నీ సాయం నాకు కావాలి.నాన్న ని నువ్వే ఒప్పించాలి"

"అసలు ఆ అబ్బాయి ఎలాటి మనిషో.."

"ఒకటి చెప్పు.కృష్ణ అంటే నీకు మంచి అభిప్రాయం ఎందుకు కలిగింది..?"

"మర్యాదస్తుడు ఇంకా చక్కగా సెటిల్ అయ్యాడు.అతని కుటుంబం కూడా మంచిది"

"అవునా..!అలానే వరుణ్ కూడా..!అతను నీకు కూడా నచ్చుతాడు.చాలా మంచి మనిషి ..అతని కుటుంబం కూడా మంచిది.అంతే కాదు వరుణ్ కి కేంపస్ ప్లేస్ మెంట్స్ లో జాబ్ కూడా వచ్చింది.అన్నిటికీ మించి తనని ఎంతో ఎక్కువ గా నేను ప్రేమించాను.."
" హ్మ్మ్..ఇంతకీ అతని పేరేమిటన్నావు?"

"వరుణ్ అని,మన పొరుగు వాళ్ళే"

"ఏమిటి నువ్వనేది"

"అవును"

"అయిత అతణ్ణి పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయించుకున్నావా?"

"పెళ్ళి అనేది చేసుకుంటే తననే..!వేరే విధంగా నేను ఊహించలేను.వినడానికి నాటకీయం గా ఉండవచ్చు.నేను చెప్పేది మాత్రం నిజం.అర్ధం చేసుకో అమ్మా"

" ఎంతకాలం నుంచి ప్రేమ లో ఉన్నారు?"

"ఒకటిన్నర ఏడాది బట్టి...సుమారు గా..!ఫోన్ లో మాట్లాడాటుకోవటం..కలిసి బయటకి వెళ్ళడం ఉన్నాయి..కానీ "

"కానీ.."

"నా ప్రేమ గురించి తనకి తెలియదు.నిజం చెప్పాలంటే అతను ఇంకో అమ్మాయి ప్రేమ లో ఉన్నాడు.భయం గానూ ఉంది..నా ప్రేమ ని అంగీకరిస్తాడా ..లేదా అని" నాకు కణ్ణీళ్ళు ఆగలేదు.

"మరి అతనితో చెప్పబోతున్నావా?"


"నీతో మాట్లాడిన వెంటనే అతని తో నేను మాట్లాడుతా.ఒకటి మాత్రం నిజం.తను కాదంటే నేను అవివాహిత గానే మిగిలిపోతాను.ఏదో ఒక రోజున అతనే నా కోసం తిరిగివస్తాడు.."

"నువు చెప్పేది నవ్వులాట గా ఉంది ప్రియ.అందుకేనా నిన్ను పెంచి పెద్ద చేసింది?"

"ఏమో అమ్మా.సారీ..!ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది.నీ కూతురు గానే ఉంటా తప్ప ఎవరో భార్య గా ఉండను"

"సరే..వరుణ్ కి ఫోన్ చెయ్యి.వాళ్ళ పేరేంట్స్ ఒప్పుకుంటే మీ మేరేజ్ జరుగుతుందన్నట్టుగా చెప్పు.ఒకసారి మన ఇంటికి రమ్మను,మీ నాన్న కి ఏదో నచ్చచెబుతా"  
నాలో సంతోషం మొలకలెత్తింది.కృష్ణ చెప్పింది రైట్ అయింది.మా అమ్మ ఎట్టకేలకు అర్ధం చేసుకున్నది నన్ను.

"థాంక్ యూ అమ్మా...!"అని ఆమె ని కౌగలించుకున్నాను.నా నుదుటన ఆమె ముద్దు పెట్టింది.

"ఆల్ ద బెస్ట్ తల్లీ" అంది అమ్మ.

ధైర్యం  కూడదీసుకుని వరుణ్ కి ఫోన్ చేశాను.అమ్మ ని ఒప్పించగలిగాను.వరుణ్ ని కూడా ఒప్పించుతాను.నా మనసు ని దాచుకోవలసిన అవసరం ఇక నాకు లేదు.

" హాయ్..పెళ్ళికొడుకు తో సమావేశం ఎందాకా వచ్చింది?" వరుణ్ ప్రశ్నించాడు అవతల నుంచి.

"నేను తిరస్కరించాను..." చెప్పాను.ఆ మాట అతనికి వేరే వాళ్ళ మీద ఇంటెరెస్ట్ లేనితనాన్ని తెలియబరుస్తుందని ఆశించాను.

"కూల్" మామూలు గా అన్నాడతను.

" అన్నట్టు నువు యామిని ని కలిశావా?" ప్రశ్నించాను.

" మీట్ అయ్యాను"

"ఏమిటి విషయాలు"

"చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి"

" అంటే మళ్ళీ ప్రేమ లో ఉన్నారా?"

"అదేం లేదు.మళ్ళీ చేరువ అవుతాము మేము,నాకు నమ్మకముంది.ఒకసారి పోగొట్టుకున్నా..మళ్ళీ అలా జరగగూడదు"

"అంటే ఇప్పటికీ ఆమె ని నువు ప్రేమిస్తున్నావా?"

"ఏమి ప్రశ్న ప్రియ..!అది మొత్తం నీకు తెలుసుగదా..!ఏదో ఒకరోజు ఆమె నాకోసం మళ్ళీ వెనక్కి వస్తుంది అని చెప్పానా ..లేదా"

"అప్పుడు చెప్పావు లే..!ఈ మధ్యన ఆమె తో మాట్లాడలేదు గా...!అలా ఏం నాతో చెప్పలేదుగా"

"అంటే దాని అర్ధం ఆమె ని ప్రేమించడం లేదని కాదు.."

"ఆమె తో నీకు ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉందా?"

"అవన్నీ రహస్యాలు "

"తెలుసుకోకూడదా నేను"

" లేదు..ప్రియ..లేదు"  (సశేషం)   

Sunday, 20 May 2018

నేనే శివ ని (నవల),Post no:57

నేనే శివ ని (నవల),Post no:57

"ఎందుకు..?మా పేరేంట్స్ డిస్టర్బ్ చేస్తున్నారా?" ప్రశ్నించాను నేను.

"అదేం లేదు.నేను మా నాన్న గురించి చెపుతున్నా.అడిగినవీ అడగనవీ అన్నీ నాన్ స్టాప్ గా మాటాడుతున్నాడు చూశారా..?ఆయన వైఖరి మీ అందరకీ బోర్ కొట్టే ఉంటుంది,దానికి నేను సారీ చెపుతున్నా" చెప్పాడు కృష్ణ.నిజానికి ఆ గోల ఏమీ నేను  వినడం లేదు.నా బాధ లో నేను మునిగిఉన్నాను.

"కొంతమందికి వారి విజయాలు చెప్పుకోవడం అలవాటు.దానిదేముంది" ఏదో పైకి అన్నాను అలా..!

"ఎంత అర్ధం చేసుకునే మనసు మీది ...అయితే మా నాన్న వాగుడుకాయ తనాన్ని పెద్దగా తప్పు అనుకోవట్లేదన్నమాట"

"ఆ ..దానిదేముంది లెండి"

" నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా గంటలు గంటలు అలా తినేస్తూనే ఉంటాడు. అవతలవాళ్ళేమో మొహమాటానికి పోయి ఈయన తో బలి అవుతుంటారు.."

