Monday 6 July 2015

ఒడియా భాషకి,సంస్కృతికి ఆత్మ వంటి ఆ గీతాల్ని అవహేళన చేసే హక్కు వారికి ఎక్కడిది..!

ఒడియా భాషకి,సంస్కృతికి   ఆత్మ వంటి ఆ గీతాల్ని అవహేళన చేసే హక్కు వారికి ఎక్కడిది ..కోక్ వంటి కార్పోరేట్ శక్తులకి తాన తందాన పాటలు పాడటానికి ఇవే దొరికాయా అంటూ దునుమాడుతున్నాడు సుభాష్ చంద్ర పట్నాయక్ .నేను క్రమం తప్పక వెబ్ సైట్ ల లో అది ఒకటి.ఎవరేమనుకున్నా తన అభిప్రాయాల్ని కుండబద్దలు గొట్టినట్లు చెప్పే ఆయన శైలి ,రీతి ఒక గమ్మత్తుగా ఉంటుంది.చాలా వాటిని మంచి పరిశోధన తో రాస్తారు.ఆంగ్ల భాష లో ఆయనకంటు ఒక దారి ఉంది.సాంస్కృతిక,సాహిత్య,సామాజిక ఇత్యాది విషయాలపై సాహసోపేతంగా రాస్తుంటారు.

అంతదాకా యెందుకు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల్ని సైతం దుమ్ము దులిపి ఆరేస్తుంటారు.ఆ మధ్య చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా భుబనేశ్వర్ వచ్చి మోడి ని పొగడగా అసలు రాజ్యాంగం ఎవరికి ఇవ్వని గౌరవ స్థానాన్ని మీకు ఇచ్చింది రాజకీయుల్ని ప్రసన్నం చేసుకొని రిటైర్మెంట్ తర్వాత కూడ ఏదో పదవుల్ని పొందటానికా..అంటూ తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు.

ఈమధ్యన సోనా మొహాపాత్ర బృందం ఒడియా జానపద ఆత్మ వంటి "రంగ బతి" అనే గీతాన్ని "వందే ఉత్కళ జనని " అనే గీతాన్ని కోక్ అడ్వర్టైజ్ మంట్ కోసం పాడగా దాన్ని ఖండిస్తూ మంచి వ్యాసం రాశారు ఇక్కడ.ఈ లింక్ నొక్కి చూడండి.http://orissamatters.com/2015/07/05/coke-studio-rangabati/తెలుగు లో మనవాళ్ళు దుమ్ము దులుపుతారులే గాని ఇలాంటి ఓ బ్లాగుని ఇంగ్లీష్ లో మన మేధావులెవరూ రాయరే అనిపిస్తుంది.నేను గతం లో కూడా చెప్పాను.నారాయణ,చైతన్య వంటి ఎన్ని కార్పోరేట్ కాలేజీలు ఉన్నా ఎందుకనో పట్టుమని పది వ్యాసాలు రాయాలన్నా ఓ కధ రాయాలన్నా ,గట్టిగా అనువాదం చేయాలన్నా చివరికి అనువాదం చేయాలన్నా ,ఆత్మ కధ రాసుకోవలన్నా ఎందుకో ఇంగ్లీష్  విషయం లో మనవాళ్ళకి ఆత్మ విశ్వాసం తక్కువే.ఏ మిశ్రా నో ,పాండే నో,బెనర్జీ నో ,ఫణిక్కర్ నో వెంట తగిలించుకోవలసిందే.దానికి కారణం ఏమిటి..నాకు తెలిసి జనరల్ ఫిక్షన్ ని హాయిగా చదివే అలవాటు ఓ సంస్కృతిగా లేకపోవడం.ఎంతసేపు ఓ అకడెమిక్ ఏంగిలే తప్ప ఇంకోటి ఉండదు.అందుకే మన వాళ్ళు రాస్తే పరమ కృతకంగా రాస్తారు.లేదా తెలుగు ప్రేమ ముసుగు లో దాక్కుంటారు.