"వృద్ధాప్యం లోకి వచ్చినపుడు ఒంటరితనం ఫీల్ అవుతుంటారు.అది అర్ధం చేసుకోదగినదే.."

"వావ్ ప్రియ...నీ జవాబు చాలా బాగుంది.మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళే మంచి మాటలు మాటాడుతారు.నీ మనసు చాలా మంచిది"

"థాంక్స్"

" నువు ఇలా ఉంటావు అనుకుంటే నేను ఒక్కడినే వచ్చేవాడిని.అయితే అది సాంప్రదాయం కాదని వెనకాడాను"

"నో ప్రోబ్లం"

"ఇప్పటికి ఎన్ని సంబంధాలు వచ్చాయి మీకు"

"ఇదే మొదటిది"

"నిజంగా"

"మరి ..మీకు ఇది ఎన్నవ పెళ్ళిచూపులు"

" ఇంతదాకా ఇద్దర్ని చూశాను.ఒకమ్మాయి మరీ అమాయకం టైప్ ఇంకోమ్మాయి లక్ష్యం అంటూ లేని మనిషి"

"నాలోనూ ఆ రెండు లక్షణాలు ఉన్నాయి"

"మీరు చెపితే నేను నమ్మను.అది నేనుగా అనుకోవాలి.చాలా పరిణితి ,విజయం పట్ల ఆకాంక్ష ఈ రెండూ మీలో ఉన్నాయి,రాత్రి కూడా పనిచేస్తున్నారు ..అంటే అదే గదా "

"అంత కష్ట జీవి ని కాదులెండి"

"అలా ఎందుకు అనుకుంటున్నారు.మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా లేదా నేను చెప్పేదాన్ని ఖండిస్తున్నారా?.."

"నేనే నిజమే చెపుతున్నా"

"మీకు నేను అంటే ఇష్టమేనా"

"మనం అయిదు నిమిషాలే గదా మాటాడింది.ఎలా చెప్పగలను దీని మీద ఆధారపడి"

"పోనీ అలా బయటకి వెడదామా"

"అలాని కాదు"

"దాన్నిబట్టి ఒకటే అయుండాలి.ఎవరినో ప్రేమించి ఉండాలి..అవునా?"

"ఆ..లేదు..లేదు" తల వాల్చి చెప్పాను.

"నాతో అబద్ధం చెప్పవద్దు ప్రియ.నీ ముఖ కవళికళే చెపుతున్నాయి,వినిపించు నీ ప్రేమ కధ.." అతను అడిగాడు.

"ఇది మా పేరేంట్స్ కి చెప్పరుగా .."

"ప్రామిస్"

"థాంక్స్.నేను ఒక వ్యక్తిని ప్రేమించాను తన పేరు వరుణ్.."

"మరి అతను మిమ్మల్ని ప్రేమించాడా?"  
"లేదు.అది ఓ పెద్ద కధ.వినడానికి ఏమైనా అభ్యంతరమా..ఉన్నది  మొత్తం చెపుతాను"

"అలాగే...దానిదేముంది"

"నన్ను కలవకముందు వరుణ్ యామిని అనే అమ్మాయి ని ప్రేమించాడు.ఆమె ఇతడిని కాదని వేరొకరిని ప్రేమించి వెళ్ళిపోయింది.ఆ తర్వాత నేను కలిశాను.తనతో మొదటి మాటలనుంచే ఆకర్షణకి లోనయ్యాను.నిజం చెప్పాలంటే తనని చూడకముందు నుంచే ఆకర్షణ ఏర్పడింది"

" అదెలా సాధ్యం"

"ఇండియా లోని ఓ  పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో అతను చదువుతున్నాడు అని వాళ్ళ అమ్మ ద్వారా తెలిసింది.ఆ విధంగా ఒక పుల్ ఏర్పడింది.నా ఫ్రెండ్స్ అంతా తెలివి తేటల్లో అంతంత మాత్రమే"

"ఒకరి ద్వారా తెలుసుకున్నావు అతడిని.."

"వాళ్ళ అమ్మ తరచూ గుళ్ళో కలుస్తూ ఉంటుంది"

"ఆ తర్వాత..."

"వరుణ్ , నేను చేరువ అయ్యాము.ప్రేమ బలపడింది.అతనికి నా ప్రేమ గురించి చెప్పే లోపు ఒక ఊహించని పరిణామం జరిగింది"

"ఏమిటది"

" యామిని మళ్ళీ ఇతని కోసం వెనక్కి వచ్చేసింది.కారణం తెలియదు.వరుణ్ ప్రస్తుతం ఆమె వద్ద కి వెళ్ళాడు"

"అదేం ప్రేమ...! వరుణ్ ని విడిచి పెట్టేసి..మళ్ళీ వెనక్కి రావడం ఏమిటి..?అందరూ ఆమె ఆడించినట్లు ఆడాలా?"

"నా గుండె బద్దలయినట్లుగా అయింది.ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది"

"ఏమిటి"

" మా పేరేంట్స్ కి ఇదంతా చెప్పే ధైర్యం లేదు.వాళ్ళేమో ఇలా సంబంధాలు తెస్తున్నారు.మీరు జెంటిల్ మేన్ లా ఉన్నారు.అందరూ అలా ఉండరు గదా"

"నిజమే"

"ఏదో రోజున ఎవరినో కట్టుకోక తప్పదు.వరుణ్ ని నా పొరబాటు ఏమీ లేకపోయినా పెళ్ళి చేసుకోలేకపోయేనే అని విచారిస్తూ..కాలం గడపవలసిందే గా"

"ఇప్పుడు మీకు ఓ ఆలోచన చెప్పనా?"

"దయచేసి చెప్పండి"
"రెండు మార్గాల్లో వెళ్ళవచ్చు.ఒకటి వరుణ్ గురించి మీ పేరేంట్స్ కి ధైర్యంగా చెప్పాలి.నాకు తెలుసు..మీరు భయపడుతున్నారని..కాని దాన్ని అధిగమించాలి.మీ బాధ ని తప్పకుండా వాళ్ళు అర్ధం చేసుకుంటారు.మీకు సపోర్ట్ గా ఉంటారు.."

"వాళ్ళు నన్ను తిట్టరూ.."

"ప్రియ..నువు ఇపుడు మేజర్ వి.ఇంకా జాబ్ కూడా ఉంది.నీకు నచ్చిన వ్యక్తిని నువు పెళ్ళి చేసుకోవచ్చు.ఓర్పు గా వారిని ఒప్పించు.చూడటానికి వాళ్ళు మంచి వాళ్ళు గా నే ఉన్నారు.నిన్ను అర్ధం చేసుకుంటారు..వేరేలా ఎందుకు భావిస్తున్నావు?"

"అయితే ఈ రోజు రాత్రి కే వాళ్ళ తో మాటాడుతా"

"అది అలా ఉండాలి.రెండో దారి ఏమిటంటే..వరుణ్ కి కాల్ చెయ్యి.తనని మీ పేరేంట్స్ తో మాటాడమను.ఒక ఫ్రెండ్ గానే కాదు జీవిత భాగస్వామి గా తనని ఎంచుకున్నట్లు చెప్పు.నిజంగా నీ ప్రేమ నిజమే అయితే అతని లో నీ పట్ల సానుకూలతే ఏర్పడుతుంది.కొన్నిసార్లు వింతలు జరుగుతాయి ప్రేమ లో"

"హ్మ్మ్"

" కొంత ధైర్యమూ కావాలి..ఈ దారుల్లో వెళ్ళాలంటే..!నీ లక్ష్యాన్ని వెంటాడడం లో తప్పు లేదు.అది నువ్వు ఇపుడు చేయాలి"

"ఇపుడు హాయి గా ఉంది.నువు ఇలా నా మంచి కోరుతావని అసలు ఊహించలేదు.థాంక్స్ ఎ లాట్"

"సరే..సక్సెస్ అయిన తర్వాత నాకు ఆ మంచి వార్త చెప్పు..నీ పెళ్ళికి కూడా నన్ను పిలువు"

"తప్పకుండా" నవ్వుతూ చెప్పాను.

"చాలా బావుంది " నాకు షేక్ హేండ్ ఇస్తూ చెప్పాడు కృష్ణ.

"మీ పెళ్ళికూతురి వేట ఫలించాలి అని కోరుకుంటున్నా" చెప్పాను.
"తప్పకుండా నీ లాంటి ఒక పెళ్ళికుమార్తె నాకు దొరుకుతుంది..కూల్" చెప్పాడతను.

"ఆ నమ్మకం ఉంది నాకు"

"సరే..ఇక మేము బయలుదేరుతాము మరి" అతను బయటకి వెళ్ళగా నేను రూం లోనే ఉండిపోయాను.

కృష్ణ నిజంగా ఒక మంచి మనిషి.అతను చెప్పిన సలహా నాకు బాగా నచ్చింది.ఒక రకంగా ఓ మోటివేషన్ సెమినార్ లా సాగిపోయింది మా సంభాషణ.నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది మా పేరేంట్స్ తో నా ప్రేమ గురించి చెప్పడానికి..!నా ప్రేమ శక్తి వరుణ్ ని నాకు దగ్గర చేస్తుంది.నేను ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమయింది.నా తల్లిదండ్రుల తోను,వరుణ్ తోను మాటాడవలసిన సమయం ఇది. (సశేషం)

Saturday, 19 May 2018

నా పేరు శివ (నవల),Post no:56

నా పేరు శివ (నవల),Post no:56

పార్ట్-5, "ప్రియ" చెబుతున్నది

చాప్టర్-17

నేను వరుణ్ ని ప్రేమించాను.గతం లో అశ్విన్ ని,సుబ్రమణిని ప్రేమించినట్లుగా గాక చాలా లోతుగా ప్రేమించాను.వరుణ్ తో మాటాడుతుంటే ఎంతో సౌకర్యంగా ఉండేది.అది వేరే ఎవరి వద్దా దొరకనిది.మేము ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేది.అతడిని కలవకముందే నేను తన పట్ల ఆకర్షింపబడ్డాను.వరుణ్ వాళ్ళ అమ్మ గుడిలో కలిసినపుడు తన కొడుకు MIIT చదువుతున్నాడని చెప్పినపుడు నాకు ఒక ఆకర్షణ జనించింది.అతడిని కలిసే రోజు కోసం చూశాను.మొదటిసారి అతడిని కలిసే అవకాశం రావడం అది ఇంకా ధృఢ బంధం గా మారింది.

అతని మొహం లోని అమాయకత్వం...నాలో సింపతీ ని రేపింది.అనారోగ్యం వల్ల కలిగిన ఒక నెమ్మది తనమూ ..తనని బాగు చేసే ఒక అవకాశం కలగడమూ దేవుడు ఇచ్చిన వరం లా అనిపించింది.అతడిని ఆనందకరం గా ఉంచడానికి నేను చేసిన యత్నము బలమైన ప్రేమ గా మారింది నాలో..!వరుణ్ చనిపోవడానికి ప్రయత్నం చేసిన ఆ తరుణం లో నాకు ఆ పీడకల రావడం ఏమిటి..అది దేవుడు తనకి కల్పించిన కల యే.లేకపోతే ఆ రోజున వరుణ్ చనిపోయి ఉంటే నాకు ఎప్పటికీ విచారమే మిగిలేది.

కాలం గడుస్తున్నకొద్దీ మేము దగ్గర అవసాగాము.అది నిజమైన ప్రేమ గా పరిణమించింది.నా ఫీలింగ్స్ ని అర్ధం చేసుకొని ప్రతి స్పందిస్తాడని ఆశించసాగాను.ఇదిగో ఈ చివరి క్షణం దాకా..!నా పాత కధల వలె ఈసారి విఫలమవడం నాకు ఇష్టం లేదు.ఆలశ్యం కాకముందే నా ప్రేమని వ్యక్తపరచాలి.అయితే దానిలో విషాదమే మిగిలింది.

వరుణ్ గురించి నా తల్లితండ్రులకి ఎప్పుడూ నేను చెప్పలేదు.అంత ధైర్యం నాకు లేకపోయింది.వాళ్ళు సంప్రదాయ తరహా లో ఆలోచించే మనుషులు.ప్రేమ గీమ అనేది అంగీకరించరు.అబ్బాయిని వాళ్ళే వెతికి పెడితే నేను తాళి కట్టించుకోవాలి.చిన్ననాటి నుంచి వారి పెంపకం చెప్పేదదే.వాళ్ళ ఉద్దేశ్యం లో తాను ఇంకా చినపిల్ల నే.నూటికి తొంభైమంది పేరేంట్స్ లాగే వాళ్ళూనూ.
నాకు ఈ రోజు ఓ షాక్ లా అనిపించింది.ఎందుకంటే నా తల్లిదండ్రులు చూసిన సంబంధం వాళ్ళు నన్ను చూడటానికి వస్తున్నారు.పెళ్ళికొడుకు,అతని తల్లి దండులు ఈ రోజు ఏ నిమిషాన్నైనా రావచ్చును.మా అమ్మ తో వరుణ్ గురించి చెప్పే ధైర్యం నాకు లేదు.నా తల్లిదండ్రులతో ఉన్నదాన్ని చెప్పలేకపోయాను.దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే ..!అనుభవిస్తున్నాను.

ఇది చాలాదన్నట్లు ఇదే సమయం లో యామిని ని కలవడానికి వరుణ్ వెళ్ళడమేమిటి..!?నాతో కనీసం సరిగా జవాబు చెప్పే మూడ్ లో కూడా లేడు.పెళ్ళికొడుకు వస్తున్నా ,ఆ సంగతి ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.వరసగా మూడు సార్లు ఇలా జరగడమేమిటి నాకు..?నా ప్రేమ సక్సెస్ రేటు జీరో శాతమే...విచారించదగ్గ విషయమే..!

నా ప్రేమ ని వరుణ్ పట్టించుకోకపోవడం ఏమిటి..?యామిని వెంట బడటమేమిటి..?నా జీవితం ఇలా కావడం ఏమిటి..?