Friday 12 June 2015

అక్కడి లారీ లకి గాని ట్రక్కులకి గాని డ్రైవర్ లు గా ఉండే వారు వాటి యజమానులే

పాలకులకి మిలిటరి శిక్షణ అనేది ఎందుకనో చాలా గౌరవనీయమైన అంశం,ఇంకా చెప్పాలంటే చాలా ఆవశ్యకమైన అంశం చాలా పాశ్చాత్య దేశాల్లోచూసినట్లయితే..! చాలా కీలకమైన ఇతర సివిల్ ఉద్యోగాల్లో కూడా మిలిటరి లో పని చేసి రిటైర్ అయిన వాళ్ళో,డెప్యుటేషన్ మీద పని చేసేవాళ్ళో కనిపిస్తారు.అది ఒక తిరుగు లేని అదనపు అర్హత.బ్రిటన్,నార్వే ఇలా ఏ యూరపు లోని రాచ కుటుంబీకులు చూసినా తప్పనిసరిగా కొంత కాలం సైన్యం లో పనిచేస్తారు.ఒక సైనికుడు చేసే పని దగ్గర్నుంచి మొదలుకుని అన్నిటిని ఎటువంటి భేషజాలు లేకుండా చేస్తారు.శరీరం ఫిట్ గా ఉంటేనే మనసు ఫిట్ గా ఉంటుంది.సైనిక శిక్షణ లో వచ్చే అనుభవం చాలా విలువైనది.త్యాగము,కష్టించి పని చేయడము,చురుకుదనము,దేశం పట్ల అనురక్తి అవన్నీ లోతు గా పాదుకుంటాయి.నాకు తెలిసి అమెరికా అధ్యక్షులు  చాలా మంది ఏదో ఒక యుద్ధం లో స్వయం గా ఫాల్గొన్నవారే.అలాగే యూరపు లో కూడా ..సైనిక శిక్షణ గల వారికి ఉండే విలువే వేరు..వాళ్ళు ఏ రంగం లో ఉండనీ.కానీ ఎందుకనో గానీ మరి మన దేశం లో సైన్యం లో ఉండే వారి పైన తగు మర్యాద చూపించరు.అంతే కాకుండా చాలా చవకబారు జోకులు వేసి హేళన చేస్తుంటారు.అసలు ఈ ధోరణి ఎక్కడనుంచి మొదలయింది..అది కూడా ..అలాంటి ప్రచారం కూడా దేశాన్ని బలహీనపరిచే దానిలో ఒక కుట్రేనా అనిపిస్తుంది.

రెండవ ప్రపంచ యుద్ధం లో సిక్కులు తమ పోరాటపటిమ ద్వారా మన దేశానికే వన్నె తెచ్చారు.ఇంచుమించు ప్రతి ఒక్క కుటుంబం లో ఒక్కరైనా సైన్యం  లో ఉండే పంజాబ్ రాష్ట్రం వ్యవసాయం,పరిశ్రమలు అన్నిటిలో గణనీయం గా నే ఉంటారు.అక్కడి లారీ లకి గాని ట్రక్కులకి గాని  డ్రైవర్ లు గా ఉండే వారు వాటి యజమానులే.మీరు ఢిల్లీ మొత్తం మీద వెదికినా ఒక్క సిక్కు బిక్షగాడు కూడా కనిపించడు.ఏ రాజకీయ పదవి పొందాలన్నా సైన్యం లో లేని కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారు.కెనడా ,బ్రిటన్ ల లో ఎక్కువగా ఉండే భారతీయుల్లో సిక్కు లే ప్రధమ స్థానం లో ఉంటారు.