ఆలోచిస్తూ ఉండగానే డోర్ బెల్ మోగింది.నా చికాకు ని పెళ్ళివాళ్ళ మీద చూపించకుండా మర్యాద గానే సంబంధాన్ని తిరస్కరించాలనే ఆలోచనకొచ్చాను.వరుణ్ నా కోసం వెనక్కి రావడానికి దారి తర్వాత యోచించాలి.ఏమో..అది ప్రేమ నా..లేక ఆబ్సెషనా ..?అతడిని వదిలే పనే లేదు.పరిస్థితులు ఎలా ఉన్నా నా వంతు ప్రయత్నం చేయకుండా వదిలేది లేదు.

"రండి..రండి.."అంటూ మా అమ్మ పెళ్ళి కొడుకు వాళ్ళని ఆహ్వానించింది.వాళ్ళు లోనికి వచ్చి కూర్చున్నారు.మా నాన్న కూడా వాళ్ళ తో హాల్ లో కూర్చున్నాడు.

""ఎలా ఉన్నారు" పెళ్ళి కొడుకు వాళ్ళ తండ్రి మా కుటుంబాన్ని పరామర్శ చేశాడు.మేము అంతా కూర్చున్నాము.

" మేము అంతా బాగున్నాం సార్..మా ఇల్లు సులభంగా నే దొరికిందిగా " మా నాన్న వాళ్ళని అడిగాడు.

"మరీ అంత ఈజీ గా కాదు గానీ..ఎలాగో దొరకబుచ్చుకున్నాము" పెళ్ళి కొడుకు తండ్రి నవ్వుతూ చెప్పాడు.

పెళ్ళికొడుకు ని చూస్తే అమాయకుని లా గుళ్ళో పూజారి గా ఉండవలసిన వ్యక్తి లా అనిపించాడు.మనిషి పరవాలేదు.తల వెంట్రుకల్ని పక్కకని దువ్వుకున్నాడు.కళ్ళద్దాల పవర్ బాగా నే ఉన్నట్లుంది.బాగా చదివే మనిషి లా తోచాడు.

"సంతోషం..ఈమె మా అమ్మాయి ప్రియ" అంటూ మా నాన్న అతనికి పరిచయం చేశాడు.

"హలో.." నేనే అన్నాను ఆ ముగ్గురి తో..!వాళ్ళు తేరిపార నా వైపు చూశారు.
"నా పేరు కృష్ణ.ప్లెజర్ టు మీట్  యూ..!" పెళ్ళికొడుకు నవ్వుతూ చెప్పాడు.

"నా పేరు ప్రియ" నవ్వుతూ చెప్పాను.

"కాఫీ గాని టీ గాని తీసుకొస్తాను మరి" మా అమ్మ అన్నది.

"నేను ఏదీ తాగనమ్మా..!మా అబ్బాయి,నా భార్య మాత్రం టీ తాగుతారు ..వాళ్ళకి రెండు కప్ లు మాత్రం తెస్తే చాలు" పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు.

"సరేనండి" అని మా అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది.

"ప్రియ కి ఎంతమంది తోబుట్టువులు?" పెళ్ళికొడుకు తండ్రి అడిగాడు.

"ప్రియ కి ఒక అక్క.ఆ అమ్మాయి పెళ్ళయి సింగపూర్ లో ఉంటున్నది.ప్రియ పెళ్ళి లో ఆమె ని చూడవచ్చు.."మా నాన్న చెప్పాడు .పాపం ఆయనకి మాత్రం ఏం తెలుసు..నా పెళ్ళి అయితే వరుణ్ తో నేనని..!

"నాకు ఇంకో అబ్బాయి ఉన్నాడు.వాడు చిన్నవాడు..లా చేస్తున్నాడు ప్రస్తుతం" పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు.

"అంటే కృష్ణ చార్టెడ్ అకౌంటెంట్ ..అంతే గదా" మా నాన్న అన్నాడు.

"అవును అంకుల్ ..నా పని లో నేను ఎంతో ఆనందిస్తాను" కృష్ణ సమాధానమిచ్చాడు.

"మీలా వృత్తిని ప్రేమించేవారంటే నాకు చాలా ఇష్టం" మా నాన్న కితాబిచ్చాడు.

"మీ జాబ్ అంటే మీకు ఇష్టమేనా "పెళ్ళికొడుకు అడిగాడు నన్ను.

"ఫర్వాలేదు.సమస్యలు ఏమీ లేవు" చెప్పాను.

"నైట్ షిఫ్ట్ లు ఉంటాయా" ఆ తండ్రి అడిగాడు.

"ఉంటాయి అంకుల్" అన్నాను.

"రెండు షిఫ్ట్ ల లో నీకు ఏది ఇష్టం" పెళ్ళికొడుకు ప్రశ్నించాడు.

" ఎనిమిది గంటలు నిద్ర ఉంటే చాలు.ఏ షిఫ్ట్ అయినా ఒకటే" నా సమాధానం అది.

"అలాని కాదు.రెండిటిలో ఏ షిఫ్ట్ ని ప్రిఫర్ చేస్తారు" తను అడిగాడు.

"పగలు షిఫ్ట్ నే ప్రిఫర్ చేస్తా" చెప్పాను.
మా అమ్మ టీ లు తెచ్చి ఇచ్చింది.నేను తప్ప మిగతా అంతా మాటల్లో మునిగిఉన్నారు.వరుణ్ గూర్చి ఆలోచిస్తూ నే టీ ని తాగాను.అక్కడ యామిని తో వరుణ్..ఇక్కడ యేమో ఈ బోరింగ్ మనిషి ఇంకా కుటుంబం తో నేను..!

నా లోపల అసూయ బుసలు కొట్టింది.యామిని కంటే నేనే వరుణ్ కి తగినదాన్ని.నా నుంచి  తన్నుకు పోయిది ..ఎంత ఇది ఆ యామిని కి..?ఆలోచిస్తున్నకొద్దీ నిరాశ కమ్ముకొస్తున్నది.వరుణ్ తో మాట్లాడాలని అనిపించింది.అతని ఫీలింగ్స్ ఏమిటో తెలుసుకోవడానికి..!

"మీరు పెద్ద గా మాట్లాడరా ..ఏమిటి?" పెళ్ళి కొడుకు ప్రశ్నించాడు.

"అదేమీ లేదు" ఏదో కవర్ చేశాను.

"మీరు వర్రీ గాకండి..మా అమ్మాయి మాట్లాడటం మొదలుపెడితే ఆపడం కష్టం..కొద్ది గా సిగ్గు అనేది ఉంటుంది గా ..అదీ విషయం" మా నాన్న చెప్పుకుపోతున్నాడు.

" అంకుల్..మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి తో ఓ పది నిమిషాలు మాటాడవచ్చా ..?" పెళ్ళికొడుకు అడిగాడు.

"అబ్బే నాకేం అబ్జక్షన్ లేదు..ప్రియ నీకూ" మా నాన్న అడిగాడు నన్ను.

" లేదు నాన్న" అన్నాను.ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఒక మంచి చాన్స్ లే అనిపించింది నాకు.

నేను,అతను ఒక రూం లోకి వెళ్ళాము.ఓ మంచం మీద కూర్చున్నాము.

"సరే..ఎలాంటి సంకోచం లేకుండా మాటాడుకుందాము" అన్నాడతను..! (సశేషం)    

Wednesday, 16 May 2018

నా పేరు శివ (నవల),Post no:55

నా పేరు శివ (నవల),Post no:55

"హలో" అన్నాను.