ఒక్క మాట లో చెప్పాలంటే మన దేశ రక్షణ లో సిక్కులు కీలకమైన పాత్ర మొదటి నుంచి పోషిస్తున్నారు.ఒక ఉధ్గ్రంధమే రాయవచ్చు ఆ డేటా తో..!బాంగ్లాదేశ్ అవతరణ సమయం లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో పెషావర్ వరకు చొచ్చుకు పోయి కొద్ది మందే ఉన్నప్పటికి అనేక ట్యాంక్ ల్ని విధ్వంసం చేసి చరిత్ర సృష్టించారు.సిక్కులు డి ఎన్ ఏ పరంగా హిందువులే అయినప్పటికీ ,వారు తమ గురువులు చెప్పినట్లుగా తాము  సిం హాలమని నమ్మడం మూలానే ప్రపంచం లోని యుద్ధ జాతుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు.Click here

Monday 1 June 2015

అది ఊహించిన యాత్రా కధనమే....

యూరపు ఖండం లోని ఓ పది దేశాల్ని తిరిగి దాని మీద ఓ పుస్తకాన్ని వెలయించారు పరవస్తు లోకేశ్వర్ గారు.కాని ఎందుకనో నన్ను అది నిరాశ పరిచింది.గతం లో ఆయన ట్రావెలోగ్ లు కొన్ని చదివి ఆయన ని అభినందించిన మాట వాస్తవం.అయితే ఇది నచ్చనంత మాత్రాన ఆయన్ని తృణీకరించడం లేదు. ఇది నేను ఊహించిందే.ఎందుకంటే గతం లోనివి దేశం లోపలివి..ఎక్కడికెళ్ళికెళ్ళిన ఆ ఊరి లోని మనుషుల్ని పలకరించడం..స్థానిక విషయాల్ని ప్రస్థావించాడం ..ఆ విధంగా ఒక రంగుల వలయంగా ఉండేది.సిల్క్ రూట్ తో కలుపుకుని చెపుతున్నా.. ఇది..ఆసియా లో నే ఉన్న ఆ దేశాలు ఇంచు మించు మన వంటివే..చాలా విధాలుగా..!

అయితే యూరపు భిన్నమైనది.రహస్యాల్ని దాచి ఉంచడం లోనే చాలా విజయాలు దాగి ఉంటాయని నమ్మే ఒక ప్రాచీన నాగరిత కి సంబందించినది.మీరు రోం,గ్రీస్ నాగరికతలు మొదటి నుంచి అధ్యయనం చేసినట్లయితే..చేయడం ఒకటే కాదు దాన్ని ఓ క్రమ పద్ధతి లో అర్ధం చేసుకున్నట్లయితే యూరోపియన్ల స్వభావం అర్ధం అవుతుంది. లేదంటే జన్మ అంతా పోయినా అర్ధం కాదు.అక్కడే అపురూపమైన కళలు వర్ధిల్లినవి.ప్రపంచాన్ని కుదిపిన సిద్ధాంతాలు వర్దిల్లాయి.అయినా యూరోపు లో కెళ్ళి మనం వాళ్ళని మన దేశీయుల మాదిరిగా మాటల్లో పెట్టో,మభ్య పెట్టో వారి స్థితి గతుల్ని తెలుసుకోవాలనుకుంటే జరగని పని.అది నాకు ఈ ట్రావెలోగ్ వల్ల మళ్ళీ ప్రూవ్ అయింది. 

సరే..పేకిజ్ టూర్ లో వెళ్ళినా కొన్ని చేయవచ్చు.స్థానిక యూరోపియన్ లను మన దేశం లో మాదిరి గా పరిచయం చేసుకుని మాట్లాడటం జరగని పని. ఎక్కడా కూడా ఆ ప్రయత్నం గాని ..అదీ గాని కనబడదు.ఆ తరవాత ఓ పది రోజులు విడి గా కూడా టూర్ చేశారు.అలాంటిది లేదు.బహుశా సాధ్య పడి ఉండదు.అది ఆయన లోపం కూడా అయి ఉండదు.మన ఆసియన్ దేశీయుల మాదిరి గా బయటి వాళ్ళు అడగ్గానే అన్నీ గల గలా మని చెప్పే పరిస్థితి యూరపు లో ఉండదు.కంటికి కనబడని నిఘా  ఎల్లవేళలా ఉంటుంది.అది ఏ పేపర్ లో ఎక్కడా ఎవరూ రాయరు.అది భూమి మీద ఇప్పటి దాకా వెలిసిన అల్టిమేట్ జ్ఞాన భూమి ఇంకా కర్మ భూమి కూడా.

మన వాళ్ళు ఎంత కాలం ఉండని....ఎప్పటికి కూడా యూరోపియన్ ల ఇన్నర్ సర్కిల్ లో భాగం అవరు.కాలేరు.కానివ్వరు.

Saturday 30 May 2015

"చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర" పుస్తకం గూర్చి రెండు మాటలు


పరవస్తు లోకేశ్వర్ గారి ఈ యాత్రానుభవాల మాలికని మొన్న ఈ మధ్య ఎమెస్కో  లో కొని చదివాను.ఏది ఎప్పుడు మన చేతికి రావాలో అదీ ఓ ప్రకృతి వ్యూహం లో భాగమే.గతం లో సిల్క్ రూట్ ,సలాం హైద్రాబాద్ లు చదివి వాటి మీద నాకు తోచిన అభిప్రాయాలు రాశాను గదా.ఈ సారికి ఇది.మొత్తం పంతొమ్మిది వందల నలభై మూడు కిలో మీటర్ల ప్రయాణం.పది రోజుల్లో స్కూటర్ మీద చుట్టివచ్చారు.అదీ 2009 లో.భద్రాచలం అనే ముఖద్వారం నుంచి సాగి కుంట,సుక్మా,దంతెవాడ,బస్తర్,జగదల్ పూర్,కొండగావ్,నారాయణ్ పూర్, కాంఖేడ్,రాయ్ పూర్,ధల్లీ రాజ్పుర  దాకా సాగి పోయి మళ్ళీ వచ్చేప్పుడు భూపాలపట్నం,సిరివొంచ,గడిచిరోలి మీదుగా కరీం నగర్ జిల్లా లోకి ప్రవేశించి అటునుంచి హైద్రబాద్ కి చేరుకున్నారు.అదీ విషయం.ఈ మధ్య కాలం లో ఎదురైన అనుభవాలను పూసగుచ్చినట్లుగా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నంత చక్కగా రాశారు.అందులో మళ్ళీ ఉర్దూ ,తెలుగు గీతాలు ,వేదాంత ధోరణులు,లౌక్య విధానం లో నడిచే లోకం పోకడలు,అచటి ఆదివాసీ ల జీవిత చిత్రణ,స్థానిక పరిస్థితులు ,శాంతి భద్రతలు విలసిల్లుతున్న తీరు,అక్కడి ప్రవాసుల ధోరణులు,నాశనం కాని అటవీ సంపద,శంకర్ గుహ నియోగి వంటి త్యాగుల చరిత్ర ,ఆయన అనుయాయుల నుంచి తెలుసుకోవడం,కుటుంబ్సర్ ప్రాచీన గుహల వర్ణనలు ఇంకా ఎన్నో ఎన్నో సంగతులు చూసి చెప్పడం ..ఆ చెప్పినది ఎంతో హాయిగా మనం కూడ ఆస్వాదించే తీరు గా ఉండటం ఈ పుస్తకం లోని ప్రత్యేకత.