"వరుణ్,ఒక పెద్ద ట్రాజెడి ఓ గంట లో జరగబోతోంది..."అన్నది ప్రియ.

"ఏమిటది"

"మా అమ్మ వాళ్ళు సంబంధం చూస్తున్నారు నాకు అని చెప్పా గదా ,వాళ్ళు రాబోతున్నారు"

"అయితే ఏమిటి దానివల్ల"

" ఏమిటి..నీకు ఎలాటి బాధ లేదా ..?వేరే వ్యక్తి తో మాటాడుతుంటే"

"బాధ దేనికి?"

"నిజంగా ఎలాటి బాధ లేదా?"

"లేదు"

"పెళ్ళి కొడుకు ని చూసే మూడ్ అసలు లేదు నాకు,అందునా ఎవరో కొత్త వ్యక్తిని"

"అలా అంటే నీ భవిష్యత్ ఎలా?"

"ఏడుపు వస్తోంది వరుణ్"

"అసలు విషయం చెప్పు"

"నీకు అర్ధం కాలేదా ?"

"ఇప్పుడు నేను ఏకాగ్రత చూపే మూడ్ లో నేను.నా కోసం ప్రవీణ్ ని విడిచిపెట్టింది యామిని.ఆమె కోసం ఇప్పుడు వెళుతున్నా"

"అంటే..నీ అర్ధం మళ్ళీ యామిని కోసం వెళుతున్నావా?"

" నేను సరిగా ఆలోచించే స్థితి లో లేను.చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి నాకు.ముందు యామిని ని కలిసి ఆ తర్వాత నిన్ను కలుస్తాను"

"ఓకె...ఆల్ ద బెస్ట్"

" థాంక్స్..బాయ్"

" బాయ్"

ప్రవీణ్ ఇచ్చిన అడ్రెస్ చూశాను.ఆమె ఇల్లు వడపళని లో ఉంది.నేను ఇప్పుడున్నది మైలా పూర్ లో..!ఆటో పిలిచి ఎక్కాను.ఇప్పుడు మా ముగ్గురి గురించి ఆలోచిస్తూ సమాచారాన్ని విశ్లేషించుకుంటున్నాను.తెగిపోయిన లింక్ ల్ని కలుపుకుంటున్నాను.నా షిజోఫ్రెనియ అవస్థ లో నేను ప్రవర్తించిన విధానానికి యామిని నన్ను విడిచివెళ్ళింది.కాబట్టి ఆమెనీ తప్పనడానికి లేదు.నన్నూ అనుకోవడానికి లేదు,ఏం చేస్తున్నానో ఆ రోజుల్లో నాకూ తెలీదు కాబట్టి..!
యామిని విడిచిపెట్టి వెళ్ళినందుకు ప్రవీణ్ బాధ పడుతున్నాడు.అతని తో మాట్లాడినతరువాత నా కనిపించింది ఏమిటంటే ముందర నేను అనుకున్నంత చెడ్డవాడు కాదు తను..!నిజం చెప్పాలంటే యామిని అతడిని విడిచి పెట్టి వెళ్ళడం కూడా సబబు కాదు.నా మానసిక స్థితి కారణం గా ప్రవీణ్ కి ఆమె చేరువ అయి ఉండవచ్చును.అయితే నా మీద ఉన్న కొన్ని ఫీలింగ్స్ వల్ల అతనితోనూ ఉండలేకపోయింది.

ఇపుడు యామిని ని కలిసి ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసుకోవాలి.ఆటో దిగాను.ఆమె ఉండే అపార్ట్మెంట్ రోడ్ కి దగ్గర గానే ఉంది.వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను.చాలా రెస్ట్ లెస్ గా ఉంది నా లోపల..!

"వరుణ్..! వాటె ప్లెజంట్ సర్ప్రైజ్ " తలుపు తెరిచి నేను కనబడటం తో అన్నది యామిని.

"నేను లోపలకి రావచ్చా" అడిగాను.ఆమె మొహం లో సంతోషం.

"తప్పకుండా .."

లోనికి వచ్చి సోఫా లో కూర్చున్నాను.

"నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు" పక్కనే కూర్చుంటూ అన్నదామె.

"నీ అద్రెస్ ప్రవీణ్ ఇచ్చాడు" చెప్పాను.

"ప్రవీణ్ ని నువు కలిశావా?"

"అవును.ప్రవీణ్ తో నీకు బ్రేక్ అప్ అయిన తవాత నాకు ఎందుకు కాల్ చేయలేదు?"


"కొన్నాళ్ళు ఇలా సింగిల్ గా ఉండడం మంచిది అనిపించింది"
"ఎలా అనిపిస్తోంది"

"బాగుంది.నీతో ఉండటానికే నేను ఇష్టపడతాను.అప్పటికి రెండు మూడు సార్లు ఫోన్ చేశాను"

"అది సరే..మరి ప్రవీణ్ ని ఎందుకు వదిలివేశావు?"

"చెప్పాలంటే అది కాంప్లికేటేడ్ విషయం"

"నాకు వివరించు"

"నిన్ను పూర్తి గా నాలోనుంచి తొలగించుకోలేకపోయాను.ప్రవీణ్ తో బాగానే ఉన్నా,మా రిలేషన్ షిప్ లో ఏదో లోపించింది.చాలా మొనాటనస్ గా డల్ గా అనిపించసాగింది.అందునా నాలాంటి మార్పు తో జీవించాలనుకునే వ్యక్తి కి..!అది అతని నుంచి పొందలేకపోయాను.ఎందుకో ఒక నెర్వస్ గా అనిపించింది.అది ఇందుకే అని చెప్పలేను"

"కంగారు పడకు..ఆ నెర్వస్ నెస్ త్వరలో పోతుంది"

"ఆలోచిస్తే..అనిపించేది ఏమంటే నీకు నాకు మధ్య అయిన గొడవలు వంటివి అతనితో లేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు.కొన్ని సార్లు అలాటివి బంధం ధృఢపడటానికి సహకరిస్తాయి.మీ ఫ్రెండ్ రాం చెప్పినది కూడా కరెక్టే అనిపిస్తోంది.."

"రాం కి థాంక్స్ చెప్పాల్సిందే"

"నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా..చెప్పు..!ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా?"

"ఆవును.."

"ఇప్పటికీ నా..?" (సశేషం)   

నా పేరు శివ (నవల),Post no:54

నా పేరు శివ (నవల),Post no:54

మార్చ్ 1,2015

"హాయ్..వరుణ్! లోపలకి రా" ప్రవీణ్ తలుపు తీసి ఆహ్వానించాడు.

"తప్పకుండా" అని లోపలకి వెళ్ళాను.

నా బ్యాగ్ లో పదునైన కత్తి ని పెట్టుకొని వచ్చాను.గుణ చెప్పినట్లుగా ప్రవీణ్ ఎంత బతిమాలినా వినకుండా పొడిచి వేయడమే..!ఈ పని చేయబోయే ముందు కొద్దిసేపు వీడితో మాటాడదాము ,పోయిందేముంది..!అసలు ఫోన్ ఎందుకు చేశాడు నాకు..అది కూడా తెలుసుకున్నట్లు ఉంటుందిగా..!

"ఆ..వరుణ్..కొద్ది గా మందు తీసుకుంటావా?" ప్రవీణ్ అడిగాడు నేను సోఫా లో కూర్చున్న తర్వాత.

"నో ..థాంక్స్..ఇపుడు నేను తాగడం లేదు." చెప్పాను.

"సరే..నేను తీసుకుంటా..నీకు అబ్జక్షన్ లేదుగా"

" నో ప్రోబ్లం..కానీ డ్యూడ్"

" ఇదివరకు నీ ఫేవరేట్ డ్రింక్ ఏమిటి..?" తను మందు పోసుకొని ఐస్ వేసుకుంటూ అడిగాడు ప్రవీణ్.

"బీర్" చెప్పాను.ఇంతకీ అసలు విషయానికి వస్తాడా వీడు అనిపించింది.

"ఓ.కె.కాలేజ్ రోజుల్లో చీప్ విస్కీ తాగేవాణ్ణి.మా యింటి దగ్గర్నుంచి ఎక్కువ డబ్బులు పంపించకపోవడం మూలాన..!" అతను సిప్ చేస్తూ చెప్పాడు.

" నిజమా"

"ఇప్పుడు నేను స్కాచ్ తాగుతున్నా.ఎందుకంటే బాగా సంపాదిస్తున్నా కాబట్టి"

"మంచిది"

" నువు ఎప్పుడైనా స్కాచ్ తాగావా?"

"లేదు"

"ట్రై చెయ్..విస్కీ కంటే స్కాచ్ సూపర్ గా ఉంటుంది,కనీసం విస్కీ అయినా రుచి చూశావా "

" ఆ చూశా"

"అంటే రెండిట్లో ఏది నీకు ఇష్టం..బీర్ లేదా విస్కీ?"

"బీర్"

" ఏంటి పొడి పొడి గా చెబుతున్నావు..బోర్ కొడుతున్నానా?"

"ఏదో మాట్లాడాలి..రమ్మన్నావు గా ..!ఆ విషయం ఏమిటి..అక్కడికి రా"

"ఇప్పుడిప్పుడే కిక్ ఎక్కుతోంది..సరే ..! నీకు తెలుసుకోవాలని ఉందిగా "

" ఔను డ్యూడ్"
"దానికంటే ముందు,నీ గురించి ఒకటి చెబుతా ఏమీ అనుకోనంటే.."

"సరే చెప్పు"

"ప్రతి ఒక్కరు తమ గురించి చెప్పేదాన్ని ఇష్టపడతారు.నీ గురించి చెబుతున్నందుకు నన్ను నువు అభినందించాలి" ప్రవీణ్ నవ్వుతూ చెప్పాడు.నేనూ మర్యాదకి ఇకిలించాను.

"నువు గిటార్ వాయించడం లో గొప్పోడివి కావచ్చు,చదువు లో గొప్పోడివి కావచ్చు,హృదయపరంగా గొప్పోడివి కావచ్చు..కాని ఒక దాంట్లో మాత్రం నువు జీరో అని చెప్పొచ్చు"

"అర్ధం కాలేదు"

"రిలేషన్షిప్ ని నిలబెట్టుకోవడం లో నువు వేస్ట్ గాడివని చెప్పొచ్చు.నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా హేపీగా ఉండాలో,ఉంచాలో నీకు తెలీదు,నిజమేగా "అడిగాడు ప్రవీణ్.తల ఊపాను.చాలా ఎక్కువ చేశాడు వీడు ఇప్పటికే..ఇంకా ఎంతసేపులే..!

మళ్ళీ ప్రవీణే అన్నాడు "నువు యామిని ని చెత్త లా చూశావు.ఆమెని బాగా బాధించావు.నీ రెండో గోవా ట్రిప్ లో నువు ఏం చేశావో తెలుసా"

"నాకు తెలీదు" అన్నాను.అయినా ప్రతి ఒక్కరు ఆ రెండో ట్రిప్ గురించే చెబుతున్నారు.ఏమి చేశానో అప్పుడు..?

"నువు ఆమె ని చంపడానికి ప్రయత్నించావు" గొంతు పెంచి చెప్పాడు ప్రవీణ్.

"ఏమి వాగుతున్నావు నువు..?" నేను షాక్ తిన్నాను.వీడు ఏదో ట్రిక్ చేస్తున్నాడు అనిపించింది.
"నీతో ఎప్పుడూ ఆ కత్తి ఉండేది.ఆ సూర్య ని చంపడానికి ఉపయోగించావే అది.ఏ తప్పు లేకుండా యామిని ని చంపడానికి ప్రయత్నించావు ఆ రోజు.ఆమె నాకు అంతా చెప్పింది డ్యూడ్.అయితే ఇది పోలీస్ లకి చెప్పకూడదని నాతో ప్రామిస్ చేయించింది.ఈ రోజు దాకా నేను ఎవరకీ ఇది చెప్పలేదు.అందుకు నువ్వు నాకు థాంక్స్ చెప్పుకోవాలి" ప్రవీణ్ వివరించాడు.

"థాంక్ యూ" అన్నాను.నాలో దేవినట్లుగా అయింది.

యామిని నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అనేది నాకిప్పుడు తెలిసింది.ఆమె ఆ రెండో గోవా ట్రిప్ లో నాతో మంచిగా ఉండాలని బంధం బలపడాలని ప్రయత్నించే ఉంటుంది గాని నేను పొడవడానికి ఒడి గట్టానంటే అప్పుడు నా స్థితి ఎంత దారుణంగా ఉన్నదో మానసికంగా..!యామిని ని పొందే అర్హత నాకు లేదు.అసలు ఈ ప్రపంచం లో ఇలా తిరిగే అర్హత కూడా నాకు లేదు.నేను పిచ్చి ఆసుపత్రి లో ఉండదగిన వాడిని.

"ఆమె అలా ఎనిమిది నెలలు బాధ పడింది.నేను ప్రేమించిన ఆ అమ్మాయి అలా ఉండటం నాకు ఎంతో బాధ కలిగించింది.." అన్నాడు ప్రవీణ్.

"నువు ప్రేమించడం ఏమిటి..?" ప్రశ్నించాను.

" నీ కంటే ముందు నుంచే ఆమె ని నేను ప్రేమిస్తున్నాను.అయితే ఆమె తో చెప్పే ధైర్యం నేను చేయలేకపోయాను.మీ మొదటి గోవా ట్రిప్ గురించి ఆమె నాకు చెప్పినపుడు నాకు నిద్ర పట్టలేదు.నా ప్రియురాల్ని దూరం చేసిన నీ మీద నాకు ఎంతో కోపం వచ్చింది.." ప్రవీణ్ చెప్పిన ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.అతడి నుంచి నేను దొంగిలించానా ఆమె ని అని..!

"నేను.."

"నేనే గనక నీలా సైకో ని అయితే ఈ చేతులతో నిన్ను చంపి ఉండేవాడిని.అంత కోపం వచ్చింది" ప్రవీణ్ ఊగిపోయాడు.