ఈ పుస్తకాన్ని ఆంగ్లం లో గనక తర్జూమా చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది.దీనిలోని విషయ సంపద,అనుభవాల సారం,సంభావ్యత ప్రతి ఒక్కరి ని ఆకర్షిస్తాయి.ఈ మధ్య కాలం లో కొన్ని ట్రావెలోగ్ లు ఇతర రాష్ట్రాల వారు ఇంగ్లీష్ లో రాసినవి చదివాను.బాగున్నాయి.కాదనను.కాని అందరు ఒకేలాంటి ప్రసిద్ది చెందిన నగరాల్నే సందర్శించడం,ఇంచు మించు చెప్పినదే చెప్పడం ఒక మూస గా అనిపించాయి.నిజానికి మన తెలుగు వాళ్ళకి మన లొని గొప్ప రచనల్ని ఇంగ్లీష్ లోకి తీసుకు వెళ్ళి ప్రమోట్ చేసుకునే విధానం ఎందుకనో ఇష్టం ఉండదనుకుంటాను.లేదా ఒక సంధిగ్ధతా..ఏమో..!  అసలు ఇండియా లో ఉన్నంత జీవన వైవిధ్యం ఎక్కడుందని..ఓపిక ఉండి చిన్న పల్లెల్ని,చిన్న పట్టణాల్ని అంతగా పేరు బయటకి రాని ఊళ్ళని ప్రతి రాష్ట్రం లోను ఒక్కసారి చుట్టి రండి.దేశం పట్ల మన ప్రేమ రెట్టింపు అవుతుంది.ఇది నేను ఎక్కడో చదివి వల్లె వేయడం లేదు.నా అనుభవం లోనుంచి చెప్తున్నా.మీరు అనవచ్చు..అవన్నీ రాయవచ్చు గా అని.అనుకుంటాం గాని ఏ మనిషికైనా భగవంతుడు కొన్నిట్లని చేయడానికేరా అన్నట్టు పుట్టిస్తాడు.దాంట్లోనే మనకి బలం ఉంటుంది.మిగతావి ఏదో  అలా చేసేస్తుంటాం.లోకేశ్వర్ గారి ప్రయాణాలు చదివినాక నేను ఇంతకంటే రాసినా ఏం ఉంటుంది అనిపించింది. అందుకే ఆ ప్రయత్నం చేట్లేదు. 

 అసలు విద్య లో కూడా ప్రయాణాలు ఓ భాగంగా కావాలి.ఎంతసేపు పుస్తకాలు అని కాకుండా ..కళ్ళతో చూసి ..కష్ట నష్టాలు భరించి..ఈ లోకం లో ఎన్నెన్ని ఒంపులు ,కుట్రలు,దారులు ఉన్నాయి..ఎలా మెలగాలి,ఎలా ఉండాలి ఇలాంటివి కళాశాల ప్రాయం నుంచి తెలియాలంటే దూర ప్రయాణాలు చాలా అవసరం.ఒంటరి గా రక్షణ లేకుండా ప్రయాణాలు చేస్తూంటే  వచ్చే అనుభవాలు చాలా అమూల్యమైనవి.మానవుని లోని ఎన్నో కోణాలు ఆవిష్కరిస్తుందది.అవి నోటి తో చెప్పేవి కావు.తెలుసుకునేవే తప్ప.     

Saturday 18 April 2015

అయన్ ర్యాండ్ రాసిన The Fountainhead గురించి మన వాళ్ళు చాలా మంది..!

అయన్ ర్యాండ్ రాసిన The Fountainhead గురించి మన వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూలలో వాటిల్లో ఉటంకిస్తూ ఉంటారు గదా..!ఏదో ఆ హీరో Howard Roark గురించో ఇంకో పాత్ర Dominique గురించో  ,Toohey గురించో రెండు ముక్కలు చెబుతుంటారే గాని ఇంకా లోపలకి దిగి ఎవరైనా చెబుతారేమో,రాస్తారేమో అని చూస్తుంటా..నా ఎదురుచూపు అలానే మిగిలిపోయింది.నేను పలు కారణాల వల్ల పూర్తిగా  చదవలేకపోయిన నవలల్లో అది ఒకటి.మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఏదైతే పూర్తిగా చదువుతానో దాన్నే నేను చదివిన పుస్తకంగా లెక్క వేసుకుంటాను.

650 పేజీలు పైబడిన దీన్ని చదవాలని ఎన్ని సార్లు కూర్చున్నా ప్రతి పేజీ నా సహనాన్నే పరీక్షించింది.చిత్రణ చాలా డల్ గా సాగుతుంది.చాలా సార్లు ఊసుపోక చెప్పే కబుర్లు పుంఖానుపుంఖాలుగా గుప్పిస్తున్నట్లు అనిపించేది.ప్రాచీన నిర్మాణ శాస్త్రం గురించి ఇంకా ఇప్పటి పధతుల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.మన హీరో Howard తన దారిలోనే తప్ప ఇంకో దారిలో ఆలోచించడానికి ఇష్టపడడు.దానికి ఆ శైలికి Objectivism అనే మాట స్థిరపడిపోయింది.కొన్ని సార్లు తమ కాలేజీ లో డీన్ తో కూడా వాదం వేసుకుంటాడు.ప్రాచీన గ్రీక్ నిర్మాణం Partheon గురించి వచ్చినప్పుడు ..ప్రతివాళ్ళు అదే రీతిలో ఆ Columns అవీ ఎందుకనీ ఈరోజుకి మన బిల్డింగ్ లు కట్టేప్పుడు కాపీ కొట్టాలి.నిజానికి అవి చెక్క తో చేసిన కొన్ని నిర్మాణాల పగుళ్ళు కనబడకుండా ఉండాలని అలా కట్టారు.బాగా గమనిస్తే అది తెలుస్తుంది.దేని అవసరాన్ని బట్టి దాని నిర్మాణం ఉండాలి.ఏ మనిషి నూరు శతం ఇంకో మనిషిలా ఎలా ఉండడో అలాగే  ఏ గృహం కట్టినా దాని కోసమే అన్నట్టు  ఉండాలి అని మన హీరో అంటాడు..!

అట్లాంటి కొన్ని  సన్నివేశాలు మాత్రం బాగున్నవి అనిపిస్తుంది.కాని ఇదే రీతి లా మన దేశం లో ఉండటం సాధ్యమా అంటే సాధ్యమే.కాని అతనికి సంసార బాధ్యతలు లేని వాడై ఉండాలి.చాలా వాటిని ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తాం మనం..మన మీద ఆధార పడిన బంధాల్ని ,బాధ్యతల్ని నెరవేర్చడానికి.ఏ కష్టం లేకుండా సాధ్యమైనంత తక్కువ కుదుపులతో జీవితం సాగించడానికి..!

ఒక్క క్షణం ఒక వెరైటీ కోసం ఆలోచించండి...మన కుమారులని ఏ ఫారిన్ కో పంపే బాధ్యత మనది కాదు.రెక్కలు వచ్చినాక వాళ్ళే పనిచేస్తూ వాళ్ళు చదువుకుంటారు.అలాగే అమ్మాయి పెళ్ళిళ్ళకి ఆ తర్వాత వారికి ఇవ్వడానికి  కోట్లు కూడబెట్టే అవసరం లేదనుకోండి....ఎవరూ ఎవరిపైనా ఆధారపడకూడదు(ఒక్క అంగవికలాంగులు,పరమ వృద్దులు తప్ప) ..అనే భావం పెరిగిన అలాంటి సమాజం లో మనిషి లోని స్వేచ్చా విహంగాలు ఇంకా పైకి ఎగురుతాయి.అన్ని శాస్త్రాల్ని ఇంకా అనురక్తి తో నేర్చుకుంటాడు..పరిశోధిస్తాడు..ఎన్నో అంచులు దాటుతాడు.ఏది ఇష్టమైతే దాన్ని మనసా వాచా కర్మణా చేస్తాడు.

మనకు జన్మతహ వచ్చే అనేక నైపుణ్యాలు పెళ్ళి తో సగం మూలబడితే ,పిల్లలు పుట్టినాక ధనం సంపాదించక తప్పని స్థితి లో మిగతావి మూలబడతాయి.అయినా కూడదీసుకుని ఏవో చేస్తూనే ఉండే మన దేశీయులు నిజంగా త్యగధనులు చాలా దేశాల వాళ్ళతో పోల్చితే..!   