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
"ఏమైతేనేం..చివరకి ,ఆమె కి నా ప్రేమ ని తెలియబరిచాను.ఆ అద్భుతమైన రోజు నాకు గుర్తుంది.అక్టోబర్ పద్నాలుగు,రెండువేల పదమూడు.ఆ రోజున నా మీద కాంతి పుంజం విరిసింది"

"ఆ తర్వాత ఏం జరిగింది"

"ఆ తర్వాత కొన్ని రోజులు బాగా గడిచాయి.అవి గుర్తుంచుకోదగిన రోజులు నాకు.అయితే ఈ మధ్య.." చిన్న గొంతు తో చెప్పాడు ప్రవీణ్.

" ఆ..ఏమైంది..చెప్పు" చాలా ఆత్రుత గా అడిగాను.

"ఇప్పటికి నిన్ను ఆమె ప్రేమిస్తోంది.నాతో రిలేషన్ లో ఉండటం ని ఓ పొరబాటు గానే భావిస్తోంది.రెండు రోజుల క్రితమే ఇది నేను తెలుసుకున్నాను.కారణం నాకు తెలీదు.నీ వేపు మొగ్గు ఉన్నది ఆమె లో.నా ఓటమి ని అంగీకరించడానికే నీకు ఫోన్ చేశాను.నీ ప్రేమ నా ప్రేమ కంటే గట్టిది.అది నిరూపించావు."అలా చెప్పి ప్రవీణ్ చిరునవ్వు చిందించాడు.తను లోపల గాయపడిన విషయం నేను తెలుసుకున్నట్లు పసిగట్టాడు.

"ఐ యాం సారీ,డ్యూడ్..!" చెప్పాను. ప్రవీణ్ ని చంపే ఆలోచన ని విరమించుకున్నాను.ఇప్పుడు గుణ ఉన్నా నన్ను కాదనలేడు.తనూ బాధ పడతాడు కూడా.

"నీ హృదయం ఎంత గాయపడిందీ నేను తెలుసుకోగలను..బ్రో" అంటూ తను నా దగ్గరకి వచ్చి హత్తుకున్నాడు.పరిస్థితి ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదు.చివరకి నేను ప్రవీణ్ ని ఓదార్చవలసి వచ్చింది.

"ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు బ్రో" అన్నాను.

"ఇప్పుడు యామిని చెన్నై లో పనిచేస్తోంది.ఇదిగో అడ్రెస్ తీసుకో..!వెళ్ళి కలువు..సర్ప్రైజ్ చెయ్యి...ఆమె నిన్ను ఇంత త్వరగా అసలు ఊహించదు"అంటూ ప్రవీణ్ నా చేతి లో ఓ కాగితం ముక్క పెట్టాడు.

"నువ్వు బాగానే ఉన్నావు గా ..ష్యూర్" అడిగాను తనని.

"ఇక ఆమెని నా జీవితం లో భాగంగా పరిగణించలేను.నేను మర్చిపోతాను.కష్టమే ..కానీ ఎలాగోలా నా దారి లో నేను వెళ్ళిపోతాను " చెప్పాడు ప్రవీణ్.

"ఐ విష్ యూ లక్" చెప్పి వెళ్ళడానికి సిద్ధపడ్డాను.

"ఈసారి అయినా మంచిగా ఉండటానికి ప్రయత్నించు..ఆల్ ద బెస్ట్,ఆనందం తో ఉండండి "

" ఓ కె" అలా చెప్పి వేగంగా బయటకి నడిచాను.

ఇపుడు నాకు ముగ్గురు మీద జాలి కలుగుతోంది.యామిని మీద..అలాంటి భయంకరమైన అనుభూతుల్ని పొందినందుకు..!ప్రవీణ్ మీద..ఆమె ఇతడిని వీడి పోయినందుకు..!చివరిగా నామీద,ఇంత సైకోపాత్ కిల్లర్ గా అయినందుకు..!

ప్రియ నుంచి కాల్ రావడం తో ఆ విషయం మీద ఆలోచిస్తున్నాను..!(సశేషం)   

Tuesday, 15 May 2018

నా పేరు శివ (నవల),Post no:53

నా పేరు శివ (నవల),Post no:53

ఫిబ్రవరి 28,2015

ఈ శనివారం సస్పెన్స్ తో నిండిపోయింది.అజయ్ కి ఉన్న ఇంటర్ వ్యూ వల్ల.అతని రిజల్ట్ ఏమవుతుందో అని నాకు ఆతురత గా ఉంది.ప్రియ వాళ్ళ కంపెనీ లోనే అతని ఇంటర్వ్యూ.ఈ చాన్స్ లో గాని తనకి జాబ్ రాకపోతే కష్టమే..!ప్రతి చోటా రిఫరల్ కావాలి ,అది దొరకడం మళ్ళీ ప్రయాస తో కూడుకున్నది.ఆందోళన గా ఉండి ఓ సిగరెట్ తీసి ముట్టించుకున్నాను.

కాసేపున్నాక అజయ్ నుంచి కాల్ వచ్చింది.వెంటనే తీసి మాటాడాను.

" ఆ..చెప్పు..ఆ శుభ వార్త" నా లోని ఆతురత ని అణచుకోలేకపోయాను.

" మళ్ళీ ఈ సారి తన్నేసింది బ్రో" నీరసంగా అన్నాడు అజయ్.

"అయ్యో..అప్పుడే రిజల్ట్స్ వచ్చాయా"

"అవును.."

"నీకు రాలేదా జాబ్ అయితే"

ఓ అయిదు క్షణాలు నిశ్శబ్దం.

"హలో" నిరాశ గా అన్నాను.మళ్ళీ సారికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ.

అజయ్ ఉన్నట్లుండి నవ్వడం వినిపించింది.

"నీతో జోక్ చేశాను బ్రో...నాకు జాబ్ వచ్చింది " అవతల నుంచి చెప్పాడు అజయ్.

"నువు ఎపుడు ఇలాంటి వేషాలే .." నవ్వుతూ అన్నాను.

" కాసేపు టెన్షన్ క్రియేట్ చేద్దామని ..అంతే..ఆ విషయం లో నేను సక్సెస్ అయ్యానా"

"జాబ్ సంపాయించడం లోను...టెన్షన్ పుట్టించడం లోనూ రెండిటిలో సక్సెస్ అయ్యావు.."

"ఆ ..ఇపుడు ఒకటి నిజంగా చెప్పాలి నీతో...సీరియస్ గా"

"నీ సక్సెస్ కి నాకు చాలా ఆనందం గా ఉంది..చెప్పు.."

"ఏదో బిల్డప్ కోసం చెప్పడం లేదు.నా గుండె లోతులోనుంచి వచ్చింది ఇపుడు చెప్పబోతున్నా"
"నువు ఆల్రెడి బిల్డప్ ఇచ్చేశావు గదా"

"నువు నిజంగా దేవుడివి బ్రో.నేను దేవుడిని ఎంతో మొక్కుకున్నాను జాబ్ ఇప్పించమని.అది నీ ద్వారా నెరవేరింది"

"అదేం లేదులే..బ్రో"

"ఒక సీక్రెట్ చెప్పనా"

"చెప్పు"

"రాం కి చెపితే నన్ను చంపేస్తాడు.కాని ఈ ఆనంద సమయం లో చెప్పకుండా ఉండలేకపోతున్నాను"

"ఏమిటది" నాలో ఆతురత ఎక్కువైంది.

"నీకు అనారోగ్యం గా ఉన్న ఆ టైం లో నిన్ను నువు శివుడిగా భావించుకునేవాడివి.నేను నమ్మినా,మిగతావాళ్ళు దాన్ని నమ్మేవారు కారు.నీ షిజోఫ్రెనియ లక్షణాల్లో అది ఒకటిగా జమకట్టేవారు.నిజం చెప్పాలంటే..నువు శివుడివే..!మేము అంతా నీ అనుచరులం" చెప్పాడు అజయ్.

"ఏమిటి...! నేను ఆ దేవుడు శివుడినా.." నమ్మలేక అడిగాను.

"అవును..ముమ్మాటికీ"

గుణ ఆ రోజు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.నేను నిజంగా శివుడినేనా..?నన్ను సరిగా పరీక్షించారా వైద్యులు ...నేను అనుకునేవి అన్నీ నిజాలేనా..?

"ఓహో..అలాగా" దీర్ఘాలోచన లో పడ్డాను.

"మళ్ళీ థాంక్స్ బ్రో" అజయ్ అన్నాడు.

"వెల్కం బ్రో..తిరుచ్చి రా..!సెలెబ్రేట్ చేసుకుందాం"

"ఓ కె ..అక్కడ కలుద్దాం"

"బాయ్.."
హాస్టల్ దాటి ఆలోచనల్లో పడి ముందుకు నడవసాగాను.నాలో అనేక ఆలోచనలు ఒకనిదానితో ఒకటి ముప్పిరిగొంటున్నాయి.ఇదివరకు కూడా నన్ను నేను శివ లాగానే భావించుకునేవాడిని.ఎందుకు అలా..?అది పోనీ..ముగ్గురు వ్యక్తులు..ఒకరి తో ఒకరికి సంబంధం లేనివారు కూడా నన్ను శివుడి గానే భావించారు.ట్రీట్ మెంట్  అయిన తరువాత కూడా గుణ నాకు కనబడటం లో అర్ధమేమిటి..?!నేను నన్ను దేవుడి గా భావించుకోవడం లేదు గాని ఒక ఉద్వేగం నాలో నెలకొన్నది.ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ సమస్యల్లో పడతాను.అలా అనుకొని తోసిపుచ్చసాగాను నా మనసులో..!

"నేనూ నీతో వస్తే ఏమైనా అభ్యంతరమా" గుణ అకాస్మాత్తుగా మళ్ళీ ప్రత్యక్ష్యమయ్యాడు.ఈ సారి నాకు భయం వేయలేదు.సంతోషమనిపించింది ఒకందుకు.నాలో ఉన్న చాలా వాటికి ఇపుడు సమాధానాలు కావాలి.

"నేను దేవుడినా" అడిగాను నేను.

"దానికి జవాబు నీకు తెలుసు.తర్వాత ప్రశ్న అడుగు" గుణ చెప్పాడు.

"నాకు షిజోఫ్రెనియ లేదా "

" అలాంటి తెలిసిన విషయాలు అడగకు.నీ లోపలకి చూడు...అక్కడ నేను ఉండి మాట్లాడుతున్నాను"

"డాక్టర్లు చెప్పింది తప్పా"

"మళ్ళీ చెపుతున్నా.సిల్లీ ప్రశ్నలు అడగకు.నీకు సమాధానం దొరకని వాటిని అడుగు.."

"నేను ప్రవీణ్ ని ఎందుకు చంపాలి?"

"ఇప్పటికే నీకు ఎంతో చెప్పాను దానిగురించి..ఊహించుకోలేవా ఆ మాత్రం"

"అది న్యాయామా"

"కొద్దిగా తెలివి పెరిగింది ఇప్పటికి.సంతోషం"

"నేను అతడిని చంపననుకో...ఏం చేస్తావు నువ్వు"

"నేను చేసేది ఏముంది..ఇక రోజూ నీ వెంట బడటమే నేను.."

"నిన్ను అసలు పట్టించుకోను నేను"

"బాబూ..మర్చిపోయావా..గతం లో నువు పడినా టార్చర్.చావు కి దగ్గర గా వెళ్ళివచ్చావు.ఆ రోజులు మర్చిపోయావా .." గుణ అడిగాడు.
"అవును..ఆ రోజులు భయంకరమైనవి" ఆ చీకటి రోజులు తల్చుకుంటూ అన్నాను.

"ఆ రోజున నువు ఆత్మహత్య చేసుకోబోతుంటే ప్రియ సమయానికి ఫోన్ చేయబట్టి బతికిపోయావు..ఈ సారి నువు సూసైడ్ చేసుకుంటే ఆ బాధ్యత ఎవరిది మరి.."

"ఏమో నాకు తెలియదు"

" చూడు వరుణ్..యామిని నీ నుంచి విడిపోవడానికి కారణం ఎవరు?"

"నేను అనుకోవడం..ప్రవీణ్ అని "

"ఇంకా నయం బతికిపోయావు,ఒక వేళ నువు గాని చనిపోయివుంటే దానికి పూర్తి కారణం ఎవరు..ప్రవీణ్ యేగా .."

"హ్మ్మ్"

" ఒక విషయం చెప్పనా...నేను నీలో ఎప్పుడు ఏర్పడ్డానో తెలుసా..?నీలో జీవితం మీద నిరాశ...కోపం లాటివి మొదలైనప్పుడు...ప్రవీణ్ మీద లోలోపల ద్వేషం మొదలైనపుడు...!నన్ను సంతృప్తి పరచాలంటే నువు ప్రవీణ్ ని చంపవలసిందే...!
గుణ మాటలు నాకు పాత రోజుల్ని గుర్తు చేశాయి.యామిని తన కి ఫోన్ చేయద్దు అని చెప్పడం...ఆ విషాదం తో నిండిన వీడ్కోలు..!ఆమె ఎందుకని అలా చెప్పింది.ఆ ప్రవీణ్ గాడి వల్లనేగా..!వాడు అలా అని ఆమె తో చెప్పి ఉంటాడు.శవం లాంటి వాడు ఆ వెధవ..శవం కావాల్సిందే..!గుణ చెప్పినది అర్ధం అవుతోంది.ప్రవీణ్ అంటే విపరీతమైన అసహ్యం కలుగుతోంది.న్యాయం జరగాల్సిందే..!నాకు నేనే చేసుకోవాలి అది.

"వాడిని నేను చంపితే పట్టుబడనా" అడిగాను.

"వాడి ఇంటికి పో.వేసేసెయ్.తప్పించుకు వచ్చేసేయ్..!ఎవరకి తెలుస్తుంది..?వాడి ఖర్మకి వాడు పోయాడు అనుకుంటారు..!"

"నేను ప్రవీణ్ ని చంపితే ఇక నాకు కనబడవు గా"

"నేను ఏర్పడిందే వాడిమీద ద్వేషం తో..!వాడికి జరగాల్సింది జరిగాక నేను నీకు కనిపించను.ప్రామిస్ చేస్తున్నా"

"సరే..ప్రవీణ్ ని నేను చంపుతా "

"మంచి నిర్ణయం"

నేను ఫోన్ తీసుకొని ఒక నెంబర్ కి డయల్ చేశాను..! (సశేషం)