Monday 6 April 2015

జీవితం గణితశాస్త్రం కాదు



మల్లి మస్తాన్ బాబు ...ఎందుకని చనిపోయిన తర్వాతనే ఎక్కువమంది తెలుగు వారికి తెలిశాడు.తెల్లారి లేస్తే సవాలక్ష ఎన్నో పనికిరాని విషయాలు,ఎక్కడో ఏ దేశం లోనో ఎవరో చేసిన చిన్న సాహసాలు ఇన్స్పిరేషన్ స్టోరీస్ అంటూ మన ముందుకు తెచ్చే మన పత్రికలు ఎందుకని అంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఇంతకు ముందు చూపెట్టలేకపోయినవి..?

172 రోజుల్లో 7 ఖండాల్లోని ఎత్తైన పర్వాతాలు ఎక్కి రికార్డు సాధించిన ఆయన ప్రతి పర్వాతాన్ని ఎక్కడానికి ఒక్కో వారం ఎన్నుకోవడం యాదృచ్చికం గా జరిగిందా లేక అనుకునేనా అనిపించింది.ఉదాహరణకి అంటార్కిటికా ఖండం లోని విన్సన్ మాన్సిఫ్ (4897 mtrs) ని గురు వారం నాడు,దక్షిణ అమెరికా లోని అకాంకగువా (6962)  ని శుక్ర వారం రోజున,ఆఫ్రికా లోని కిలిమంజారో (5895) ని బుధ వారం రోజున,ఆస్ట్రేలియా లో కొస్యుజ్కొ (2228) ని శనివారం రోజున,ఆసియా లో ఎవరెస్ట్ (8850) ని ఆదివారం రోజున ,యూరప్ లోని ఎల్బ్రస్ (5642) ని మంగళవారం రోజున ,ఉత్తర అమెరికా లోని డెనాలి (6194) ని సోమ వారం రోజున అధిరోహించారు.మస్తాన్ బాబు గార్కి కూడ కొన్ని నమ్మకాలు ఉన్నట్లు అనిపిస్తున్నది.ఆయన మరణించిన చోట భగవద్గీత,ఒక జప మాల ఇంకొన్ని వస్తువులతో పాటు దొరికాయి.    

పర్వతారోహణ జీవితం తో చెలగాటమే,ముఖ్యంగా గ్రూప్ లు గా కాకుండా ఒంటరిగా వెళ్ళడం మరీ ప్రమాదం.ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఉన్నట్లుండి మారే వాతావరణ మార్పులు ఊహించలేనటువంటివి.అయినా సరే..ముందుకు సాగడానికే నిశ్చయించుకునే వారి అభిరుచిని తెగువను అభినందించవలసిందే.Give every man his due అనే బ్రిటిష్ సామెత వెనుక చాలా బరువు ఉంది.చరిత్ర నేర్పిన పాఠాలు ఉన్నాయి.

ఏ మనిషి అయినా పోవలసిందే ,ఎవరూ శాశ్వతం కాదు.కాని ఒక లక్ష్యం కోసం వెళుతూ ప్రాణాలు కోల్పోవడమే అత్యుత్తమమైన గౌరవం మన శరీరానికి..అది ఏదైనా కావచ్చును.. !జీవితం గణితశాస్త్రం కాదు పరిష్కరించడానికి,అది ఒక మార్మికతకి సంబందించిన విషయం ..దాన్ని తెలుసుకోవాలంటే చచ్చినట్లు జీవించవలసిందే..అన్న ఫ్రెంచ్ తత్వవేత్త  గాబ్రియల్ మార్సెల్  గారి మాటల్ని ఈ సందర్భగా ఉటంకిస్తూ..  !! 

Tuesday 3 March 2015

సిడ్నీ షెల్డన్ రాసిన The other side of midnight నవల్లోంచి ఇంకొన్ని సన్నివేశాలు

సిడ్నీ షెల్డన్ రాసిన The other side of midnight నవల్లోంచి ఇంకొన్ని సన్నివేశాలు


గతంలో కొన్ని విషయాలు చర్చించుకున్నాము గదా.ప్రధాన పాత్ర Noelle Page ..ఆమె ఫ్రాన్స్ లోని స్వప్రదేశం మార్సైల్స్ నుంచి మోడల్ గా రాణించడానికి పారిస్ రావడం..అక్కడ విశాల అనుభవాలు పొందడమూ అవన్నీ..!పారిస్ నగరం ..దాని రాజసము,సౌందర్యం చూసిన ఆమెకు అనిపిస్తుంది తన వంటి తెలివైన ,అందమైన వ్యక్తులు నివసించవలసిన అసలైన ప్రదేశం అదేనని.ఏది ఏమైనా ఇక్కడనే తాను తన సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకోవాలని నిశ్చయించుకుంటుంది.దాని కొరకు ఆమె ఒక ప్రణాళిక ప్రకారం వివిధ వ్యక్తులతో పరిచయం పెంచుకుంటుంది.అయితే Larry Douglas అనే ఒక అమెరికన్ పైలట్ తో ఆమె ఉన్నప్పుడు అతడిని ఎంతో ప్రేమిస్తుంది..అయితే రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ సమయం లో అతను చెప్పపెట్టకుండా వెళ్ళిపోవలసివస్తుంది.ఆ విధంగా ఆమె అతని పై కక్ష పెంచుకుంటుంది..అతని వల్ల కలగబోయే బిడ్డని అబార్షన్ ద్వారా తొలగించుకుంటుంది.అప్పుడు ఆమెకి కలిగిన అనారోగ్య సమస్యల నుంచి Israel Katz అనే డాక్టర్ బయటపడవేసి ఆమె కి ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు.దానితో ఆమె మళ్ళీ కొత్త మనిషి అవుతుంది.ఈ రెండు పాత్రల మధ్య ఉండే బాంధవ్యం గమ్మత్తుగా ఉంటుంది.జర్మన్లు పారిస్ ని ఆక్రమించి యూదుల బ్రతుకుల్ని దుర్భరం చేసినప్పుడు ఆమె యూదుడైన ఈ డాక్టర్ ని రక్షించడానికి అతడిని పారిస్ నగరం దాటించడానికి జర్మన్ సైన్యాధికారితో సంబంధం పెట్టుకుంటుంది.ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని,ధనాన్ని సంపాదిస్తుంది.అయినప్పటికి Israel Katz చేసిన సాయాన్ని మర్చిపోకుండా సహాయం చేస్తుంది.విచిత్రంగా వీరిరువురి నడుమ ఎలాంటి సెక్స్ సంబంధం కూడా ఉండదు.కాని తాను సంబంధం పెట్టుకున్న పురుషులందరి కంటే ఆమె ఇతడిని ఎక్కువగా అభిమానిస్తుంది.

నవలంతా రెండవ ప్రపంచ యుద్ధ చ్చాయల్లో జరుగుతూ మిలిటరీ మనుషులకి,మామూలు సివిలియన్లకి ఉండే తేడాని చూపుతూంటుంది.జర్మన్ సైనికాధికారులలోని కళాదృష్టి కూడా అక్కడక్కడ మెరుస్తూంటుంది.కొన్ని  జోకులు గూడా గమ్మత్తుగా అనిపిస్తాయి.నోయెల్ జర్మన్ సైనికాధికారిని బ్రిటిష్ వారి గురించి అడిగినపుడు ఇలా అంటాడు" బ్రిటిష్ వాళ్ళని శాంతి యుతం గా ఉన్నప్పుడు భరించలేము..వాళ్ళకెప్పుడూ ఏదో పనిలో ఉండటమే ఇష్టం..ఒక బ్రిటిష్ నావికుడు ఎప్పుడు ఆనందం గా ఉంటాడో తెలుసా ..అతని ఓడ మునిగిపోతున్నప్పుడు మాత్రమే"

సరే..మిగతాది ఎప్పుడైనా చెప్పుకుందాము.